రూ.5.40 లక్షలతో ఏటీఎంనే ఎత్తుకెళ్లారు | ATM machine of HDFC Bank stolen in J&K's Pampore town | Sakshi
Sakshi News home page

రూ.5.40 లక్షలతో ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

Published Tue, Jun 13 2017 5:00 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

రూ.5.40 లక్షలతో ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

రూ.5.40 లక్షలతో ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

జమ్ముకశ్మీర్‌: సాధారణంగా ఏటీఎంను పగులగొట్టి అందులోని నగదును దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటారు దొంగలు. కానీ ఇక్కడ ఏకంగా నగదుతో ఉన్న ఆ యంత్రాన్నే ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు.

ఈ సంఘటన శ్రీనగర్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. శ్రీనగర్‌-జమ్ము జాతీయ రహదారిపై పాంపోర్‌కు 16 కి.మీ. దూరంలోని కాదల్‌బల్‌ ప్రాంతంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆ ఏటీఎంలో సుమారు రూ.5,40,200 నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. కేసునమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement