మణిపూర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చాదల్ జిల్లాలో అసోం రైఫిల్స్ కాన్వాయ్పై ఆదివారం మధ్యాహ్నం ముష్కరులు దాడికి పాల్పడ్డారు.
మణిపూర్: మణిపూర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చాదల్ జిల్లాలో అసోం రైఫిల్స్ కాన్వాయ్పై ఆదివారం మధ్యాహ్నం ముష్కరులు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తనిఖీలు ముగించుకుని వెళ్తున్న రైఫిల్స్ కాన్వాయ్పై ఉగ్రవాదులు మందుపాతరతో దాడికి పాల్పడ్డారు. మొత్తం ఆరు రైఫిల్స్ను ఉగ్రవాదులు ఎత్తుకుపోయినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.