Gunfight
-
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ..!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్లలో మృతి చెందడం, మరోవైపు మావోయిస్టుల కీలక ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు పట్టుసాధిస్తుండటం మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం దంతెవాడ–బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు తొలితరం అగ్రనాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేరు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు సహా మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమిటీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న, అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు హతమైన విషయం తెలిసిందే. తాజాగా గురువారం రఘునాథపాలెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. \దళం తుడిచిపెట్టుకుపోయినట్లే... కర్కగూడెం గ్రామానికి అతి సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పాట్రో టీంకు తారసపడిన బీఏ–ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న, లచ్చన్న సతీమణి తులసి అలియాస్ పునెం లక్కీ, పాల్వంచ మణుగూరు ఏరియా కమాండర్ కామ్రేడ్ రాము, పార్టీ సభ్యులు కోసి, సీనియర్ సభ్యులు గంగాల్, కామ్రేడ్ దుర్గేశ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌తో తెలుగు ప్రాంతాల్లో మావోయిస్టులకు చెందిన అత్యంత కీలకమైన భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే–ఏఎస్ఆర్) దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లయింది. ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దులోపల ఇదే భారీ ఎన్కౌంటర్ కావడం గమనార్హం. ఇదే డివిజన్ కమిటీకి చెందిన మరో మావోయిస్టు విజయేందర్‌ను సైతం పోలీసులు ఈ ఏడాది జూలైలో గుండాలలో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చారు.ఇలా దెబ్బమీదదెబ్బతో బీకే–ఏఎస్ఆర్ డివిజన్‌కు తీవ్ర నష్టం జరిగింది.క్రమంగా పట్టుసాధిస్తున్న పోలీసులు..మరోవైపు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు అత్యంత పట్టుఉన్న ప్రాంతాల్లోనూ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, స్థానిక పోలీస్ బలగాలు చొచ్చుకుపోతున్నాయ. కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లోనూ వరుస ఎన్కౌంటర్లలో కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు మావోయిస్టులపై పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు తెలంగాణ నుంచి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రంలోకి అడుగుపెడుతుండగా హతమార్చారు. ఈ ఏడాది జూన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లోనూ 8 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. ఇలా వరుస దాడులతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చత్తీస్‌గఢ్ వైపు ఒత్తిడి పెరగడంతో తెలంగాణలోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయతి్నస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలను తెలంగాణ గ్రేహౌండ్స్, టీజీఎస్పీ, స్థానిక పోలీసు బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. మావోయిస్టులు తెలంగాణ వైపు రాకుండా ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తూ వారిని అడ్డుకుంటున్నాయి. ఏ మాత్రం సమాచారం దొరికినా వెంటనే బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. అయితే, తాజాగా గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. పట్టుబడ్డ ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ముందస్తు సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు పుల్వామాలోని నెహామా ప్రాంతాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులుపైకి ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులో సమయంలో లష్కర్-ఇ-తోయిబా రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు రాయిస్ అహ్మద్, రియాజ్ అహ్మద్‌లు భద్రతా బలగాలకు పట్టుబడ్డారు.#WATCH | Pulwama encounter: The house in Nihama area where terrorists are trapped, caught on fire. Encounter underway. Further details awaited. #JammuAndKashmir pic.twitter.com/qLSpB2UbwD— ANI (@ANI) June 3, 2024 ‘పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ‘ఎక్స్’ తెలిపారు. అయితే కాల్పులు జరిగిన సమమంలో ఎవరూ మృతి చెందలేదని పోలీసులు తెలిపారు. ఇక.. మే 7న జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
పోలీసు, మావోయిస్టుల కాల్పుల్లో పసికందు మృతి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో పోలీసులు, మానోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మాట్వాండిలో సోమవారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన ఆరు నెలల పసికందు మృతి చెందగా.. తల్లి గాయాల పాలైంది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి పోలీసులు సాయం అంధించారు. పోలీసులు, మానోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు నక్సలైట్లకు గాయాలు అయ్యాయి. చదవండి: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన భారత్! ఇంతకీ నేపథ్యం ఏంటంటే.. -
కశ్మీర్లో ఉగ్రఘాతుకం
రాజౌరీ/జమ్మూ: ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన సైన్యంపై ఉగ్రవాదులు మాటువేసి మెరుపుదాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఆర్మీ కల్నల్, మేజర్, డిప్యూటీ ఎస్పీలు వీరమరణం పొందారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని గరోల్ దగ్గర్లోని కొకొరెనాగ్ కొండ ప్రాంతంలో జరిగింది. రాజౌరీలో ఉగ్రకాల్పుల్లో జవానును కాపాడబోయి సైనిక జాగిలం కెంట్ ప్రాణాలు కోల్పోయిన మరుసటి రోజే ఈ కాల్పుల ఘటన జరగడం విషాదకరం. బుధవారం ఉదయం సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొకొరెనాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో మంగళవారం రాత్రి సైన్యం, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు వెంటనే తూటాల వర్షం కురిపించారు. దీంతో 19వ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ అధికారి అయిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిశ్ ధోనక్, డిప్యూటీ ఎస్పీ హుమయూన్ భట్ నేలకొరిగారు. J-K: Army Colonel, Major killed in gunfight with terrorists in Anantnag Read @ANI Story |https://t.co/29Tvl95ZE6#IndianArmy #TerroristAttack #Anantnag pic.twitter.com/HsGielfLEy — ANI Digital (@ani_digital) September 13, 2023 జమ్మూకశ్మీర్ మాజీ ఐజీ గులామ్ హసన్ భట్ కుమారుడే ఈ హుమయూన్. కాల్పుల ఘటనకు నిషేధిత రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ లష్కరే తోయిబానే ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థను వెనక ఉండి నడిపిస్తోంది. ఆగస్టు నాలుగో తేదీన కుల్గామ్ జిల్లాలోని హలన్ అటవీప్రాంతంలో ముగ్గురు జవాన్ల మరణానికి కారకులైన వారే బుధవారం దాడి చేశారని సైనిక నిఘా వర్గాలు వెల్లడించాయి. Anantnag encounter | A Jammu and Kashmir Police official also lost his life in the encounter. The Army officers were leading the troops from the front after they had gone to search for terrorists in the area based on specific intelligence: Indian Army officials — ANI (@ANI) September 13, 2023 ఇదీ చదవండి: సైనికున్ని రక్షించేందుకు.. తూటాలకు ఎదురునిలిచి.. సైనిక శునకం ప్రాణ త్యాగం -
శ్రీనగర్‌లో ఆంక్షలు విధింపు
శ్రీనగర్: భద్రతాబలగాల చేతిలో నిన్న(ఆదివారం) 13 మంది ఉగ్రవాదులతో పాటు నలుగురు పౌరులు మృతిచెందటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా అధికారులు సోమవారం ఆంక్షలు విధించారు. షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో మూడు వేర్వేరు కాల్పుల ఘటనలు ఆదివారం చోటుచేసుకున్నసంగతి తెల్సిందే. ఈ ఘటనల్లో ఉగ్రవాదులతో పాటు ముగ్గురు సైనికులు కూడా చనిపోయారు. రాళ్లు విసిరిన సుమారు 60 మంది పౌరులు గాయపడ్డారు. వేర్పాటువాద నాయకులు సయేద్ అలీ గిలానీ, మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, మహ్మద్ యాసిన్ మాలిక్‌లు సోమవారం నిరసన ర్యాలీకి పిలుపునవ్వడంతో వారిని గృహనిర్బంధం చేశారు. భారీ ఎత్తున భద్రతా బలగాలు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లను నిషేధిత ప్రాంతాల్లోకి మోహరించారు. లోయలో మార్కెట్లు, రవాణా వ్యవస్థ, వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. పాఠశాలు,కళాశాలకు సెలవులు ఇచ్చారు. పరీక్షలను మరోతేదీకి వాయిదా వేశారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా పట్టణానికి, బన్నిహాల్ పట్టణాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపేసి, సామాజిక మాధ్యమాల్లోకి ఫోటోలు, వీడియోలు అప్లోడ్ కాకుండా ఉండేందుకు బ్రాడ్ బ్రాండ్ సర్వీసు స్పీడ్ తగ్గించారు. -
భవనంలో నక్కిన ఉగ్రవాదులు
-
భవనంలో నక్కిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కలకలం కొనసాగుతోంది. సోమవారం పుల్వామా జిల్లాలోని పాంపోర్‌లో ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కారు. జమ్మూకశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించిన భద్రతా బలగాలు.. కాంప్లెక్స్‌కు గల అన్నిదారులను మూసివేసి ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు భవనంలో దాక్కొని ఉండొచ్చిని అనుమానిస్తున్నారు. భవనంలో కాల్పుల శబ్దం వినిపించిందని పోలీసు అధికారి వెల్లడించారు. శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాంప్లెక్స్‌పై ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. -
జమ్మూలో మళ్లీ కాల్పుల మోత
-
జమ్మూలో మళ్లీ కాల్పుల మోత
జమ్మూ: జమ్మూకశ్మీర్ మళ్లీ కాల్పుల మోతతో హోరెత్తుతోంది. పూంచ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతోన్నాయి. నిన్న ఉగ్రవాదులు పూంచ్‌లోని మినీ సెక్రటేరియట్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంలో మళ్లీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇక నిన్న జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరణించినవారిలో ముగ్గురు ఉగ్రవాదాలు కాగా, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. ఎదురు కాల్పుల్లో మరో అయిదుగురు గాయపడ్డారు. వారిలో ఓ పోలీస్ అధికారితో పాటు, ముగ్గురు జవాన్లు, ఓ సాధారణ వ్యక్తి ఉన్నారు. ఇక పూంచ్‌లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. -
ఎన్కౌంటర్లో నలుగురు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్లో శనివారం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద అక్రమంగా భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులు.. పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చొరబాటుదారులు సైతం మృతి చెందారు. ఉగ్రవాదుల చొరబాటుని సమర్థవంతంగా తిప్పికొట్టామని భద్రతాబలగాలు ప్రకటించాయి. అయితే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. -
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు గురువారం మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల సమాచారంతో వాస్తవాధీన రేఖ(ఎల్ఓసీ) సమీప ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించాయి. ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి మీడియా సంస్థకు తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదుల సమాచారంతో కుప్వారా ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కాశ్మీర్లో ఎన్కౌంటర్ : తీవ్రవాదుల హతం
శ్రీనగర్ : కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రత దళాలు... గెరిల్లాల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు వేర్పాటు వాద తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. బీగ్ మోహల్లా ప్రాంతంలోని ఓ ఇంట్లో తీవ్రవాదలు దాక్కుని ఉన్నట్లు భద్రత దళాలకు సమాచారం అందింది. దీంతో సదరు ఇంటిని భద్రత దళాలు చుట్టుముట్టాయి. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఇరువైపులా భీకర పోరు జరిగింది. ఆ క్రమంలో భద్రత దళాలు కాల్పులో ఇద్దరు తీవ్రవాదులు మరణించారు. అయితే ఈ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. -
ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో గురువారం సైన్యానికి, వేర్పాటువాద గెరిల్లాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. థ్రాల్ పట్టణ సమీపంలో మిలిటెంట్లు తలదాచుకున్నట్లు సమాచారంతో భద్రతా దళాలు బుధవారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఓ భవనంలో దాక్కున్న ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటనలో ముగ్గురు మిలిటెంట్లు హతమైనట్లు చెప్పారు. ఘటనాస్థలం నుంచి మూడు ఏకే 47 రైఫిళ్లను, ఎనిమిది మ్యాైగ్జెన్స్ను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు కాగా ఆప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
కాశ్మీర్లో ఎన్కౌంటర్: ఆర్మీ సైనికులు మృతి
శ్రీనగర్ : కాశ్మీర్ కుప్వారా జిల్లా మర్సారి గ్రామంలోని చౌకీబాల్ సరిహద్దు ప్రాంతంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సైనికులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. సదరు గ్రామంలోని ఓ ఇంట్లో తీవ్రవాదులు దాగి ఉన్నారని శుక్రవారం సాయంత్రం భద్రత దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ అపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ పోలీసులు తీవ్రవాదులు దాగి ఉన్న ఇంటిని చుట్టిముట్టారు. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు... భద్రత దళాలపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సైనికులు మరణించారు. -
ఎన్కౌంటర్లో పౌరుడి మృతి
శ్రీనగర్: కశ్మీర్లో సైనికులకు, మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ప్రాణాలు కోల్పోతున్న సాధారణ పౌరుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం అర్థరాత్రి సైనిక బలగాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ పౌరుడు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సీనియర్ పోలీస్ అధికారి అందించిన వివరాల ప్రకారం కుల్లాంగ జిల్లా రెద్వానీ బాలా గ్రామంలో జరిగిన హోరాహోరీ పోరులో అవిఫ్ రషీద్ అనే వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. బిలాల్ అహ్మద్ అనే మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వార్త తెలిసిన వెంటనే గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట గుమిగూడి ఆందోళన చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈసందర్భంగా కోపోద్రిక్తులైన ఆందోళన కారులు సైనిక బలగాలతో ఘర్షణకు దిగిన రాళ్ళ వర్షం కురిపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
'బంకర్లో దాగిన ఉగ్రవాదులను ఏరివేస్తాం'
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటన చేశారు. దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని, బంకర్లో ఉన్న మిగిలినవారిని కూడా ఏరివేస్తామని పారికర్ చెప్పారు. తీవ్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్లు, ముగ్గురు పోలీసులు మరణించినట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరుపుతూ, యూరీ సెక్టార్‌లోని ఓ బంకర్లోకి చొరబడ్డారు. వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగారు. బంకర్లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని అధికార్లు వెల్లడించలేకపోతున్నారు. ఉగ్రవాదులు ఉన్న బంకర్‌ను దిగ్బంధం చేసినట్లు చెప్పారు. -
మూడు రోజుల్లో మోదీ పర్యటన..ఉగ్రవాదుల దుశ్చర్య
శ్రీనగర్ : ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మరో మూడురోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో సంచలనం సృష్టించేందుకు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. జమ్మూ,కశ్మీర్లో అయిదు దశల పోలింగ్‌లో భాగంగా రెండు విడతలు పూర్తికాగా, ఈనెల 9వ తేదీన మూడోదశ పోలింగ్ జరగనుంది. కాగా శుక్రవారం తెల్లవారుజాము 3.30గంటల నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మరోవైపు ఎదురు కాల్పుల్లో నలుగురు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. -
సరిహద్దుల్లో హోరాహోరీ కాల్పులు
-
సరిహద్దుల్లో హోరాహోరీ కాల్పులు
శ్రీనగర్ : పాక్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులకు.. భారత సైన్యానికి మధ్య హోరాహోరిగా కాల్పులు కొనసాగుతున్నాయి. బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది మరణించారు. వీరిలో ఐదుగురు సైనికులు, ఇద్దరు పోలీసులు, ఇద్దురు ఉగ్రవాదులు ఉన్నారు. మొదటగా పోలీసులపై కాల్పులు జరుపుతూ... ఉగ్రవాదులు యూరీ సెక్టార్‌లోని ఓ బంకర్లోకి చొరబడ్డారు. వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదుల కూడా ప్రతిఘటిస్తున్నారు. బంకర్లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. ఎంతమంది ఉన్నారు.. అనే విషయాన్ని మాత్రం అధికార్లు వెల్లడించలేకపోతున్నారు. ఉగ్రవాదులు ఉన్న బంకర్‌ను దిగ్బంధం చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో ఉగ్రవాదులు ఎవరైనా మరణించిన విషయాన్ని కూడా అధికారులు వెల్లడించలేదు. -
జమ్మూ కాశ్మీర్ లో కాల్పులు: తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారని ... వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరో ఇద్దరు తీవ్రవాదులు నవ్గామ్ ప్రాంతంలో భారత్‌లోని ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భద్రత దళాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరపగా... ఆ ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారని చెప్పారు. కుప్వారాలోని అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగిన నేపథ్యంలో నోవ్గామ్ ప్రాంతంలో తీవ్రవాదులు చోరబడకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతాధికారులు వివరించారు. -
మోదీ పర్యటనకు ముందు జమ్మూలో కాల్పులు
జమ్మూ: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు జమ్మూకాశ్మీర్ సరిహద్దున హింస చెలరేగింది. శుక్రవారం ఉదయం జమ్మూ జిల్లాలో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం మోదీ జమ్మూ రానున్నారు. ఆ రాష్ట్ర రెండో విడత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సభల్లో మోదీ పాల్గొననున్నారు. గురువారం కూడా జమ్మూ జిల్లాలోని ఆర్నియా వద్ద ఉగ్రవాదులు భారత స్థావరాలపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు, నలుగురు పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించారు.