మ్యూజియంపై దాడి :19 మంది మృతి | Tunisia museum attack leaves 19 people, two terrorists dead | Sakshi
Sakshi News home page

మ్యూజియంపై దాడి :19 మంది మృతి

Published Thu, Mar 19 2015 9:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

మ్యూజియంపై దాడి :19 మంది మృతి

మ్యూజియంపై దాడి :19 మంది మృతి

ట్యునిస్ : ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యూనీషియా రాజధాని ట్యూనిస్లో ప్రఖ్యాత బర్దో మ్యూజియంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 19 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో అత్యధికులు విదేశీ పర్యాటకులేనని ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు. దాడికి తెగబడిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రత దళాలు హతమార్చినట్లు చెప్పారు.  మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

బర్దో మ్యూజియంలోని చోరబడిన ఉగ్రవాదులు... సందర్శకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దాంతో అక్కడికి చేరుకున్న భద్రత దళాలు వెంటనే మ్యూజియంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వారి వద్ద బందీలుగా ఉన్న విదేశీ సందర్శకులను భద్రత దళాలు మ్యూజియం నుంచి బయటకు సురక్షితంగా పంపించారు. ఈ కాల్పుల ఘటనపైన ట్యూనీషియా అధ్యక్షుడు  తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్యునిస్లోని బర్దో మ్యూజియం అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement