![Retired Senior Cop Shot Dead By Terrorists At Mosque iIn Kashmir - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/12/24/police_img.jpg.webp?itok=ETwdONP1)
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు. గంటముల్లా బాలా ప్రాంతంలోని స్థానిక మసీదులో ఎస్‌ఎస్‌పీ మహమ్మద్ షఫీ మీర్ ప్రార్థనలు చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించారు.
"బారాముల్లా ప్రాంతంలో మసీదులో రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయాలపాలై ఆయన మరణించారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
గత నెలలో, శ్రీనగర్‌లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా గాయపడ‍్డారు. గత కొంతకాలంగా కశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఇటీవల పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ
Comments
Please login to add a commentAdd a comment