![Militants Killed In Encounter With Security Forces In Jammu And Kashmir Anantnag - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/10/jammu-kashmir.jpg.webp?itok=Z1s9eiIV)
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చింది. భద్రతా సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు దక్షిణా కశ్మీర్ జిల్లాలోని క్వారిగం, రాణిపోరా ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్‌ను నిర్వహించారు.
భద్రతా సిబ్బంది తనీఖీలు చేస్తోన్న సందర్భంలో ఒక్కసారిగా ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులతో విరుచుకుపడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై ఎదురుకాల్పులును జరిపింది. కాల్పుల్లో ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల వివరాలను సేకరిస్తున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment