శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో రెండు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. గురువారం కుప్వారా, రాజౌరీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందటంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం భద్రతా బలంగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
‘ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం అదించింది. దీంతో 28, 29 తేదీల్లో ఆర్మీ బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులతో సంయుక్తంగా మచల్, కుప్వారా ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టాం. ప్రతికూల వాతావరణంలో అనుమానాస్పద కదలికలుపై కాల్పులు జరిపాం. ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు’ అని శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ‘ఎక్స్’లో పేర్కొంది.
OP PHILLORA, TANGDHAR #Kupwara
Based on intelligence inputs regarding likely infiltration bids, a Joint anti-infiltration Operation was launched by #IndianArmy & @JmuKmrPolice on the intervening night of 28-29 Aug 24 in general area Tangdhar, Kupwara. One terrorist is likely to… pic.twitter.com/R2N6ql2NgM— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 29, 2024
ఇవాళ ఉదయం కుప్వారా మచిల్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేత కర్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
J-K: One terrorist likely killed in anti-infiltration Op in Kupwara
Read @ANI Story | https://t.co/R5Q1x1r2rp#Infiltration #Kupwara #IndianArmy pic.twitter.com/8aJvooyP4i— ANI Digital (@ani_digital) August 29, 2024
Comments
Please login to add a commentAdd a comment