బుర్కినా ఫాసోలో 100 మంది కాల్చివేత | Burkina Faso Says At Least 100 Civilians Killed In Countrys Deadliest Attack In Years | Sakshi
Sakshi News home page

బుర్కినా ఫాసోలో 100 మంది కాల్చివేత

Published Sun, Jun 6 2021 2:18 AM | Last Updated on Sun, Jun 6 2021 8:43 AM

Burkina Faso Says At Least 100 Civilians Killed In Countrys Deadliest Attack In Years - Sakshi

నియామీ: బుర్కినో ఫాసోలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సాయుధులైన ఉగ్రవాదులు కనీసం 100 మందిని కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సోల్‌హాన్‌ గ్రామంలో ఈ ఘటన జరిగిందని సాహెల్స్‌ యఘ ప్రావిన్స్‌ ప్రభుత్వ ప్రతినిధి ఒస్సేనీ తంబౌరా చెప్పారు. ఈ ఘటనకు జిహాదీలే కారణమని తెలిపారు. స్థానిక మార్కెట్‌ను, పలు ఇళ్లకు వారు నిప్పంటించారని పేర్కొన్నారు.

ఈ ఘటన అత్యంత అమానవీయమైనదని దేశాధ్యక్షుడు రోచ్‌ మార్క్‌ క్రిస్టియన్‌ అభిప్రాయపడ్డారు. గత అయిదేళ్లలో ఇంత భారీస్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి.  సాహెల్‌లో 5,000 ఫ్రెంచ్‌ సైనికులు మోహరించి ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ప్రాంతంలో ఇటీవల జిహాదీల దాడులు పెరుగుతూ వస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement