officer killed
-
అమెరికాలో మాజీ సైనికుడి కాల్పులు.. పోలీసు మృతి
ఫ్లోరెన్స్: సౌత్ కరోలినా రాష్ట్రం ఫ్లోరెన్స్ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మాజీ సైనికాధికారి జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని వింటేజ్ ప్లేస్ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు ఫ్రెడరిక్ హాప్కిన్స్(74)పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన వారెంట్ అందజేసేందుకు బుధవారం సాయంత్రం ఏడుగురు పోలీసు అధికారులు అతడి ఇంటికి వెళ్లారు. వారిని దూరం నుంచి చూసిన హాప్కిన్స్ తన తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఏడుగురు పోలీసులూ తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. దీంతో రెండు గంటలపా టు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు హాప్కిన్స్పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా పోలీసు అధికారి టెరెన్స్ కరావే(52) అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
కశ్మీర్లో మళ్లీ ఉగ్ర కాల్పులు
పోలీసు మృతి శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. షోపియాన్ జిల్లాలో ఓ మైనారిటీ వర్గానికి కాపలా కాస్తున్న సెక్యూరిటీ పోస్టుపై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు చనిపోయాడు. మరో పోలీసు, ఓ పౌరుడు గాయపడ్డారు. పోలీసులు ఎదురు కాల్పలు జరపడంతో ఉగ్రవాదులు పారిపోయారు. కాల్పుల్లో కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, పీఓకేలో ఉగ్ర స్థావరాలపై భారత్ గత నెల 29న సర్జికల్ దాడుల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి 25 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. -
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలకు మధ్య ఉగ్రవాదులకు మధ్య చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి పాంపోర్‌లో ఇరు వర్గాలకు మద్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా 11మంది జవాన్లు గాయాలపాలయ్యారు. ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఈడీఐ) భవనంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లు గుర్తించడంతో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఈ భవనంలో ముగ్గురు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు.