
భవనంలో నక్కిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కలకలం కొనసాగుతోంది. సోమవారం పుల్వామా జిల్లాలోని పాంపోర్‌లో ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కారు. జమ్మూకశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించిన భద్రతా బలగాలు.. కాంప్లెక్స్‌కు గల అన్నిదారులను మూసివేసి ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు భవనంలో దాక్కొని ఉండొచ్చిని అనుమానిస్తున్నారు. భవనంలో కాల్పుల శబ్దం వినిపించిందని పోలీసు అధికారి వెల్లడించారు. శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్‌పై ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు.