
భీకర పోరు.. 55మంది ఉగ్రవాదులు హతం
కైరో: ఈజిప్టులో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగింది. ఇందులో మొత్తం ఇద్దరు సైనికులు చనిపోగా 55మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో పన్నెండుమంది సైనికులు గాయపడగా .. 35మంది ఉగ్రవాదులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
దాదాపు తొమ్మిది రోజులుగా ఈజిప్టు సేనలు ఉగ్రవాదులను ఏరివేసే చర్యలకు పోలీసుల సహాయంతో దిగాయి. తొలి రోజుల్లో ఉగ్రవాదులదే పైచేయి కాగా, తాజాగా జరిగిన దాడిలో మాత్రం ఉగ్రవాదులకు సైన్యం నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల ఈజిప్టులోని ఓ పురాతన ఆలయాన్ని ఉగ్రవాదులు నేలమట్టం చేయడం కూడా సైన్యానికి ఆగ్రహం తెప్పించి చాలా తీవ్రంగా ఉగ్రవాదులను ఎదుర్కొంటున్నారు.