బటాసిపూర్ (అసోం): అసోంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఏఎస్పీ మరణించగా, మరో నలుగురు పోలీసులు, ఓ ఇన్ఫార్మర్ గాయపడ్డారు. బటాసిపూర్లో పోలీసులు ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఎన్డీఎఫ్బీ సోంగ్బిజిత్ వర్గం కాల్పులు జరిపినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనలో సోనిట్పూర్ జిల్లా ఏఎస్పీ గుల్జార్ హుస్సేన్ మరణించారు.
ఆయన తల, కాళ్లలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. ఆయనను తేజ్పూర్ మిలటరీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. గాయపడ్డవారికి ప్రాథమిక చిక్సత చేయించి మెరుగైన వైద్యం కోసం గౌహతి మెడికల్ కాలేజీకి తరలించారు. ఎన్డీఎఫ్బీ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో సమావేశమవుతున్నారనే సమాచారంతో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు.
ఎన్కౌంటర్లో ఏఎస్పీ మృతి
Published Tue, Jan 28 2014 3:07 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement
Advertisement