షా భౌతిక కాయానికి గౌరవ వందనం చేస్తున్న పోలీసులు
శ్రీనగర్ : పవిత్ర బక్రీద్ పర్వదినాన కశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. వేర్వేరు ఘటనల్లో ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసులు, ఒక బీజేపీ కార్యకర్త ను కాల్చిచంపారు. బాధిత కుటుంబాల్లో ఈద్ సంబరాల స్థానంలో విషాదం నింపారు. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని లార్వెలో ఈద్ జరుపుకోవడానికి స్వస్థలం వచ్చిన ఇన్‌స్పెక్టర్ మహ్మద్ అష్రాఫ్ దార్‌ను ఉగ్రవాదులు బుధవారం సాయంత్రం అతని స్వగృహంలోనే హత్యచేశారు. ఆయన బుద్గాంలోని స్పెషల్ బ్రాంచీలో పనిచేస్తున్నారు. అంతకుముందు, కుల్గాంలో ఈద్ ప్రార్థనలు చేసి ఇంటికి వెళ్తున్న ట్రైనీ కానిస్టేబుల్ ఫయాజ్ అహ్మద్ షాను పొట్టనబెట్టుకున్నారు. పూల్వామా జిల్లాలో స్పెషల్ పోలీసు అధికారి మహ్మద్ యాకూబ్ షాపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. కుప్వారా జిల్లాలో మంగళవారం రాత్రి అపహరణకు గురైన స్థానిక బీజేపీ కార్యకర్త మృతదేహం బుధవారం కనిపించింది. ఆయన శరీరమంతా బుల్లెట్లు దిగి ఉండటంతో ఈ ఘాతుకానికి పాల్పడింది ఉగ్రవాదులే అని భావిస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విచారం వ్యక్తం చేస్తూ కశ్మీర్ లోయలో హింస ఎక్కువ కాలం కొనసాగదన్నారు. అనంత్‌నాగ్‌లోని జంగ్‌లాట్ మండీ, బారాముల్లాలోని సోపోర్ తదితర ప్రాంతాల్లోనూ నిరసనకారులు రాళ్లు రువ్వారు.
Comments
Please login to add a commentAdd a comment