శ్రీనగర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ పీడీపీ నేత అబ్దుల్ ఘని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పుల్వామలో సోమవారం ఉదయం అబ్దుల్ ఘని వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ని బతికించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అబ్దుల్ ఘనీ చికిత్స పొందుతూ మరణించారు. రెండు వారాల వ్యవథిలో అబ్దుల్ ఘనిపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది మూడోసారి.
ఉగ్రదాడిలో పీడీపీ నేత అబ్దుల్ ఘని మృతి
Published Mon, Apr 24 2017 3:26 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
Advertisement
Advertisement