బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని... | BJP Affiliate Shabir Ahmad Bhat Shot Dead By Terrorists | Sakshi
Sakshi News home page

బీజేపీకి అనుకూల నాయకుడిని హత్య చేసిన ఉగ్రవాదులు

Published Wed, Aug 22 2018 9:22 AM | Last Updated on Wed, Aug 22 2018 2:29 PM

BJP Affiliate Shabir Ahmad Bhat Shot Dead By Terrorists - Sakshi

షబ్బీర్‌ అహ్మద్‌ భట్‌

పుల్వామా :  జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న ఓ నాయకుడిని ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా రాక్‌-ఇ-లిటర్‌ గ్రామానికి చెందిన షబ్బీర్‌ అహ్మద్‌ భట్‌ బీజేపీ అనుకూలంగా జిల్లాలో పనిచేస్తున్నారు.

కాగా మంగళవారం అర్థరాత్రి షబ్బీర్‌ను కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున 2.30గంటల పాంత్రంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో షబ్బీర్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. శరీరం నిండా బుల్లెట్లతో పడి ఉన్న మృతదేశాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement