మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు | Security forces and militants were engaged in a gunfight in north Kashmir's Kupwara | Sakshi
Sakshi News home page

మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Published Thu, May 26 2016 1:30 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

Security forces and militants were engaged in a gunfight in north Kashmir's Kupwara

శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు గురువారం మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల సమాచారంతో  వాస్తవాధీన రేఖ(ఎల్ఓసీ) సమీప ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.

దీంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించాయి. ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి మీడియా సంస్థకు తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదుల సమాచారంతో కుప్వారా ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement