millitants
-
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురి పాలస్తీనా ఉగ్రవాదుల మృతి
గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులను కొనసాగిస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు.. స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంటోంది. తాజాగా తమ సైన్యం చేతిలో ఐదుగురు పాలస్తీనా ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లోని ఓ మసీదులో దాక్కుకొని ఉన్న ఉగ్రవాదులను ఇజ్రాయెల్ దళాలు కాల్చిచంపినట్లు పేర్కొంది. ఈ ఐదుగురిలో ఒక స్థానిక కమాండర్ మహ్మద్ జాబర్ అలియాస్ అబూ షుజా ఉన్నట్లు ఇజ్రాయెల్ బలగాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చేసిన పలు దాడుల్లో అబూ షుజా హస్తం ఉన్నట్లు ఆర్మీ పేర్కొంది. జూన్‌లో జరిపిన భారీ కాల్పులకు అబూ షుజా ప్లాన్ చేసినట్టు తెలిపింది.అబూ షుజా గతంలోనే మృతి చెందినట్లు పలు నివేదికలు వెల్లండించాయి. అయితే పలువురు మిలిటెంట్ల అంత్యక్రియల్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. నూర్ షామ్స్ శరణార్థి శిబిరంలోని ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్ కమాండర్ మహ్మద్ జాబర్ మృతిపై పాలస్తీనా ఇంకా ధృవీకరించకపోవటం గమనార్హం. బుధవారం నుంచి పాలస్తీనాపై చేస్తున్న ఇజ్రాయెల్ దాడుల్లో 10 మంది ఫైటర్లు మృతి చెందినట్లు హమాస్ మలిటెంట్ సంస్థ పేర్కొంది. -
జమ్మూ కశ్మీర్లో కాల్పుల కలకలం..!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చింది. భద్రతా సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు దక్షిణా కశ్మీర్ జిల్లాలోని క్వారిగం, రాణిపోరా ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్‌ను నిర్వహించారు. భద్రతా సిబ్బంది తనీఖీలు చేస్తోన్న సందర్భంలో ఒక్కసారిగా ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులతో విరుచుకుపడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై ఎదురుకాల్పులును జరిపింది. కాల్పుల్లో ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల వివరాలను సేకరిస్తున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. ఇద్దరు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దక్షిణ కశ్మీర్ షోపియన్ జిల్లాలోని మెల్‌హురా ప్రాంతంలో మంగళవారం జరిగింది. మెల్‌హురా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో భద్రతా దళాలు, పోలీసులు కార్డన్ చెర్చ్ చేపట్టారు. దీంతో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు మంగళవారమే తెలిపారు. (చెన్నైలో భయం.. భయం) ఇక ఈ ఎదురుకాల్పుల్లో మరో ఉగ్రవాది కూడా మృతి చెందగా.. మూడో ఉగ్రవాది కాల్పులు జరిగిన ప్రాంతంలోనే చిక్కుకుపోయినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు ట్వీటర్లో పేర్కొన్నారు. ఇక మూడో ఉగ్రవాది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మృతి చెందినవారు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో ఇంకా గుర్తించలేదని పోలీసులు పేర్కొన్నారు. Operation at Melhura continued through the night. Two terrorists killed.Bodies recovered. For third terrorist search is on. https://t.co/mXMg99GzgU — J&K Police (@JmuKmrPolice) April 29, 2020 -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. ముగ్గురు హతం
ఢిల్లీ: జమ్మూ-కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. శనివారం ఉదయం కుల్గం జిల్లాలో ఉగ్రవాదులకు భద్రత బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో ఆర్మీ బలగాలు, స్థానిక కశ్మీర్ పోలీసులు కుల్గం జిల్లాలోని హార్డ్ మంగూరి బాటాపోరా ప్రాంతంలో కార్డన్ చెర్చ్ నిర్వహించారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరపటంతో ఆర్మీ బలగాలు ఎదురు కాల్పలు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఆర్మీ జవాన్‌కు గాయాలయ్యాయి. మృతి చెందిన ఉగ్రవాదులను కుల్గంకి చెందిన ఫయాజ్, ఆదిల్, మొహద్ షాహిద్‌లుగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ముగ్గురు ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మిలిటెంట్లు మృతి
కశ్మీర్: జమ్మూ- కశ్మీర్‌తో కాల్పుల మోత మోగింది. దక్షిణ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని గుండ్బాబా సంగంలో భద్రతా దళాలకు లష్కరే తొయిబా మిలిటెంట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దాళాలు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. మృతి చెందిన వారిలో లష్కరే తొయిబా మిలిటెంట్ల స్థానిక కమాండర్ ఫుర్కాన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అంత్యక్రియల్లో ఆ వ్యాఖ్యలు చేస్తే జైలుకే
సాక్షి, న్యూఢిల్లీ : భారత భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల చావులను పావుగా వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ వాయిద్ తెలిపారు. అంత్యక్రియల్లో మిలిటెంట్లను అమరులుగా పేర్కొంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై నిఘా ఉంచుతామన్నారు. సోషల్ మీడియా వేదికగా మిలిటెంట్ల అంత్యక్రియల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారని వెల్లడించారు. మిలిటెంట్లను అమరులుగా కీర్తిస్తూ ముస్లిం యువతను రెచ్చగొట్టడం వల్ల మరెంతో మంది ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై వారి ఆటలు సాగనీయమనీ, పక్కా ప్రణాళికతో అలాంటి వారిని గుర్తించి కటకటాల పాలు చేస్తామని అన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం.. కాగా, పోలీసులు తీసుకునే చర్యలను వివరించేందుకు వాయిద్ నిరాకరించారు. మిలిటెంట్ల అంత్యక్రియల్లో భారీగా జనం పోగవకుండా, ఆ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కాకుండా అడ్డుకుంటామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ‘తీవ్రవాదుల మృతికి సంతాపంగా వారి అనుయాయులు తుపాకీతో సెల్యూట్ తెలపడం ఆనవాయితీ, అయితే సంచలనం కోసం ఇటీవల ఒక మిలిటెంట్ అంత్యక్రియల్లో అతని తల్లితో గాల్లోకి కాల్పులు జరిపించార’ని వివరించారు. దాంతో ఆ వీడియో వైరల్ అయి అంత్యక్రియల్లో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని వెల్లడించారు. ఇలాంటి ఎత్తుగడలను అడ్డుకునేందుకే రంజాన్ మాసంలో కాల్పుల విరమణ పాటించామని తెలిపారు. -
మంత్రి ఇంటిపై ఉగ్రవాదుల దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలో మంత్రి ఫరూక్ అంద్రాబి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది ఇద్దరికి గాయాలయ్యాయి. అనంతనాగ్‌లోని డూరులో పీడీపీ మంత్రి ఫరూక్ అంద్రాబి నివాసంపై ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు దాడి చేశారు. సెక్యురిటీ సిబ్బంది ఉగ్రవాదులను నిలువరించడానికి చేసిన ప్రయత్నంలో కాల్పుల్లో గాయపడ్డారు. దీంతో.. వారి వద్ద నుంచి ఆయుధాలు తీసుకొని ఉగ్రవాదులు పరారయ్యారు. దాడి జరిగిన సమయంలో ఫరూక్ ఆ ఇంట్లో లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. గాయపడిన భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. శనివారం జమ్మూలో ముగ్గురు వ్యక్తులు ఓ పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏకే 47 తుపాకీని దొంగిలించారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు గురువారం మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల సమాచారంతో వాస్తవాధీన రేఖ(ఎల్ఓసీ) సమీప ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించాయి. ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి మీడియా సంస్థకు తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదుల సమాచారంతో కుప్వారా ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
22 మంది ఉగ్రవాదులు హతం
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో 22 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. తాలిబాన్ల ప్రాబల్యం అధికంగా గల బగ్లాన్ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో 22 మంది తాలిబాన్లు హతమవ్వడంతో పాటు మరో ఏడుగురు ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారని ఆర్మీ అధికారి అహ్మద్ జావేద్ సలీం ఆదివారం తెలిపారు. బగ్లాన్లోని డాండ్-ఈ-ఘోరి ప్రాంతంలో భద్రతా దళాలకు, తాలిబాన్ ఉగ్రవాదులకు మధ్య శనివారం నుండి జరుగుతున్న భీకర కాల్పుల్లో వీరంతా మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో బగ్లాన్ ప్రాంతంలో తాలిబాన్ ఉగ్రవాదుల కార్యకలాపాలపై దృష్టి సారించిన ఆఫ్ఘన్ ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాలు చేపడుతోంది. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. బారాముల్లా జిల్లాలోని కుంజర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతం కాగా, మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
'1700 మంది సైనికులను చంపాం'
తాము ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 1700 మంది ఇరాకీ సైనికులను చంపినట్లు అక్కడి ఉగ్రవాదులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించి కొన్ని అత్యంత క్రూరంగా కనిపిస్తున్న ఫొటోలను కూడా వాళ్లు ట్విట్టర్లో పోస్ట చేశారు. అయితే, వాళ్లు చెబుతున్న విషయాలు గానీ, చూపిస్తున్న ఫొటోలు గానీ ఎంతవరకు నిజమనే విషయం ఇంతవరకు అధికారికంగా నిర్ధారణ కాలేదని ఇరాకీ ప్రభుత్వాధికారులు అంటున్నారు. ఉగ్రవాదులు సైనికులను హతమార్చామని చెబుతున్న సలాహుద్దీన్ రాష్ట్ర ప్రాంతంలో ఎక్కడా సామూహిక దహనాలు జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. కానీ... ఒకవేళ ఉగ్రవాదులు చెబుతున్న విషయమే నిజం అయితే మాత్రం ఇది ఇప్పటివరకు సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఘోరమైన చర్య అవుతుంది. ఇంతకుముందు సిరియా శివార్లలోని డమాస్కస్ ప్రాంతంలో గత సంవత్సరం జరిగిన రసాయన దాడుల్లో సిరియా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న 1400 మంది మరణించారు. ఉగ్రవాదుల చేతుల్లోంచి రెండు పట్టణాలను విడిపించామని, వారిమీద తాము పైచేయి సాధించామని చెబుతున్న ప్రభుత్వ వర్గాలు ఈ కథనాలు చూసి కలవరపడుతున్నాయి.