భీకర ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం | LeT militant killed in Kashmir encounter | Sakshi
Sakshi News home page

భీకర ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం

Published Tue, Sep 22 2015 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

భీకర ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం

భీకర ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులకు భారతీయ జవాన్లకు మధ్య భీకర్ ఎన్కౌంటర్ చోటుచేసుకుని ఓ లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని కావిని అనే గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమచారం మేరకు ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన భద్రతా బలగాలు, పోలీసులు కావిని గ్రామం చుట్టుపక్కల గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

అయితే, అదే గ్రామంలోని ఓ ఇంట్లో దాచుకున్న ఉగ్రవాదులు తొలుత భద్రతా బలగాలపై గ్రనేడ్లు విసరడంతో తిరిగి బలగాలు ప్రతిఘటించాయి. దీంతో జహంగీర్ అహ్మద్ గనీ అనే ఉగ్రవాది హతమయ్యాడు. అతడు ఈ మధ్యకాలంలోనే లష్కరే తోయిబాలో చేరినట్లు తెలిసింది. గనీ స్వగ్రామం జమ్మూకాశ్మీర్లోని కోయిల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement