
శ్రీనగర్ : ముగ్గురు ఉగ్రవాదులు కశ్మీర్‌లోని ఓ బ్యాంకులో చొరబడి అందిన కాడికి డబ్బు దొచుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. పుల్వామా జిల్లాలోని నూర్‌పొరాలోని జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్‌లో సోమవారం ముగ్గురు తీవ్రవాదులు మొహాలకు మాస్కులు ధరించి చొరబడ్డారు. బ్యాంకు సిబ్బందిని, బ్యాంకు కస్టమర్లను బెదిరించి లక్ష రూపాయలు దోచుకున్నారు. పరారయ్యే సమయంలో కొన్ని రౌండ్‌లు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే దుండగులు పరారయ్యారు. భద్రతాబలగాలు, పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడి వెనక ఉగ్రవాది జకీర్ మూసా హస్తం ఉన్నట్టు సమాచారం. జకీర్ మూసా, మరో ఇద్దరు ఉగ్రవాదుల సహాయంతో ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.
(జకీర్ మూసా ఫైల్ ఫోటో)
Comments
Please login to add a commentAdd a comment