Senior Cop
-
ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు. గంటముల్లా బాలా ప్రాంతంలోని స్థానిక మసీదులో ఎస్ఎస్పీ మహమ్మద్ షఫీ మీర్ ప్రార్థనలు చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించారు. "బారాముల్లా ప్రాంతంలో మసీదులో రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయాలపాలై ఆయన మరణించారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గత నెలలో, శ్రీనగర్‌లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గత కొంతకాలంగా కశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఇటీవల పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
రాత్రివేళలో రచ్చ..ఐఏఎస్,ఐపీఎస్ సస్పెండ్
రాజస్థాన్:రాజస్థాన్‌లో జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన ఘర్షణల్లో ఓ ఐఏఎస్,ఐపీఎస్ అధికారితో సహా ఐదుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఐఏఎస్ అధికారి, అజ్మీర్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ సస్పెండ్ అయినట్లు సమాచారం. స్థానిక వివరాల ప్రకారం.. ఐపీఎస్ అధికారి కొత్త ప్రాంతానికి బదిలీ అయినందున ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసు సిబ్బంది కూడా హాజరయ్యారు. పార్టీ ముగించుకుని వెళ్లే క్రమంలో రెస్టారెంట్లో వాష్‌రూమ్ వాడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. అనంతరం ఐపీఎస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. ఐపీఎస్ అధికారి రెస్టారెంట్ సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం రెస్టారెంట్ సిబ్బంది కూడా అధికారిపై తిరగబడిన తర్వాత ఘర్షణ మొదలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా రెస్టారెంట్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసులు తమ సిబ్బందిపై ఘర్షణకు దిగారని రెస్టారెంట్ యజమాని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ రిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోందని రాజస్థాన్ పోలీసు చీఫ్ ఉమేష్ మిశ్రా తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణనలను ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ ఖండించారు. अजमेर में IAS और IPS अफसरों ने की होटल स्टाफ के साथ मा#रपीट! | Si News@BJP4India @Myogioffice @Narendramodi#Ajmer #HotelMakranaRaj #IAS #IPS #IPSSushilBishnoi #IASGiridhar #Suspended #SiNews pic.twitter.com/TKyqvRWeAJ — Since Independence (@Sinceindmedia) June 14, 2023 ఇదీ చదవండి:మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు.. 9మంది మృతి.. -
మహిళపై పోలీసు అధికారి జులుం..వీడియో హల్చల్
పట్నా: పేదవాళ్లపై, అభాగ్యులపై పోలీసులు దాష్టీకాలు పరిపాటిగా మారిపోయాయి ముఖ్యంగా మహిళలపై వారి అరాచకాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా బిహార్ రాజధాని పట్నా నగర వీధుల్లో ఇలాంటి అమానుషం ఒకటి వెలుగుచూసింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. మహిళపై ఓ పోలీసు అధికారి ప్రదర్శించిన జులుం, ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సాక్షాత్తూ ఓ పోలీసు ఉన్నతాధి కారి మహిళపై దాడిచేసిన దృశ్యాలు,అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. స్థానిక మీడియా సిబ్బంది ఈ దృశ్యాలను చిత్రీకరించారు. పాట్నాలోని స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రాంతంలో నివసిస్తున్న గుడిసె వాసులపై ఒక బిల్డర్ తన అనుచరులతో దాడికి దిగాడు. ఆ స్థలంలో వారిని ఖాళీ చేయిల్సాందిగా హుకుం జారీ చేశాడు. ఈ క్రమంలో స్థానికులపై దాడికి దిగగా, అక్కడ వున్నవారంతా తిరగబడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికి రియల్ ఎస్టేట్ డెవలపర్ , మరికొంతమంది దుండగులు అక్కడినుంచి ఉడాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడున్న వారిపై విరుచుకుపడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేస్తూతమ ప్రకోపాన్ని ప్రదర్శించారు. అటు సామరస్యంగా సమస్యను పరిష్కరించాల్సిన సాక్షాత్తూ డిప్యూటీ సూపరింటెండెంట్ కైలాష్ ప్రసాద్ స్తానిక మహిళపై దారుణంగా హింసకు పాల్పడ్డాడు. అక్కడున్న పురుషుడిపై దాడిచేస్తుండగా, ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడుతన్న ఆమెను జుట్టు పట్టుకుని తోసేశాడు. పలుమార్లు ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు డీజీపీ షాలిన్ చెప్పారు. వీడియో దృశ్యాలను పరిశీలించిన మీదట సంబంధిత చర్య తీసుకుంటామన్నారు.