militants
-
హమాస్ చెర నుంచి మరో ముగ్గురికి విముక్తి
డెయిర్ అల్–బలాహ్: కాల్పుల విరమణ ఒప్పందం మేరకు శనివారం హమాస్ మిలిటెంట్లు మరో ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేశారు. ప్రతిగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 183 మంది పాలస్తీనియన్లను వదిలేసింది. వందలాదిమంది సాయుధ హమాస్ శ్రేణులు ఎలి షరాబీ(52), బెన్ అమి(56), ఒర్ లెవీ(34) అనే బందీలను వేదికపైకి తీసుకువచ్చాయి. అనంతరం వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించాయి. ఎంతో బలహీన స్థితిలో ఉన్న వారిని మాట్లాడాలంటూ బలవంత పెడుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు మీడియాలో రావడంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం షరతులను హమాస్ ఉల్లంఘిస్తోందని, మధ్యవర్తులకు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తామని తెలిపింది. 2023 అక్టోబర్ 7న హమాస్ శ్రేణులు అపహరించుకుపోయిన సుమారు 250 మంది పై ముగ్గురు కూడా ఉన్నారు. జనవరి 19న కుదిరిన ఒప్పందం అనంతరం హమాస్ 18 మంది బందీలకు విముక్తి కల్పించింది. -
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లో భారీ ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్ సండే మార్కెట్లోని టూరిస్ట్ సెంటర్ ఆఫీస్(TRC)పై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో పది మందికి(12 మంది) పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. శ్రీ నగర్ నగరానికి గుండెకాయగా చెప్పుకునే లాల్ చౌక్‌ను ఆనుకున్న రోడ్డులోనే సండే మార్కెట్ పేరిట వారాంతపు సంత నిర్వహిస్తారు. మార్కెట్ కారణంగా టీఆర్సీ గ్రౌండ్లో విపరీతమైన జన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు మైదానంలోకి గ్రనేడ్లు విసిరినట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. దాడి జరిగిన వెంటనే పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు చేర్చాయి. ప్రస్తుతం అక్కడ ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. లష్కరే తాయిబా గ్రూప్‌కు చెందిన టాప్ కమాండర్ ఒకరిని.. ఖన్యార్ ప్రాంతంలో భారత సైన్యం మట్టుపెట్టింది. ఆ మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. #BREAKINGGrenade attack in Srinagar's busy Sunday market injures 5 civiliansIncident occurred near the heavily-guarded Tourist Reception Centre (TRC)Comes a day after security forces neutralized top Lashkar-e-Taiba commander in downtown #Srinagar. Security forces on site… pic.twitter.com/iaWl1NJNL9— Nabila Jamal (@nabilajamal_) November 3, 2024ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అక్కడ వరుసగా ఉగ్రవాద కదలికలు పెరిగాయి. గత వారం రోజులుగా మూడు ఎన్కౌంటర్లు జరిగాయి. అంతకు ముందు నుంచే సైనిక వాహనాలపైనా దాడులు జరుగుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ కట్టుదిట్టం చేశాయి. ఒకవైపు సైనికులు.. మరోవైపు అమాయక ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వరుస ఉగ్రదాడి ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు దురదృష్టకరమని , సరిహద్దుల్లో ఎలాంటి భద్రతా లోపం లేదని.. ఉగ్రవాదులకు భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని చెప్పారు.ఇదీ చదవండి: కశ్మీర్ ఓటమి.. కమలం పార్టీ కీలక నిర్ణయం -
ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించిన అల్ జజీరా
గాజాలో ఆరుగురు అల్ జజీరా మీడియా సంస్థకు జర్నలిస్టులు పాలస్తీనా తీవ్రవాదులని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలు చేసింది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపులతో ఆరుగురు జర్నలిస్టులు అనుబంధంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణలై స్పందించిన ఖతార్‌కు చెందిన అల్ జజీరా మీడియా నెట్వర్క్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలు నిరాధారమని తోసిపుచ్చింది.‘‘ఇజ్రాయెల్ సైన్యం మా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తున్నాం. ఇజ్రాయెల్ మా జర్నలిస్టులపై కల్పిత సాక్ష్యాలను సృష్టించడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం. ఈ కల్పిత ఆరోపణలతో ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న జర్నలిస్టుల గొతునొక్కేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోంది. తద్వారా యుద్ధంలో జరుగుతున్న కఠినమైన వాస్తవాలను ప్రపంచానికి తెలియకూడదలనే కుట్రకు ఇజ్రాయెల్ తెరలేపింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు, గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని ఎప్పటికప్పుడూ ప్రసారం చేస్తున్న ఏకైక అంతర్జాతీయ మీడియా నెట్వర్క్ అల్ జజీరానే’’ అని ఓ ప్రకటనలో తెలిపింది..‘‘గాజాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాద సంస్థలలోని సైనికులతో ఆరుగురు అల్ జజీరా జర్నలిస్టులు కలిసిపోయారని నిర్ధారించే గూఢచార సమాచారం, టెర్రరిస్ట్ శిక్షణా కోర్సుల జాబితా, ఫోన్లతో సహా గుర్తించబడ్డాయి. ఖతార్ అల్ జజీరా మీడియా నెట్‌వర్క్‌లో పనిచేసే సిబ్బంది హమాస్ ఉగ్రవాదులతో కలిసిపోయారడానికి ఈ పత్రాలే రుజువు. అల్ జజీరా హమాస్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నట్లు చాలా మంది జర్నలిస్టులు బహిర్గతం చేశారు. అల్ జజీరా జర్నలిస్టులు.. అనస్ అల్-షరీఫ్, హోసామ్ షబాత్, ఇస్మాయిల్ అబు ఒమర్ , తలాల్ అర్రూకీలకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయి.అదేవిధంగా అష్రఫ్ సరాజ్, అలా సలామెహ్ ఇస్లామిక్ జిహాద్‌తో అనుబంధం కలిగి ఉన్నారు’’ అని బుధవారం ఇజ్రాయెల్ ‘ఎక్స్’లో పేర్కొంది. -
మణిపూర్‌లో మళ్లీ హింస.. ఆరుగురి మృతి
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ దాడులు మొదలయ్యాయి. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన తాజా హింసలో ఆరుగురు ప్రజలు మరణించారని పోలీసులు తెలిపారు.మైయితీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిరిబామ్ జిల్లా కేంద్రానికి 5 కి.మీ.ల దూరంలో ఉన్న ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి ఇంట్లోకి మిలిటెంట్లు ప్రవేశించి నిద్రలోనే కాల్చి చంపారని తెలిపారు. ఈ హత్యానంతరం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో ఇరు వర్గాలకు చెందిన సాయుధుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో నలుగురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడ్నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.కాగా మణిపూర్‌లో గత ఏడాదిన్నర కాలంగా హింస కొనసాగుతూనే ఉంది. గతేడాది మే నుంచి కుకీలు, మైతేయ్ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 225 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పర్వత - మైదాన ప్రాంత ప్రజలుగా విడిపోయారు.ముఖ్యంగా గడచిన ఐదురోజుల్లో హింస మరింత పెరిగింది. శుక్రవారం మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో రెండు ప్రదేశాల్లో డ్రోన్ దాడులు జరిగాయి. అయితే కుకీ మిలిటెంట్లే వీటిని వాడుతున్నారని మైయితీ వర్గం ఆరోపిస్తోంది. కుకీలు మాత్రం ఖండిస్తున్నారు. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రతికూల వాతావరణం, పొగమంచు మధ్య భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యం అణువణువునా గాలిస్తున్నారు. ఉగ్రవాదులెవరూ హతమైనట్లు ఇంతవరకూ సమాచారం లేదు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఖనేడ్ అడవిలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా దళాలకు ఇన్పుట్ అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి, కాల్పులు ప్రారంభించాయి. అటవీప్రాంతంలో నలువైపులా ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సైనిక వర్గాలు తెలిపాయి. నలుగురు ఉగ్రవాదులతో కూడిన జైషే గ్రూపు రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక గ్రూపు చెట్లలో దాక్కొనగా, మరొక గ్రూపు తప్పించుకుంది. బసంత్‌గఢ్‌లోని ఖనేడ్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయని డీఐజీ మహ్మద్ రైస్ భట్ తెలిపారు.దీనికిముందు అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేశాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను దావూద్ అహ్మద్ దార్, ఇంతియాజ్ అహ్మద్ రేషి, షాహిద్ అహ్మద్ దార్లుగా గుర్తించారు. ఈ ముగ్గురూ హసన్‌పోరా తవేలాకు చెందినవారు. -
Israel-Hamas war: గాజా ఆస్పత్రిని చుట్టుముట్టిన ఐడీఎఫ్
రఫా: ప్రాణాలతో మిగిలి ఉన్న బందీలను హమాస్ మిలిటెంట్లు నాసిర్ ప్రాంగణం అడుగునున్న సొరంగాల్లో దాచినట్లు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్)అనుమానిస్తున్నాయి. దీంతో, వారం రోజులుగా ఆస్పత్రిని దిగ్బంధించి అణువణువూ శోధిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ దాడితో సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఆస్పత్రిలోని 460 మందికి పైగా సిబ్బంది, రోగులను ఎలాంటి సౌకర్యాలు లేని ఆ పక్కనే ఉన్న పాతభవనంలోకి తరలివెళ్లాలని ఆర్మీ ఆదేశించింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోపాటు, ఆక్సిజన్ నిల్వలు అడుగంటడంతో ఐసీయూలోని ఆరుగురు రోగుల్లో ఐదుగురు చనిపోయినట్లు గాజా అధికారులు శుక్రవారం తెలిపారు. -
BSF: కశ్మీర్‌కు చొరబాట్ల ముప్పు
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దుల గుండా జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు కనీసం 250 నుంచి 300 మంది దాకా ఉగ్ర ముష్కరులు నక్కి ఉన్నట్టు బీఎస్ఎఫ్ శనివారం తెలిపింది. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచరముందని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, వారి ఎత్తులను తిప్పికొడతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సైన్యంతో కలిసి సమన్వయంతో సాగుతున్నామని విలేకరులకు వివరించారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్ వాసులతో భద్రతా దళాలకు అనుబంధం, సమన్వయం పెరుగుతోందని ఆయన తెలిపారు. వారి సహకారంతో స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నారు. -
Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. దాడుల్లో కనీసం 100 మందికి పైగా మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డట్టు చెబుతున్నారు. సరిహద్దుల ప్రాంతాల్లో పౌరులతో పాటు సైనికులను కూడా మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. వారిని, చేజిక్కించుకున్న ఇజ్రాయెల్ సైనిక వాహనాలను గాజా వీధుల్లో ఊరేగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఊహించని దాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్ తేరుకుని హుటాహుటిన సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇరువర్గాల ఎక్కడికక్కడ మధ్య భీకర పోరు సాగుతోంది. కాల్పులు, మోరా్టర్లు, రాకెట్ల మోతతో దేశం దద్దరిల్లుతోంది. తాము ముట్టడిలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘ఇది దాడి కాదు, మాపై పూర్తిస్థాయి యుద్ధమే’’అని పేర్కొన్నారు. దీనికి పాలస్తీనా అతి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘‘ముందుగా చొరబాటుదారులను ఏరేస్తాం. అనంతరం భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరతాం’’అని ప్రకటించారు. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. గత కొన్నేళ్లలో ఆ దేశంపై జరిగిన అతి తీవ్ర దాడి ఇదే. మరోవైపు ఇజ్రాయెల్ ప్రతి దాడిలో గాజాలో ఇప్పటికే 200 మందికి పైగా మరణించినట్టు, 2000 మంది దాకా గాయపడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 14 చోట్లనుంచి చొరబాటు...! ఇజ్రాయెల్‌లోకి కనీసం 7 నుంచి 14 ప్రాంతాల గుండా మిలిటెంట్లు చొచ్చుకొచి్చనట్టు చెబుతున్నారు. తొలుత వివాదాస్పద గాజా స్ట్రిప్ నుంచి తెల్లవారుజామున రాకెట్ల వర్షం కురిపించారు. 20 నిమిషాల్లోనే 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించారు. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు దేశమంతటా వాయుదాడి సైరన్లు మోగాయి. ఆ వెంటనే మిలిటెంట్లు దేశంలోకి చొచ్చుకొచ్చారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దక్షిణాన గాజా–ఇజ్రాయెల్ సరిహద్దుల్లో కంచెలను పేల్చేసి మోటార్‌సైకిళ్లు, వాహనాల్లో, పారా గ్లైడర్ల ద్వారా కూడా దూసుకొచ్చి దాడులకు దిగారు. ప్రతిగా సైన్యం కూడా గాజాపైకి వేలాది రాకెట్లు ప్రయోగించింది. అల్ హక్సా మసీదుపై ఇజ్రాయెల్ అకృత్యాలకు, గాజాపై ఏళ్ల తరబడి అణచివేతకు ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్టు హమాస్ మిలిటరీ వింగ్ నేత మొహమ్మద్ దెయిఫ్ పేర్కొన్నాడు. దీన్ని ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్’గా అభివరి్ణంచాడు. తూర్పు జెరూసలేం నుంచి ఉత్తర ఇజ్రాయెల్ దాకా ఉన్న పాలస్తీనియన్లంతా యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఈ దాడి నెతన్యాహూ నాయకత్వ సామర్థ్యంపై పలు సందేహాలు లేవనెత్తింది. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, భారీ ఆందోళనలకు ఆయన కారకుడవడం తెలిసిందే. దాడి నేపథ్యంలో సైనిక ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండ: మోదీ ఇజ్రాయెల్‌పై దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి అండగా ఉంటామని ప్రకటించారు. బాధిత పౌరులు, కుటుంబాల క్షేమం కోసం ప్రారి్థస్తున్నానంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడిని అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించగా. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని పలు ఇతర దేశాలు కోరాయి. అక్కడి భారతీయులకు అడ్వైజరీ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయు లు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. అ నవసరంగా ఇళ్ల నుంచి బయటికి రావద్దని పేర్కొంది. ఈ మేరకు అక్కడి భారత ఎంబసీ ఇంగ్లిష్తో పా టు హిందీ, మరాఠా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయె ల్లో 18 వేల మంది దాకా భారతీయులున్నారు. -
సైన్యాన్ని చుట్టుముట్టిన మహిళలు
ఇంఫాల్: మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు యత్నిస్తున్న సైన్యానికి స్థానికంగా ఓ వర్గం మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిలిటెంట్లను విడిపించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్మీని దిగ్బంధించారు. దీంతో రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. చివరికి, ఆర్మీ తమ అదుపులో ఉన్న మెయిటీ వర్గం మిలిటెంట్లను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన తూర్పు ఇంఫాల్ జిల్లా ఇథమ్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. భద్రతా బలగాలు శనివారం ఉదయం గ్రామంలో సోదాలు జరిపి 12 మంది మిలిటెంట్లను అదుపులోకితీసుకున్నాయి. విషయం తెల్సుకున్న సుమారు 1,200 మంది మెయిటీ వర్గం మహిళలు సైనికులను చుట్టుముట్టారు. మిలిటెంట్లను వదిలేయాలని భీష్మించారు. సాయంత్రం వరకు ఇదే ప్రతిష్టంభన కొనసాగింది. చివరికి బలగాలు మిలిటెంట్లను వదిలేశాయి. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను, మందుగుండును మాత్రం తీసుకెళ్లామని ఆర్మీ తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా, బలప్రయోగంతో కలిగే నష్టాన్ని, గ్రామస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మానవతా దృక్పథంతో మిలిటెంట్లను స్థానిక నేతకు అప్పగించినట్లు ఆర్మీ తెలిపింది. ఆర్మీ విడిచిపెట్టిన వారిలో మెయిటీ వర్గం కేవైకేఎల్ గ్రూపునకు చెందిన స్వయం ప్రకటిత లెఫ్టినెంట్ కల్నల్ మొయిరంగ్థెమ్ తంటా అలియాస్ ఉత్తమ్ ఉన్నాడు. ఇతడికి పలు హింసాత్మక ఘటనలతో సహా 2015లో ‘6 డోగ్రా యూనిట్’పై దాడితో సంబంధముంది. ఈ గ్రూప్ మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి చొరబడినట్లు ఆర్మీ తెలిపింది. గ్రామంలోకి అదనపు బలగాల ప్రవేశాన్ని ఆలస్యం చేసేందుకు ఆ మార్గంలోని కొన్ని వంతెనల వద్ద అడ్డంకులు కల్పించారంది. కాగా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆదివారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను వివరించారు. -
వీర శునకం... ఉగ్రదాడిలో రెండు బుల్లెట్లు దిగినా లెక్కచేయక....
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సెర్చ్ చేసే ఆపరేషన్ని ప్రారంభించాయి. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు, భధ్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్ దాడిలో ఆర్మీ కుక్క తీవ్రంగా గాయపడింది. తొలుత ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి 'జూమ్' అనే ఆర్మీ కుక్కను పంపినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిపై దాడి చేసి, చేజ్ చేసే పనిలో భాగంగా జూమ్ ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఆ సమయంలోనే కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించగా, పలువురు జవాన్లు గాయపడ్డారు. ఆ తర్వాత అధికారులు జూమ్‌ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కుక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ జూమ్ అనే కుక్క అత్యంత శిక్షణ పొందిన క్రూరమైన, నిబద్ధత కలిగిన కుక్క అని చెప్పారు. అంతేగాదు ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి పట్టుకోవడంలో అత్యంత తర్ఫీదు పొందిందని కూడా తెలిపారు. #WATCH | In an operation in Kokernag, Anantnag, Army's dog 'Zoom' attacked terrorists & received 2 gunshot injuries. In spite of that, he continued his task which resulted in neutralisation of 2 terrorists. The canine is under treatment in Srinagar, J&K. (Source: Chinar Corps) pic.twitter.com/D6RTiWqEnb — ANI (@ANI) October 10, 2022 (చదవండి: సింహం పిల్లలే కదా అనుకుంటే ఇట్లుంటది.. ఒక్క గాండ్రింపుతో హడల్) -
చొరబడేందుకు కాచుకు కూర్చున్నారు
శ్రీనగర్/జమ్మూ: గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది మిలిటెంట్లు సరిహద్దు అవతల వేచి చూస్తున్నట్టు సమాచారం అందిందని కశ్మీర్ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ సోమవారం తెలిపారు. చొరబాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దు వెంబడి గస్తీ పెంచామని చెప్పారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. తాలిబన్ల ముప్పు, అఫ్గానిస్తాన్ నుంచి కశ్మీర్‌కు ఆయుధాలు సరఫరా అవుతాయనే వార్తలపై స్పందిస్తూ.. ఇప్పటివరకైతే అలాంటి సమాచారమేం లేదన్నారు. అయినా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, నిఘా పెంచామని చెప్పారు. కొంత మంది గైడ్లు నియంత్రణ రేఖ దాటి అవతలివైపునకు వెళ్లారని.. ఇటువైపు వచ్చాక వాళ్లపైన, వాళ్ల కుటంబాలపైనా నిఘా పెడతామన్నారు. యాంటీ డ్రోన్ పద్ధతులు వాడుతున్నాం సరిహద్దులో డ్రోన్ల సమస్య ఉందని, గతేడాది కూడా కొన్ని తమకు కనిపించాయని, అయితే మనవైపు రాలేదని ఐజీ వివరించారు. ఈ ఏడాది యాంటీ డ్రోన్ పద్ధతులను వాడుతున్నామని, డ్రోన్లు కూడా సమకూర్చుకుంటున్నామని తెలిపారు. సరిహద్దు అవతలివైపు నుంచి నార్కోటిక్ డ్రగ్స్ పంపేందుకు ప్రయత్నిస్తున్నారని, కొన్నింటిని ఇప్పటికే సీజ్ చేశామని తెలిపారు. సరిహద్దుల్లో 2021లో దాదాపు రూ. 88 కోట్ల విలువైన మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ: జమ్మూ ఐజీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించడంతో అప్రమత్తమయ్యామని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ డీకే బోరా చెప్పారు. సరిహద్దు అవతలి నుంచి చొరబాట్లు జరగొచ్చని.. ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేయొచ్చని సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి యాంటీ డ్రోన్ ఎక్సర్సయిజ్లు, టన్నెల్స్‌ను గుర్తించడం ముమ్మరం చేశామన్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ పెంచామని తెలిపారు. వీలైనంత ఎక్కువ మందిని సరిహద్దులో మోహరించామన్నారు. -
రష్యా సర్జికల్ స్ట్రైక్: 200 ఉగ్రవాదులు ఖతం
మాస్కో: నిత్యం బాంబు దాడులతో దద్దరిల్లే సిరియాలో మరోసారి దాడులు జరిగాయి. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు, సామాన్యులపై చేసే దాడుల నేపథ్యంలోనే సిరియా పేరు వార్తల్లో వినపడుతోంది. తాజాగా మరోసారి బాంబుల మోతతో వార్తల్లో నిలిచింది సిరియా. కాకపోతే ఈ సారి దాడులు సామాన్య ప్రజలపై కాకుండా ఉగ్రవాదులపై జరిగాయి. ఈ ఘటనలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారు. సిరియాలోని ఉగ్రవాద స్థావరంపై రష్యా తమ యుద్ధ విమానాలతో సోమవారం దాడి చేసింది. ఈ వైమానిక దాడిలో 200 మంది ఉగ్రవాదులు మృతి చెందారని, 24 వాహనాలు, సుమారు 500 కిలోగ్రాముల (1,100 పౌండ్లకు పైగా) మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను ధ్వంసం చేశామని రష్యా సైన్యం ప్రకటించింది. పల్మైరా ప్రాంతంలో ఉన్న క్యాంపులో ఉగ్రవాదులు పేలుడు పదార్థాల తయారీపై శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. ఈ సమాచారం అందిన వెంటనే రష్యా తమ సైన్యంతో ఈ దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇటీవల ఇద్దరు రష్యా సైనికులను చంపినట్లు ఇస్లామిక్ స్టేట్ పేర్కొనగా.. ప్రతీకార చర్యల్లో భాగంగానే రష్యా ఈ దాడులు చేసింది. ( చదవండి: తీవ్ర పరిణామాలు తప్పవు: రష్యాకు అమెరికా వార్నింగ్! ) -
ప్రధాని హత్యకు కుట్ర: 14 మందికి మరణ శిక్ష
ఢాకా: రెండు దశాబ్దాల క్రితం అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనాను హత్య చేసేందుకు యత్నించారన్న కేసులో 14 మంది ఇస్లామిక్ మిలిటెంట్లకు బంగ్లాదేశ్ కోర్టు మరణ శిక్ష విధించింది. వీరిలో 9 మందిని పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వీరిని ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్పించి చంపి ఇలాంటి వారికి ఒక సందేశమివ్వాలని జడ్జి తీర్పులో వ్యాఖ్యానించారు. లేదంటే వీరిని ఉరితీయాలని ఆదేశించారు. బంగ్లాదేశ్ నియమాల ప్రకారం మరణ శిక్షను హైకోర్టు నిర్ధారించాల్సి ఉంటుంది. తాజా తీర్పుపై నిందితులు అప్పీలుకు వెళ్లే అవకాశం ఇస్తారు. 2000 సంవత్సరంలో హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్‌కు చెందిన వీరంతా ప్రధాని హత్యకు కుట్రపన్నారు. వీరి నాయకుడు ముఫ్తి అబ్దుల్ హనన్‌కు వేరే కేసులో 2017లో మరణ శిక్ష అమలు చేశారు. ప్రధాని హత్యాయత్నాన్ని సెక్యూరిటీ వర్గాలు భగ్నం చేశాయి. ఈ కేసుకు సంబంధించే గతంలో 10మంది ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేయడం జరిగింది. 1975 నుంచి హసీనా పలుమార్లు హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారు. -
ఎన్నికల ప్రచారంలో బంగ్లా ప్రధాని హత్యకు కుట్ర!
ఢాకా: రెండ దశాబ్దాల క్రితం ఇస్లామిక్ మిలిటెంట్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను హతమార్చేందుకు ప్రయత్నాలు చేసిన విషయం తాజాగా బహిర్గతమైంది.. ఆమెను వారు తూటాలతో కాల్చేందుకు సిద్ధమయ్యారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బంగ్లాదేశీ కోర్టు మంగళవారం తెలిపింది. 14 మంది మిలిటెంట్ల మరణ వాంగ్మూలంలో ఈ విషయం తెలిసినట్లు కోర్టు పేర్కొంది. ఆ మిలిటెంట్లను కోర్టు నుంచి జైలుకు తరలిస్తుండగా ప్రధాని హత్యకు వేసిన ప్రణాళికను ఢాకా కోర్టు న్యాయవాది అబు జఫర్ ఎండీ కమ్రుజ్జమన్ వివరించారు. గోపాల్‌గంజ్ నైరుతి నియోజకవర్గంలోని కోటాలిపార ప్రాంతంలో ఉన్న మైదానంలో జూలై 21, 2000లో 76 కిలోల భారీ బాంబు అమర్చేందుకు ప్లాన్ వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని హసీనా ఆ మైదానానికి వస్తారని గుర్తించి బాంబు పెట్టేందుకు హర్కాతుల్ జిహాద్ బంగ్లాదేశ్ (హజీ బీ) సంస్థ ప్రయత్నాలు చేసింది. ఈ కుట్రలో మొత్తం 14 మంది పాత్ర ఉందని తెలిపింది. వారిని ఉరి తీసే క్రమంలో ఈ విషయాన్ని తెలిపారని న్యాయమూర్తి కమ్రుజ్జమన్ తెలిపారు. చదవండి: పార్లమెంట్లో రాసలీలలు.. డెస్క్‌లు, టేబుళ్ల చాటుగా చదవండి: నిజమైన భారతీయులను రక్షిస్తాం -
ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. దక్షిణ కశ్మీర్‌లోని షోపైన్ జిల్లాలో మెల్‌హురా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో భద్రతా దళాలు, పోలీసులు కార్డన్ చెర్చ్ చేపట్టారు. సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వీరిని అల్‌ఖైదా సంబంధిత సంస్థ ఘజవత్ అల్ హింద్ అధినేత మజీద్తోపాటు మరో ఇద్దరిని అనంత్‌నాగ్‌కు చెందిన నజీర్‌భట్, కుల్గాంకు చెందిన ఉమర్ ఫిదాయిన్‌గా గుర్తించారు. వారి దగ్గర నుంచి ఏకే 47 రైఫిల్స్, రివాల్వర్‌తో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్ మంగళవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఇందులో ఆరుగురు సైనికులతోపాటు ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. (జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. ఇద్దరు మృతి) -
తాలిబన్ చెర నుంచి భారతీయుల విడుదల
ఇస్లామాబాద్: గత సంవత్సర కాలంగా తమ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురు భారతీయ ఇంజనీర్లను అఫ్గాన్ తాలిబన్లు సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు తాలిబన్ నాయకులు స్థానిక రేడియో చానల్లో మాట్లాడినట్లు మీడియా సంస్థలు కథనాలు రాశాయి. అఫ్గాన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి అయిన జల్మే ఖలిల్జాద్ ఇస్లామాబాద్‌లో తాలిబన్ నాయకులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ముగ్గురు భారతీయ బందీలను తాలిబన్లు విడుదల చేశారని ఇందుకు ప్రతిగా అఫ్గాన్ జైళ్లలో ఉన్న 11 మంది తాలిబన్ నాయకులను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే ఈ పరిణామాలపై స్పందించేందుకు అఫ్గాన్ అధ్యక్ష కార్యాలయం, రక్షణ శాఖ నిరాకరించాయి. దీనిపై అఫ్గాన్ ప్రభుత్వం నుంచి గానీ, భారత ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాలేదు. విడుదల అయిన బందీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తాలిబన్లు వెల్లడించలేదు. అయితే జైళ్ల నుంచి విడుదలైన తాలిబన్ నేతలను అభినందిస్తున్న ఫొటోలు, వీడియోలను మాత్రం విడుదల చేశారు. కాగా 2018 మేలో బాగ్లాన్ రాష్ట్రంలోని ఓ పవర్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఏడుగురు భారతీయ ఇంజనీర్లను, వారి డ్రైవర్‌ను తాలిబన్లు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ పని తామే చేశామని అప్పట్లో ఏ గ్రూప్ కూడా ప్రకటించలేదు. అయితే అపహరణకు గురైన ఏడుగురిలో ఒకరిని ఈ మార్చిలో విడుదల చేశారు. -
బట్టలన్నీ విప్పేసి, కాళ్లు, చేతులు కట్టేసి..
సాక్షి, న్యూఢిల్లీ : ‘మమ్మల్ని రాత్రి పూట ఇళ్ల నుంచి బయటకు తీసుకెళ్లారు. తీవ్రంగా కొట్టారు. శరీరమంతటా ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’ అని కొంత మంది గ్రామస్తులు ఆరోపించగా, ‘రాత్రిపూట సైనిక శిబిరాల నుంచి ప్రజలు అరుపులు, ఏడ్పులు రోజూ వినిపించేవి’ మరికొంత మంది తెలిపారు. ‘ఆగస్టు 14వ తేదీన రాత్రిపూట సైనికులు మా ఇళ్లు తలుపు తట్టారు. నేను తలుపులు తీశాను. పది మంది సైనికులు ఇంట్లో జొరబడ్డారు. నాకు, నా సోదరుడి కళ్లకు గంతలు గట్టి బయటకు తీసుకెళ్లారు. ముందుగా రోడ్డవతలికి నా సోదరుడిని తీసుకెళ్లారు. అక్కడ అతడిరి తీవ్రంగా కొడుతుండడంతో హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది. నన్ను సమీపంలోని చౌగామ్ సైనిక శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ బట్టలన్నీ విప్పేశారు. చేతులను, కాళ్లను కట్టేసి ఇనుప రాడ్లతో కొట్టారు. చేతులు, కాళ్లు, వీపు, పిర్రలపై ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’ 26 ఏళ్ల అబిద్ ఖాన్ ‘ఏపీ’ వార్తా సంస్థకు వివరించారు. సోఫియాన్ జిల్లా హిర్పోరా గ్రామంలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ‘నీ పెళ్లికి హిజ్బుల్ ముజాహిదీన్’ మిలిటెంట్ సంస్థకు చెందిన రియాజ్ నైకూ మిలిటెంట్‌ను ఎందుకు ఆహ్వానించావు ? ఇప్పుడు అతనెక్కడున్నాడో చెప్పు ?’ అంటూ భారత సైనికులు తనను హింసించారని, అతను ఎవరో, అసలు ఎక్కడుంటారో కూడా తనకు తెలియదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని అబిద్ ఖాన్ మీడియాకు వివరించారు. తన పురుషాంగం, వరి బీజాలపై కూడా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారని తెలిపాడు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసిన నేపథ్యంలో మున్ముందు ఎలాంటి నిరసన ప్రదర్శనలు జరపరాదనే ఉద్దేశంతోనే వారు ఇలా తనను హింసిస్తున్నారని అర్ధం అయిందని ఆయన చెప్పారు. తన లాగే తన గ్రామానికి చెందిన మరికొంత మంది యువకులను ఇలాగే హింసించినట్లు తెల్సిందని చెప్పాడు. సైనిక శిబిరం నుంచి అబద్ ఖాన్ విడులయ్యాక పది రోజుల పాటు నిల్చోలేక పోయాడు, కూర్చోలేక పోయాడని, ఆ పది రోజులు వరుసగా వాంతులు చేసుకుంటూనే ఉన్నాడని, బ్రతుకుతాడని ఆశ లేకుండేనని కుటుంబ సభ్యులు తెలిపారు. 20 రోజుల తర్వాత తేరుకొని కాస్త అటు, ఇటు నడవ కలుగుతున్నాడని వారు చెప్పారు. పలు గ్రామాల్లో జరుగుతున్న ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. కశ్మీర్లో ఎప్పుడో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ నేటికి సాధారణ పరిస్థితులు లేవని ఏపీ మీడియా వెల్లడించింది. ఇంకా పలు ప్రాంతాల్లో టెలిఫోన్ సౌకర్యాలను కూడా పునరుద్ధరించలేదు. -
రహస్యంగా మసూద్ విడుదల
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల అనంతరం వాటికి బా«ధ్యత వహించిన జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ సహా ఎందరినో అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించిన పాక్ ఇప్పుడు తన దారి మార్చుకుంది. అజర్‌ని మూడో కంటికి తెలీకుండా రహస్యంగా జైలు నుంచి విడుదల చేసింది. అజర్ ప్రస్తుతం పాక్ జైల్లో లేడని, భవల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్టుగా భారత్ ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. కశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించడానికి, భారత్‌లో భారీగా దాడులకు పాక్ కుట్ర పన్నుతున్నట్టు భద్రతా అధికారులు వెల్లడించారు. కశ్మీర్లోకి చొరబడడం, ఈ ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించడం, కశ్మీర్లో ఘర్షణలు రేగేలా ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేయడం వంటి వాటి కోసం పాక్ అజర్‌ను విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. జైషేప్రధాన కార్యాలయంలో అజర్, ఆయన సోదరులు, సంస్థకి చెందిన ఇతర సభ్యులు దాడులకు వ్యూహాలను రచిస్తున్నట్టు భారత్‌కు ఉప్పందింది. అజర్‌ను ఇటీవల భారత్ ఉగ్రవాది ప్రకటించిన విషయం తెలిసిందే. -
షోపియాన్‌లో ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదరుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత దళాలు మట్టుపెట్టాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు జరిపి కొన్ని గంటలైన గడవకముందే.. మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. షోపియాన్ జిల్లాలో మెమందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు బుధవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రత బలగాలపై కాల్పులు దిగినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టడానికి భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఎవరు గాయపడలేదని సమాచారం. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడ్డ పాక్.. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. మంగళవారం సాయంత్రం నుంచి సరిహద్దు వెంబడి దాదాపు 15 చోట్ల ఇష్టా రాజ్యంగా పాక్ కాల్పులు జరిపింది. పాకిస్తాన్ బలగాలు జరిపిన కాల్పులో ఐదుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సరిహద్దులోని పలు చోట్ల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పాక్ ఆర్మీకి ధీటుగా బదులిచ్చిన భారత దళాలు పాకిస్తాన్‌కు చెందిన ఐదు పోస్టులను ధ్వంసం చేశాయి. (సర్జికల్ స్ట్రయిక్స్ 2 సక్సెస్) -
మూడేళ్లలో నక్సలిజం అంతం
లక్నో: రాబోయే మూడేళ్లలో దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను ఎదుర్కోవడంలో సీఆర్పీఎఫ్ బలగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. సీఆర్పీఎఫ్ అనుబంధ విభాగమైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) 26వ వార్షికోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్ మాట్లాడుతూ..‘ఆ రోజు ఎంతో దూరంలో లేదు. రాబోయే 2–3 ఏళ్లలో దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. గతంలో దేశవ్యాప్తంగా 126 జిల్లాల్లో తీవ్రవాదుల ప్రాబల్యముంటే.. ఈ సంఖ్య ప్రస్తుతం 10 నుంచి 12 జిల్లాలకు పడిపోయింది. మీ (సీఆర్పీఎఫ్ జవాన్ల) అంకితభావం, ధైర్యం, కృషి కారణంగానే ఇది సాధ్యమైంది. ఆర్ఏఎఫ్ బలగాలు స్పందించడంలో వేగంగా ఉండాలే తప్ప ప్రజలతో దురుసుగా వ్యవహరించకూడదు’ అని తెలిపారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ విశేష కృషి చేస్తోందని ప్రశంసిం చారు. భద్రతాబలగాలు 2018లో ఇప్పటివరకూ 131 మంది ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను మట్టుబెట్టాయని రాజ్‌నాథ్ తెలిపారు. దీంతోపాటు 1,278 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో 58 మంది లొంగిపోయారని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. కశ్మీరీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారనీ, అయినా రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ బలగాలు శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నాయని కితాబిచ్చారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో యాపిల్ కంపెనీ మేనేజర్‌ను పోలీసులు కాల్చిచంపడంపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘ఆందోళనలు, అల్లర్ల సందర్భంగా ఆర్ఏఎఫ్ బలగాలు సత్వరం స్పందించాలే తప్ప ప్రజలతో దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. సుశిక్షితులైన భద్రతాబలగాలు ప్రజలతో దురుసుగా ప్రవర్తించి కూర్రులుగా గుర్తింపు తెచ్చుకోకూడదు. విధి నిర్వహణ సందర్భంగా ప్రజలతో ఎప్పుడు, ఎంతమేరకు, ఎలా వ్యవహరించాలన్న అంశంపై జవాన్లకు అవగాహన ఉండాలి’ అని రాజ్‌నాథ్ వెల్లడించారు. దేశంలో అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 1991లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, అలహాబాద్, ముంబై, అలీగఢ్, కోయంబత్తూర్, జంషెడ్పూర్, భోపాల్, మీరట్‌లో ఆర్ఏఎఫ్ బెటాలియన్లను మోహరించారు. -
ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లోని కొకేర్‌నాగ్ వద్ద భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులు ఓ భవనంలో దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ భవనాన్ని చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కూడా వారిపై ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మిగిలిన ముష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈద్ వేళ ఉగ్ర ఘాతుకం... -
ఈద్ వేళ ఉగ్ర ఘాతుకం...
శ్రీనగర్ : పవిత్ర బక్రీద్ పర్వదినాన కశ్మీర్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. వేర్వేరు ఘటనల్లో ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసులు, ఒక బీజేపీ కార్యకర్త ను కాల్చిచంపారు. బాధిత కుటుంబాల్లో ఈద్ సంబరాల స్థానంలో విషాదం నింపారు. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని లార్వెలో ఈద్ జరుపుకోవడానికి స్వస్థలం వచ్చిన ఇన్స్పెక్టర్ మహ్మద్ అష్రాఫ్ దార్‌ను ఉగ్రవాదులు బుధవారం సాయంత్రం అతని స్వగృహంలోనే హత్యచేశారు. ఆయన బుద్గాంలోని స్పెషల్ బ్రాంచీలో పనిచేస్తున్నారు. అంతకుముందు, కుల్గాంలో ఈద్ ప్రార్థనలు చేసి ఇంటికి వెళ్తున్న ట్రైనీ కానిస్టేబుల్ ఫయాజ్ అహ్మద్ షాను పొట్టనబెట్టుకున్నారు. పూల్వామా జిల్లాలో స్పెషల్ పోలీసు అధికారి మహ్మద్ యాకూబ్ షాపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. కుప్వారా జిల్లాలో మంగళవారం రాత్రి అపహరణకు గురైన స్థానిక బీజేపీ కార్యకర్త మృతదేహం బుధవారం కనిపించింది. ఆయన శరీరమంతా బుల్లెట్లు దిగి ఉండటంతో ఈ ఘాతుకానికి పాల్పడింది ఉగ్రవాదులే అని భావిస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విచారం వ్యక్తం చేస్తూ కశ్మీర్ లోయలో హింస ఎక్కువ కాలం కొనసాగదన్నారు. అనంత్‌నాగ్‌లోని జంగ్లాట్ మండీ, బారాముల్లాలోని సోపోర్ తదితర ప్రాంతాల్లోనూ నిరసనకారులు రాళ్లు రువ్వారు. -
12 పాఠశాలలను తగలబెట్టిన ఉగ్రవాదులు
ఒక ఆడపిల్ల (మలాలా) చదువుకుంటేనే.. ఆకాశమంత ఎత్తు ఎదిగి, నోబెల్ అవార్డు అందుకునే స్థాయికి చేరుకుంది. మూఢాచారాలపై, మతఛాందసవాదులపై ఏకంగా యుద్ధమే చేస్తోంది. మరి దేశంలోని మిగతా ఆడపిల్లలంతా చదువుకుంటే... అమ్మో, ఇంకేమైనా ఉందా? ఉగ్రవాదాన్ని, మూఢాచారాల్ని కూకటివేళ్లతో పెకలించేయరూ..! అందుకేనేమో.. ఆడపిల్లలు చదువుకునే పాఠశాలలను తీవ్రవాదులు తగలబెట్టేస్తున్నారు. విద్య మనిషిని సంస్కరిస్తుంది... జ్ఞానాన్ని పెంచుతుంది... అజ్ఞానాన్ని తుంచేస్తుంది. ఆధునికతవైపు నడిపిస్తుంది... మూఢాచారాలపై పోరాడే శక్తినిస్తుంది. అందుకేనేమో.. మతఛాందసవాదులైన ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఆ విద్యకు ఆలవాలమైన పాఠశాలలపై కన్నేశారు. ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో చాటిచెప్పి.. నోబెల్ అవార్డును అందుకునే స్థాయికి ఎదిగిన మలాలా పుట్టిన గడ్డపైనే.. ఆడపిల్లలు చదువుకునే పాఠశాలలను తగులబెడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. పూర్తిగా ధ్వంసం: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్–బాల్టిస్తాన్‌లో గుర్తుతెలియని ఉగ్రవాదులు 12 స్కూళ్లను తగలబెట్టారు. ఇందులో ఆరు బాలికల పాఠశాలలే ఉన్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు.. స్కూళ్లకు తగిన రక్షణ కల్పించాలని ఆందోళన చేపట్టారు. గిల్గిత్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలాస్ టౌన్లో గురువారం రాత్రి మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. 12 స్కూళ్లను తగలబెట్టి, పూర్తిగా ధ్వంసం చేశారని స్థానిక డైమర్ జిల్లా ఎస్పీ రాయ్ అజ్మల్ వెల్లడించారు. దీనిపై విచారణ మొదలుపెట్టామని, నిందితులను పట్టుకోవడానికి భద్రత దళాలు వేట మొదలుపెట్టాయని చెప్పారు. స్కూళ్లపై ఎలాంటి బాంబు దాడీ జరగలేదని డైమర్ ప్రాంత కమిషనర్ అబ్దుల్ వహీద్ చెప్పారు. నిర్మాణంలో ఉన్న పాఠశాలలపైనా..: మిలిటెంట్లు దాడి చేసిన స్కూళ్లలో కొన్ని ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయని, భవిష్యత్తులో పాఠశాలలేవీ నిర్మించకుండా ఉండేందుకే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ దాడులకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన చేయలేదు. అయితే ఈ ప్రాంతంలో గతంలోనూ తాలిబన్లు స్కూళ్లపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. బాలికల పాఠశాలలపైనే ఎక్కువగా ఈ దాడులు జరిగేవి. మళ్లీ ఆ రోజులను గుర్తుచేస్తూ ఘటనలు జరుగుతుండడంపై గిల్గిట్–బాల్టిస్తాన్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఉగ్ర’ సమిధలుగా చిన్నారులు: ఐరాస
ఐరాస: పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద సంస్థలు జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వేందుకు, అల్లర్లు సృష్టించేందుకు చిన్నారులను ఆయుధాలుగా వాడుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదికలో వెల్లడించింది. చిన్నారులు, సాయుధ దాడులు అనే అంశంపై ఐరాస వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2017 జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా అల్లర్ల కారణంగా మరణించిన, గాయాలపాలైన చిన్నారుల సంఖ్య పదివేలకు పైగా ఉంది. అంతేకాకుండా ఉగ్ర సంస్థలు అల్లర్లు సృష్టించడానికి ఎనిమిది వేల మంది బాలలను నియమించుకున్నాయని నివేదిక స్పష్టం చేసింది. సిరియా, అఫ్గానిస్తాన్, యెమెన్, భారత్, ఫిలిప్పీన్స్, నైజీరియాలతో పాటు 20 దేశాలకు సంబంధించి ఈ నివేదికను తయారు చేశారు. భారత్‌లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు.. భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో చిన్నారులు ఎక్కువగా బలైపోతున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మావోయిస్టులు కూడా చిన్నారులనే ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ప్రత్యేకంగా చిన్నారులను నియమించుకొని వారిచేత అల్లర్లు చేయిస్తున్నారని, అలాగే పిల్లలను ఇన్ఫార్మర్లు, గూఢచారులుగా ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు. పాకిస్తాన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది. -
జమ్మూ కశ్మీర్: కుప్వారాలో ఎన్కౌంటర్
-
ఉగ్రవాదిగా మారిన ఐపీఎస్ సోదరుడు..!
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌కు చెందిన యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడానికి ఉగ్ర సంస్థలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఓ ఐపీఎస్ అధికారి సోదరుడు ఉగ్రవాదుల్లో చేరినట్టు వెలువడుతున్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌కు వెలుపల సేవల అందిస్తున్న ఆ ఐపీఎస్ అధికారి సోదరుడు షామ్సుల్ హక్ మే 26వ తేదీన అదృశ్యమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాకు చెందిన షామ్సుల్ ప్రభుత్వ కళాశాల నుంచి బీయూఎంస్ పట్టా పొందాడు. అయితే షామ్సుల్ అదృశ్యమైనప్పటి నుంచి ఇప్పటివరకు అతని గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అతను తీవ్రవాదం వైపు ఆకర్షితుడైనట్టు అనుమానాలు బలపడుతున్నాయి. కాగా షోఫియాన్ ఎస్ఎస్పీ మాత్రం దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. షామ్సుల్ మిస్సింగ్ గురించి కుటుంబసభ్యులు నుంచి ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. వారు ఫిర్యాదు చేస్తే తాము అధికారికంగా విచారించే అవకాశం ఉంటుందన్నారు. 2017లో 126 మంది యువకులు ఉగ్రవాదం వైపు అకర్షితులైనట్టు అధికారులు వెల్లడించారు. -
సోదరీమణులారా బీ కేర్‌పుల్...
కశ్మీర్: సోషల్ మీడియాలో సైనికులతో చాటింగ్ చేయ్యెద్దంటూ ఇస్తామిక్ ఉగ్రవాద సంస్థ ‘ హిజ్బుల్ ముజాహిదీన్ ’ కశ్మీర్ యువతులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకో ఓ ఆడియో క్లిప్పును విడుదల చేశారు. ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు కశ్మీర్లో వైరల్ అయింది. ‘ భద్రతా దళాలు, పోలీసులు కశ్మీర్ యువతులో సంబంధం ఏర్పాటు చేసుకొని మా గురించి సమాచారం లాగుతున్నారు. ముఖ్యంగా పాఠశాల యువతను టార్గెట్ చేశారు. వారితో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అపరిచితులతో పరిచయాలు పెంచుకోకండి. మీతో చాట్ చేసి మిమ్మల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. వారు అడిగిన సమాచారం చెప్పకపోతే మీ రహస్యాలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సోదరీమణులారా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి. మీ పిల్లలు భద్రతా దళాలతో సంబంధాలు పెట్టుకుంటే మిమ్మల్ని మేము విడిచిపెట్టం జాగ్రత్త’ అని హెచ్చరిస్తూ ఉన్న పది నిమిషాల ఆడియో క్లిప్ జమ్మూ-కశ్మీర్లో వైరల్ అయింది. ఈ ఆడియో క్లిప్‌ను అందరికి షేర్ చేయాలని కూడా రియాజ్ నైకో కశ్మీర్ యువతను కోరారు. కాగా కొద్దిరోజుల క్రితం ఆర్మీ మేజర్ నితిన్ లీతుల్ గోగోయ్ శ్రీనగర్‌లోని ఓ హోటల్లో ఓ యువతతో పట్టుబడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారానే వారు పరిచయం అయ్యారు.ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థ ఆడియో క్లిప్ ను విడుదల చేసింది. గోగోయ్ విషయాన్ని కూడా ఆడియో క్లిప్‌లో గుర్తుచేశారు. -
100 మంది హిందువుల ఊచకోత
యాంగూన్, మయన్మార్ : వందలాది మంది హిందువుల(మయన్మార్‌లో హిందువులు కూడా మైనారిటీలే)ను రోహింగ్యా మిలిటెంట్లు గతేడాది ఊచకోత కోసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధ్రువీకరించింది. ఈ మేరకు ఆమ్నెస్టీ బుధవారం ఓ రిపోర్టును విడుదల చేసింది. మయన్మార్‌లో జాతుల(హిందువులు, రోహింగ్యాలు) మధ్య వైరాలను ఆమ్నెస్టీ రిపోర్టు తేటతెల్లం చేసింది. గతేడాది ఆగష్టు 25న పెద్ద ఎత్తున బౌద్ధులు, రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలపై విరుచుకుపడ్డారు. అదే రోజున రోహింగ్యా మిలిటెంట్లు సైతం హిందువుల ప్రాంతాలపై విరుచుకుపడి నరమేధం సృష్టించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. ఈ ఘటన వల్లే మయన్మార్ సైన్యం రంగంలోకి దిగిందని, దీంతో 7 లక్షల మంది రోహింగ్యాలు దిక్కతోచని స్థితిలో పొరుగుదేశాలకు వలస బాట పట్టారని వివరించింది. రోహింగ్యా జాతిని అంతమొందించేందుకు బర్మా సైన్యం వారిపై పౌరుల హత్య, గ్రామాలకు నిప్పుపెట్టడం వంటి ఆరోపణలు చేసిందని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, రోహింగ్యా మిలిటెంట్లపై సైతం పలు ఆరోపణలు ఉన్నట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. హిందువుల కుటుంబాలపై దాడులు జరిపిన రోహింగ్యా మిలిటెంట్లు 53 మందిని ఉరి తీసినట్లు వెల్లడించింది. రఖైన్ రాష్ట్ర ఉత్తరభాగాన ఉన్న ఓ శ్మశానవాటికలో హిందువుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటితో తమకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ) పేర్కొంది. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టింది రోహింగ్యా మిలిటెంట్లేనని ఆమ్నెస్టీ పరిశోధనలో తేలింది. మరో గ్రామంలో కూడా 46 మంది హిందువులు మిస్సయ్యారని వారిని ఏఆర్ఎస్ఏ మిలిటెంట్లే హతమార్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చదవండి : 400 మంది ముస్లింలు ఊచకోత -
ఉగ్రవాదులు కాదు.. వాళ్లూ అమర వీరులే!
శ్రీనగర్ : కశ్మీర్ అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ చిచ్చును రాజేస్తున్నాయి. పీపుల్ డెమొక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ మీర్ ఎన్కౌంటర్లో చనిపోతున్న టెర్రరిస్టులను అమర వీరులుగా పేర్కొన్నారు. దీంతో మిత్రపక్షం బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘‘ఉగ్రవాదులను చనిపోతుంటే మేం వేడుకలు చేసుకోలేం. ఎందుకంటే వారు మాకు సోదరులే. ఇకపై జవాన్ల కుటుంబాలతోపాటు మిలిటెంట్ల కుటుంబాలకు కూడా మా సంఘీభావం తెలుపుతాం’’ అని గురువారం అసెంబ్లీ బయట ఓ జాతీయ మీడియాతో మీర్ వ్యాఖ్యానించారు. చనిపోయిన వారు ఉగ్రవాదులా? పోలీసులా? అని తమకు సంబంధం లేదని.. కశ్మీర్ గడ్డపై పుట్టిన వారందరినీ తాము అమరులుగానే భావిస్తామని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంలో వేర్పాటువాదులతో, ఉగ్రవాదులతో ప్రభుత్వం చర్చలు జరపాలంటూ మీర్ డిమాండ్ చేస్తున్నారు. కాగా, మీర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వాచి అసెంబ్లీ నియోజక వర్గం(సోఫిన్ జిల్లా)లో ఉగ్రవాదుల దాడులు తరచూ జరుగుతుంటాయి. గత అక్టోబర్‌లో మీర్ ఇంటిపైనే గ్రెనేడ్ దాడి జరగగా.. స్వల్ఫ గాయాలతో ఆయన బయటపడ్డాడు. అయినా సరే ఉగ్రవాదులకు మద్దతుగా ఆయన అసెంబ్లీలో గళం వినిపిస్తున్నారు. వారు చనిపోయినప్పుడు వేడుకలు చేసుకోవద్దంటూ బుధవారం ఎమ్మెల్యేలకు ఆయన పిలుపు కూడా ఇచ్చారు. ఇక మీర్ వ్యాఖ్యలను మిత్రపక్షం బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. నరరూప రాక్షసులను అమరులుగా అభివర్ణించటాన్ని కశ్మీర్ రవాణా శాఖా మంత్రి సునీల్ శర్మ తప్పుబట్టారు. ఇక ఈ వ్యాఖ్యలు పీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శమని ప్రతిపక్ష పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ విమర్శిస్తోంది. -
చనిపోతోంది మన పిల్లలే.. సంబరమొద్దు!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో హతమవుతున్న స్థానిక మిలిటెంట్ల గురించి ఆ రాష్ట్ర పోలీసు అధికారి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కశ్మీర్లో స్థానిక మిలిటెంట్లను చంపేసినప్పుడు సంతోషం వ్యక్తం చేయవద్దని, వారు మన పిల్లలేనని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ రిజర్వు పోలీసు (ఐఆర్పీ) రెండో బెటాలియన్ కమాండెంట్ ఎస్ఎస్స్పీ శైలేంద్రకుమార్ మిశ్రా ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, ఆ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన గురువారం మీడియాతో అన్నారు. 2009 ఏపీఎస్ బ్యాచ్ అదికారి అయిన మిశ్రా గతవారం ముంబైలో జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడుతూ కశ్మీరీ మిలిటెంట్లను హతమార్చడం మన ఉమ్మడి వైఫల్యంగా అభివర్ణించారు. 'మిలిటెంట్ల హత్యలపై సంతోషం వ్యక్తం చేయకండి. ఈ హత్యలు మన పరాజయానికి, ఉమ్మడి వైఫల్యానికి ప్రతీకలు. బుర్హాన్ వనీ హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? వసీం మల్లా (వనీ అనుచరుడు. గత ఏడాది ఎన్కౌంటర్లో మృతిచెందాడు) ఒక భారతీయ పౌరుడు. షోపియన్‌లో జన్మించారు. బీఏ సెకండియర్ విద్యార్థి అయిన అతడు ఎందుకు తుపాకి పట్టాడు. భారతీయుడి గుర్తింపు కాదనుకొని.. దేశంలోని ప్రతి వ్యవస్థను ఎందుకు ద్వేషించాడు?' అని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదం లేదని, మిలిటెన్సీ మాత్రమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని చెప్పారు. 'జమ్మూకశ్మీర్‌లోని కొంతమంది యువతకు మన వ్యవస్థ, మన పనితీరు పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. కానీ వారు కూడా మన పిల్లలే. వాళ్లు మన సొంత మనుషులు. వాళ్లు బందిపోట్లుగా, అసాంఘిక శక్తులుగా మారి ఉండొచ్చు. కానీ వారిని చంపడంలో మాకు ఎలాంటి సంతోషం ఉండదు' అని మిశ్రా వివరించారు. -
6 నెలల్లో 80 మందిని ఏరేశాం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో 115 మంది ఉగ్రవాదులు రహస్యంగా దాక్కున్నారని ఆర్మీ మేజర్ జనరల్ బీఎస్ రాజు తెలిపారు. పుల్వామా ఎన్‌కౌంటర్‌పై స్పందించిన ఆయన ఉగ్రవాదులను ఏరేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దక్షిణ కశ్మీర్లో మొత్తం 115 మంది ఉగ్రవాదులు ఉన్నారని.. అందులో 99 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌నుంచి ఉగ్రవాదులు దేశంలోరి చొరబడుతున్నారని రాజు తెలిపారు. గత ఆరు నెలల్లో ఇలా చొరబడ్డ, స్థానిక ఉగ్రవాదులతో కలిపి మొత్తం 80 మందిని భద్రతాదళాలు ఏరేశాయని ఆయన తెలిపారు. లోయలోని యువత ఎవరూ పొరపాటున కూడా ఉగ్రవాదులతో కలవద్దని చెప్పారు. 115 terrorists prsnt in S Kashmir,99 local terrorists&15 foreign terrorists; 80 terrorists killed in last 6 mnths: BS Raju,GOC Victor Force pic.twitter.com/AaTPFEvKHY — ANI (@ANI) November 3, 2017 -
ఆ కుటుంబాలను లక్ష్యంగా చేసుకోకండి
సాక్షి, శ్రీనగర్ : ఉగ్రవాదుల ఇళ్లను, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవద్దని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భద్రతాదళాలను ఆదేశించారు. పీడీపీ మాజీ సర్పంచ్‌ను మిలిటెంట్లు మత్య చేయడంతో.. భద్రతా బలగాలు దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సీఎం మెహబూబాబ ముఫ్తీ.. మానిగామ్ పోలిస్ ట్రైనింగ్ స్కూల్ పాసింగ్ పెరేడ్లో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. ఉగ్రవాదులు.. భద్రతా బలగాలను చంపి.. వారి ఇళ్లను తగలబెట్టిన ఘటనలు ఈ మధ్య అక్కడక్కడా జరిగాయి. ఇదే విధంగా భద్రతా బలగాలు సైతం.. వ్యవహరిస్తే.. మనకు వారికి తేడా ఏముంటుంది అని అన్నారు. గత వారం షోపియాన్ ప్రాంతంలోని ఉగ్రవాదుల ఇళ్లలో భద్రతా బలగాలు సోదాలు జరిపాయి. సోదాల అనంతరం కొందరు ఉగ్రవాదులు.. అధికార పీడీపీ, ప్రతిపక్ష నేషనల్ కాన్ఫెరెన్స్ నేతలను బెదిరించినట్లుతెలిసింది. ఇటువంటివ ఇమరోసారి జరిగితే.. మా టార్గెట్ మీరు అవుతారని ఉగ్రవాదులు.. నేతలను హెచ్చరించినట్లు తెలిసింది. -
160 మంది ఉగ్రవాదులను ఏరేశాం
సాక్షి, శ్రీనగర్ : ఈ ఏడాది ఇప్పటివరకూ 160 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు జమ్మూ కశ్మీర్ డీజీపీ శీష్‌పాల్ ప్రకటించారు. కశ్మీర్ నిరుద్యోగ యువత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఉగ్రవాద సంస్థలు నిరుద్యోగ యువతపై తీవ్ర ప్రభావం చూపుతూ.. వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. అక్రమ చొరబాట్లు, పెట్రేగుతున్న ఉగ్రవాదులను అణిచి వేసే శక్తి పోలీసులు, భద్రతా బలగాలకు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే యువతకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపేలా రాజకీయ పార్టీలు చొరవ చూపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచించకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. రాళ్లు విసిరే ఆకతాయిలను స్వతంత్ర సమరయోధులగా పోల్చడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలో భారతదేశానికి అనుకూలంగా మాట్లాడగలిగితే.. ఇక్కడ పూర్తిస్థాయిలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. దక్షిణ కశ్మీర్లో ఈ ఏడాది 160 మంది ఉగ్రవాదులకు హతమార్చామని ఆయన చెప్పారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం కశ్మీర్, నియంత్రణ రేఖ వద్ద భద్రత బలగాలు శక్తివంతంగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఉత్తర కశ్మీర్లో 90 మంది వరకూ ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు సమాచారం ఉందని.. త్వరలోనే వారిని ఏరి పారేస్తామని చెప్పారు. -
ముగ్గురు ఉగ్రవాదులు హతం!
చొరబాటుయత్నాన్ని భగ్నం చేసిన భద్రతా దళాలు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటుయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. 'గురేజ్ సెక్టార్లో ఎల్వోసీ వద్ద గురువారం ఉదయం జరిగిన చొరబాటుయత్నాన్ని భగ్నం చేశాం. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు' అని ఆర్మీ తన అధికారిక ట్విట్టర్ పేజీలో వెల్లడించింది. అనంతరం మరో ఉగ్రవాది హతమైనట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఇక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో చొరబాటు యత్నాన్ని భగ్నం చేసి.. ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. -
ఉగ్రవాదుల కాల్పులు: పోలీసు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. పుల్వామా జిల్లాలో జరగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. -
అనంతనాగ్‌లో ఎన్కౌంటర్.. మహిళ మృతి
అనంతనాగ్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు బలగాలకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. అనంతనాగ్ జిల్లాలోని కొన్ని నివాసాల్లో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం అందడంతో శనివారం ఉదయం పోలీసులు, బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించగా ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే కాల్పులు జరుగుతునే ఉన్నాయి. ఓ ఇంట్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని, అందులోని కుటుంబ సభ్యులను వారు బందించారని చెబుతున్నారు. కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. కొంతమంది మాత్రం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ టాప్ లీడర్ అందులో ఉన్నట్లు చెబుతున్నారు. -
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్పోక్పి జిల్లాలో కేఎన్‌ఎఫ్(కూకి నేషనల్ ఫ్రంట్), ఆర్పీఎఫ్(రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్) సంస్థలకు చెందిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన కేఎన్‌ఎఫ్ ఉగ్రవాది లెట్కొసెన్.. మే 5న జరిగిన ఇద్దరు కూకి రెవల్యూషనరీ ఆర్మీ(కేఆర్ఏ) మిలిటెంట్ల హత్యలో నిందితుడుగా ఉన్నాడని డీజీపీ ఎల్ఎం ఖౌతే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అతడి వద్ద ఓ పిస్టల్‌తో పాటు ఆరు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొయ్జామ్ వర్జిత్ అనే ఆర్పీఎఫ్ ఉగ్రవాదిని జూన్ 8వ తేదీన అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. -
ఏడుగురు ఉగ్రవాదులు హతం.. జవాను మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక జవాను వీరమరణం పొందగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా, బందిపోరా, కుప్వారా జిల్లాలో గత రెండు రోజులుగా ఈ ఎన్కౌంటర్ జరుగుతోంది. పలువురు ఉగ్రవాదులను భారత సైనికులపై దాడులు చేసేందుకు నియంత్రణ రేఖ వెంబడి ఉండే పాక్ బలగాలు కుట్రలు చేస్తున్నాయని, వాటిని తాము సమర్థంగా విఫలం చేశామని ఉదంపూర్ కు చెందిన కల్నల్ అధికారి ఎన్ఎన్ జోషి చెప్పారు. -
ఆర్మీ అధికారి కిడ్నాప్.. హత్య
► జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్ల ఘాతుకం ► పిరికిపంద చర్య: జైట్లీ శ్రీనగర్: సెలవులో ఉన్న ఓ యువ ఆర్మీ అధికారిని అపహరించిన మిలిటెంట్లు.. ఆపై అత్యంత దారుణంగా హతమార్చారు. షోపియాన్ జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరైన రాజ్‌పుటానా రైఫిల్స్ అధికారిని కిడ్నాప్ చేసిన మిలిటెంట్లు.. అతనిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. కుల్గామ్ జిల్లా సుర్సోనా గ్రామానికి చెందిన లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్(22).. బాతాపురాలో బంధువుల వివాహానికి హాజరయ్యాడు. మంగళవారం రాత్రి పది గంటలకు ముగ్గురు మిలిటెంట్లు పెళ్లి జరుగుతున్న ఇంట్లోకి చొరబడి ఉమర్‌ను అపహరించారు. మిలిటెంట్ల హెచ్చరికలతో ఉమర్ కుటుంబ సభ్యులు కిడ్నాప్ గురించి పోలీసులకుగానీ, ఆర్మీకి గానీ సమాచారం ఇవ్వలేదు. అయితే బుధవారం ఉదయం ఉమర్ నివాసానికి సమీపంలో హర్మాన గ్రామంలో బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఉమర్ మృతదేహాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అతని మృతదేహంపై ఉన్న గాయాలను చూస్తే మిలిటెంట్లను ఉమర్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటించినట్టు తెలుస్తోందని చెప్పారు. అత్యంత సమీపం నుంచి అతనిపై కాల్పులకు తెగబడ్డారని, తల, పొట్ట, ఛాతీ భాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని వివరించారు. సైనిక లాంఛనాలతో ఉమర్ అంత్యక్రియలను పూర్తి చేశారు. సెలవు పెట్టి పెళ్లికి వచ్చిన ఉమర్ ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హెచ్చరించి విడిచిపెడతారని భావించే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కానీ ఇంత ఘోరం జరుగుతుందని భావించలేదని చెప్పారు. ఆయన రోల్ మోడల్: జైట్లీ ఫయాజ్ హత్యను రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ యువ అధికారి ఒక రోల్ మోడల్ అని కొనియాడారు. గత డిసెంబర్లో ఉమర్ ఆర్మీలో చేరాడని, బంధువుల పెళ్లి కోసం మొదటిసారిగా సెలవుపెట్టి వెళ్లాడని ఉన్నతాధికారులు చెప్పారు. హత్యను సీఎం మెహ బూబా, రాహుల్ గాంధీ ఖండించారు. -
పోలీసుల తుపాకులు లాక్కెళ్లిన ఉగ్రవాదులు
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదులు తెగబడ్డారు. ఏకంగా కోర్టు ప్రాంగణంలోకి చొరబడి కాపలాగా ఉన్న పోలీసుల వద్ద నుంచి తుపాకులు ఎత్తుకెళ్లారు. మొత్తం ఆరు రైఫిల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ఆదమరిచి ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇప్పటికే కశ్మీర్లో ఉగ్రవాదుల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజా ఘటన ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా కోర్టు ప్రాంగణంలో కొంతమంది పోలీసులు గస్తీ కాస్తున్నారు. వారు విధులు ముగియడంతో తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అనూహ్యంలో లోపలికి ప్రవేశించిన మిలిటెంట్లు వారి వద్ద నుంచి తుపాకులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. అంతకుముందు కుల్గాం జిల్లాలో కూడా ఇలాంటి దాడి చేసి నాలుగు తుపాకులు ఎత్తుకెళ్లారు. ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. హద్దు మీరిన పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి తుంగలోకి తొక్కి ఫైరింగ్ చేసింది. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
పాకిస్తాన్ పైశాచికం
-
పాకిస్తాన్ పైశాచికం
పూంచ్ సెక్టార్లో ఇద్దరు భారత జవాన్ల తలలు నరికివేత ► 250 మీటర్లు చొచ్చుకొచ్చి మరీ దాడికి పాల్పడ్డ పాక్ బీఏటీ బృందం ► మోర్టార్లు, తుపాకులతో భారత పోస్టులపై ఆదివారం రాత్రినుంచీ దాడులు జమ్మూ/న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన పైశాచికత్వాన్ని చాటుకుంది . పదేపదే కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ కవ్విస్తున్న పాక్.. ఈ సారి మరీ బరితెగించింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి మరీ.. పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు భారత జవాన్లపై దాడి చేసి అత్యంత క్రూరంగా వారి తలలు నరికేసింది. ఉగ్రవాదుల సాయంతో సరిహద్దుల్లో భారత సైన్యంపై దాడులకు తెగబడుతున్న పొరుగుదేశం.. ఈసారి ఏకంగా ఆర్మీనే రంగంలోకి దించి దొంగదెబ్బ కొట్టింది. పాక్ సైన్యం ఓవైపు సరిహద్దు వెంబడి భారత పోస్టులపై మోర్టార్లతో దాడికి తెగబడగా.. పాక్ సరిహద్దు భద్రతా దళం (బీఏటీ) బృందం 250 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఆదివారం రాత్రి నుంచి యథేచ్చగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్‌ను కవ్వించిన పాక్.. సోమవారం ఉదయం జవాన్లను కిరాతకంగా చంపేసింది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత జవాన్ల తలలు నరికిన పాక్ ఆర్మీ చర్య అనాగరికమని భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. పాకిస్తాన్‌కు దీటైన సమాధానం ఇవ్వక తప్పదన్నారు. కాగా పాక్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలిసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా పర్యటించి.. కశ్మీర్ ఆందోళనలకు తమ మద్దతుంటుందని ప్రకటించిన మరునాడే ఈ దాడులు జరగటం గమనార్హం. దాడెలా జరిగింది? పాకిస్తాన్ ఆర్మీలోని ప్రత్యేక బలగాలతో రూపొందించిందే సరిహద్దు కార్యాచరణ దళం (బీఏటీ). పూంచ్ సెక్టార్లో సోమవారం ఉదయం ఇద్దరు భారత జవాన్ల తలలను తెగనరికింది ఈ బీఏటీ బృందమే. పాక్ ఆర్మీ చీఫ్ పర్యటన తర్వాత పాకిస్తాన్ వ్యూహాత్మకంగా భారత్‌పై దాడికి వ్యూహరచన చేసింది. ముందుగా వేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటీ సెక్టార్‌లోని రెండు భారత ఫార్వర్డ్ డిఫెన్స్ కేంద్రాల (కిర్పాణ్, పింపుల్ పోస్టులు)పై ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో రాకెట్లు, మోర్టార్లతో దాడిచేశాయి. భారత్ దీన్ని ప్రతిఘటించే ప్రయత్నాల్లో ఉండగానే.. బీఏటీ సభ్యులు సరిహద్దు దాటి భారత భూభాగంలోకి 250మీటర్లు చొచ్చుకొచ్చారు. పాక్ దాడినుంచి తట్టుకునేందుకు పోస్టులో ఉన్న భారత జవాన్లు బయటకు రాగానే వారిని అంతం చేయాలనేది బీఏటీ యోచన. కనీసం 7–8 మంది జవాన్లను మట్టుబెట్టాలనే వ్యూహంతో చాలా సేపటినుంచే బీఏటీ సభ్యులు మాటువేశారని భారత ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ ఆర్మీ దాడులకు భారత పోస్టులు ప్రతిఘటిస్తూనే మధ్య మధ్యలో విరామమిచ్చాయి. ఈ సమయంలో పోస్టులకు సహాయంగా రావాలంటూ పెట్రోలింగ్ పార్టీలకు సమాచారం అందటంతో.. సమీపంలోని పెట్రోలింగ్ బలగాలు ఈ పోస్టులవైపు బయలుదేరాయి. ఈ క్రమంలో ఇద్దరు (ఓ జవాన్, మరో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్) మాత్రం వెనకబడిపోయారు. దీంతో వీరిద్దరినీ కాల్చి చంపిన పాక్ బలగాలు ఆ తర్వాత శిరచ్ఛేదనానికి పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. మృతిచెందిన వారిని 22వ సిఖ్ ఇన్ఫాంట్రీకి చెందిన నాయిబ్ సుబేదార్ పరమ్‌జీత్ సింగ్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ (200వ బెటాలియన్)గా గుర్తించినట్లు తెలిపారు. కాల్పుల్లో గాయపడ్డ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రాజిందర్ సింగ్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో శ్రీనగర్‌కు వచ్చిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇలా జరిగి ఉండొచ్చేమో!: పాకిస్తాన్ బీఏటీ బృందం పన్నిన ఉచ్చులో చిక్కుకునే ఇద్దరు భారతీయ జవాన్లు చనిపోయి ఉండొచ్చనే ఆర్మీ అధికార వర్గాలు భావిస్తున్నాయి. భారత భూభాగంలో సరిహద్దు వెంబడి పాక్ బలగాలు మందుపాతరలు అమర్చి ఉండొచ్చని ఇటీవలే ఇంటెలిజెన్స్ సమాచారమిచ్చింది. అయితే ఈ మందుపాతరలను కనిపెట్టేందుకు ఆర్మీ, బీఎస్ఎఫ్ సంయుక్త బృందం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలోనే ఔట్ పోస్టులపై పాక్ కవ్వింపు చర్యకు సమాధానమిచ్చే ప్రయత్నంలో భాగంగా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి వేచి చూస్తున్న పాక్ బీఏటీ బృందం వలలో వీరిద్దరూ చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. భారత్ తీవ్రంగా ప్రతిస్పందించిన నేపథ్యంలో పాక్ ఆర్మీ స్పందిస్తూ.. ‘నియంత్రణ రేఖ వెంబడి మేం ఎలాంటి దాడులు చేయలేదు. భారత్ పేర్కొన్నట్లుగా భారత సైనికుల శిరచ్ఛేదం అవాస్తవమని ఓ ప్రకటనలో తెలిపింది. వారి భాషలోనే బదులివ్వాలి: పాక్ తీరును భారతీయ రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. పాకిస్తాన్‌కు అర్థమయ్యే భాషలోనే సమాధానమివ్వాలని బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ అన్నారు. ఇలాంటి ఘటనల ద్వారా పాకిస్తాన్ తన నాశనాన్ని తనే కోరుకుంటోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. ప్రభుత్వం మొద్దునిద్రలోంచి మేల్కొనాలని కాంగ్రెస్ సూచించింది. ‘ప్రధాని 56 అంగుళాల ఛాతీ ఎక్కడికెళ్లింది?’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. పాకిస్తాన్ తీరును ఖండించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ.. దౌత్యపరంగా పాక్‌తో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేలా విపక్షాలతో కేంద్రం సంప్రదింపులు జరపాలన్నారు. పాక్‌కు దీటైన సమాధానం ఇస్తాం ఇద్దరు భారత సైనికుల తలలు నరకటంపై రక్షణ మంత్రి జైట్లీ తీవ్రంగా స్పందించారు. ‘పాక్ ఆర్మీ చర్య అమానవీయం, అనాగరికం. యుద్ధం జరుగుతన్న సమయంలోనూ ఇంత క్రూరంగా వ్యవహరించరు. దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. యావద్భారతానికి మన సాయుధ బలగాలపై పూర్తి నమ్మకముంది. దీనికి దీటైన సమాధానం ఇవ్వక తప్పదు. జవాన్ల త్యాగం వృధాకాదు’ అని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు సరైన సమాధానం ఇచ్చేందుకు భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘పాకిస్తాన్ ఆదివారం రాత్రి నుంచీ నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లతో దాడి ద్వారా కవ్వింపు చర్యలకు దిగింది. ఇదే సమయంలో బీఏటీ బృందం భారత పెట్రోలింగ్ బలగాలపై మెరుపుదాడి చేసింది. అత్యంత క్రూరంగా ఇద్దరు భారతీయ జవాన్ల తలలను తెగనరికింది. పాక్ చేసిన ఈ అమానవీయ ఘటనకు ఆర్మీ దీటైన సమాధానం ఇస్తుంది’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆరు నెలల్లో మూడో ఘటన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దురాగతాలకు అంతే లేకుండా పోతోంది. గత ఆరునెలలో జవాన్ల తలలు నరకటం ఇది మూడోసారి. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇలాంటి రెండు ఘటనలు జరిగాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు ఘటనలు మచిల్ సెక్టార్లోనే జరిగాయి. కార్గిల్ యుద్ధ సమయం నుంచి అడపాదడపా పాక్ ఇలాంటి క్రూరమైన చర్యలకు ఒడిగడుతోంది. అక్టోబర్, నవంబర్ 2016: నియంత్రణ రేఖ వెంబడి మచిల్ సెక్టార్‌పై దాడికి పాల్పడిన పాక్ సైనికులు ఇద్దరు భారత జవాన్లను చంపి వీరి తల నరికారు. జనవరి 2013: లాన్స్‌నాయక్ హేమ్రాజ్, లాన్స్‌నాయక్ సుధాకర్ సింగ్‌లను చంపి తలలు నరికేశారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రాజిందర్ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జూన్ 2008: కేల్ సెక్టార్లో దారితప్పిన ఓ గోర్ఖా రైఫిల్స్ జవాన్‌ను బీఏటీ బృందం బందీగా పట్టుకుంది. కొంతకాలానికి ఆ జవాను శవం తలలేకుండా లభ్యమైంది. ఫిబ్రవరి 2000: పాక్ ప్రేరేపిత ఉగ్రవాది ఇలియాస్ కశ్మీరీ భారత ఔట్‌పోస్టుపై మెరుపుదాడికి పాల్పడి ఏడుగురు భారత జవాన్లను క్రూరంగా చంపేశాడు. అంతే కాకుండా 17 మరాఠా ఇన్ఫాంట్రీకి చెందని భావుసాహెబ్ మారుతి తాలేకర్ అనే 24 ఏళ్ల జవాను తలను నరికి పాకిస్తాన్ తీసుకెళ్లాడు. 1999 కార్గిల్ యుద్ధం: కెప్టెన్ సౌరభ్ కాలియాను పట్టుకుని చిత్రహింసలు పెట్టిన పాకిస్తాన్ ఆర్మీ అనంతరం తలనరికి భారత్‌కు మృతదేహాన్ని అప్పగించింది. -
ఉగ్రవాదుల బరితెగింపు..
- కొత్త నోట్ల కోసం బ్యాంకు దోపిడీ యత్నం అనంతనాగ్: పాత నోట్ల రద్దు..ఉగ్రవాద,తీవ్రవాద కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించిందన్న మాట నిజమని మరోసారి రుజువైంది. తమ కార్యక్రమాల విస్తరణ కోసం కొత్త నోట్లు అవసరమైన ఉగ్ర సంస్థలు ఏకంగా బ్యాంకులనే టార్గెట్ చేసుకున్నాయి. శుక్రవారం కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకున్న దోపిడీ యత్నం ఉగ్రవాదుల బరితెగింపును వెలుగులోకి తెచ్చేదిలా ఉంది. నోట్ల రద్దు తర్వాత కశ్మీర్ లోని బ్యాంకులపై జరిగిన ఐదో దాడి ఇది. అనంత్ నాగ్ జిల్లా కేంద్రంలోని ఒక బ్యాంకును కొట్టగొట్టేందుకు సాయుధ ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో ముష్కరులు తోకముడవక తప్పలేదు. బ్యాంకులోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకడిని చెరపట్టగా, మరొకడు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పలుమార్లు తుపాకి పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దోపిడీ యత్నం చేసిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనేది తెలియాల్సిఉంది. కాగా, జనవరిలో ఇదే అనంత్ నాగ్ పట్టణంలో దుండగులు ఎటీఎంను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ బ్యాంక్ కు చెందిన ఆ ఏటీఎంలో రూ.14 లక్షలు ఉన్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇలాంటివే మరో రెండు ఘటనలూ చోటుచేసుకున్దేనాయి. ఆ కేసుల దర్యాప్తు జరుగుతుండగానే నేడు మరో దోపిడీ ఘటన చోటుచేసుకోవడం కశ్మీర్ లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతాప్రమాణాలపై అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయి. -
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు.
-
అమెరికా దాడుల్లో 7,631 మంది హతం
కైరో: అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మూడేళ్ల క్రితం ఐసిస్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సిరియాలో 7,631 మంది ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్‌కు చెందిన ఒక సంస్థ తెలిపింది. లండన్ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల పరిశీలన సంస్థ (ఎస్ఓహెచ్ఆర్) ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మృతుల్లో 1,256 మంది పౌరులు కాగా, వీరిలో 275 మంది మైనర్లు, 184 మంది మహిళలు ఉన్నారు. అమెరికా సంకీర్ణ దళాలు 2014 సెప్టెంబరులో దాడులు మొదటినప్పటి నుంచి 5,961 మంది ఐసిస్ సభ్యులు హతమయ్యారు. వీరిలో ఎక్కువ మంది విదేశీయులే! అల్ కాయిదాకు గతంలో అనుబంధంగా పనిచేసిన సభాత్ ఫతే అల్–షమ్‌ను కూడా సంకీర్ణ దళాలు వదిలిపెట్టడం లేదు. ఈ సంస్థకు చెందిన 141 మందిని అమెరికా దళాలలు చంపేశాయి. జైష్ అల్–సున్నా వంటి ఇతర చిన్నాచితక ఉగ్రవాద సంస్థల సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. -
400 మంది ఉగ్రవాదుల లొంగుబాటు!
ఇస్లామాబాద్: సుమారు 400 మంది ఉగ్రవాదులు తమ ఆయుధాలను వదిలేసి జనజీవనస్రవంతిలో కలిసిపోయారు. పాక్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని నగరం క్వెట్టాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఆయుధాలను వదిలేసి లొంగిపోయిన నేపథ్యంలో బలూచిస్తాన్ అసెంబ్లీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి నవాబ్ సనావుల్లా జెహ్రీ, సినియర్ ఆర్మీ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెహ్రీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను జనజీవన స్రవంతిలో కలపడానికి అవసరమైన అన్నిచర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అమాయక ప్రజలను చంపడానికి ఉగ్రవాదులు బలూచ్ ప్రావిన్స్‌లోని అమాయక ప్రజలను ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. లొంగిపోయిన ఉగ్రవాదుల్లో బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీతో పాటు పలు సంస్థలకు చెందిన వారు ఉన్నారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. -
33 మంది యువకులను హతమార్చిన ఐసిస్
సిరియా: తూర్పు సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 33 మంది యువకులను అతి కిరాతకంగా చంపారు. ఐఎస్ ఉగ్రవాదులు బుధవారం దీర్-ఎల్-జౌర్ ప్రావిన్స్‌లోని మయాదీన్ పట్టణంలో యువకుల గొంతు కోసి ఘోరంగా హతమార్చినట్లు బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. హత్యకు గురైన వారు సిరియన్ భద్రతా బలగాలకు చెందిన వారా లేక రెబల్ గ్రూపునకు చెందిన వారా అనేది స్పష్టంగా తెలియలేదని పేర్కొంది. ఐఎస్ ఉగ్రవాదులు ఇలాంటి హత్యలను గత సంవత్సర కాలముగా పాల్పడుతున్నారని యూరప్‌లో నివసిస్తోన్న ఓ సిరియన్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో కిరాతకంగా తలలు నరకడం, బ్రతికి ఉన్న వారిని నీళ్లలో ముంచి సజీవంగా చంపేయడం.. వాటిని ఫోటోలు,విడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం వంటి చర్యలు ఐఎస్ ఉగ్రవాదుల పనేనన్న విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే ఎస్కార్ట్‌పై ఉగ్ర కాల్పులు
శ్రీనగర్: జుమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం అనంతనాగ్ నుంచి షోపైన్కు వెళ్తున్న ఎమ్మెల్యే మహ్మద్ యూసఫ్‌కు ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేది బుల్లెట్ ఫ్రూఫ్ కారు కావడంతో ఎమ్మెల్యేకు ఏమి కాలేదని పోలీసులు తెలిపారు. అయితే వాహనాలు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయి. -
'కుటుంబాలు మీకూ ఉన్నాయ్.. జాగ్రత్త'
శ్రీనగర్: పోలీసుల కుటుంబాలపై టెర్రరిస్టులు దాడులు చేయడంపై జమ్మూకశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వేడ్ మిలిటెంట్లకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల ఇళ్లపై దోపిడీలకు దిగి బెదిరింపులకు పాల్పడే వారికి కూడా కుటుంబాలు ఉన్నాయనే సంగతి గుర్తించుకుని ప్రవర్తిస్తే మంచిదని అన్నారు. అనవసరంగా కుటుంబాలను సమస్యల్లోకి లాగొద్దని చెప్పారు. పోలీసుల కుటుంబాలను వేధిస్తే.. అదే తరహాలో తాము కూడా ఉగ్రవాదుల కుటుంబాలను వేధిస్తామని అన్నారు. మంగళవారం ఓ పోలీసు ఇంట్లో చొరబడిన ఉగ్రవాదులు సొత్తు దోచుకుని వెళ్తూ ఉద్యోగం మాన్పించాలని అతని కుటుంబసభ్యులను బెదిరించారు. గత శనివారం షోపియన్‌లో జరిగిన మరో సంఘటనలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటిపై దాడి చేసిన పది మంది మిలిటెంట్లు ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసి ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించారు. ఘటనలను సీరియస్‌గా తీసుకున్న డీజీపీ వేడ్ టెర్రరిస్టులకు హెచ్చరికలు చేశారు. -
నలుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
మేజర్‌సహా నలుగురు సైనికులు మృతి శ్రీనగర్: కశ్మీర్లో మంగళవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు, నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. అమరులైన ఆర్మీ సిబ్బందిలో ఒక మేజర్ కూడా ఉన్నారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో సైనికులు బందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని సైనికులు తమ అధీనంలోకి తీసుకుంటుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 10 మంది సైనికులు గాయపడగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఇక్కడే ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు. మరో ఎన్ కౌంటర్ కుప్వారా జిల్లాలోని క్రల్గండ్ ప్రాంతంలో జరిగింది. ఒక ఇంటిలో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి మేజర్ ఎస్ దహియా మరణించారు. సరిహద్దులో సొరంగం జమ్మూ: భారత్–పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు తవ్వుకున్న సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) సిబ్బంది గుర్తించారు. జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లా సరిహద్దులో ఉగ్రవాదులు ఈ సొరంగం తవ్వారు. కంచె నుంచి సొరంగం భారత భూభాగంలో 20 మీటర్ల వరకూ విస్తరించి ఉందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. -
ఇంట్లో నక్కిన ముగ్గురు తీవ్రవాదులు
జమ్ము కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో అవూరా గ్రామంలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య హోరా హోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఓ ఇంట్లో ముగ్గురు తీవ్రవాదులు నక్కినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకల్లో ఉగ్రవాద దాడులకు దిగొచ్చనే అంచనాల నేపథ్యంలో భద్రతా అధికారులు దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ జారీచేశారు. విమానాశ్రయాల ద్వారా ఉగ్రవాదులు దేశంలోచొరబడి దాడులు నిర్వహించే ప్రమాదం ఉందనీ, అప్రమత్తంగా ఉండాలంటూ నిఘా సంస్థలు ముందస్తు హెచ్చరికలు చేశాయి. ప్రధానంగా మిలిటెంట్స్ యూనిఫామ్ లో సంచరిస్తూ భద్రతా సిబ్బందిని మభ్యపెట్టి తప్పించుకునే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని భద్రతా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలలో భద్రతకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలంటూసివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (బీసీఎఎస్) డిసెంబర్ 28 న అలర్ట్ జారీ చేసింది. అలాగే దేశంలో విమానాశ్రయాలభద్రతను పరిశీలించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) కూడా హెచ్చరికలు జారీ చేసింది. యూని ఫాంలో ఉన్న అనుమానితులను, పాస్ ఉన్నా కూడా జాగ్రత్తగా తనిఖీ చేయాలని ఆదేశించింది. సాధారణంగా పోలీసు లేదా సైనిక దుస్తుల్లో ఉన్నవారి పట్ల భద్రతా సిబ్బంది సాఫ్ట్ గా ఉంటారనీ...కానీ పూర్తి తనిఖీలు నిర్వహించాలంటూ అప్రమత్తం చేశారు. అలాగే, పారామిలిటరీ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రయాణికుల ప్రొఫైల్ ను గుర్తించడంలో శిక్షణ పొందిన "స్వీపింగ్ స్క్వాడ్" ఏర్పాటు చేసినట్టు సమాచారం. -
కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాదుల వేట
-
ఆర్మీ కార్యాలయంపై ఉగ్రవాదుల కాల్పులు
-
ఆర్మీ కార్యాలయంపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్: జమ్మూ కశ్మీర్ యురీ సెక్టార్‌లోని ఆర్మీకార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నలుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు సమాచారం. భద్రతా బలగాలే లక్ష్యంగా యురీ సెక్టార్‌లోని ఆర్మీకార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. ఉగ్రదాడిలో 17మంది జవానులు మృతిచెందగా, 20 మందికి గాయాలయ్యాయి. భీకరంగా సాగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ♦ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా, అమెరికాపర్యటనలను వాయిదా వేసుకొని సంబంధిత ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ♦ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లోకి హెలీకాప్టర్ల ద్వారా ఆర్మీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ♦ గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
43 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతం
కాబూల్: ఆఫ్గనిస్తాన్ భద్రతా బలగాలు 'థండర్ 14' పేరుతో చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో 43 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. కుందుజ్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ ఉగ్రవాదులపై చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలకు ఎయిర్ ఫోర్స్ సహకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో 15 మంది ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. తాలిబాన్ ఉగ్రవాదులు శనివారం ఖాన్ అబాద్ జిల్లాను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. కుందుజ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మక జిల్లాను భద్రతా బలగాలు వెంటనే తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయని మీడియా సంస్థ 'జిన్హువా' తెలిపింది. ఈ ఆపరేషన్‌లో తాలిబాన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హుస్సేన్ సైతం మృతి చెందినట్లు వెల్లడించింది. కుందుజ్ ప్రాంతంలో పట్టుకోసం తాలిబాన్లు ప్రయత్నిస్తుండటంతో గత రెండు మాసాల నుంచి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
చర్లపల్లి జైలుకు ఉగ్రవాదులు
కుషాయిగూడ: నగరంలో పట్టుబడ్డ ఉగ్రవాదులను గురువారం రాత్రి చర్లపల్లి జైల్‌కు తీసుకువచ్చారు. వారిలో అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమోదీ, మహ్మద్ ఇబ్రహిం యజ్దాని, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇలియాస్ యజ్దాని, ముజాఫర్ హుస్సేన్ రిజ్వాన్ అనే ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు జైల్ పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా వారికి కేటాయించిన ఖైదీ నెంబర్లు, బ్యారక్ల వివరాలను చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. -
ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. కొన్ని గంటల వ్యవధిలోని వేర్వేరు ప్రాంతాలలో మిలిటెంట్లు కాల్పులకు పాల్పడి ఒక ఉన్నతా అధికారి సహా ఇద్దరు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. అనంత్ నాగ్ జిల్లాలో శనివారం ఉదయం పోలీస్ పార్టీపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే జనరల్ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా మిలిటెంట్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్‌గా గుర్తించారు. కాగా 24 గంటల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఇది రెండోసారి. శుక్రవారం సాయంత్రం బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో తొమ్మిదిమంది గాయపడిన విషయం తెలిసిందే. మరోవైపు అనంత్ నాగ్ జిల్లాలో జూన్ 22న ఉప ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా మఫ్తీ తండ్రి మఫ్తీ మహ్మద్ సయిద్ అనారోగ్యంతో ఈ ఏడాది జనవరిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. -
అధీన రేఖవద్ద హైఅలర్ట్, తీవ్రవాదులకోసం జల్లెడ!
జమ్మూః శ్రీనగర్ సిటీలో సోమవారం ఉదయం జరిగిన ఉగ్రదాడి తమ పనేనంటూ తీవ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిదీన్ ప్రకటించడంతో వారికోసం సైన్యం జల్లెడ పడుతోంది. జడిబల్ పోలీసు స్టేషన్ పై ఉదయం జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందడంతో సైన్యం అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. మెహబూబా ముఫ్తి సారధ్యంలోని పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వేర్పాటువాద గెరిల్లా దాడి జరిగింది. పాకిస్తాన్ మద్దతుతో అక్కడే శిక్షణ పొందిన ఉగ్రవాదులు సరిహద్దులగుండా భారత్ లోకి చొరబడేందుకు చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో సైన్యం నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది. భారీగా సాయుధ తీవ్రవాదులు జడిబల్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మరణించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఏఎస్ఐ అహ్మద్, కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ లు దాడిలో అక్కడికక్కడే మరణించగా.. మరో పోలీసు తీవ్రంగా గాయపడి, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. అయితే ఇటువంటి ఉగ్రదాడులపై ఆర్మీ, పోలీసులు, ఇతర ఏజెన్సీలు దృష్టి సారించాయని టెర్రరిస్టులను ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టేది లేదని జీవోసీ అధికారి సతీష్ దువా తెలిపారు. ఇటువంటి దాడులను ఎదుర్కొనేందుకు ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిద్ధంగా ఉన్నాయన్నారు. -
ఎన్కౌంటర్లో జవాను మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాను మృతి చెందాడు. కుప్వారా జిల్లా అటవీ ప్రాంతంలో మిలిటెంట్లకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల ఘటనలో ఓం వీర్ సింగ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మిలిటెంట్లు దాగి ఉన్నట్లు సమాచారంతో భద్రతా దళాలు నిన్నటి నుంచి హంద్వారా ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిలిటెంట్లు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగటంతో ప్రతిగా జవాన్లు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది. -
అనారోగ్యం పేరుతో డ్యూటీకి డుమ్మా
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పరిస్థితి నానాటికీ బలహీనంగా మారుతోంది. తన అధీనంలోని భూభాగాల సరిహద్దుల్లో శత్రుదళాలతో పోరాడాల్సిన మిలిటెంట్లు అనారోగ్యం సాకుతో విధులను తప్పించుకుంటున్నారు. ఇందుకోసం ఫైటర్లు డాక్టర్ల దగ్గరి నుంచి ధ్రువపత్రాలు తెచ్చి అందజేస్తున్నారు. ఇది వరకే ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ లోపాలతో ఇబ్బందిపడుతున్న ఐఎస్‌కు ఈ పరిణామం మింగుడుపడటం లేదు. ఐఎస్ కోశాగారాలు, చమురు నిల్వల కేంద్రాలపై అమెరికా తరచూ దాడులు చేస్తుండడంతో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఫలితంగా ఫైటర్ల జీతాలను సగానికి తగ్గించింది. దీంతో చాలా మంది సంస్థను వీడేందుకు సాకులు వెతుకుంటున్నారని అమెరికా సైనికవర్గాలు తెలిపాయి. -
ఉగ్రవాదుల సమావేశంపై వైమానిక దాడి
కాబూల్: తమ వైమానిక దళం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను గట్టి దెబ్బకొట్టిందని అఫ్ఘనిస్థాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రహస్యంగా సమావేశం నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై దాడులు జరిపి దాదాపు 40 మందిని హతం చేశామని వెల్లడించింది. రక్షణ శాఖ అధికార ప్రతినిధి జనరల్ దాలత్ వజిరి ఈ వివరాలు తెలియజేస్తూ గురువారం రాత్రి అచిన్ జిల్లాలోని పిఖా లాతాబాండ్ లో ఉగ్రవాదులంతా సమావేశమై చర్చించుకుండగా తమ వైమానిక దళం నేర్పుగా దాడులు చేసిందని, ఈ దాడుల్లో 40మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువమంది విదేశాల నుంచి ఐసిస్ రిక్రూట్ చేసుకున్నవారే ఉన్నారని వెల్లడించారు. వీరిలో చాలామందిని స్థానికులు తీసుకొని వెళ్లారని, ఉగ్రవాద సంస్థకు మృతదేహాలను అప్పగించారని అన్నారు. -
భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్: దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య గురువారం తెల్లవారుజామున హోరా హోరిగా కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదుల హతమయ్యారని ఆర్మీ అధికారులు తెలిపారు. వీరు టెర్రరిస్టు గ్రూపు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన వారుగా గుర్తించారు. మరికొందరు టెర్రరిస్టులు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
భారత్‌కు మళ్ళీ టెర్రర్ ముప్పు?
దేశానికి మరోసారి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిఘావర్గాలకు అందిన సమాచారం నిజమైతే.. భారీ ఎత్తున దాడులు చేసేందుకు ఉగ్రవాదులు పక్కాగా ప్లాన్ చేశారు. పెద్దమొత్తంలో ఆయుధాలతో ఉగ్రవాదులు కశ్మీర్‌వైపు కదులుతున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందంది. వాళ్లు ప్రధానంగా అర్ధరాత్రి సమయంలోనే కదులుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడుల ముప్పు ఉందంటూ పంజాబ్ లోని చండీగఢ్ శాంతిభద్రతల డీజీపీ వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల నుంచి అందిన సమాచారంతో హై అలర్ట్ ప్రకటించారు. మందుగుండు సామగ్రితో కూడిన ఓ కారుతో పాటు ముగ్గురు పాకిస్తానీ తీవ్రవాదులు ఢిల్లీ, ముంబై, గోవాలే లక్ష్యంగా చొరబడే ప్రయత్నంలో ఉన్నట్లు ఏజెన్సీల నుంచి తమకు వార్తలు అదినట్లు అధికారులు చెబుతున్నారు. ఓ బూడిద రంగు స్విఫ్ట్ డిజైర్ కారులో (నెం.జెకె-01 ఏబీ-2654) ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులతో పాటు, ఓ కాశ్మీరీ కూడా ప్రయాణిస్తున్నట్లు తమకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల నుంచి సమాచారం అందిందని చండీగఢ్ శాంతిభద్రతల డీజీపీ తెలిపారు. దాడులకు కావలసిన ఆయుధాలతో పాటు, మందుగుండు సామగ్రిని కూడా ఉగ్రవాదులు తీసుకెళ్తున్నారని, వారి వద్ద బహుశా ఆత్మాహుతి బెల్ట్ కూడ ఉన్నట్లు పోలీసుల సమాచారం ప్రకారం తెలుస్తోందని ఆయనన్నారు. ఆయుధాలు, సామగ్రితో కూడిన ఆ ప్రత్యేక వాహనంలో పాక్ తీవ్రవాదులు బుధవారం రాత్రి తర్వాత బనిహాల్ టన్నెల్ దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని, మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని డీజీపీ వివరించారు. -
బలగాలకు మిలిటెంట్లకు మధ్య కాల్పులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి తుపాకుల చప్పుడు వినిపించింది. కుప్వారా జిల్లాలోని లాల్ పోరా ప్రాంతంలోగల షేక్ పురాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్‌కు సరిగ్గా 100 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదుల అలికిడి ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, సైనికులు కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. వారికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదురుపడి కాల్పులు జరపడంతో ప్రతిగా బలగాలు కాల్పులు జరిపాయి. అయితే, జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. -
70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు
మొగాదిషు: ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమాలియాలో 70 మంది ఉగ్రవాదులను ప్రభుత్వ బలగాలు మట్టుబెట్టాయి. మరో 30 మందిని బంధించాయి. సైనికాధికారులు సోమవారం ఈ విషయాన్ని ప్రకటించాయి. ఉత్తర సోమాలియాలోని నుగల్ ప్రాంతంలోని సుజ్ వ్యాలీలో ప్రభుత్వ బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకరమైన పోరు గత నాలుగు రోజులుగా జరుగుతుందని పుంట్లాండ్ మంత్రి తెలిపారు. 'మేం అల్ షహబ్ సంస్థకు చెందిన 70 మందిని హతమార్చాం. 30 మందిని అరెస్టు చేశాం. ఉగ్రవాదులపై ఇది సైన్యం సాధించిన విజయం అని ఆయన చెప్పారు. మొత్తం 500 మందిని చుట్టుముట్టామని త్వరలోనే మిగితావారి ఆటకట్టవుతుందని తెలిపారు. -
కాశ్మీర్లో ఎన్కౌంటర్ : తీవ్రవాదుల హతం
శ్రీనగర్ : కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రత దళాలు... గెరిల్లాల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు వేర్పాటు వాద తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. బీగ్ మోహల్లా ప్రాంతంలోని ఓ ఇంట్లో తీవ్రవాదలు దాక్కుని ఉన్నట్లు భద్రత దళాలకు సమాచారం అందింది. దీంతో సదరు ఇంటిని భద్రత దళాలు చుట్టుముట్టాయి. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఇరువైపులా భీకర పోరు జరిగింది. ఆ క్రమంలో భద్రత దళాలు కాల్పులో ఇద్దరు తీవ్రవాదులు మరణించారు. అయితే ఈ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. -
ఉగ్ర దాడుల్లో ఇద్దరు సైనికులు హతం
ఇస్లామాబాద్ః పాకిస్తాన్ లో మళ్ళీ ఉగ్రదాడులు బీభత్సం సృష్టించాయి. పాక్ భద్రతా దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించగా.. ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు పాకిస్తాన్ సైనికాధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ లోని చిలాస్ సమీప ఘయ్యాల్ గ్రామానికి దగ్గరలోని తారెల్ లోయలో ఉగ్రదాడులు భయోత్పాతాన్ని సృష్టించాయి. సైనిక శిబిరంపై దాడి చేసిన తీవ్ వాదులు... భద్రతా బలగాల్లోని ఇద్దరు సైనికులను కాల్చి చంపినట్లు సైనికాధికారులు వెల్లడించారు. అనంతరం ఇంటెలిజెన్స్ఆధారిత ఆపరేషన్ లో ముగ్గురు తీవ్రవాదులను విజయవంతంగా మట్టుబెట్టినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ తాజా ఘటనతో ఘయాల్ గ్రామాన్ని భద్రతాదళాలు చుట్టు ముట్టాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మరణించిన తీవ్రవాదులు స్థానిక పౌర రవాణా, పర్యాటకులు, భద్రతా దళాలే ధ్యేయంగా దాడులు నిర్వహించినట్లు భద్రతాధికారులు చెప్తున్నారు. ఉగ్రవాదుల వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ పాకిస్తాన్ నిషేధించిన లష్కర్-ఇ-ఝాంఘ్వి, తెహ్రీక్-తాలిబాన్-పాకిస్తాన్ బృందాలకు చెందిన తీవ్రవాదులుగా భావిస్తున్నారు. -
వైమానిక దాడులు : 10 మంది తీవ్రవాదులు మృతి
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ కుందుజ్ ప్రావిన్స్‌లో వైమానిక దళాలు నిర్వహించిన దాడుల్లో 10 మంది తాలిబన్ తీవ్రవాదులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రావిన్స్‌లోని ఖాన్ అబద్ జిల్లాలో శనివారం ఆర్థరాత్రి ఈ దాడులు వైమానిక దళం నిర్వహించిందని తెలిపారు. -
ఎన్కౌంటర్ : ఏడుగురు తీవ్రవాదుల హతం
లాహోర్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున పోలీసులకు తీవ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు తీవ్రవాద వ్యతిరేక విభాగానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లాహోర్ సమీపంలోని షారుఖ్పుర్ వద్ద 12 మంది తీవ్రవాదులను పోలీసులు గుర్తించారు. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు తీవ్రవాదులు మృతి చెందగా.... మరో ఐదుగురు తీవ్రవాదులు మాత్రం చీకట్లో పరారైయ్యారని చెప్పారు. మృతదేహాల వద్ద నుంచి 2 కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మృతి చెందిన తీవ్రవాదులంతా తెహ్రీక్- ఈ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) , లష్కర్ - ఈ- జంగ్వీ (ఎల్‌ఈజే) సంస్థలకు చెందినవారని పేర్కొన్నారు. చార్సద్దా పట్టణంలో యూనివర్సటి తీవవ్రాదులు దాడి చేశారు. ఈ దాడిలో 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. వారిలో విద్యార్థులే అధికంగా ఉన్నారని వెల్లడించారు. -
అక్కడ ఉగ్రవాదులు భూగర్భం చీల్చుకుంటూ..!
రామాది(ఇరాక్): రామాది.. ఇరాక్ లో ఇది కీలక నగరం. నిత్యం దాడులకు గురవుతూ మానని గాయాలతో మూలుగుతుంటుంది. ఈ నగరాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. మరోపక్క, ఈ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తి లేదని, ఉగ్రవాదులకు గుప్పెడు జాగ వదిలేది లేదని ఇరాక్ సేనలు చేస్తున్న పోరాటం కూడా తక్కువేం కాదు. ఇ వీరికి తోడుగా అమెరికాతో సహా ప్రపంచ దేశాల వైమానిక సేనలు వరుస బాంబులు కురిపిస్తూ చేస్తున్న సాహసం కూడా అంత ఈజీ ఏం కాదు. ఇలా, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 25శాతం రామాది ప్రాంతం ఉగ్రవాదుల చెరలోనే ఉంది. ప్రభుత్వ బలగాలు, విదేశీ సేనలు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఉగ్రవాదం నుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నా ఎందుకు ఆ ప్రాంతం ఇప్పటికీ విముక్తి కాలేకపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంపై ఆరా తీయగా పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఊపిరి అంతా కూడా రామాది భూగర్భంలో ఉందట. అంటే వారంతా అక్కడి భూగర్బంలో పెద్దపెద్ద బొరియలు, గుహలు ఏర్పాటుచేసుకోవడంతోపాటు పెద్ద మొత్తంలో బంకర్లను కూడా ఏర్పాటుచేసుకున్నారని బయటపడింది. వారు ఆక్రమణలకు దిగే సమయంలో తప్ప ఎప్పుడూ భద్రతా బలగాలు దాడికి వచ్చినా, వైమానిక దాడులు జరిగినా వెంటనే గుట్టుచప్పుడు కాకుండా ఈ కలుగుల్లోకి, బొరియల్లోకి, బంకర్లోకి చొరబడి తమ ప్రాణాలను రక్షించుకొని టార్గెట్ చేసేవారికి కొరకరాని కొయ్యగా తయారయ్యాయని తాజాగా వెలుగుచూసిన అంశాల ఆధారంగా తెలుస్తోంది. గిరిజనులతో నిండిన రామాది ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారని, వారంతా దాదాపు పది మీటర్ల దిగువున ఒకటి నుంచి రెండు మీటర్ల వెడల్పు మేర ఉండే సొరంగ మార్గాల్లో నక్కి ఉంటున్నారని తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా వైమానిక సేనకు కనిపించకుండా ఒక ఇంటిలో నుంచి మరో ఇంటిలోకి సొరంగ మార్గాలు ఏర్పాటుచేసుకొని వాటి ద్వారా కన్నుగప్పి తిరుగుతారని కూడా వెల్లడైంది. ఇలా భూగర్భం నుంచి పలు నివాసాలను అనుసంధానం చేసుకుంటూ దాదాపు కిలో మీటర్ దూరం పొడవునా సొరంగ మార్గాలు ఏర్పాటుచేసుకున్నట్లు తెలిసింది. మరికొన్ని సొరంగ మార్గాలు 700 నుంచి 800 మీటర్ల పొడవు కూడా ఉన్నాయని మరికొన్ని ఆధారాలు చెబుతున్నాయి. వీటిని ధ్వంసం చేస్తే తప్ప అక్కడి ఉగ్రవాదులను ఏం చేయలేరని తెలుస్తోంది. -
ఆఫ్ఘనిస్థాన్‌లో 30 మంది తాలీబాన్లు హతం
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని హెల్మండ్ ప్రాంతంలో ఆదివారం 30 మంది తాలిబాన్లు హతమయ్యారు. పోలీస్ చెక్పోస్టులపై దాడికి ప్రయత్నించిన తాలిబాన్ ఉగ్రవాదులను పోలీసులు మట్టుపెట్టారు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి గాయపడ్డాడు. తాలిబాన్ల ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి హెల్మండ్ ప్రాంతంలో రహదారులను తమ ఆదీనంలోకి తీసుకోవాలని ఉగ్రవాదులు దాడి జరుపగా, పోలీసులు దాడిని తిప్పికొట్టారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన కాల్పుల్లో భారీ సంఖ్యలో తాలీబాన్లు హతమైనట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. -
వైమానిక దాడి.. 21 మంది ఉగ్రవాదులు హతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో వైమానిక దాడి జరిగి 21మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్- అఫ్గనిస్థాన్ సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ నెలలో ఇది ఉగ్రవాదులకు మరో గట్టి దెబ్బ. ఈ నెల 11న కూడా ఓసారి పాక్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు వైమానిక దాడులు జరపగా 22మంది హతమయ్యారు. ఖైబర్ ఏజెన్సీలోని రాజ్గల్, తిరాహ్ ప్రాంతాల్లో గురువారం అనూహ్యంగా తాము ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాల్లో దాడులు జరిపామని, గత కొద్ది రోజులుగా ఉగ్రవాదులను అణిచివేసే చర్యల్లో భాగంగా అటు అప్గనిస్థాన్కు కూడా సహాయపడేలా దాడులు నిర్వహిస్తున్నామని పాక్ సైనిక వర్గాలు తెలిపాయి. -
భీకర ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు భారతీయ జవాన్లకు మధ్య భీకర్ ఎన్కౌంటర్ చోటుచేసుకుని ఓ లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని కావిని అనే గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమచారం మేరకు ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన భద్రతా బలగాలు, పోలీసులు కావిని గ్రామం చుట్టుపక్కల గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయితే, అదే గ్రామంలోని ఓ ఇంట్లో దాచుకున్న ఉగ్రవాదులు తొలుత భద్రతా బలగాలపై గ్రనేడ్లు విసరడంతో తిరిగి బలగాలు ప్రతిఘటించాయి. దీంతో జహంగీర్ అహ్మద్ గనీ అనే ఉగ్రవాది హతమయ్యాడు. అతడు ఈ మధ్యకాలంలోనే లష్కరే తోయిబాలో చేరినట్లు తెలిసింది. గనీ స్వగ్రామం జమ్మూకాశ్మీర్‌లోని కోయిల్. -
భీకర పోరు.. 55మంది ఉగ్రవాదులు హతం
కైరో: ఈజిప్టులో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగింది. ఇందులో మొత్తం ఇద్దరు సైనికులు చనిపోగా 55మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో పన్నెండుమంది సైనికులు గాయపడగా .. 35మంది ఉగ్రవాదులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు తొమ్మిది రోజులుగా ఈజిప్టు సేనలు ఉగ్రవాదులను ఏరివేసే చర్యలకు పోలీసుల సహాయంతో దిగాయి. తొలి రోజుల్లో ఉగ్రవాదులదే పైచేయి కాగా, తాజాగా జరిగిన దాడిలో మాత్రం ఉగ్రవాదులకు సైన్యం నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల ఈజిప్టులోని ఓ పురాతన ఆలయాన్ని ఉగ్రవాదులు నేలమట్టం చేయడం కూడా సైన్యానికి ఆగ్రహం తెప్పించి చాలా తీవ్రంగా ఉగ్రవాదులను ఎదుర్కొంటున్నారు. -
ఉగ్రవాదులు అనుకొని టూరిస్టులను వేటాడి..
కైరో: ఈజిప్టు భద్రతా బలగాలు ఘోర తప్పిదానికి పాల్పడ్డాయి. ఉగ్రవాదులను హతమార్చేందుకు వారిని వెంటాడుతూ ఆ క్రమంలో పన్నెండు మంది పర్యాటకులను అనుకోకుండా కాల్చి చంపారు. ఈ ఘటన సంచలనానికి తెరతీసింది. పోలీసులు, సైనిక దళాలు ఆదివారం సాయంత్రం ఉమ్మడి ఉగ్రవాద నిరోధక చర్యలకు దిగాయి. ఈ క్రమంలో ఏడారిలో నిషేధిత ప్రాంతమైనా అల వాహత్లో నాలుగు వాహనాల్లో మెక్సికన్, ఈజిప్టు టూరిస్టులు అనుకోకుండా వచ్చారు. దీంతో అప్పటి వరకు ఉగ్రవాదులను వెంటాడిన భద్రతా బలగాలు ఆ తర్వాత కూడా వారు ఉగ్రవాదులే అనుకుని భ్రమపడి మెక్సికో పర్యాటకుల వాహనాలపై కాల్పులు జరిపారు. దీంతో 12 మంది మెక్సికో, ఈజిప్టు టూరిస్టులు ప్రాణాలు కోల్పోగా మరో పది మంది గాయాలపాలయ్యారు. ఈజిప్టుకు ప్రధాన ఆదాయం టూరిజం నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అయితే, మెక్సికో మాత్రం ఈ అంశాన్నిఇంకా ధృవీకరించలేదు. ఇద్దరు మెక్సికన్లు మాత్రం చనిపోయినట్లు సమాచారం ఉందని తెలిపింది. -
లష్కరే టాప్ మిలిటెంట్ హతం
శ్రీనగర్: జమ్మూక శ్మీర్లో మిలిటెంట్లపై పోరులో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ ఇర్షద్ గానీని శనివారం ఎన్కౌంటర్లో హతమార్చాయి. పుల్వామా జిల్లా కాకపోరా ప్రాంతంలోని బేగమ్ బాగ్ గ్రామం వద్ద మిలిటెంట్లు ఉన్నారని సమాచారం రావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే ఆర్మీ రంగంలోకి దిగి, పోలీసులతో కలసి గానీని మట్టుబెట్టింది. మిగతా మిలిటెంట్ల కోసం గాలిస్తున్నారు. కాకపోరాకే చెందిన ఇర్షద్ తలపై రూ. 10 లక్షల రివార్డు ఉంది. 2013లో హైదర్‌పోరాలో 8 మంది జవాన్లను చంపిన కేసుతోపాటు ఆర్మీ, పోలీసులపై జరిగిన పలు దాడుల కేసుల్లో అతడు నిందితుడు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
- ఇద్దరు మిలిటెంట్లు, ఇద్దరు జవాన్లు మృతి జమ్మూ: ఉత్తర కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లతోపాటు ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిచెందారు. కుప్వారా జిలా లారిబల్ గ్రామంలో గురువారం రాత్రినుంచే ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని, అవి ఇంకా కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్పుల సందర్భంగా ఇద్దరు గుర్తుతెలియని మిలిటెంట్లు హతమయ్యారని, ఇద్దరు జవాన్లు కూడా మృతిచెందారని అధికారులు తెలిపారు. మరోసారి పాక్ కాల్పులు భారత్, పాకిస్తాన్ సైన్యాధికారులమధ్య ఓ వైపు చర్చల ప్రక్రియ నడుస్తుండగానే పాక్ దళాలు కశ్మీర్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులకు పాల్పడ్డాయి. రాజౌరీ జిల్లాలోని హమీర్పూర్ సెక్టార్లో అధీనరేఖవెంట పాక్ దళాలు శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపాయని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
పాక్ తొలి డ్రోన్ ఎటాక్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
పెషావర్: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పాకిస్థాన్ తొలి డ్రోన్ ఒకటి విజయవంతంగా తన విధిని నిర్వర్తించింది. సోమవారం దానిని ఉగ్రవాదుల ప్రభావం ఉండే ఉత్తర వజీరిస్థాన్‌లో ప్రయోగించగా ముగ్గురు కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు విదేశీ పరిజ్ఞానంతో డ్రోన్లను తయారుచేసి దాడులకు ఉపయోగించిన పాక్ ఇటీవల బురాక్ డ్రోన్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. దీనిని ముఖ్యంగా ఉగ్రవాదులు ఎక్కువగా ఉండే శవాల్ లోయలో ప్రయోగించి క్షిపణులు విడిచి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేయగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిని అధికారికంగా ఆమోదించడానికి ముందు తొలిసారి ఈ ఏడాది మార్చి 14 ప్రయోగించి చూశారు. -
మరో పురాతన ఆలయం కూల్చేశారు
పామిరా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సిరియాలోని ప్రముఖ పురాతన బాల్ ఆలయంపై మరోసారి విరుచుపడ్డారు. పురాతన క్షేత్రం వద్ద కొలువై ఉన్న సిరియన్ల ప్రముఖ దైవం బాల్ ఆలయాలను ఒక్కొక్కటీగా ధ్వంసం చేస్తున్నారు. గతవారం ఓ ఆలయాన్ని బాంబు దాడులో కూల్చివేయగా.. తాజాగా మరో ప్రముఖ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసి నేలమట్టం చేశారు. క్రీ.శ 32లో నిర్మించిన ఈ ఆలయానికి దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఘటనను పరిశీలించిన స్థానికుడు అదొక మహా విస్ఫోటనంగా అభివర్ణించాడు. వారు పేల్చిన బాంబుకు వెలువడిన శబ్ధం విన్నవారి చెవులకు చిల్లులు పడాల్సిందే, వినికిడి లోపం సమస్య తలెత్తాల్సిందే అని చెప్పారు. షాటిలైట్లో కూడా ఆలయం ధ్వంసం సమయంలో ఏర్పడిన దుమ్ము దూళి పొగ భారీగా ఎగిసిపడటం కనిపించింది. ఈ ప్రాంతానికి యునస్కో హెరిటేజ్ గుర్తింపు కూడా ఉంది.