పోలీసు మృతి
శ్రీనగర్: కశ్మీర్‌లో ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. షోపియాన్ జిల్లాలో ఓ మైనారిటీ వర్గానికి కాపలా కాస్తున్న సెక్యూరిటీ పోస్టుపై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు చనిపోయాడు. మరో పోలీసు, ఓ పౌరుడు గాయపడ్డారు. పోలీసులు ఎదురు కాల్పలు జరపడంతో ఉగ్రవాదులు పారిపోయారు. కాల్పుల్లో కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, పీఓకేలో ఉగ్ర స్థావరాలపై భారత్ గత నెల 29న సర్జికల్ దాడుల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి 25 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది.
కశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కాల్పులు
Published Sat, Oct 8 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
Advertisement
Advertisement