గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులను కొనసాగిస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు.. స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంటోంది. తాజాగా తమ సైన్యం చేతిలో ఐదుగురు పాలస్తీనా ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది.
పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లోని ఓ మసీదులో దాక్కుకొని ఉన్న ఉగ్రవాదులను ఇజ్రాయెల్ దళాలు కాల్చిచంపినట్లు పేర్కొంది. ఈ ఐదుగురిలో ఒక స్థానిక కమాండర్ మహ్మద్ జాబర్ అలియాస్ అబూ షుజా ఉన్నట్లు ఇజ్రాయెల్ బలగాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చేసిన పలు దాడుల్లో అబూ షుజా హస్తం ఉన్నట్లు ఆర్మీ పేర్కొంది. జూన్‌లో జరిపిన భారీ కాల్పులకు అబూ షుజా ప్లాన్ చేసినట్టు తెలిపింది.
అబూ షుజా గతంలోనే మృతి చెందినట్లు పలు నివేదికలు వెల్లండించాయి. అయితే పలువురు మిలిటెంట్ల అంత్యక్రియల్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. నూర్ షామ్స్ శరణార్థి శిబిరంలోని ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్ కమాండర్ మహ్మద్ జాబర్ మృతిపై పాలస్తీనా ఇంకా ధృవీకరించకపోవటం గమనార్హం. బుధవారం నుంచి పాలస్తీనాపై చేస్తున్న ఇజ్రాయెల్ దాడుల్లో 10 మంది ఫైటర్లు మృతి చెందినట్లు హమాస్ మలిటెంట్ సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment