జమ్మూ: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలకు మధ్య ఉగ్రవాదులకు మధ్య చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి పాంపోర్లో ఇరు వర్గాలకు మద్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా 11మంది జవాన్లు గాయాలపాలయ్యారు. ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఈడీఐ) భవనంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లు గుర్తించడంతో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఈ భవనంలో ముగ్గురు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి మృతి
Published Sun, Feb 21 2016 8:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement
Advertisement