Terrorists attack
-
ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు. గంటముల్లా బాలా ప్రాంతంలోని స్థానిక మసీదులో ఎస్ఎస్పీ మహమ్మద్ షఫీ మీర్ ప్రార్థనలు చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించారు. "బారాముల్లా ప్రాంతంలో మసీదులో రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయాలపాలై ఆయన మరణించారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గత నెలలో, శ్రీనగర్‌లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గత కొంతకాలంగా కశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఇటీవల పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
అమర జవాన్‌కు ఆఖరి వందనం
పాములపాడు: ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ సిరిగిరి సురేంద్ర (24) అంత్యక్రియలు ముగిశాయి. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. కశ్మీర్‌లోని బారాముల్లా ఆర్మీ బెటాలియన్ యూనిట్ నంబర్ 46లో విధులు నిర్వహిస్తూ జూలై 31న జరిగిన మిలిటెంట్ ఆపరేషన్‌లో వీర మరణం పొందారు. మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా కృష్ణానగర్‌కు తీసుకువచ్చారు. బుధవారం కృష్ణానగర్ గ్రామానికి నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, తహశీల్దార్ రత్నరాధిక, ఎంపీడీవో గోపీకృష్ణ చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు భౌతికకాయంపై జాతీయ పతాకాన్ని కప్పి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ రామాంజనాయక్ ఆధ్వర్యంలో ఏఆర్ బృందం 3 సార్లు గాల్లోకి కాల్పులు జరపగా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సురేంద్ర కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు. దేశం కోసం తమ చిన్న కుమారుడు సురేంద్ర ప్రాణాలు వదిలాడని, తమను పోషించాల్సిన బాధ్యత పెద్ద కుమారుడిపై ఉందని, అతడికి ఉద్యోగం కలి్పంచాలని తల్లిదండ్రులు సుబ్బయ్య, సుబ్బమ్మ కోరారు. -
జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సిధ్రాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టారు. సంజ్తీర్థి- సిధ్రా రహదారిపై వెళ్తున్న ట్రక్కులో ఉగ్రవాదులు దాక్కున్నారని జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రతా బలగాలను రంగంలోకి దింపాయి. ట్రక్కను అడ్డుకొని తనిఖీలు చేస్తుండగా డ్రైవర్ పారిపోగా.. అందులో దాక్కున్న ఉగ్రవాదులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. J&K | Encounter underway in Sidhra area of Jammu, firing going on, two terrorists likely on the spot: Jammu and Kashmir police pic.twitter.com/R4JCATGM65 — ANI (@ANI) December 28, 2022 వెంటనే సైనిక బలగాలు టెర్రరిస్టులపై ఎదురుకాల్పులు జరిపాయి. ఉదయం 7.30 గంటలకు కాల్పులు జరిగాయని, ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఎన్ కౌంటర్ స్థలంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఒక కోడెడ్ షీట్, ఒక లెటర్ ప్యాడ్ పేజీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో 15 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ను(ఐఈడీ)బలగాలు పసిగట్టి నిర్వీర్యం చేసిన తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. చదవండి: చేదు మిగిల్చిన షుగర్ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా.. -
కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి
శ్రీనగర్: కశ్మీర్లో స్థానికేతరులే లక్ష్యంగా మరోమారు రెచ్చిపోయారు ఉగ్రవాదులు. షోపియాన్ జిల్లాలో కశ్మీరీ పండింట్లే లక్ష్యంగా శనివారం కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని చౌధరీ గుండ్ ప్రాంతంలో తన ఇంటి సమీపంలోనే పురాన్ క్రిష్ణ భట్ అనే వ్యక్తిని కాల్చి చంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భట్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారన్నారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు పోలీసు అధికారులు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు.. బాధితుడు భట్‌కు ఇద్దరు 10 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని, తాము భయం భయంగా బతుకుతున్నామని ఆయన బంధువు ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల భయంతో భట్ ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టేందుకు సైతం భయపడేవాడని చెప్పారు. ఇంతకు ముందు ఆగస్టు 16న షోపియాన్ జిల్లాలోనే ఆపిల్ తోటలో సునీల్ కుమార్ అనే పండిట్‌ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఆ తర్వాత కొద్ది రోజులు పరిస్థితులు సద్దుమణిగినట్లు కనిపించినా.. మరోమారు తూటా పేలటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొద్ది నెలలుగా కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటో తమకు రక్షణ కల్పించాలని పండిట్లు డిమాండ్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పండిట్లు ఆందోళనలు సైతం చేపట్టారు. ఇదీ చదవండి: కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి -
జమ్మూ కశ్మీర్: ఆస్పత్రిలోకి చొరబడి ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి చోటు చేసుకుంది. శ్రీనగర్‌లోని ఎస్‌కేఐఎంఎస్ ఆస్పత్రిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆస్పత్రి సమీపంలో భద్రతా దళాలపై ఉగ్రవాదుల కాల్పులకు తెగపడ్డారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు యత్నిస్తున్నారు. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని శ్రీనగర్ పోలీసులు పేర్కొన్నారు. -
భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరో మారణ హోమం చోటు చేసుకుంది. ఈద్ లక్క్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడ్డారు మిలిటెంట్లు. బాగ్దాద్ శివారు నగరం సద్ర్‌లోని ఓ రద్దీ మార్కెట్లో భారీ బాంబు పేలుడుకు పాల్పడగా.. ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో భీకరంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 35 మంది చనిపోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. సద్ర్ సిటీ వహాయిలత్ మార్కెట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బక్రీద్ కోసం మార్కెట్లకు క్యూ కట్టిన జనాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రద్దీ మార్కెట్ కావడంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఘటనకు స్థానికంగా తయారుచేసిన పేలుడు పదార్థాన్నే ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎల్(ఐఎస్ఐఎస్) ప్రకటించుకుంది. ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సాలి ఈ దాడిని ‘క్రూరమైన నేరం’గా అభివర్ణించాడు. కాగా, ఈ ఏడాదిలో ఈ తరహా దాడి ఇది మూడోది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
బుర్కినా ఫాసోలో 100 మంది కాల్చివేత
నియామీ: బుర్కినో ఫాసోలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సాయుధులైన ఉగ్రవాదులు కనీసం 100 మందిని కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సోల్హాన్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని సాహెల్స్ యఘ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి ఒస్సేనీ తంబౌరా చెప్పారు. ఈ ఘటనకు జిహాదీలే కారణమని తెలిపారు. స్థానిక మార్కెట్‌ను, పలు ఇళ్లకు వారు నిప్పంటించారని పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత అమానవీయమైనదని దేశాధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ అభిప్రాయపడ్డారు. గత అయిదేళ్లలో ఇంత భారీస్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి. సాహెల్‌లో 5,000 ఫ్రెంచ్ సైనికులు మోహరించి ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ప్రాంతంలో ఇటీవల జిహాదీల దాడులు పెరుగుతూ వస్తున్నాయి. -
‘కశ్మీర్‌ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లం’
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లార్కిపోరా ప్రాంతంలోని లుక్బావన్ గ్రామ సర్పంచ్ అజయ్ పండిత(40) అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. ఆయన ఉగ్రవాదుల చేతిలో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అజయ్ పండిత కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్. అజయ్ పండిత అంత్యక్రియల అనంతరం ఆయన సోదరుడు విజయ్ పండిత మీడియాతో మాట్లాడుతూ.. మేము కశ్మీర్‌ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లము. కశ్మీర్ లోయలో పండిట్ల కోసం ప్రభుత్వం వెంటనే రెజిమెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా తన సోదరుడు అందరికీ సహాయం చేసేవాడని తెలిపారు. బలహీన వర్గాల వారిని ఆదుకునేవాడని పేర్కొన్నారు. అజయ్ సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత ముస్లిం గ్రామాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడని వెల్లడించారు. (కరోనా: ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ లేదు) అదే విధంగా మృతి చెందిన సర్పంచ్ అజయ్ పండిత తండ్రి ద్వారికా నాథ్ పండిత మాట్లాడుతూ.. తన కుమారుడు నిజమైన దేశభక్తుడని తెలిపాడు. 1996లో తమ కుటుంబం తిరిగి కశ్మీర్‌కు వచ్చిందన్నారు. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని అజయ్ తమ ఇంటిని నిర్మించాడని పేర్కొన్నారు. తన కుమారుడి మృతి వెనక దేశ ద్రోహులు ఉన్నారని ఆరోపించారు. అజయ్ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారని తెలిపారు. గత డిసెంబర్లో అజయ్.. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరిన విషయాన్ని తండ్రి ద్వారికా నాథ్ గుర్తుచేశారు. (సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్) -
కశ్మీర్లో మరోసారి ఉగ్రపంజా; ఐదుగురు మృతి
శ్రీనగర్ : కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. బెంగాల్‌కు చెందిన ఐదుగురు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. దక్షిణ కశ్మీరులోని కుల్గాం జిల్లాలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా మరొక కూలీ తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరందరూ పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన దినసరి కూలీలని కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. తమ పని ముగించుకొని ఇంటికి వెళ్లాలని సోపోర్ బస్టాండ్‌కు వచ్చిన సమయంలో ఉగ్రవాదులు వీరిపై దాడికి తెగబడ్డారని డీజీపీ తెలిపారు. కాగా, ఉగ్రవాదులు అనంత్‌నాగ్ జిల్లాలో ట్రక్కు డ్రైవర్‌ను పొట్టన బెట్టుకున్న మరుసటి రోజే ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. చనిపోయిన ఐదుగురిలో షేక్ కమ్రూద్దీన్, షేక్ మహ్మద్ రఫీక్, షేక్ ముర్న్సులిన్ గా గుర్తించినట్లు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జహోరుద్దీన్‌ను చికిత్స కోసం అనంత్‌నాగ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో కశ్మీర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో భారీ గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. యూరోపియన్ పార్లమెంటరీ కమిటీ జమ్మూ కశ్మీర్ పర్యటనకు వచ్చిన రోజే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడడం గమనార్హం. మరోవైపు ఈ దాడిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలను బలిగొంటున్న ఉగ్రవాదులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చనిపోయిన ఐదుగురికి తన ప్రగాడ సానభూతిని ప్రకటించిన మమత వారి కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. -
కాబూల్‌లో భారీ బాంబు పేలుడు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు దగ్గర్లోనే ఈ దాడి చోటుచేసుకుంది. ఈ దాడికి తమదే బాధ్యత అని తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించారు. కారు బాంబుతో దాడి జరిగిందని ప్రభుత్వం చెప్పినప్పటికీ, తాలిబన్ మాత్రం ట్రక్ బాంబ్‌తో ఈ పేలుడు జరిపినట్లు ప్రకటించారు. ఈ దాడిలో 14 మంది అక్కడిక్కడే మృతి చెందగా, 145 మంది గాయపడ్డారు. అమెరికా సైన్యాలు అఫ్గాన్ విడిచి వెళ్లేందుకు, దోహాలో తాలిబన్లకు, యూఎస్ బలగాలకు మధ్య ఎనిమిదో దఫా చర్చలు జరుగుతుండగానే ఈ దాడి జరగడం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం రద్దీగా ఉండే ఉదయం 9 గంటల సమయంలో పేలుడు సంభవించింది. బాంబు పేలుడు శబ్దం పశ్చిమ కాబూల్ అంతా మారు మోగింది. పేలుడు అనంతరం చాలా మంది మహిళలు తమ భర్తల కోసం, పిల్లల కోసం ఏడుస్తూ కనిపించారంటూ స్థానిక జర్నలిస్ట్ జకేరియా హసాని తెలిపారు. పేలుడు ధాటికి కిలోమీటరు పరిధిలోని దాదాపు 20 దుకాణాల గాజు కిటికీలు పగిలిపోయానని దుకాణదారుడు అహ్మద్ సాలేహ్ తెలిపారు. గాయపడిన 145 మందిలో దాదాపు 92 మంది సాధారణ పౌరులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ దాడితో మరణించిన, గాయపడిన వారి సంఖ్య ఒక్క నెలలోనే దాదాపు 1500కు చేరింది. ఈ దాడికి ముందుగా కాబూల్‌లో ఐఎస్ ఉగ్రవాదులు తలదాచుకుంటున్న ఇళ్లను అఫ్గాన్ బలగాలు ధ్వంసం చేశాయి. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి/గుంటూరు: శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి తీర ప్రాంత రాష్ట్రాలకు తీవ్రవాదులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని డీజీపీ ఆర్పీ ఠాకూర్ పలు జిల్లాల పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ ఠాకూర్ బుధవారం ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రధానంగా విమానాశ్రయాలు, ఓడ రేవులు, బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సముద్రతీరాల్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని మార్గనిర్దేశం చేశారు. విదేశీ పర్యాటకులు వచ్చే ప్రాంతాలు, హోటల్స్, జనం ఎక్కువగా చేరే స్థలాల వద్ద బాంబు స్క్వాడ్లు, జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రముఖ మసీదులు, చర్చిలు, ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. కీలక ప్రాంతాలు, కేంద్ర సంస్థలు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వద్ద స్థానిక పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏఏ ప్రాంతాల్లో అలజడులు, అసాంఘిక శక్తుల కదలికలు ఉండే అవకాశం ఉందో గుర్తించాలని సూచించారు. ఆర్మ్డ్ కౌంటర్ యాక్షన్ పోలీస్ టీమ్స్, ఆక్టోపస్ టీమ్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు చాలా కేసుల్లో సీసీ కెమెరా ఫుటేజీలు కీలకంగా ఉపయోగపడతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బందోబస్తు పరంగా పలు ప్రాంతాల్లో ఉన్న వైఫల్యాలను గుర్తించి వాటిని నెల రోజుల్లో చక్కదిద్దుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందేలా ప్రజలతో పోలీసులు మంచి సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. భద్రతా చర్యలపై నెల రోజుల్లో సమీక్ష: డీజీపీ వీడియో కాన్ఫరెన్సు అనంతరం డీజీపీ ఠాకుర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లకు పలు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. మరో నెల రోజులు తర్వాత భద్రతాపరమైన చర్యలు ఏమేరకు తీసుకున్నారో అనే విషయాలను సమీక్షిస్తామని డీజీపీ చెప్పారు. సమావేశంలో డీజీపీతోపాటు శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్, సీఐడీ ఏడీజీ అమిత్‌గార్గ్, పీఅండ్ఎల్ ఏడీజీ హరీష్‌కుమార్ గుప్త పాల్గొన్నారు. రాజధానిలో హై అలర్ట్ ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో రాజధాని ప్రాంతంపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తాత్కాలిక సచివాలయంతోపాటు, హైకోర్టు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. అక్కడకు వెళ్లే అన్ని రహదారుల్లోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్త వ్యక్తుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. అనుకోని సంఘటన జరిగితే ఏవిధంగా ఎదుర్కోవాలనే దానిపై మాక్‌డ్రిల్‌ను నిర్వహిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని సముద్రతీర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఎయిర్‌ఫోర్స్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర అధికారులతో మాట్లాడుతూ ఉగ్రవాద కదలికలపై ఆరా తీస్తున్నారు. మత పెద్దలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన గుంటూరు అర్బన్ పోలీసులు మసీదులు, చర్చిలు, దేవాలయాల వద్ద అనుమానిత వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు వలంటీర్లను ఏర్పాటు చేసేలా మత పెద్దలకు సూచిస్తున్నారు. లాడ్జిలు, హోటళ్లపై ఆకస్మికంగా దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
సముద్ర మార్గం ద్వారా భీకర దాడులకు పాక్ స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొచ్చుకువచ్చి భారత్‌లో విధ్వంసకర దాడులు చేపట్టేందుకు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం నేడు ప్రపంచ శాంతి సుస్ధిరతలకు పెను సవాల్ విసురుతోందని, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు అంతర్జాతీయ సమాజం ఒక్కటై పోరాడాలని ఆయన కోరారు. గత కొన్నేళ్లుగా ఇండో పసిఫిక్ ప్రాంతం భిన్నరూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండో పసిఫిక్ రీజినల్ డైలాగ్‌లో ఆయన మాట్లాడుతూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని నేవీ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో మనం మూడు వారాల కిందట ఉగ్రవాదుల భీకర దాడిని చూశామని పుల్వామా ఘటనను ఆయన ప్రస్తావించారు. భారత్‌ను అస్థిరపరిచేందుకు పొరుగు దేశం ఉగ్రవాదులను ప్రేరేపిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. సముద్ర మార్గం ద్వారా దేశంలోకి చొచ్చుకువచ్చి ఉగ్రవాదులు భారత్‌లో అలజడి సృష్టించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయని చెప్పారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించేందుకు భారత సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. -
‘పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదు’
ఇస్ఫాహన్(ఇరాన్): తమ దేశంలో ఆత్మాహుతి దాడితో 27 మంది భద్రతా సిబ్బంది మృతికి కారణమైన పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. పాక్– ఇరాన్ సరిహద్దుల్లోని సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం సైనికులతో వెళ్తున్న బస్సును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చడంతో అందులోని 27 మంది మృతి చెందారు. ఆ సైనికుల అంతిమ యాత్రలో ఇరాన్ సైనిక దళాల(రివల్యూషనరీ గార్డ్స్) కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫారీ పాల్గొని, ప్రసంగించారు. ‘ఇప్పటిదాకా ఉపేక్షించాం. ఇకపై ధీటుగా బదులిస్తాం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు. ఇరాన్ బద్ద విరోధి, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదివారం నుంచి పాక్ పర్యటన ప్రారంభమవుతున్న సమయంలో ఇలాంటి హెచ్చరికలు వెలువడటం గమనార్హం. తమ సైనికులపై దాడికి పాక్ ప్రోత్సాహంతో నడుస్తున్న ‘జైషే ఆదిల్’ కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. -
పుల్వామా : భద్రతా బలగాలపై ఉగ్ర దాడి
-
ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఓ జవాను, మరో పౌరుడు మరణించారు. ఆదివారం రాత్రి కాకపోరాలోని 50వ రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్‌పై మిలిటెంట్లు దాడి చేశారని, ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. జవాన్లు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మిలాల్ అహ్మద్ అనే మరో పౌరుడు గాయపడ్డాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మరణించినట్లు వెల్లడించారు. మరోవైపు, కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మిలిటెంట్లు జరిపిన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. -
మారణహోమమా..? అబ్బే ఉత్తిదే!
సాక్షి, హైదరాబాద్: మయన్మార్‌లో రొహింగ్యా ముస్లింల మారణహోమం జరగలేదని ఆ దేశ రాయ బారి మవ్ చా అంగ్ తోసిపుచ్చారు. రొహింగ్యా ప్రజలపై సామూహిక అత్యాచారాలు, హత్యలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్ని కట్టుకథలని కొట్టిపారేశారు. దేశ సరిహద్దులోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారని, దీంతో సైన్యం జరిపిన ప్రతిదాడిలో కేవలం 10 మంది మాత్రమే మరణించారన్నారు. అంతకు మించి ఏమీ జరగలేదని, మారణ హోమం జరిగిందని చెప్తున్న వారే ఆధారాలు చూపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటా మన్నారు. మయన్మార్‌లోని రోహింగ్య ముస్లింలపై గతేడాది సెప్టెంబర్‌లో అక్కడి సైన్యం జరిపిన దాడుల్లో వందలాది మంది మరణించడంతో పాటు దాదాపు 5 లక్షల మంది కట్టుబట్టలతో పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు పారిపోయి తలదాచుకుంటున్న విష యం తెలిసిందే. మనుషుల అక్రమ రవాణాకు వ్యతి రేకంగా శనివారం నగరంలో ప్రారంభమైన ‘దక్షిణాసియా దేశాల సదస్సు’లో పాల్గొనడానికి వచ్చిన మవ్ చా అంగ్ ...రోహింగ్యా ముస్లింల సంక్షోభంపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న: మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చారు. మీ దేశంలో రోహింగ్యా ముస్లిం మహిళలపై సామూహిక అత్యాచారాలు, హత్యలు జరిగాయి. వారు మహిళలు కారా? మవ్ చా అంగ్: అలాంటి దేమీ జరగలేదు. ప్రశ్న: పెద్ద సంఖ్యలో రొహింగ్యాలు ఆశ్రయం కోల్పోయి పరాయిదేశం బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు? ఇది మనుషుల అక్రమ రవాణాకు దారితీయదా? మవ్ చా అంగ్: మా దేశంలో ఎలాంటి మారణహోమం జరగలేదు. అక్కడ ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదులు, సైన్యం మధ్య ఎదురు కాల్పులు జరగడంతో ప్రజలు రక్షణ కోసం పారిపోయారు. ప్రశ్న: రోహింగ్యాలు దేశం విడిచి వెళ్తుంటే మీ ప్రభుత్వం ఎందుకు వారిని ఆపలేకపోయిం ది? బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయిన 5లక్షల మంది రొహింగ్యాలు తిరిగి వచ్చేందుకు మీ ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదు? మవ్ చా అంగ్: ఎదురు కాల్పులు జరుగు తున్నప్పుడు రక్షణ కోసం వెళ్లిపోతున్న వారిని ఆపడం సాధ్యం కాదు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ తర్వాత వెనక్కి వచ్చే వారిని అనుమతిస్తున్నాం. ఇప్పటికే కొందరు తిరిగి వచ్చారు. ప్రశ్న: రొహింగ్యాలు తమ సొంత దేశంలోనే సురక్షితంగా లేరన్నది వాస్తవం కాదా? మవ్ చా అంగ్: మా దేశంలో ప్రజలందరికీ రక్షణ కల్పిస్తున్నాం. ప్రశ్న: మీ ప్రభుత్వం ప్రతి ప్రాణానికి భరోసా కల్పిస్తుందా? మవ్ చా అంగ్: కచ్చితంగా.. మా దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ రక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రశ్న: మారణహోమం జరగలేదని అంటు న్నారు కదా.. వాస్తవాలు తెలుసుకో వడానికి మీ ప్రభుత్వం అంతర్జాతీయ మీడియాను ఎందుకు అనుమతించడం లేదు? మవ్ చా అంగ్: అంతర్జాతీయ దౌత్యవేత్తలు మా దేశంలో సందర్శించారు. అంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో అంతర్జాతీయ మీడి యాను అనుమతించలేం. మీ దేశంలో కూడా ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో అంతర్జా తీయ మీడియా పర్యటించేందుకు ప్రభు త్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉం టుంది. ఐక్య రాజ్య సమితి, ఇతర అంతర్జా తీయ సంస్థలను దేశంలోకి అనుమతించాం. ప్రశ్న: రోహింగ్యా ముస్లింలను చంపి సామూ హికంగా పాతిపెట్టిన సమాధులను వెలుగు లోకి తెచ్చిన ముగ్గురు రాయిటర్స్ జర్నలి స్టులను అరెస్టు చేయడం ఎంతవరకు సబబు? మవ్ చా అంగ్: అధికారిక రహస్యాల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకే వారిని అరెస్టు చేశాం. మా దేశం చట్ట ప్రకారం నడుచుకుంటోంది. సామూహిక సమాధులను వెలుగులోకి తెచ్చినందుకు అరెస్టు చేయలేదు. ప్రశ్న: రోహింగ్యాలను ఊచకోత కోశారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థలు సైతం ఆరోపించాయి? మవ్ చా అంగ్: అలా జరిగితే ఆధారాలు చూపమని అడుగుతున్నాం. దేన్ని దాచలేం. వెయ్యి మంది హత్యకు గురయ్యారని అనుకోండి. ఎక్కడ జరిగిందో చూపండి. కొందరు కట్టు కథలు చెప్పారు. ఆధారాలు చూపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: రొహింగ్యా ముస్లింలకు పౌరసత్వం ఎందుకు జారీ చేయడం లేదు? మవ్చాఅంగ్: చట్టప్రకారం నడుస్తాం ప్రశ్న: మయన్మార్‌లో బౌద్ధ తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో మీ ప్రభుత్వం విఫలమైం దని ఆరోపణలున్నాయి? మవ్ చా అంగ్: కేవలం 10 మంది మాత్రమే మృతి చెందారు. ఉగ్రవాదుల చేతిలో అంతకంటే ఎక్కువ మంది హతమయ్యారు. -
ట్రాల్లో ఉగ్రవాదుల దాడి..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు లక్ష్యంగా గురువారం ఉదయం దాడులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువమంది పోలీసులు, జవాన్లే ఉన్నారు. సీఆర్పీఎఫ్ యూనిట్ లక్ష్యంగా మొదట గ్రనేడ్ దాడులు చేసిన ఉగ్రవాదులు అనంతరం కాల్పులు జరిపారు. రాష్ట్రమంత్రి నయీమ్ అఖ్తర్ ట్రాల్ ప్రాంతానికి ఓ ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి మంత్రి తృటిలో సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించిన భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని.. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. ర్యాంబన్లో జరిగిన మరో ఉగ్రవాద దాడిలో ఆర్మీ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయారు. -
శ్రీనగర్‌లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు!
అమరుడైన ఒక జవాను.. ఇద్దరికి గాయాలు కొనసాగుతున్న ఆపరేషన్ శ్రీనగర్: జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. భారీ ఆయుధాలతో కూడిన ఉగ్రవాదులు శనివారం సాయంత్రం గస్తీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఒక జవాను అమరుడు అవ్వగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనగర్ పంథా చౌక్ ప్రాంతంలోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై సాయంత్రం 6. 15 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు ఏకే-47 రైఫిళ్లతో సీఆర్పీఎఫ్ జవాన్లపై విచక్షణారహితంగా 29వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో గాయపడిన ముగ్గురు జవాన్లను సమీపంలోని బాదమిబాఘ్ సైనిక ఆస్పత్రికి తరలించగా.. సబ్ ఇన్స్పెక్టర్ సాహబ్ శుక్లా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రవాద ఆడితో అలర్ట్ అయిన పోలీసులు, పారా మిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని ముష్కరులను ఏరివేసే ఆపరేషన్‌ను చేపట్టారు. శ్రీనగర్-రహదారిని మూసివేసి ముమ్మరంగా ఆపరేషన్ చేపడుతున్నారు. -
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరుగురు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లా హజవిరా ఆచాబాల్లో పోలీస్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు శుక్రవారం దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ అధికారితో పాటు అయిదుగురు పోలీసులు మృతి చెందారు. కాగా ఈ దాడిలో సుమారు 15మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో టాప్ లష్కరే తోయిబా కమాండర్ జునేద్ మట్టూ మరణించాడు. అనంత్‌నాగ్ జిల్లాలోని ఆర్వాణీ గ్రామంలో తీవ్రవాదులన్నారన్న సమాచారంతో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో కమాండర్‌తో మరో ఇద్దరు లష్కరే మిలిటెంట్లు మరణించినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలను చూడగానే స్థానిక యువత రాళ్ల దాడి ప్రారంభించింది. పలు ఉగ్రదాడుల్లో జునేద్ హస్తం ఉందని ఆర్మీ తెలిపింది. ఇక నిన్న వేర్వేరు ఘటనల్లో ఉగ్రదాడుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. -
మొబైల్ ఇంటర్నెట్, సోషల్ మీడియాపై బ్యాన్!
ఇంఫాల్‌లో చర్చిలపై దాడుల నేపథ్యంలో వదంతులు మత ఉద్రిక్తతలు నివారించేందుకు అధికారుల నిర్ణయం ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని ఇంఫాల్‌లోని మణిపూర్ బాప్టిస్టు కన్వేన్షన్ సెంటర్ చర్చి, తాంగ్ఖుల్ చర్చిపై అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. చర్చిలపై దాడుల అంశంపై వదంతులు వస్తుండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వదంతుల వ్యాప్తిని, మత ఉద్రిక్తతలను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్పై, సోషల్ మీడియా వెబ్సైట్లపై నిషేధం విధించారు. మణిపూర్‌లోని పలు జిల్లాలు నాగాల పూర్వీకుల భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయంటూ నాగా గిరిజన గ్రూపులు ఆందోళనకు దిగడంతో మణిపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది. మణిపూర్‌కు నిత్యావసరాలు సరఫరా అయ్యే ప్రధాన రహదారిని గిరిజనులు దిగ్బంధించడంతో ఆ రాష్ట్ర ప్రజలు నిత్యావసరాలతోపాటు కనీస ఔషధాలు లేక అల్లాడుతున్నారు. మరోవైపు నాగా ఉగ్రవాదుల దాడులతో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంఫాల్‌లో నాగా వర్గం ప్రజలు తరచూ సందర్శించే చర్చిలపై కొందరు అల్లరిమూకలు రాళ్లు విసరడం కలకలం రేపింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదుల కాల్పులు
-
ఆర్మీ కాన్వాయ్ పై కాల్పుల కలకలం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాంపోర్ లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. పుల్వామా జిల్లాలోని కద్లబాల్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జవాన్లు ఎదరుకాల్పులు ప్రారంభించగానే కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పులు జరిగిన వెంటనే ఆర్మీ సిబ్బంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సొరంగ మార్గంలో ఉగ్రవాదులు చొరబడ్డారు
-
సొరంగ మార్గంలో ఉగ్రవాదులు చొరబడ్డారు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని బీఎస్ఎఫ్ డీజీ కేకే శర్మ చెప్పారు. సైనిక స్థావరాలపై దాడి చేసిన ఉగ్రవాదులు సొరంగ మార్గం ద్వారా జమ్ము కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి చొరబడ్డారని తెలిపారు. ఫెన్సింగ్ లేని ప్రాంతాల్లో టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు. సర్జికల్ దాడుల తర్వాత ఇప్పటి వరకు 15 మంది పాకిస్థాన్ రేంజర్లను, 10 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని బీఎస్ఎఫ్ డీజీ వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దుతో భద్రత దళాలకు ఇబ్బందేమీ లేదని చెప్పారు. నగరోటాలో నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో ఏడుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. భద్రత దళాల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతను బీఎస్ఎఫ్ డీజీ సమీక్షించారు. -
కశ్మీర్లో మళ్లీ ఉగ్ర కాల్పులు
పోలీసు మృతి శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. షోపియాన్ జిల్లాలో ఓ మైనారిటీ వర్గానికి కాపలా కాస్తున్న సెక్యూరిటీ పోస్టుపై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు చనిపోయాడు. మరో పోలీసు, ఓ పౌరుడు గాయపడ్డారు. పోలీసులు ఎదురు కాల్పలు జరపడంతో ఉగ్రవాదులు పారిపోయారు. కాల్పుల్లో కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, పీఓకేలో ఉగ్ర స్థావరాలపై భారత్ గత నెల 29న సర్జికల్ దాడుల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి 25 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. -
'విమానం ఢీకొట్టిన అంతస్తుపైనే నాన్న'
న్యూయార్క్: సెప్టెంబర్, 11, 2001. ఆ రోజు అమెరికా చరిత్రలోనే చెరిగిపోని మచ్చ. మరిచిపోలేని ఓ పీడకల. తలుచుకుంటేనే బాధితులకే కాకుండా అమెరికన్లందరికి అమ్మో అని గుండెలను తడుముకునేలా చేసిన ఓ భయంకర సంఘటన. అదే ట్విన్ టవర్స్ బ్లాస్ట్. అమెరికాలోని ప్రముఖ రెండు వాణిజ్య సముదాయాలపై ఉగ్రవాద సంస్థ అల్ ఖాయిదా విమానాలను హైజాక్ చేసి మరి దాడి చేసిన సందర్భం. ఈ ఘటనలో 3000మందికి పైగా చనిపోగా ఎంతోమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ సమయంలో ఊపిరి బిగపట్టుకొని ఉత్కంఠగా తమవారి జాడకోసం ఎదురుచూసిన వారు ఎందరో.. అలాంటి వారిలోనే ఆ సమయంలో పదకొండేళ్ల ప్రాయంలో ఉన్న ఓ అమ్మాయి తన తండ్రిని కోల్పోయింది. ఈ ఘటన జరిగి దాదాపు నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా క్రిస్టినా రాంకే అనే అమ్మాయి తన తండ్రిని కోల్పోయిన తీరు, ఆ సమయంలో ఆ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితి ఓసారి ఆమె మాటల్లోనే చూస్తే.. '9/11న జరిగిన సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడే 15 ఏళ్లు గడిచిపోయాయని అనుకుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ సంఘటన జరిగినప్పుడు నాకు 11 ఏళ్లు. మా నాన్న దాడికి గురైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని దక్షిణ టవర్ లో ఉద్యోగం చేసేవారు. మేమంతా జిమ్ లో ఉండగా కొంతమంది వచ్చి మా స్కూల్ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన విషయం చెప్పారు. నన్ను ఇంటికి తీసుకెళ్లగా అంతా టీవీల ముందు టెన్షన్ గా ఉన్నారు. టవర్లు తగలబడిపోతున్న దృశ్యాలు నా కళ్లకు టీవీలో కనిపించాయి. అవి ఇప్పటికీ నా కళ్లలోనే కనిపిస్తాయి. 3000మంది చనిపోయారు. ఆ సమయంలో నాకు ఆ విషయం తెలియదు. అందులోనే పనిచేస్తున్న నాన్న కనిపించడం లేదని తెలిసింది. అమ్మకు దిగులు మొదలైంది. ఎన్ని ఆస్పత్రులకు పరుగులు పెట్టి నాన్న కోసం గాలించిందో లెక్కే లేదు. ఆ రోజు అమ్మకష్టం అంతాఇంత కాదు. మా చుట్టూ అప్పుడు ఎన్నో ప్రశ్నలు. చివరకు మా దురదృష్టంకొద్ది ఆయన మృతదేహం కూడా లభ్యంకాని పరిస్థితి. ఆ ప్రమాదంలో నాన్న లేడు తిరిగొస్తాడని ఎదురుచూశాం. నాలుగు నెలల తర్వాత ఆయన ఇక లేనట్లేనని నిర్ణయానికి వచ్చాం. నా మిత్రులను కూడా ఎంతోమందిని పోగొట్టుకున్నాను. అమ్మ ప్రతి రోజు ఏడుస్తుండేది. అది నాపై చాలా ప్రభావం పడింది. మా నాన్నకు నేను చాలా ఇష్టం. ఓ ఉగ్ర విమానం ఢీకొట్టిన ఎత్తయిన అంతస్తులో పనిచేసేవారు. నన్ను కొన్నిసార్లు తీసుకెళ్లారు. అప్పుడప్పుడు సరదాగా లిఫ్ట్‌లో చివరి వరకు వెళ్లే వాళ్లం. ఆయనకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి. నా కుటుంబంలో నేనే పెద్దదాన్ని అయినందున ఏదో ఒకటి కుటుంబం కోసం చేయాలని అనుకున్నాను. ప్రస్తుతం వెంచర్ క్యాపిటలిస్టుగా పనిచేస్తున్నాను. 9/11 ఘటన బారిన పడ్డ బాధితుల కుటుంబాల్లోని పిల్లల విద్యావకాశాలకు కూడా నేను కృశిచేస్తున్నాను. ఇది నాకు చాలా ముఖ్యమైనది కూడా' అంటూ క్రిస్టినా చెప్పుకొచ్చింది. (చిన్నప్పుడు తండ్రితో క్రిస్టినా రాంకే(ఫైల్)) -
అమెరికన్ వర్సిటీపై ఉగ్రదాడి
కాబుల్: అఫ్ఘనిస్థాన్ రాజధాని నగరంలో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. బుధవారం రాత్రి కాబుల్ నగరంలోని ప్రఖ్యాత అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ అఫ్ఘనిస్థాన్ లోకి చొరబడ్డ ముష్కరులు బాంబులు పేల్చుతూ, తూలాల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పలువురు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది విద్యార్థులు వర్సిటీ లోపలే చిక్కుకు పోయారు. ప్రభుత్వ దళాలు ఘటనాస్థలానికి చేరుకుని ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్ ప్రారంభించారు. 'భారీ పేలుళ్లు, తుపాకి చప్పుళ్లు వినిపిస్తున్నాయి.. భయంగా ఉంది' అంటూ లోపలున్నవారు మెసేజ్ ల ద్వారా స్నేహితులకు సమాచారం అందించారు. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఉగ్రవాదుల దాడి: ముగ్గురు జవాన్లు, పోలీసు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు. బారాముల్లా సెక్టార్లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై తెల్లవారుజామున 2. 30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్ల సహా ఒక పోలీస్ అధికారి మృతిచెందినట్టు తెలిపారు. మరో ఐదుగురు అధికారులకు గాయాలు అయినట్టు పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు ఆర్మీ అధికారుల కుంబింగ్ కొనసాగుతోంది. -
అసోంలో టెర్రరిస్టుల దాడి, 13 మంది మృతి
కొక్రాఝర్: పట్టణానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలోని బాలాజన్ టినాలి మార్కెట్ పై జరిగిన ఉగ్రదాడిలో 13 మంది పౌరులు మృతి చెందగా, గాయలపాలైన వారి సంఖ్య 18కు పెరిగింది. దాడిపై స్పందించిన ప్రభుత్వం మరిన్ని దళాలను ఘటనాస్థలానికి హుటాహుటిన పంపింది. కాగా దాడిని అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తీవ్రంగా ఖండించారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో మృతి చెందిన పౌరులకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. మొత్తం ముగ్గురు మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారని డిఫెన్స్ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ ఎస్ న్యూటన్ చెప్పారు. ఒక మిలిటెంటును భద్రతాదళాలు హతమార్చినట్లు ప్రకటించారు. మిగిలిన ఇద్దరి కోసం భద్రతాదళాలు గాలిస్తున్నట్లు తెలిపారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రంలో హైఅలర్ట్ ఉన్న సమయంలో దాడి జరగడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. దాడిపై స్పందించిన అసోం డీజీపీ సహాయ్ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్ బీ) కు మిలిటెంట్లు దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నట్లు చెప్పారు. కొక్రాఝర్ మిలిటెంట్ల దాడి దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అసోం ప్రభుత్వం నుంచి దాడిపై పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి
జమ్మూ కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పై శనివారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాంపోర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. -
రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి: ఆరుగురి జవాన్ల మృతి
మణిపూర్: మణిపూర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చాదల్ జిల్లాలో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఆదివారం మధ్యాహ్నం ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తనిఖీలు ముగించుకుని వెళ్తున్న రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మందుపాతరతో దాడికి పాల్పడ్డారు. మొత్తం ఆరు రైఫిల్స్‌ను ఉగ్రవాదులు ఎత్తుకుపోయినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు
-
పఠాన్‌కోట్ లో పేలుడు; మరో జవాన్ మృతి
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ లో ఆదివారం ఉదయం ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆర్మీ ఆఫీసర్ నిరంజన్ సింగ్ మృతిచెందగా, మరో ఐదుగురు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఎయిర్‌బేస్ నుంచి తుపాకీ కాల్పులతో పాటు పేలుడు శబ్ధాలు వినిపించినట్టు స్థానికుల చెబుతున్నారు. ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ లో మొత్తం ఐదగురు ఉగ్రవాదులను హతమార్చగా, ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల మృతదేహాల పక్కన పడిఉన్న ఏకే-47, గ్రనైడ్స్, జీపీఎస్ పరికరాలు, మోర్టార్లను సిబ్బంది స్వాధీనం చేసుకుంది. ఆర్మీ, పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎయిర్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఐఎస్ఐ పథకం ప్రకారం జైష్ ఫిదేయిన్స్ ఉగ్రవాదులు పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంపుపై దాడి చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్పీ మృతి, 13కి చేరిన మృతుల సంఖ్య
-
మ్యూజియంపై దాడి :19 మంది మృతి
ట్యునిస్ : ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యూనీషియా రాజధాని ట్యూనిస్లో ప్రఖ్యాత బర్దో మ్యూజియంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 19 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో అత్యధికులు విదేశీ పర్యాటకులేనని ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు. దాడికి తెగబడిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రత దళాలు హతమార్చినట్లు చెప్పారు. మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బర్దో మ్యూజియంలోని చోరబడిన ఉగ్రవాదులు... సందర్శకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దాంతో అక్కడికి చేరుకున్న భద్రత దళాలు వెంటనే మ్యూజియంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వారి వద్ద బందీలుగా ఉన్న విదేశీ సందర్శకులను భద్రత దళాలు మ్యూజియం నుంచి బయటకు సురక్షితంగా పంపించారు. ఈ కాల్పుల ఘటనపైన ట్యూనీషియా అధ్యక్షుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్యునిస్లోని బర్దో మ్యూజియం అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉంది. -
పెషావర్ మృతులకు పార్లమెంట్ శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ : పాకిస్తాన్ పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిని పార్లమెంట్ ఉభయ సభలు బుధవారం ఖండించాయి. మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉభయసభల్లో సభ్యులు రెండు నిమిషాల పాటూ మౌనం పాటించారు. అనంతరం మత మార్పిళ్ల అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. ప్రధాని మోదీ సభకు వచ్చి ఈ అంశంపై ప్రకటన చేసేదాకా సభ సజావుగా సాగనివ్వబోమని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి... సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను మధ్యాహానానికి వాయిదా వేశారు. -
సరిహద్దులో ఉగ్ర దాడులు
ముగ్గురు ఆర్మీ సిబ్బంది, ముగ్గురు పౌరులు మృతి నలుగురు ఉగ్రవాదులు హతం జమ్మూ/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన మరోరోజు ఉండగా.. గురువారం జమ్మూలోని అర్నియా సెక్టార్‌లోని సరిహద్దు ప్రాంతం తుపాకుల మోతతో హోరెత్తింది. పాకిస్తాన్ సరిహద్దుకు చేరువలో ఉన్న రెండు భారత బంకర్లలపై ఉగ్రవాదులు దాడికి దిగారు. దీనిని ఆర్మీ సిబ్బంది దీటుగా ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన భీకరమైన కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బందితో పాటు మరో ముగ్గురు పౌరులు మృతిచెందారు. భారీ ఎత్తున ఆయుధాలతో చొరబాట్లకు ప్రయత్నించి, ఒక బంకర్లో నక్కిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో మిలిటెంట్ బంకర్లోనే ఉన్నాడని, ఆ బంకర్‌ను పేల్చివేయడానికి ట్యాంకర్లను రప్పించామని పోలీసులు తెలిపారు. కాగా, శుక్రవారం ఉధంపూర్ జిల్లాలో జరిగే ఎన్నికల సభల్లో మోదీ పాల్గొననున్నారు. ఆ ప్రాంతం ఈ కాల్పులు జరి గిన ప్రాంతానికి 100 కి.మీ. దూరంలో ఉండటం గమనార్హం. ఐదుగురు ఉగ్రవాదుల బృందం అర్నియా సెక్టార్‌లోని ఎల్వోసీ నుంచి దేశంలో చొరబాటుకు ప్రయత్నించారని, ఆర్మీ, బీఎస్ఎఫ్, పోలీస్ దళాలు రంగంలోకి దిగి వారి కోసం వెతుకులాట ప్రారంభించిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఆర్మీ దుస్తులు ధరించిన ఉగ్రవాదులు అర్నియా సెక్టార్లో తాము ఖాళీ చేసిన 92 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ బంకర్‌ను ఆక్రమించారన్నా రు. మిలిటెంట్లు ఉపయోగించనట్లుగా భావిస్తు న్న ఓ కారును ఆర్మీ స్వాధీనం చేసుకుంది. యాదృచ్చికం కాదు..: ఒమర్ ఈ దాడులు యాదృచ్చికం కాదని, సార్క్ సమావేశాల్లో భారత్, పాక్ ప్రధానులు పాల్గొన్న నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కొన్నింటిని ఎప్పటికీ మార్చలేమని, ఇరు దేశాల నేతలు సమావేశమైతే సరిహద్దులో అలజడి మామూలేనని చెప్పారు. మరోవైపు రాజౌరీ జిల్లాలోని ఎల్వోసీ వద్ద చొరబాటుకు మిలిటెంట్లు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ అడ్డుకుంది. ఆయుధాలతో కూడిన ఒక అనుమానిత మిలిటెంట్‌ను అదుపులోనికి తీసుకుంది. 400లకుపైగా ఉల్లంఘనలు న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఆగస్టు నుంచి సెప్టెంబర్ 17 వరకూ పాకిస్తాన్ సేనలు 400ల సార్లకుపైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు గురువారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశ ప్రజల రక్షణ, భద్రత కల్పించేం దుకు, దేశ సమగ్రతను కాపాడేందుకు కేం ద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. -
కరాచీ విమానాశ్రయంపై తాలిబన్ల దాడి
తిప్పికొట్టిన పాక్ భద్రతా బలగాలు 10 మంది ఉగ్రవాదులు సహామొత్తం 29 మంది మృతి 13 గంటలు సాగిన కాల్పులు కరాచీ: పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆదివారం ఆర్ధరాత్రి సమయంలో ప్రారంభమైన ఈ దాడి సోమవారం మధ్యాహ్నం వరకు సుమారు 13 గంటలపాటు సాగింది. భద్రతాదళాల దుస్తుల్లో వచ్చిన మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు సాగించారు. పాక్భద్రతాదళాలు ఈ దాడిని తిప్పికొట్టాయి. ఇరుపక్షాలమధ్య జరిగిన భీకరపోరులో మొత్తం 29 మంది మృతిచెందారు. ఇందులో 10 మందివరకు ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం. నిషేధిత తెహ్రికే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే పాల్పడినట్టు ప్రకటించింది. ప్రస్తుతం విమానాశ్రయం పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చిందని, ఉగ్రవాదులను మట్టుపెట్టామని పాక్ పారామిలిటరీ రేంజర్స్ ప్రతినిధి సిబ్తియాన్ రిజ్వీ మీడియాకు తెలిపారు. 17 గంటల అనంతరం విమానాశ్రయాన్ని తిరిగి ప్రయాణికులకోసం తెరిచారు. పదిమంది ఉగ్రవాదులు రెండు బృందాలుగా విడిపోయి ఈ దాడి చేశారని ఆయన వివరించారు. ఆర్మీ, పారామిలిటరీ రేంజర్లు, పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది కలిసి ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టినట్టు ఆయన చెప్పారు. తుపాకీ గుళ్ల గాయాలను సెకండ్లలోనే మానిపించే ఆధునిక పరికరాలు, మందులను ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్నారని తెలిపారు. విమానాశ్రయాన్ని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారు అన్ని ఏర్పాట్లతో వచ్చినట్టు తెలుస్తోందని అన్నారు. గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడిచేశారని ఆయన వివరించారు. ఈ దాడిలో 11 మంది విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ఇద్దరు రేంజర్లు, ఓ పోలీసు అధికారి, నలుగురు సిబ్బంది మృతిచెందారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఇదిలా ఉండగా, దేశంలో పౌరవిమాన నెట్‌వర్క్‌ను కుప్పకూల్చడానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు అధికారులు ప్రధాని నవాజ్‌షరీఫ్‌కు అందించిన నివేదికలో పేర్కొన్నారు. విమానాశ్రయంలో ఉన్న విమానాలన్నిటినీ పేల్చివేయడానికి ఉగ్రవాదులు వ్యూహం పన్నారని, అయితే భద్రతాదళాలు వారి ప్రయత్నాలను భగ్నం చేశాయని ఆ నివేదికలో వివరించారు. విధ్వంసమే లక్ష్యం...ఉగ్రవాదులు ఆహారం, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని తమ వెంట తెచ్చుకున్నారు. పాక్ దళాలు జరిపిన ఎదురుదాడిలో ఏడుగురు ఉగ్రవాదులు మృతిచెందగా, మరో ముగ్గురు ఆత్మాహుతికోసం ఉపయోగించే బెల్టులను పేల్చడంద్వారా మృతిచెందినట్టు తెలుస్తోంది. విమానాలను హైజాక్ చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తాలిబన్ల ప్రతినిధి షహీద్ పేర్కొన్నాడు. ఈ దాడి తమ సత్తాకు చిన్న ఉదాహరణమాత్రమేనని, ముందు ముందు మరిన్ని దాడులకు పాల్పడతామని షహీద్ హెచ్చరించాడు. కాగా, ఉగ్రవాదులు ప్రధాన టెర్మినల్వద్దకు వెళ్లిఉంటే భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేదని, ప్రయాణికులను బందీలుగా పట్టుకునే అవకాశాలుండేవని అధికారులు అభిప్రాయపడ్డారు. విమానాశ్రయంలోని కొంత భాగం మంటలకు కాలిపోయింది. భారత్‌లో విమానాశ్రయాలకు గట్టి భద్రత న్యూఢిల్లీ: కరాచీు విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా దేశంలోని 59 ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ విమానాశ్రయాల్లో సుమారు 23వేలమంది సీఐఎస్ఎఫ్ బలగాలను భద్రతకోసం వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కరాచీ దాడిని భారత్ ఖండించింది. -
నైజీరియాలో వంద మందిపైగా ఊచకోత
కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు.ఈశాన్య నైజీరియా బోర్నో రాష్ట్రంలో క్రై స్తవులు అధికంగా ఉండే ఇఘే గ్రామంపై దాడిచేసి దాదాపు వంద మందిని ఊచకోత కోశారు. శనివారం రాత్రి ఆరు ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై ఆయుధాలతో సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బార్నాబాస్ అనే రైతు వెల్లడించారు. ఈ ఘటనతో భీతిల్లిన చాలామంది గ్రామస్తులు ఇళ్లను వదలి పారిపోయారు. ఆ దుండగులు బోకో హరామ్ ఇస్లామిస్ట్ బోకో హరామ్‌కు చెందినవారుగా అనుమానిస్తున్నట్లు స్థానిక సెనేటర్ అలీ డుమె ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు వెల్లడించారు. 60 మంది మతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని, మిగతావాటికి చేయాల్సి ఉందని చెప్పారు. -
నగరంలో హైఅలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించడంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. 26/11 తరహాలో ఢిల్లీలోని మెట్రోస్టేషన్లపై ముష్కరులు దాడులు చేయొచ్చని మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి పోలీసుశాఖకు సమాచారం అందింది. దీంతో నగరంలోని అన్ని మెట్రోస్టేషన్లు, రద్దీమార్కెట్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వీటితోపాటు రాత్రి వేళల్లో గస్తీ సైతం పెంచారు. ఈ విషయాన్ని నగర పోలీసు శాఖ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. ఈ నెల పదో తేదీలోగా ఎప్పుడైనా ఉగ్రదాడులు జరగొచ్చంటూ నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. గణతంత్ర వేడుకల నేపథ్యంలో సాధారణంగానే అదనపు భద్రత కనిపించే మధ్యఢిల్లీ పరిసరాల్లో ప్రస్తుతం సాయుధ బలగాలు పెద్దసంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి మెట్రో రైలు స్టేషన్లలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను మరింత పెంచారు. ఆయా స్టేషన్లలోకి వచ్చేవారి కదలికలను గమనించడంతోపాటు వారు తెచ్చే వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించారు. మెట్రోస్టేషన్లలో భద్రతా సిబ్బందిని దాదాపు రెట్టింపు చేశామని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్ కీలక సభ్యుడైన యాసిన్ భత్కల్ను విడుదల చేయించుకునేందుకు ఉగ్రవాదులు హైజాక్‌లకు సైతం పాల్పడే అవకాశం ఉన్నట్టు మిలిటరీ ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. కీలక ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో క్విక్ రియాక్షన్ టీంలు, బాంబు నిర్వీర్య స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సైతం అందుబాటులో ఉంచేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సీసీటీవీ కెమెరాలద్వారా అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.