Pampore
-
Seher Mir: అమ్మలు మెచ్చిన కూతురు
‘నా కూతురు వయసు కూడా లేదు. ఈ అమ్మాయి నాకు ఏం చెబుతుంది’ అనుకుంది ఒక అమ్మ. అయితే ఆ అమ్మాయి చెప్పిన మంచిమాటలు విన్న తరువాత, ఆ అమ్మ తన దగ్గరకు వచ్చి ‘చల్లగా జీవించు తల్లీ’ అని ఆశీర్వదించింది. నలుగురికి ఉపయోగపడే పనిచేస్తే అపూర్వమైన ఆశీర్వాదబలం దొరుకుతుంది. అది మనల్ని నాలుగు అడుగులు ముందు నడిపిస్తుంది... పుల్వామా (జమ్ము–కశ్మీర్) జిల్లాలోని పంపోర్ ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల సెహెర్ మీర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సమాజాన్ని కూడా చదువుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి తెలుసుకుంది. వాటి గురించి విచారించడం కంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. తన ఆలోచనలో భాగంగా మిత్రులతో కలిసి ‘ఝూన్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, శుభ్రమైన న్యాప్కిన్ల వాడకం, రుతుక్రమం, అపోహలు... ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది మీర్. మొదట్లో ‘ఈ చిన్న అమ్మాయి మనకేం చెబుతుందిలే’ అన్నట్లుగా చూశారు చాలామంది. కొందరైతే సమావేశానికి పిలిచినా రాలేదు. ఆతరువాత మాత్రం ఒకరి ద్వారా ఒకరికి మీర్ గురించి తెలిసింది. ‘ఎన్ని మంచి విషయాలు చెబుతుందో’ అని మెచ్చుకున్నారు. నెలసరి విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది మీర్. కొద్దిమందితో మొదలైన ‘ఝూన్’లో ఇప్పుడు యాభై మందికి పైగా టీనేజర్స్ ఉన్నారు. ‘ఝూన్లో పనిచేయడం ద్వారా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను పదిమందికి తెలియజేయడంతో పాటు, రకరకాల గ్రామాలకు వెళ్లడం ద్వారా సామాజిక పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది నుహా మసూద్. ‘తెలిసో తెలియకో రకరకాల కారణాల వల్ల నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్లను కొనకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఇది చాలా రహస్య విషయం, ఎవరికీ తెలియకూడదు అనుకోవడం! ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటుంది మీర్. ‘ఝూన్’ ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని అందుకోవడానికి చురుగ్గా అడుగులు వేస్తోంది. -
రూ.5.40 లక్షలతో ఏటీఎంనే ఎత్తుకెళ్లారు
జమ్ముకశ్మీర్: సాధారణంగా ఏటీఎంను పగులగొట్టి అందులోని నగదును దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటారు దొంగలు. కానీ ఇక్కడ ఏకంగా నగదుతో ఉన్న ఆ యంత్రాన్నే ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన శ్రీనగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పాంపోర్‌కు 16 కి.మీ. దూరంలోని కాదల్బల్ ప్రాంతంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆ ఏటీఎంలో సుమారు రూ.5,40,200 నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. కేసునమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ముగిసిన పాంపోర్ ఆపరేషన్
-
ముగిసిన పాంపోర్ ఆపరేషన్: ఉగ్రవాదులు ఫినిష్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లా పాంపోర్ లో దాదాపు 50 గంటలు కొనసాగిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ బుధవారం మధ్యాహ్నం తర్వాత ముగిసింది. ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్(ఈడీఐ) హాస్టల్ భవంతిలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులనూ మట్టుపెట్టామని, వారి నుంచి రెండు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని ఆపరేషన్ కు నేతృత్వం వహించిన మేజర్ జనరల్ అశోక్ నరూలా (జీవోసీ విక్టర్ ఫోర్స్) మీడియాకు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున పడవలో జీలం నదిని దాటి వచ్చి, ఈడీఐ బిల్డింగ్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కాల్పులు జరుపుతున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నానికి కాల్పుల ఉధృతి తగ్గడంతో భద్రతా బలగాలు లోపలికి ప్రవేశించి, ముష్కరులను మట్టుపెట్టాయి. 'ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినప్పటికీ, ఈడీఐ హాస్టల్ బిల్డింగ్ లో మొత్తం 122 గదులున్నందున అణువణువూ తనిఖీ చేస్తున్నాం. చనిపోయిన ఇద్దరూ లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులని భావిస్తున్నాం'అని మేజర్ జనరల్ అశోక్ అన్నారు. మనవైపు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదన్న ఆయన.. పాంపోర్ ఘటనను ఉగ్రవాదుల జిత్తులమారి చర్యగా అభివర్ణించారు. మొదట ముగ్గురు ఉగ్రవాదులు బిల్డింగ్ లోకి చొరబడి ఉండొచ్చని భద్రతా బలగాలు అనుమానించాయి. ముష్కరులు తప్పించుకోకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాని అధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోర్టార్ షెల్స్ తో ప్రతిదాడి చేశారు. చివరికి పారా కమెండోలు రంగంలోకిదిగి మనవైపు ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా ఆపరేషన్ ముగించారు. -
భవనంలో నక్కిన ఉగ్రవాదులు
-
భవనంలో నక్కిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కలకలం కొనసాగుతోంది. సోమవారం పుల్వామా జిల్లాలోని పాంపోర్‌లో ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కారు. జమ్మూకశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించిన భద్రతా బలగాలు.. కాంప్లెక్స్‌కు గల అన్నిదారులను మూసివేసి ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు భవనంలో దాక్కొని ఉండొచ్చిని అనుమానిస్తున్నారు. భవనంలో కాల్పుల శబ్దం వినిపించిందని పోలీసు అధికారి వెల్లడించారు. శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్‌పై ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. -
ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి
జమ్మూ కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పై శనివారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాంపోర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. -
పాంపోర్ ఉగ్రదాడిలో రూ.220 కోట్లు గల్లంతు!?
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని పాంపోర్ లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు ముగిశాయి. శనివారం నుంచి కొనసాగిన ఈ ఆపరేషన్ లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు, ముగ్గురు ఉగ్రవాదులు కలిపి మొత్తం 9 మంది మరణించారు. ఇప్పటివరకు ఇద్దరు ముష్కరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు మరొకడి శవం కోసం గాలిస్తున్నాయి. కాగా ఉగ్రదాడితో జేకేఈడీఐ సంస్థకు భారీగా ఆస్తినష్టం సంభవించడమేకాక కంప్యూటర్ డేటా ధ్వంసం కావడంతో రూ.220 కోట్లు గల్లంతయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సంస్థనే ఉగ్రవాదులు టార్గెట్ చేసుకోవడం వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 2004లో జమ్ముకశ్మీర్ ఎంటర్ ప్రెన్యూర్స్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్(జేకేఈడీఐ)ను నెలకొల్పింది. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారికి అతి సమీపంగా పాంపోర్ లో మూడున్నర ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ సంస్థ.. ఇప్పటివరకు 13వేల మందికిపైగా యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చింది. మరో 5వేల మంది ఔత్సాహికులకు లోన్ల రూపంలో కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం చేసింది. అయితే నిత్యం వందలమంది వచ్చిపోయే ఈ సంస్థపై దాడి జరగవచ్చనే అనుమానం గతంలోనే వ్యక్తమైంది. ఆ క్రమంలోనే జేకేఈడీఐకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ముందుకొచ్చింది. కానీ సంస్థ నిర్వాహకులు, ప్రభుత్వం మాత్రం పోలీసుల హెచ్చరికలను తేలికగా తీసుకుంన్నారు. శనివారం నాటి ఘటనలో మొదట జాతీయ రహదారి మీద సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుంచి జేకేఈడీఐ ప్రాంగణంలోపలికి సులువుగా చొచ్చుకుపోయారు. అడ్మినిస్ట్రేటివ్ భవంతి నాలుగో అంతస్తులో దాక్కున్నారు. సరిగ్గా అదే అంతస్తులో జేకేఈడీఐ డేటాబేస్ సెంటర్ ఉంది. దాదాపు మూడు రోజులపాటు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కంప్యూటర్లతోపాటు డేటా మొత్తం ధ్వంసమైందని, బ్యాకప్ సౌకర్యం కూడా లేకపోవడంతో పారిశ్రామికవేత్తలకు రుణంగా ఇచ్చిన రూ.220 కోట్లకు సంబంధించిన వివరాలు గల్లంతయ్యాయని జేకేఈడీఐ ఉద్యోగి ఒకరు తెలిపారు. భద్రతా బలగాలు, పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. 'భద్రత విషయంలో జేకేఈడీఐ తీరు గర్హనీయం. పొరపాటున ఎప్పుడైనా మా పోలీస్ జీపులు ఆ ప్రాంగణంలోకో లేక ప్రహారీ బయటో ఆపితే అధికారులు ఊరుకునేవారు కాదు. 'అరే.. మేం పోలీసులం' అని చెప్పినా వినిపించుకునేవారుకాదు. మమ్మల్ని కాదని ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు రక్షణ బాధ్యతలు అప్పగించారు. ఉగ్రవాదులు ఈ సంస్థను టార్గెట్ చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణమే' అని పోలీస్ అధికారి ఒకరు కుండబద్దలు కొట్టారు. -
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలకు మధ్య ఉగ్రవాదులకు మధ్య చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి పాంపోర్‌లో ఇరు వర్గాలకు మద్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా 11మంది జవాన్లు గాయాలపాలయ్యారు. ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఈడీఐ) భవనంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లు గుర్తించడంతో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఈ భవనంలో ముగ్గురు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు.