ఆఫ్ఘనిస్థాన్లోని హెల్మండ్ ప్రాంతంలో ఆదివారం 30 మంది తాలిబాన్లు హతమయ్యారు.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని హెల్మండ్ ప్రాంతంలో ఆదివారం 30 మంది తాలిబాన్లు హతమయ్యారు. పోలీస్ చెక్పోస్టులపై దాడికి ప్రయత్నించిన తాలిబాన్ ఉగ్రవాదులను పోలీసులు మట్టుపెట్టారు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి గాయపడ్డాడు. తాలిబాన్ల ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి హెల్మండ్ ప్రాంతంలో రహదారులను తమ ఆదీనంలోకి తీసుకోవాలని ఉగ్రవాదులు దాడి జరుపగా, పోలీసులు దాడిని తిప్పికొట్టారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన కాల్పుల్లో భారీ సంఖ్యలో తాలీబాన్లు హతమైనట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.