పుల్వామా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను బలగాలు మట్టుబెట్టాయి.
జమ్మూకశ్మీర్: పుల్వామా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఉగ్రవాదుల నక్కి ఉన్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టిన బలగాలపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు.
దీంతో ఆత్మరక్షణలో పడిన బలగాలు ఉగ్రవాదులను హతమార్చాయి. కాగా, భద్రతా బలగాల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది.