
ఫైల్ ఫోటో
ఢిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. శనివారం ఉదయం కుల్గం జిల్లాలో ఉగ్రవాదులకు భద్రత బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో ఆర్మీ బలగాలు, స్థానిక కశ్మీర్ పోలీసులు కుల్గం జిల్లాలోని హార్డ్ మంగూరి బాటాపోరా ప్రాంతంలో కార్డన్ చెర్చ్ నిర్వహించారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరపటంతో ఆర్మీ బలగాలు ఎదురు కాల్పలు జరిపాయి.
ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఆర్మీ జవాన్‌కు గాయాలయ్యాయి. మృతి చెందిన ఉగ్రవాదులను కుల్గంకి చెందిన ఫయాజ్, ఆదిల్, మొహద్ షాహిద్‌లుగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ముగ్గురు ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment