22 మంది ఉగ్రవాదులు హతం | 22 Taliban militants killed in Afghanistan | Sakshi
Sakshi News home page

22 మంది ఉగ్రవాదులు హతం

Feb 28 2016 3:24 PM | Updated on Sep 3 2017 6:37 PM

22 మంది ఉగ్రవాదులు హతం

22 మంది ఉగ్రవాదులు హతం

ఆఫ్ఘనిస్తాన్లో 22 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు.

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో 22 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. తాలిబాన్ల ప్రాబల్యం అధికంగా గల బగ్లాన్ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్లో 22 మంది తాలిబాన్లు హతమవ్వడంతో పాటు మరో ఏడుగురు ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారని ఆర్మీ అధికారి అహ్మద్ జావేద్ సలీం ఆదివారం తెలిపారు.

బగ్లాన్లోని డాండ్-ఈ-ఘోరి ప్రాంతంలో భద్రతా దళాలకు, తాలిబాన్ ఉగ్రవాదులకు మధ్య శనివారం నుండి జరుగుతున్న భీకర కాల్పుల్లో వీరంతా మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.  ఇటీవలి కాలంలో బగ్లాన్ ప్రాంతంలో తాలిబాన్ ఉగ్రవాదుల కార్యకలాపాలపై దృష్టి సారించిన ఆఫ్ఘన్ ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాలు చేపడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement