two terrorists dead
-
కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో చోటుచేసుకున్న భీకర ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పాక్ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఐదుగురు ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్ ఆపరేషన్ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. రాజ్‌బాగ్ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్పీఎఫ్ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు. -
కశ్మీర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. బారాముల్లాలోని వాటర్‌గామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు తలదాచుకొన్నారనే సమాచారంతో బుధవారం భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయని, తీవ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ మొదలైందని అధికారవర్గాయి తెలిపాయి. కాల్పుల్లో మరణించిన తీవ్రవాదుల పేర్లు, వారు ఏ సంస్థకు చెందిన వారనే విషయాలను ఆరాతీస్తున్నారు. తీవ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీసు, మరో జవానుకు గాయాలయ్యాయని వెల్లడించారు. -
మ్యూజియంపై దాడి :19 మంది మృతి
ట్యునిస్ : ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యూనీషియా రాజధాని ట్యూనిస్లో ప్రఖ్యాత బర్దో మ్యూజియంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 19 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో అత్యధికులు విదేశీ పర్యాటకులేనని ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు. దాడికి తెగబడిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రత దళాలు హతమార్చినట్లు చెప్పారు. మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బర్దో మ్యూజియంలోని చోరబడిన ఉగ్రవాదులు... సందర్శకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దాంతో అక్కడికి చేరుకున్న భద్రత దళాలు వెంటనే మ్యూజియంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వారి వద్ద బందీలుగా ఉన్న విదేశీ సందర్శకులను భద్రత దళాలు మ్యూజియం నుంచి బయటకు సురక్షితంగా పంపించారు. ఈ కాల్పుల ఘటనపైన ట్యూనీషియా అధ్యక్షుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్యునిస్లోని బర్దో మ్యూజియం అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉంది.