33 మంది యువకులను హతమార్చిన ఐసిస్
సిరియా: తూర్పు సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 33 మంది యువకులను అతి కిరాతకంగా చంపారు. ఐఎస్ ఉగ్రవాదులు బుధవారం దీర్-ఎల్-జౌర్ ప్రావిన్స్‌లోని మయాదీన్ పట్టణంలో యువకుల గొంతు కోసి ఘోరంగా హతమార్చినట్లు బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. హత్యకు గురైన వారు సిరియన్ భద్రతా బలగాలకు చెందిన వారా లేక రెబల్ గ్రూపునకు చెందిన వారా అనేది స్పష్టంగా తెలియలేదని పేర్కొంది.
ఐఎస్ ఉగ్రవాదులు ఇలాంటి హత్యలను గత సంవత్సర కాలముగా పాల్పడుతున్నారని యూరప్‌లో నివసిస్తోన్న ఓ సిరియన్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో కిరాతకంగా తలలు నరకడం, బ్రతికి ఉన్న వారిని నీళ్లలో ముంచి సజీవంగా చంపేయడం.. వాటిని ఫోటోలు,విడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడం వంటి చర్యలు ఐఎస్ ఉగ్రవాదుల పనేనన్న విషయం తెలిసిందే.