అసోం: అసోం గోల్పారా జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను గోల్పారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కృషినీ పోలీసు స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం 8.10 నిమిషాలకు ఈ పేలుడు సంభవించింది. తీవ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాన్ని ఓ సైకిల్కు అమర్చినట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని ముజిబార్ రెహ్మాన్గా పోలీసులు గుర్తించారు.
అసోంలో బాంబు పేలుడు, ఒకరి మృతి
Published Wed, Jul 23 2014 10:35 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement