Burkina Faso
-
భయానక ఘటన.. గంటల వ్యవధిలో 600 మంది ఊచకోత
బుర్కినా ఫాసో: కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని దారుణంగా కాల్చి చంపిన అత్యంత భయానక ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించినవారిని కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ రెబల్స్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్, మాలిలో ఉన్న అల్-ఖైదా అనుబంధ సంస్థ, బుర్కినా ఫాసోలో ఉగ్రవాద సంస్థలు ఆ దేశంలో క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. ఈ ఘటనలో.. ఐక్యరాజ్యసమితి దాదాపు 200 మంది మరణించినట్లు అంచనా వేయగా, ఉగ్రవాద సంస్థ జెఎన్ఐఎం దాదాపు 300 మందిని చంపినట్లు ప్రకటించింది.ఇదీ చదవండి: ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన -
ఆదిమ ఖండంలో... నియంత పాలనలు
సైనిక తిరుగుబాట్లతో ఆఫ్రికా ఖండం అతలాకుతలం అవుతోంది. కొన్నేళ్లుగా ఇక దేశం తర్వాత ఒక దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి సైనిక నియంతలు అధికారం చేజిక్కించుకుంటున్నారు. బుర్కినా ఫాసో మొదలుకుని తాజాగా గబాన్ దాకా ఈ జాబితా నానాటికీ పెరుగుతూనే పోతోంది. ఆ సైనిక కుట్రల పట్ల ఆయ దేశాల్లో పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాకపోవడం విశేషం. పైగా యువ ఆఫ్రికన్లు ఈ పరిణామాన్ని రెండు చేతులా స్వాగతిస్తుండటం విస్మయకర వాస్తవం... ► పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్‌లో సైనిక తిరుగుబాటు జరిగి నెలన్నర కూడా కాలేదు. అప్పుడే ఆదిమ ఖండంలో మరో కుట్ర. మధ్య ఆఫ్రికా దేశం గాబాన్లో గత ఆదివారమే ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయమే ఫలితాలు వెలువడ్డాయి. 2009 నుంచీ దేశాన్ని పాలిస్తూ వస్తున్న అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా మరోసారి తన అధికారాన్ని నిలుపుకున్నారు. ఆయన పార్టీ ఘన విజయం సాధించినట్టు టీవీల్లో అధికారిక ప్రకటన వెలువడింది. దాంతో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ నిమిషాల్లోనే పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఈసారి సైనికాధికారులు టీవీ తెరపైకి వచ్చారు. బొంగోను అదుపులోకి తీసుకుని ఆయన అధికారిక నివాసంలోనే ఖైదు చేసినట్టు, పాలనా పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలా మరో ఆఫ్రికా ఖండంలో ప్రజాస్వామ్యం మరోసారి పరిహాసానికి గురైంది. మరో దేశం సైనిక కుట్రను చవిచూసింది. వరుస సైనిక కుట్రలు ఆఫ్రికాలో, ముఖ్యంగా పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలో కొన్నేళ్లుగా సైనిక కుట్రలు పరిపాటిగా మారాయి. ► గత జూలై 26న నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజొమ్ను ఆయన సొంత ప్రెసిడెన్షియల్ బాడీ గార్డులే నిర్బంధంలోకి తీసుకున్నారు. ► 2022 జనవరిలో బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేనుఆ దేశ సైన్యాధ్యక్షుడే బందీని చేసి అధికారం చేజిక్కించుకున్నాడు. అయితే 8 నెలల్లోనే కింది స్థాయి సైనికాధికారులు అతన్ని కూడా జైలుపాలు చేసి అధికారాన్ని పంచుకున్నారు! ► 2012 సెపె్టంబర్లో గినియాలో అధ్యక్షుడు ఆల్ఫా కొండేను ప్రత్యేక సైనిక బృందాలు ఖైదు చేసి పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ► 2021 మేలో మాలిలో కల్నల్ అసిమి గొయిటా కూడా సైనిక కుట్రకు పాల్పడ్డాడు. అంతకుముందు కూడా ఇలా ప్రభుత్వాన్ని పడదోసిన చరిత్ర అతనిది. ► 2021 ఏప్రిల్‌లో చాద్ రిపబ్లిక్లో కూడా అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ ఇట్నో మృతి కారణంగా అనిశ్చితి ఏర్పడటంతో సైన్యం జోక్యం చేసుకుంది. అయితే, ఆయన కుమారుడే అధికార పగ్గాలు చేపట్టేలా చక్రం తిప్పి రంగం నుంచి తప్పుకుంది. పాలనపై తమ ఆధిపత్యాన్ని మాత్రం నిరి్నరోధంగా కొనసాగిస్తూనే ఉంది! ఆఫ్రికాలోనే ఎందుకిలా? కేవలం గత మూడేళ్లలో ఆఫ్రికాలో కనీసం 5 దేశాల్లో సైనిక కుట్రలు జరిగా యి. ఇందుకు పలు కారణాలు కనిపిస్థాయి కూడా... ► సంప్రదాయ పాలక వర్గపు మితిమీరిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం తదితర పోకడలతో ఆఫ్రికా యువత తీవ్రంగా విసిగిపోయింది. ► అదే సమయంలో ఇటు జనాదరణలోనూ, అటు ఆర్థికంగా కూడా ఆయా ప్రభుత్వాలు బలహీనపడుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని సైనిక పెద్దలు అవకాశంగా మలచుకున్నారు ► ప్రజల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంత యువతలో అధికార పారీ్టల పట్ల ఉన్న ఏహ్య భావాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ...అందుకే ఆఫ్రికా యువతలో అసంతృప్తి! ఆఫ్రికా యువతలో ప్రజాస్వామిక ప్రభుత్వాల పట్ల నెలకొన్న తీవ్ర అసంతృప్తికి కారణాలు లేకపోలేదు... ► ఉపాధి అవకాశాల లేమి ► పెచ్చరిల్లిన అవినీతి ► అధిక వర్గాల్లోనూ వారి మితిమీరిన ఆశ్రిత పక్షపాతం ► ఈ దేశాల్లో చాలావరకు మాజీ ఫ్రెంచి వలస రాజ్యాలే. దాంతో వాటిపై ఇప్పటికీ చాలా విషయాల్లో ఫ్రాన్స్ ప్రభావం కొనసాగుతోంది. ఇది కూడా యువతకు మింగుడు పడడం లేదు. ► ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవడానికి పాలక పార్టీలు చేస్తున్న అక్రమాలతో జనం మరింతగా విసిగిపోయారు. దశాబ్దాలుగా బొంగోల రాజ్యమే! గాబన్పై బొంగో కుటుంబం ఒకరకంగా అర్ధ శతాబ్దానికి పైగా గుత్తాధిపత్యం చెలాయించిందనే చెప్పాలి. ► అలీ బొంగో 14 ఏళ్లుగా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు! ఇది ఆయ నకు మూడో టర్ము. 2018లోనే స్ట్రోక్‌కు గురైనా అధికారాన్ని మాత్రం వీడలేదు. ► అయితే దేశాన్ని ఆధునీకరణ బాట పట్టించేందుకు ఆయన ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ జనం ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవి సరిపోలేదు. ► అలీ తండ్రి ఒమర్ బొంగో అయితే ఏకంగా 40 ఏళ్లకు పైగా నియంతలా దేశాన్ని పాలించారు! 2009లో ఆయన మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అలీ తనను తాను విజేతగా ప్రకటించుకున్నారు. కానీ నిజానికి విపక్ష నేత ఆంద్రే ఎంబా ఒబామే నెగ్గారని చెబుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
సైనికుల చేతిలో బుర్కినా ప్రెసిడెంట్ బందీ!
ఉగడుగు: బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరెను బంధించామని ఆ దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు ప్రకటించారు. అధ్యక్షుడిని ఎక్కడ దాచింది వెల్లడించలేదు. ఆదివారం సైనిక శిబిరాల వద్ద మొదలైన కాల్పుల కలకలం సోమవారం కూడా కొనసాగింది. అధ్యక్ష భవనం వద్ద చిన్నపాటి యుద్దం జరిగింది. రాజధానిలో తిరుగబాటు సైనికులు గస్తీ కాస్తున్నారు. తొలుత ఇది తిరుగుబాటు కాదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ చివరకు సైనికుల చేతికి ప్రెసిడెంటే బందీగా చిక్కారు. 2015 నుంచి బుర్కినాకు కబోరె అధిపతిగా ఉన్నారు. దేశంలో జరుగుతున్న ఉగ్రచర్యలతో మిలటరీ తీవ్రంగా నష్టపోతోంది. తమకు సరైన సదుపాయాలు లేవని సైనికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇది చివరకు తిరుగుబాటకు దారితీసింది. తిరుగుబాటుకు ప్రజల్లో కూడా మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు తెలిపారు. -
మిలటరీ బేస్ వద్ద తిరుగుబాటు జరిగిందంటూ వదంతులు!!
Africa: ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశ రాజధాని దగ్గరలోని మిలటరీ బేస్ వద్ద ఆదివారం భారీ కాల్పులు జరిగాయి. దీంతో టర్కీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలటరీ తిరుగుబాటు జరిగిందన్న పుకార్లు వ్యాపించాయి. ఇటీవల కాలంలో దేశంలో పెరిగిపోతున్న ముస్లిం తిరుగుబాట్లను ప్రభుత్వం సరిగా అణిచివేయడంలేదన్న ఆరోపణలున్నాయి. అయితే ఆర్మీ తిరుగుబాటు ఏమీ జరగలేదని, అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేను ఎవరూ నిర్భంధించలేదని రక్షణ మంత్రి సింపురె ప్రకటించారు. సైనికుల్లో అభిప్రాయభేదాలు ముదిరి కాల్పులు జరుపుకున్నారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఆర్మీలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆందోళన చేస్తున్న సైనికులు మీడియాకు ఫోన్ చేశారు. తమకు సరైన పనిచేసే పరిస్థితులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. దేశంలో మిలటరీ, ఇంటెలిజెన్స్‌ల్లో వంశపారంపర్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆందోళనలు పెరుగుతున్న సందర్భంగా ఇటీవలే దేశ ప్రధానిని అధ్యక్షుడు తొలగించారు. (చదవండి: భారీ మూల్యం తప్పదు!..ఉక్రెయిన్ అధిపతిగా రష్యా అనుకూల నేత! -
బుర్కినా ఫాసోలో ఉగ్రదాడి.. 19 మంది మృతి..
బుర్కినా ఫాసో(ఆఫ్రికా): ఆఫ్రికా దేశమైన బుర్కినాఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ దాడులలో 19 మంది అమాయకులు మృతి చెందారు. వీరిలో 9 మంది భద్రత దళాలున్నట్లు సమాచారం. సెంటర్ నార్త్ రీజియన్‌లో జరిగిన ఈ దాడిలో ఆసుపత్రిని ముష్కరులు కాలబెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థల మధ్య ఘర్షణల కారణంగా బుర్కినాఫాసోలో హింస రోజురోజుకి పెరుగుతుంది. దీంతో వేలాది మంది అమాయకులు మరణిస్తున్నారు. ఇప్పటివరకు 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
బుర్కినా ఫాసోలో 100 మంది కాల్చివేత
నియామీ: బుర్కినో ఫాసోలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సాయుధులైన ఉగ్రవాదులు కనీసం 100 మందిని కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సోల్హాన్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని సాహెల్స్ యఘ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి ఒస్సేనీ తంబౌరా చెప్పారు. ఈ ఘటనకు జిహాదీలే కారణమని తెలిపారు. స్థానిక మార్కెట్‌ను, పలు ఇళ్లకు వారు నిప్పంటించారని పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత అమానవీయమైనదని దేశాధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ అభిప్రాయపడ్డారు. గత అయిదేళ్లలో ఇంత భారీస్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి. సాహెల్‌లో 5,000 ఫ్రెంచ్ సైనికులు మోహరించి ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ప్రాంతంలో ఇటీవల జిహాదీల దాడులు పెరుగుతూ వస్తున్నాయి. -
భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి
వాగాడౌగా : ఆఫ్రికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుర్కినా ఫాసోలో ఓ చర్చిపై దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న వారిని లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఫాస్టర్‌తో సహా.. 24 మంది అమాయకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు మరికొంత మందిని దుండుగులు అపహరించుకుని పోయారని తెలుస్తోంది. బుర్కినా ఫాసోపై ఇటీవల కాలంలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు. కాగా గడిచిన నాలుగేళ్లగా ఈ ప్రాంతంలో జరిగిన అనేక దాడుల్లో దాదాపు 600కుపైగా పౌరులు మృతి చెందారు. -
బుర్కినాఫాసోలో రక్తపాతం
ఔగడొగు: ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో రక్తమోడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఓ పట్టణంపై దాడి చేసి 35 మందిని చంపేశారు. ప్రతిగా సైన్యం జరిపిన దాడుల్లో 80 మంది ఉగ్రమూకలు హతమయ్యారు. సౌమ్ ప్రావిన్స్‌లోని అర్బిండాలో మంగళవారం ఉదయం బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు పట్టణంలోని సైనిక క్యాంపుతోపాటు పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 35 మంది పౌరులు చనిపోగా 20 మంది సైనికులు, ఆరుగురు పౌరులు గాయపడ్డారు. మృతుల్లో 31 మంది మహిళలేనని ప్రభుత్వం తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, వైమానిక దళం సాయంతో ఉగ్రవాదులపై భారీ ఎత్తున విరుచుకుపడింది. తమ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఉగ్రదాడికి తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోనప్పటికీ ఈ ప్రాంతంలో తరచూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న అల్ ఖాయిదా, ఐఎస్‌లే కారణమని భావిస్తున్నారు. బుర్కినాఫాసోతో మాలి, నైగర్ సరిహద్దులకు సమీపంలో గడిచిన ఐదేళ్లలో ఉగ్ర దాడుల్లో 700 మంది చనిపోయారు. 5.60 లక్షల మంది ప్రజలు భయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. దీంతో ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు 4, 500 ఫ్రెంచి, 13 వేల ఐక్యరాజ్యసమితి బలగాలు పనిచేస్తున్నాయి. -
బుర్కినా ఫాసోలో దాడి.. 37 మంది మృతి
ఔగాడోగ్: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దారుణం చోటుచేసుకుంది. కెనడియన్ మైనింగ్ కంపెనీ సెమాఫోలో పనిచేస్తున్న ఉద్యోగులే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 37 మంది మరణించగా.. 60 మందికి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం సెమాఫో కంపెనీ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సప్లయర్స్‌తో వెళ్తున్న ఐదు బస్సులను సాయు«ధులు అడ్డుకుని కాల్పులకు తెగబడ్డారు. బుర్కినా ఫాసోలో జిహాదీలు పాల్పడుతున్న హింసలో 700 మంది మృతి చెందారు. -
మసీదులో కాల్పులు..
ఓవాగడౌగౌ: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో కాల్పుల కలకలం చెలరేగింది. ఓవాగడౌగౌ నగరంలోని మసీదులో జరిగిన ఈ దాడిలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆయుధాలు ధరించిన కొందరు ఉగ్రవాదులు శుక్రవారం సాయంత్రం మసీదులో ప్రవేశించి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రెంచ్, ఆమెరికన్, కెనడియన్, జర్మన్ బలగాలు తమ ప్రాంతంలో ప్రవేశించి ఉగ్రవాదులతో పోరాడుతున్నామని చెబుతున్నాయని, అయితే విదేశీయులు తమ దేశంలో ఉండటం ఇష్టం లేని ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడుతున్నాయని ఓ స్థానికుడు తెలిపారు. -
చర్చిలో కాల్పులు.. ఆరుగురు మృతి
ఔగడొగొ: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోకు ఉత్తరాన ఉన్న డాబ్లో నగరంలోని ఓ క్యాథలిక్ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ మత బోధకుడు సహా ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రార్ధనలు జరుగుతుండగా సాయుధులైన కొందరు చర్చిలోకి చొరబడ్డారని డాబ్లో నగర మేయర్ ఉస్మానె జోంగో చెప్పారు. చర్చిలో ఉన్నవారు పారిపోయేందుకు ప్రయత్నించగా దుండగులు కాల్పులు జరిపారని చెప్పారు. అనంతరం చర్చికి, పలు దుకాణాలకు నిప్పు పెట్టారని జోంగో వివరించారు. స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని దోపిడీ చేశారని, చీఫ్ నర్స్ వాహనాన్ని తగులబెట్టారని చెప్పారు. దేశంలో క్రైస్తవ, ముస్లిం మత గురువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల్లో 2015 నుంచి ఇప్పటివరకు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. -
బుర్కినా ఫాసోలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
కాల్పులు, పేలుళ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
వాగాదువో : పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం నుంచి రాజధాని వాగాదువో నగరంలో ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. కారులో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులకు, బాంబు దాడులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌తోపాటు ఫ్రాన్స్ రాయబార కార్యలయంపై దాడి జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తున్నారు.రంగంలోకి దిగిన సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికా రాయబార కార్యలయం కూడా ఉగ్రదాడిని ట్విట్టర్లో తెలియజేసింది. కాగా, రెండేళ్ల క్రితం నగరంలోని ఓ టర్కీస్ రెస్టారెంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 17 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. -
బర్కినా హోటల్‌పై ఉగ్ర దాడి
26 మంది మృతి ఔగాడౌగౌ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగాలో శనివారం ఓ స్టార్ హోటల్‌పై అల్ కాయిదా ఉగ్రవాదులు తెగబడ్డారు. 26 మంది పౌరులను కాల్చి చంపారు. భద్రతా దళాలు... ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి 126 మందిని వారి చెర నుంచి రక్షించాయి. వీరిలో 33 మంది గాయపడ్డారు. తొలుత స్ప్లెన్‌డిడ్ ఫోర్ స్టార్ హోటల్, అనంతరం సమీపంలోని కాపుసినో రెస్టారెంట్‌పై దాడి చేసిన జీహాదీలు అందులోని వారిని బంధించారు. దగ్గర్లోని మరో హోటల్ వైబి నెక్ట్స్‌లో దాడి కొనసాగుతోందని ఆ దేశ మంత్రి కంపోర్ చెప్పారు. ఫ్రాన్స్ ప్రత్యేక దళాల సహకారంతో తమ భద్రతా దళాలు హోటల్లో గాలిస్తున్నాయన్నారు. దాడి నుంచి తప్పించుకున్నవారిలో కార్మిక శాఖ మంత్రి సవడోగో కూడా ఉన్నారన్నారు. ‘తెల్లవారుజామున హోటల్ ముఖ ద్వారం వద్ద కాల్పుల శబ్దం వచ్చింది.బయటనున్న దాదాపు పది వాహనాలను ఉగ్రవాదులు తగులబెట్టారు. ఆ సమయంలో అంతా నిద్రపోతున్నారు. వారిపై కాల్పులు జరిపారు’ అని యానిక్ చెప్పారు. అల్ కాయిదా అనుబంధ సంస్థ ఇస్లామిక్ మఘ్రెబ్ ఈ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించుకుంది. మృతుల్లో నలుగురు విదేశీయులున్నారు. భారతీయుడు క్షేమం! బుర్కినా ఫాసోలోని హోటల్లో ఉగ్రవాదుల చెరలో చిక్కిన 126 మంది బందీలలో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. భద్రతా దళాల ఆపరేషన్‌తో ఆ భారతీయుడు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. బుర్కినా ఫాసోలో ఉన్న గౌరవ్ గార్గ్ అనే వ్యక్తి.. తన మిత్రుడు విరాజ్ ఉగ్రవాదులు చొరబడిన స్ప్లెన్‌డిడ్ హోటల్లో చిక్కుకుపోయినట్టు మొదట ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. సైనికుల ఆపరేషన్ తర్వాత అతను క్షేమంగా బయటపడినట్టు వెల్లడించాడు. -
గన్ మెన్ కాల్పులు, కారు బాంబు పేలుళ్లు..
-
గన్ మెన్ కాల్పులు, కారు బాంబు పేలుళ్లు..
గన్ మెన్ కాల్పులు, కారుబాంబు పేలుళ్లు, 20 మంది మృతి బుర్కినా ఫాసో రాజధానిలో ఓ హోటల్ వద్ద దుర్ఘటన యూఎన్ అధికారులు, పశ్చిమ దేశాలవాళ్ల తాకిడి ఎక్కువ ఔగాడుగు: కారు బాంబు పేలుళ్లు సహా గన్ మెన్ జరిపిన కాల్పుల్లో 20 మందికి పైగా మృతిచెందారు. ఈ ఘటన ఆఫ్రికా లోని బుర్కినా ఫాసోలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధాని ఔగాడుగులోని ఫోర్ స్టార్ హోటల్ స్పెన్డిడ్ వద్ద ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. మొదటగా కొందరు గన్‌మెన్స్ హోటల్ ను చుట్టుముట్టారు. సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుంటుండగానే గన్ మెన్ కారు బాంబులు పేల్చేశాడు. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతిచెందడంతో పాటు మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్య అని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు. ఓ మంత్రి సహా 63 మందిని అల్ ఖైదా ఉగ్రవాదులు తమ బంధీలుగా అదుపులోకి తీసుకున్నారు. కారు బాంబు దాడులు, గన్ మెన్ కాల్పుల అనంతరం ఫ్రెంచ్ ఆర్మీ, అమెరికన్ బలగాలు రంగంలోకి దిగాయి. కొన్ని గంటలు అల్ ఖైదా ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిపి 63 మందిని సురక్షితంగా వారి చెర నుంచి విడిపించాయి. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ స్థానిక అల్ ఖైదా గ్రూపు అనుబంధ సంస్థ ఏక్యూఐఎమ్ ప్రకటించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. 15 మందికి బుల్లెట్ గాయాలు ఉన్నాయని, దాడినుంచి తప్పించుకునే యత్నంలో మరికొంతమందికి గాయాలయ్యాయని రాజధానిలోని యల్గాడో ఆస్పత్రి వైద్యులు వివరించారు. యూఎన్ అధికారులు, పశ్చిమ దేశాల వాసులు ఎక్కువగా స్పెన్డిడ్ హోటల్ లో బస చేస్తుంటారు. వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చునని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దు దేశం మాలిలోని రాడిసన్ హోటల్లోనూ గతేడాది ఇదేవిధంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మందికి పైగా మృతిచెందిన విషయం అందరికీ విదితమే. ఉగ్రదాడికి గురైన హోటల్ ఇదే.. -
డ్యామ్‌లో పడిపోయిన బస్సు: 22 మంది జలసమాధి
- బుర్కినా ఫాస్కోలో ఘోరం వాగాడూగు: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాస్కోలో ఘోర ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి లోతైన డ్యామ్ లోకి పడిపోవడంతో 22 మంది జలసమాధి అయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 27వ నంబర్ జాతీయ రహదారిపై కెబలోగ్ ప్రాంతం వద్ద గురువారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలను అధికారులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికితీస్తున్నదని, క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత పేద దేశాల్లో ఒకటైన బుర్కినా ఫాస్కోలో సరైన రోడ్లు లేక తరచూ భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం విషాదం. -
బర్కినా ఫాసో
ఖండం : ఆఫ్రికా వైశాల్యం : 2,74,200 చదరపు కిలోమీటర్లు జనాభా : 17,322,796 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని : ఓగాండోగో కరెన్సీ : సిఎఫ్ఎ ఫ్రాంక్ అధికార భాష : ఫ్రెంచి ప్రభుత్వం : సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ మతం : ఇస్లాం (55%) క్రైస్తవులు (25%), స్థానిక తెగలు (20%) వాతావరణం : సంవత్సరం పొడుగునా 25-40 డిగ్రీల మధ్య ఉంటుంది. పంటలు : ప్రత్తి , వేరుశనగ, జొన్నలు, రాగులు, మొక్కజొన్న, వరి. పరిశ్రమలు : ప్రత్తి జిన్నింగ్, బీరు, ఆహార పదార్థాల ప్రాసెసింగ్, సబ్బులు, దుస్తులు, బంగారం. స్వాతంత్య్రం : 1960 ఆగస్టు 5 ఎగుమతులు : ప్రత్తి, బంగారం, మాంగనీసు. సరిహద్దులు : మాలి, నైగర్, బెనిన్ టోగో, ఘనా, కోబెడి ఐవోరీ. చరిత్ర క్రీస్తు పూర్వం ఈ ప్రాంతం అడవి వేటగాళ్లకు ప్రసిద్ధి. ఆ కాలంలో వారు ఉపయోగించిన రాతి కత్తులు, కొడవళ్లు, బాణాలు ఇంకా ఇతర పరికరాలు 1973 నాటి పురావస్తు తవ్వకాలలో బయట పడ్డాయి. క్రీ.పూ. 3600 - 2500 మధ్య కాలంలో వ్యవసాయం చేసిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. క్రీ.పూ. 1200 శతాబ్దంలోనే ఇక్కడి వాళ్లు ఇనుప వస్తువులు తయారు చేసి, ఆయుధాలుగా ఉపయోగించారు. క్రీ.శ.700 లో ఈ ప్రాంతానికి ప్రోటో మోసి రాజులు వచ్చి, ఈ ప్రాంతంలో తమ రాజ్యాన్ని ఏర్పరిచారు. క్రీ.శ. 1400 శతాబ్దంలో సామో రాజులు ప్రాంతాన్ని ఆక్రమించారు. 15, 16 శతాబ్దాలలో డోగన్ రాజులు దేశ ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమించుకుని, పరిపాలన చేశారు. 16వ శతాబ్దంలో సోంఘై రాజులు, 18వ శతాబ్దంలో గ్విరికో రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్, ఫ్రెంచి, జర్మనీ పాలకులు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. చివరికి 1960 ఆగస్ట్ 5న ఫ్రెంచి నుండి ఈ దేశం స్వాతంత్య్రాన్ని పొందింది. పరిపాలనా రీతులు దేశం మొత్తం పరిపాలనా సౌలభ్యం కోసం 13 పాలనా రీజియన్లుగా విభజించారు. ఒక్కొక్క రీజియన్‌కు ఒక్కొక్క గవర్నర్ ఉంటాడు. ఈ రీజయన్లు తిరిగి 45 ప్రావిన్స్‌లుగా, 301 డిపార్టుమెంటులుగా విభజింపబడి ఉన్నాయి. దేశం మొత్తంలో పది పెద్ద నగరాలు ఉన్నాయి. అవి, రాజధాని ఓగడోగో, బోబో డియోలాసో, బాన్ ఫోరా, కొడోగో, ఒయాహిగోయా, కాయా, ఫాదా ఎన్గోర్మా, టెంకొడోగో, హోండే, డిడోగోలు. ప్రజలు - సంస్కృతి బర్కినా ఫాసో ఒక అనేక భాషల, మతాల సమ్మేళనం. దేశంలో దాదాపు 69 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఇందులో 60 భాషలు మాట్లాడే వాళ్లు ఆటవిక తెగలకు చెందినవారు. మోసి భాషను మొత్తం జనాభాలో 40% ప్రజలు మాట్లాడుతారు. అధికార భాష ఫ్రెంచి అయినా ఇతర భాషలకు కూడా దేశంలో ప్రాధాన్యత ఉంది. మండే, ద్యూలా, గారున్సి, బిస్సా, బోబో, సమో, మార్కా, పులా, గోర్ మంచి మొదలైన భాషలు మాట్లాడే ప్రజలు దేశ వివిధ భాగాలలో నివసిస్తున్నారు. దేశంలో 55% ప్రజలు ఇస్లాం మతానికి, 25% క్రైస్తవ మతానికి, మిగిలిన వారు ఆటవిక తెగలకు చెందినవారు ఉన్నారు. దేశంలో అక్షరాస్యత చాలా తక్కువ. కేవలం 23% మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. దేశంలో నివసిస్తున్న ప్రజలను బురినబి అంటారు. పంటలు - పరిశ్రమలు దేశం ఉత్తర భాగమంతా సహారా ఎడారి ఆక్రమించి ఉంది. మధ్య భాగం, దక్షిణ భాగాలలో ప్రజలు ప్రత్తి, చెరకు పంటలను ఎక్కువగా పండిస్తారు. జొన్నలు, మిల్లెట్, మొక్కజొన్న, వరి, వేరుశనగ, నువ్వుల పంటలు కూడా రైతులు పండిస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ దుస్తులు, మాంగనీస్ గనులు, బంగారం గనులు బాగా పుంజుకున్నాయి. దేశం నుండి ప్రత్తి, బంగారం ఇతర దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. పరిశ్రమలు ఎక్కువగా రాజధాని నగరం పరిసరాలలో నెల కొని ఉన్నాయి. తోలు వస్తువులు, సిగరెట్లు, ఇటుకలు, తేలికపాటి మెటల్ వస్తువులు, వ్యవసాయ పనిముట్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. రాజధాని ఓగడోగో ఈ నగరం దేశం మొత్తంలోనే అతి పెద్దది. నగరంలో మనకు దేశంలోని అన్ని తెగల ప్రజలు కనిపిస్తారు. నగరం మధ్యలో విమానాశ్రయం ఉంది. నగరంలోనే బంగ్రే ఊగో అర్బన్ పార్క్ ఉంది. ఈ పార్కులో చిన్న జంతు ప్రదర్శనశాల కూడా ఉంది. ఇందులో మొసళ్లు చూడవచ్చు. ఈ పార్కును ఎన్నో శతాబ్దాల క్రితమే నిర్మించారు. దీనితో పాటు నగరానికి అతి సమీపంలో ఎల్ యునైట్ పెడగాగిక్ అనే మరో జూపార్కు కూడా ఉంది. ఇది 20 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో అనేక రకాల అడవి జంతువులు ఉన్నాయి. ఈ పార్కులోనే ఒక మ్యూజియం ఉంది. ఇందులో శతాబ్దాల నాటి దేశ సంస్కృతి, చరిత్రకు సంబంధించిన రకరకాల వస్తువులు ఉన్నాయి. నగరంలో ఐక్యరాజ్య సమితి స్క్వేర్‌లో ఓగా- లోడెన్ గార్డెన్ ఉంది. ఇది బర్కినా - ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న స్నేహానికి చిహ్నంగా ఉంటుంది. నగరంలో ఇంకా లే మూసీ నేషనల్ మ్యూజియం ఆఫ్ మ్యూజిక్, మూసి డి మనేగా, నాబా కూమ్ అనే శిల్పం, లా ప్లేస్ డు గ్రాండ్ ల్యాన్ స్మారకం మొదలైనవి చూడవచ్చు. గౌవా నగరం గౌవా నగరం దేశంలో రెండో అతి పెద్ద నగరం. ఈ నగరంలో లోబి తెగ ప్రజలు అధికంగా నివసిస్తారు. ఇదొక మార్కెట్ నగరం. ఇక్కడి ప్రజల్లో మూఢ నమ్మకాలు అధికం. ఇక్కడి పురాతన కాలం నాటి అడవులు, చెట్లు ఉన్నాయి. వీటిని ప్రజలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బైబిల్ గ్రంథంలో పేర్కొన్న ఒక చెట్టు ఇక్కడ ఉంది. దీనిని అబ్రహం నాటాడని నమ్ముతారు. ఆ చెట్టును ప్రజలు దేవుడుగా కొలుస్తారు. ఆలివ్ చెట్లున్న ప్రాంతమంతా ఆకుపచ్చగా ఉంటుంది. ఈ నగరంలో పురాతన కాలం నాటి చెట్లతో పాటు, ఒక మ్యూజియం, కొన్ని పురాతన గుహలు కూడా ఉన్నాయి. క్రైస్తవుల చర్చి, ముస్లింల మసీదు ఆ కాలం నాటివి ఉన్నాయి. బాన్ ఫోరా నగరం ఈ నగరం దేశ దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ఉంది. శతాబ్దం క్రితం ఈ ప్రాంతాన్ని ఫ్రెంచి పాలకులు ఆక్రమించుకుని పరిపాలించారు. ఈ ప్రాంతంలో నేడు చెరకు అధికంగా పండుతుంది. ఇదొక పెద్ద వ్యాపార కేంద్రం. నగరమంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ నగరంలో గోయిన్, కరబోరో, టుర్కా తెగల ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. వీరు ఫ్రెంచి, డియోలా భాషలు మాట్లాడుతారు. ఈ నగరానికి సమీపంలో బాన్ఫోరా కాస్కేడ్లు అనే జలపాతాలు ఉన్నాయి. పర్యాటకులను ఈ ప్రాంతం బాగా ఆకర్షిస్తుంది. ఇవి నగరానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడే కోమోనది ప్రవహిస్తుంది. రాళ్లు, గుట్టల పైనుండి జాలువారే నీరు చూపరులను బాగా ఆకర్షిస్తుంది. డబ్ల్యు నేషనల్ పార్కు డబ్ల్యు నేషనల్ పార్కు ఈ దేశంలోనే కాక నైగర్, బెనిన్ దేశాల భూభాగాలలో కూడా విస్తరించి ఉంది. మూడు దేశాల ప్రభుత్వాలు దీనిని పర్యవేక్షిస్తాయి. 1954లో ఈ జాతీయ పార్కును ఏర్పరిచారు. దీనిని యునెస్కో సంస్థ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ పార్కు దాదాపు 10 వేల కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. మెర్కో, నైగార్ నదులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తాయి. రాతి గుట్టలు, వాటి సమీపాలలో పురాతన కాలం నాటి సమాధులు ఎన్నో కనిపిస్తాయి. ఈ పార్కులో అడవి దున్నలు, బబూన్ రకపు కోతులు, చిరుత పులులు, ఏనుగులు, హిప్పోలు, సింహాలు మొదలైన జంతు వర్గం ఉంది. ఆఫ్రికన్ ఏనుగులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. దాదాపు 350 రకాల పక్షిజాతులు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. -
అల్జీరియా విమాన శకలాలు లభ్యం
విమానంలోని 116 మంది మృతి పారిస్: ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో కూలిపోయిన అల్జీరియా విమానం శకలాలు లభించాయి. బర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు బుధవారం అర్ధరాత్రి బయలుదేరిన 50 నిమిషాలకే ఈ విమానం మాలిలోని గోస్సి ప్రాంతంలో కూలింది. విమానంలోని 116 మంది మృతిచెందారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండె ప్రకటించారు. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నా ఉగ్ర దాడి సహా ఏ కోణాన్ని తోసిపుచ్చలేమన్నారు. ఈ ప్రమాదంలో 51 మంది తమ దేశ జాతీయులు మృతిచెందారన్నారు. తమ బలగాలు ఘటనాస్థలికి చేరుకొని విమాన శకలాల సమీపంలో పడిఉన్న బ్లాక్‌బాక్స్‌ను గుర్తించాయన్నారు