Lashkar-e-Toiba
-
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్‌తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్‌లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్‌ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్‌కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
పాక్ నుంచి రిందా కుట్ర
సాక్షి, హైదరాబాద్: పంజాబ్‌తోపాటు ఢిల్లీ, చండీగఢ్, మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మాఫియా డాన్ హర్వీందర్ సింగ్ అలియాస్ రిందా పాకిస్తాన్ నుంచి భారత్‌లో పేలుళ్లకు కుట్ర పన్నాడు. పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత సంస్థ బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ముసుగులో అటు ఐఎస్ఐ, ఇటు ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ)లకు సహకరిస్తున్నాడు. దీనికోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న తన నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాడు. రిందా ఆదేశాల మేరకు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుంచి ఆదిలాబాద్‌కు మారణాయుధాలు, పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్ రవాణా చేస్తున్న నలుగురు ఉగ్రవాదులను హరి యాణాలోని కర్నాల్ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. వీటి ట్రాన్సిట్ పాయింట్ ఆదిలాబాద్ అని, అక్కడకు వచ్చే నాందేడ్ ముఠా తీసుకుని వెళ్లేలా రిందా ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. త్రుటిలో తప్పించుకుని పాక్‌కు.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన రిందా కుటుంబం పంజాబ్‌లోని తరంతరాన్ జిల్లాకు వలసవెళ్లింది. 18 ఏళ్ల వయస్సులోనే సమీప బంధువును హత్య చేసిన రిందా.. తర్వాత నాందేడ్‌కు మకాం మార్చాడు. అక్కడా రెండు హత్యలతోసహా పలు నేరాలు చేసి పంజాబ్‌కు పారిపోయాడు. పంజాబ్ యూనివర్సిటీలో ఉన్న పరిచయస్తుల సాయంతో అందులోనే తలదాచుకున్నాడు. 2016లో అక్టోబర్‌లో ఆ వర్సిటీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న రిందా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఓఐ) నాయకులపై తుపాకులతో కాల్పులు జరిపాడు. మాఫియా సంబంధాలతో హత్యలు, బలవంతపు వసూళ్లు తదితర నేరాలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. 2017లో తన భార్యతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్నట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు. వీరి సమాచారంతో బెంగళూరు పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. త్రుటిలో తప్పించుకున్న రిందా పాకిస్తాన్ పారిపోయాడు. అక్కడ ఉంటూనే బీకేఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. బీకేఐ సంస్థ ఐఎస్ఐ, ఎల్ఈటీల కోసం పని చేస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో గతంలోనే గుర్తించింది. తాజాగా రిందాను వినియోగించుకుని ఈ రెండు సంస్థలు భారత్‌లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నింది. దీనికోసం ఇతగాడు పంజాబ్‌లోని∙బీకేఐ స్లీపర్ సెల్స్‌తోపాటు నాందేడ్‌లో తన అనుచరులను వాడుకోవాలని పథకం వేశాడు. -
కశ్మీర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమయ్యారు. మరో సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు వెల్లడించారు అమిషిపొరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల్ని నిర్బంధించడానికి ప్రయత్నించగా వారు జరిపిన కాల్పుల్లో షకీల్ అహ్మద్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రంతా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా వివరించారు. -
ఐరాస నివేదికపై భారత్ అసంతృప్తి
ఐరాస: ఐసిస్ ఉగ్రవాద సంస్థపై ఐరాస సెక్రటరీ జనరల్ విడుదల చేసిన నివేదికపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. పాక్ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరేతోయిబా, జేషే మహ్మద్ సంస్థలకు ఐసిస్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి పలు మార్లు హెచ్చరించినా నివేదికలో పేర్కొనలేదని భారత్ అసంతృప్తి తెలిపింది. అఫ్గాన్‌లో ఐసిస్ అకృత్యాలపై ఐరాస్ 14వ సెక్రటరీ జనరల్ రిపోర్టును ఇటీవల విడుదల చేసింది. పాక్ మద్దతుతో హక్కానీ నెట్వర్క్ విస్తరించడాన్ని, పలు ఉగ్రసంస్థలకు ఆల్‌ఖైదా, ఐసిస్‌తో ఉన్న సంబంధాలను విస్మరించకూడదని ఐరాసలో భారత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రబంధాలపై భారత్ పలుమార్లు వివరాలందించిందని, ఆందోళన వ్యక్తం చేసిందని, కానీ కార్యదర్శి నివేదిక ఈ బంధాలను ప్రస్తావించలేదని చెప్పారు. భవిష్యత్‌లోనైనా సభ్యదేశాల ఆందోళనను పట్టించుకొని నివేదికలు రూపొందించాలని కోరారు. పాక్ నుంచి తాము ఎదుర్కొంటున్న ఉగ్రముప్పుపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందన్నారు. ఆసియాలో ఐసిస్ విస్తరణకు యత్నించడాన్ని నివేదికలో పొందుపరిచారు. దీనిపై తిరుమూర్తి స్పందిస్తూ, ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. -
జంట పేలుళ్ల కేసులో నజీర్, షఫాస్ నిర్దోషులు
కొచ్చి: కోజికోడ్ జంట పేలుళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కార్యకర్త తడియంతెవిడ నజీర్, షఫాస్‌లను నిర్దోషులుగా పేర్కొంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోజికోడ్ కేఎస్ఆర్టీసీ, మొఫుసిల్ బస్టాండ్లలో జరిగిన బాంబు పేలుళ్లకు నజీర్, ఇతర నిందితులు కుట్ర చేశారని, ప్రణాళికతో పాటు అమలు చేసినట్లు వీరిపై అభియోగాలున్నాయి. 2011లో ఎన్ఐఏ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. నజీర్, షఫాస్ ఇద్దరూ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, 1967(ఉపా)లోని వివిధ సెక్షన్ల కింద నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ మొదటి నిందితుడు నజీర్, నాలుగో నిందితుడు షఫాస్ దాఖలు చేసిన అప్పీలును కేరళ హైకోర్టు అనుమతించింది. న్యాయమూర్తులు కె.వినోద్ చంద్రన్, జియాద్ రెహమాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం తుదితీర్పు వెల్లడించింది. ఘట న జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న ఈ కేసు దర్యాప్తు సంక్లిష్టతను తాము అర్థం చేసుకున్నామని చెప్పిన ధర్మాసనం వారే నేరం చేశారనేందుకు నమ్మదగిన ఆధారాలేవీ లేవని పేర్కొన్నది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఐఏ దాఖలు చేసిన అప్పీలును కూడా ధర్మాసనం తిరస్కరించింది. -
ఉగ్రవాద శక్తులకు తోడ్పాటు వద్దు: జైశంకర్
ఐక్యరాజ్యసమితి: లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆరోపించారు. శిక్ష పడుతుందన్న భయం వాటికి లేకుండా పోయిందన్నారు. ఇతర దేశాల అండ చూసుకొని రెచ్చిపోతున్నాయని చెప్పారు. ఆయన గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అధ్యక్ష హోదాలో ప్రసంగించారు. ఇండియాలో ముంబై, పఠాన్ కోట్, పుల్వామా దాడులకు పాల్పడింది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలేనని గుర్తుచేశారు. అలాంటి సంస్థలకు ఏ దేశమూ తోడ్పాటు అందించవద్దని కోరారు. ఉగ్రవాద మూకలకు అందుతున్న ఆర్థిక సాయాన్ని విస్మరించడం తగదని అన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు. -
ఒక్కో బ్లాస్ట్‌కు రూ.కోటి ఇస్తామని నిందితులకు లష్కరే తోయిబా ఆఫర్
-
నలుగురు లష్కరే ముష్కరులు హతం
శ్రీనగర్: సోమవారం జమ్ముకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాదళాలు నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులను మట్టుబెట్టాయి. జిల్లాలోని మనిహల్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి భద్రతాదళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాయని, మిలిటెంట్లను గుర్తించిన అనంతరం లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా కాల్పులు జరిపారని, దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపగా నలుగురు తీవ్రవాదులు మరణించారని ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వీరంతా తమను తాము లష్కరే ముస్తఫా వర్గంగా చెప్పుకుంటారని, కానీ పోలీసు రికార్డుల్లో వీరు లష్కరేతోయిబా తీవ్రవాదులనే ఉందని చెప్పారు. ఎన్కౌంటర్ స్థలంలో మూడు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారన్నారు. మృతులను రాయిస్ అహ్మద్ భట్, అమిర్ షఫి మిర్, రఖిబ్ అహ్మద్ మాలిక్, అఫ్తాబ్ అహ్మద్ వనిగా గుర్తించారు. సంఘటనలో ఒక ఆర్మీ జవాను గాయపడగా ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ంతవరకు 9 ఎన్కౌంటర్లు జరిగాయని, వీటిలో 19మంది తీవ్రవాదులు హతమయ్యారని ఐజీ వివరించారు. తిరిగి వచ్చేయండి ఈ సంవత్సరం 18 మంది యువకులు మిలిటెంట్లలో చేరారని, వీరిలో 5గురు ఎన్‌కౌంటరయ్యారని, ముగ్గురు అరెస్టయ్యారని, మిగిలిన వారు లొంగిపోయేలా చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇలా ఏడుగురు యువకులు మిలిటెంట్లనుంచి తిరిగి వచ్చారన్నారు. సెక్యూరిటీ దళాలపై లోయలో తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతోందన్నారు. స్థానిక యువతను తీవ్రవాదంవైపు మరల్చేందుకు పాకిస్థాన్ కుయుక్తులు పన్నుతోందని, సోషల్‌మీడియా ద్వారా రెచ్చగొడుతోందని విమర్శించారు. దీనికితోడు పాక్ డ్రగ్స్‌ను కూడా సరఫరా చేస్తోందని, ఇలా డ్రగ్స్‌కు బానిసైనవారు తమను సంప్రదిస్తే డీఅడిక్షన్ కేంద్రాలకు పంపుతామని చెప్పారు. యువతకు సాయం చేసేందుకు పోలీసులు సదా సిద్ధమన్నారు. లోయలో శాంతిస్థాపన తమ ధ్యేయమన్నారు. దళాలపై రాళ్లురువ్వే సంఘటనలు చాలా తగ్గిపోయాయని, గతంలోలాగా కాకుండా మిలిటెంట్లకు భయపడకుండా ప్రజా జీవనం కొనసాగుతోందని చెప్పారు. నిజానికి మిలిటెన్సీ కన్నా రాళ్లు రువ్వే ఘటనలు చాలా తీవ్రమైనవని, సామాజికంగా సీరియస్ సమస్యని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా పలువురిని ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేస్తున్నామని చెప్పారు. -
సౌదీలో ఆ దాడి చేసింది భారతీయుడే!
రియాద్ : సౌదీ అరేబియాలోని జెడ్డా ప్రాంతంలో రెండేళ్ల క్రితం ఆత్మాహుతి దాడికి పాల్పడింది భారతీయుడేనని సౌదీ ప్రభుత్వం నిర్ధారించింది. 2016 జూలై 4 వ తేదీన సౌదీలోని మూడు ప్రాంతాల్లో నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ దాడుల్లో భాగంగా సౌదీ పశ్చిమ ప్రాంతంలోని యూఎస్ కాన్సులేట్ వెలుపల ఆత్మహుతి దాడి జరిపింది భారతీయుడైన ఫయాజ్ కాగ్జీ అని ఆరోపణలు వచ్చాయి. దీంతో సౌదీ అధికారులు ఆ దాడి దృశ్యాలను భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు పంపి.. నిందితుడి వివరాలు పంపాల్సిందిగా కోరారు. దీంతో ఎన్ఐఏ ఆదేశాలతో మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు కాగ్జీ డీఎన్ఏ నమూనాలను 2017లో సౌదీ అధికారులకు అందజేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి డీఎన్ఏతో ఇది సరిపోలడంతో.. ఆ దాడికి పాల్పడింది కాగ్జీనే అని సోమవారం సౌదీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన కాగ్జీ 2006లో పాకిస్తాన్‌కు వెళ్లి.. అక్కడ లష్కరే తోయిబాలో చేరి పలు విధ్వంసాలకు పాల్పడ్డాడు. 2006లో జౌరంగాబాద్ అక్రమ ఆయుధాల రవాణా కేసులో కాగ్జీ ప్రధాన నిందితుడు. అలాగే 26/11 ముంబై దాడులకు కాగ్జీనే సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. -
ఆ..ఆలయంపై ఉగ్రవాదులు దాడి!?
సాక్షి, పట్నా : ఉగ్రవాదులు మరోసారి దేశం మీద దాడికి తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రకటించాయి. ఈ దఫా దేశంలోని పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే సూచనలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రకటించాయి. ఈ దఫా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రదాడికి తెగబడొచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు బీహార్‌లోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక ఆలయం అయిన మాతా తవవాలి ఆలయం మీద దాడి చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలిసింది. గోపాల్‌గంజ్ జిల్లాలోని ఈ ఆలయంలో దుర్గా మాత కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని క్రీ.శ, 14వ శతాబ్దంలో చేర రాజులు నిర్మించారు. లష్కరే తోయిబాకు చెందిన స్లీపర్ సెల్ ఉగ్రవాది.. షేక్ అబ్దుల్ నయీమ్ కొంత కాలంగా ఈ ప్రాంతంలో తచ్చాడుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గోపాల్‌గంజ్ జల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు.. పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే దుర్గామాత ఆలయానికి ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. ఈ ఆలయంలోని దుర్గామాతను దర్శించేందుకు బీహార్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్, పశ్చిమ బెంగాల్ నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. -
ఉగ్రవాదులకు పాక్‌సైన్యం శిక్షణ
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం శిక్షణ అందిస్తోందన్న ఆరోపణలకు మరోసారి బలమైన సాక్ష్యం లభించింది. నవంబర్ 24న కశ్మీర్లో భద్రతాబలగాలకు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎన్ఐఏ విచారణలో చెప్పారు. ముంబై దాడులు సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన ఉగ్రసంస్థ జమాతే ఉద్ దవా తనకు ఉగ్రశిక్షణ ఇచ్చిందని.. ఎన్ఐఏకు తెలిపారు. అలాగే పాకిస్తాన్ సైన్యం.. మిలటరీ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు భారత్లోరి రహస్యంగా పంపిందని ఎన్ఐఏ అధికారులుకు వివరించారు. ఇదిలా ఉండగా అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని అమీర్ బెన్ రియాజ్ అలియాస్ అబు హమాస్‌గా పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్‌లోని కరాచీ అతని స్వస్థలమని పోలీసులు చెబుతున్నారు. హహీజ్ సయీద్ గృహ నిర్భంధం తరువాత భారత్‌పై మళ్లీ భారీ దాడికి పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక మిలిటెంట్‌ను భద్రతాధికారులు పట్టుకోవడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
హఫీద్ సయీద్ అంటే నాకిష్టం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ సంచలన విషయాలను ప్రకటించారు. తనకు జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, లష్కరే తోయిబా ఏర్పాటులో కీలకంగా వ్యహరించిన హఫీజ్ సయీద్ అంటే ఇష్టమని ప్రకటించారు. కశ్మీర్ వేర్పాటువాదులకు సహకారం అందించడం.. ఆ ప్రాంతంలో జిహాద్, ఉగ్రదాడులకు కారణమవుతున్న హఫీజ్ సయీద్ పట్ల అభిమానం ఉందని ముషారఫ్ ప్రకటించారు. ‘నాకు హఫీజ్ సయీద్ అంటే చాలా ఇష్టం. కశ్మీర్లో వేర్పాటు వాద కార్యక్రమాలకు ఆయన స్థాపించిన జమాత్ ఉద్ దవా ముందుకు నడిపిస్తోంద’ని పాకిస్తాన్‌లోని ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ముషారఫ్ చెప్పారు. లష్కరే తోయిబాను కూడా పూర్తిగా సమర్థిస్తున్నట్లు ముషారఫ్ స్పష్టం చేశారు. నేను సమర్ధిస్తా! భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా, జీహాద్‌ను పూర్తిగా సమర్థిస్తున్నట్లు ముషారఫ్ తెలిపారు. అంతేకాక తాను అధికారంలో ఉన్న సమయంలో హఫీజ్ సయీద్‌తో పలుమార్లు భేటీ అయినట్లు వెల్లడించారు. సైనిక చర్యకు నేను అనుకూలమే! జమ్మూకశ్మీర్‌పై సైనిక చర్యకు ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉన్నట్లు ముషారఫ్ ప్రకటించారు. భారత సైన్యం చాలా శక్తివంతమైనది.. ఆ సైన్యాన్ని ఎదుర్కోవడం క్లిష్టమని ఆయన తెలిపారు. అదే సమయంలో కశ్మీర్లో లష్కరే తోయిబా సమర్థవంతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. అమెరికా సహకారంతో భారత్ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంలో సఫలమైందన్నారు. ముంబై దాడుల్లో హఫీజ్ హస్తం లేదు! భారత్‌ను కుదిపేసిన 26/11 ముంబై దాడుల సూత్రధారిగా హఫీజ్ సయీద్‌ను పేర్కొనడాన్ని ముషారఫ్ తప్పు పట్టారు. ఆ దాడులకు జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబాకు సంబంధం లేదని కూడా ఆయన చెప్పారు. హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా పిలిచేందుకు పాకిస్తాన్లో ఎవరూ ఇష్టపడరని ముషారఫ్ తెలిపారు. I am the biggest supporter of LeT and I know they like me & JuD also likes me: Pervez Musharraf to Pakistan's ARY News, also said 'yes' on being asked if he likes Hafiz Saeed, added that, 'I have met him (Hafiz Saeed)' pic.twitter.com/txxT58oPoU — ANI (@ANI) November 29, 2017 -
మరో 26/11 ముంబై తరహా దాడి జరిగితే..!
న్యూఢిల్లీ: 26/11 ముంబై తరహా దాడులకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులు మరోసారి తెగబడితే.. భారత్ సహనంగా ఉండటం ఎంతమాత్రం సాధ్యపడదని బ్రసెల్స్‌కు చెందిన ఓ అంతర్జాతీయ మేధో సంస్థ అభిప్రాయపడింది. దక్షిణాసియాలో ఉగ్రవాదంపై అమెరికా విధానాన్ని విశ్లేషిస్తూ ఇంటర్నేషనల క్రైసిస్ గ్రూప్ తాజాగా ఓ నివేదిక వెలువరించింది. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రధాన ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌కు చెప్పుకోదగినస్థాయిలో పాక్ సర్కారు మద్దతు ఉందని విశ్లేషించిన ఆ సంస్థ.. ఈ ఉగ్రవాద గ్రూపులతో అమెరికాకు కూడా ముప్పేనని స్పష్టం చేసింది. ‘ఈ ఉగ్రవాద గ్రూపులకు అల్ కాయిదాకు నేరుగా సంబంధాలు లేకపోయినా.. వాటి ఫైటర్లు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లలో అంతర్జాతీయ ఉగ్రవాదులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ ఉగ్రవాద గ్రూపులు పాకిస్థాన్‌కే కాదు భారత్, అమెరికాకు కూడా ప్రమాదకరమే’ అని పేర్కొంది. గత ఏడాది కశ్మీర్లో భద్రతా దళాలపై ఉగ్రవాదుల దాడిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రతిస్పందనను అంచనా వేస్తే.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఆయన ప్రతిచర్యలు ఉంటాయని స్పష్టమవుతోంది. కానీ, 2008లో ముంబైలో చాలామందిని పొట్టనబెట్టుకున్న మారణహోమంలాంటిది మరొకటి జరిగితే.. భారత్ సహనంగా ఉండటం చాలా కష్టం’ అని అభిప్రాయపడింది. గత ఏడాది ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత సైనికులు ఎల్వోసీను దాటి మరీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి.. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్‌ను ధ్వంసం చేసి.. పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ’కౌంటర్ టెర్రరిజం పిట్ఫాల్స్: వాట్ ద యూస్ ఫైట్ అగైనెస్ట్ ఐఎస్ఐఎస్ అండ్ అల్ కాయిదా షూడ్ అవైడ్’ పేరిట రూపొందించిన ఈ నివేదికలో భారత వ్యతిరేక ఉగ్రవాద గ్రూపుల నియంత్రణ, తాలిబన్లతో చర్చల దిశగా పాకిస్థాన్ సైన్యాన్ని ఒప్పించడమే అమెరికా ముందున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొంది. -
భీకర ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు భారతీయ జవాన్లకు మధ్య భీకర్ ఎన్కౌంటర్ చోటుచేసుకుని ఓ లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని కావిని అనే గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమచారం మేరకు ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన భద్రతా బలగాలు, పోలీసులు కావిని గ్రామం చుట్టుపక్కల గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయితే, అదే గ్రామంలోని ఓ ఇంట్లో దాచుకున్న ఉగ్రవాదులు తొలుత భద్రతా బలగాలపై గ్రనేడ్లు విసరడంతో తిరిగి బలగాలు ప్రతిఘటించాయి. దీంతో జహంగీర్ అహ్మద్ గనీ అనే ఉగ్రవాది హతమయ్యాడు. అతడు ఈ మధ్యకాలంలోనే లష్కరే తోయిబాలో చేరినట్లు తెలిసింది. గనీ స్వగ్రామం జమ్మూకాశ్మీర్‌లోని కోయిల్. -
మరికొంచెం రెచ్చిపోయారు
నోవాట్ట: మరోసారి జమ్మూకాశ్మీర్‌లో జాతి వ్యతిరేక శక్తులు రెచ్చిపోయారు. పాకిస్థాన్‌కు, పలు ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలుపుతూ జెండాలు ప్రదర్శించారు. వారికి అనుకూల నినాదాలు చేస్తూ వీధుల్లోకి చొచ్చుకొచ్చే యత్నం చేశారు. దీంతో పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. శుక్రవారం పవిత్ర ప్రార్థనలు ముగిసిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఉండగానే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి గతంలో కన్నా జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటి నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి. వేర్పాటువాద సంస్థ హుర్రియత్ కూడా పాకిస్థాన్ అనూకూల శక్తులను మరింత ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పురిగొల్పుతునే ఉంది. అయినప్పటికీ, పీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు సమర్థంగా తీసుకోకపోవడం గమనార్హం. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ప్రత్యేక వాదులు ప్రదర్శించిన పాక్ ఉగ్రవాద సంస్థల జెండాల్లో లష్కరే ఈ తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ ఐఎస్ వి ఉన్నాయి. ఈ జెండాలు ప్రదర్శించినవారంతా యువకులేకావడం, వారి వెనుక చిన్న చిన్న పిల్లలు కూడా ఉండటం కొంత ఆందోళన కలిగించింది. -
లష్కర్ ఉగ్రవాది బెయిల్ పిటిషన్ తిరస్కృతి
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును స్థానిక న్యాయస్థానం తోసిపుచ్చింది. భారత్‌లో విధ్వంసకర కార్యక్రమాలను చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం నిందితుడు మహ్మద్ షాహిద్ అనే ఉగ్రవాది నగరానికి చెందిన ఓ వ్యాపారిని అపహరించేందుకు యత్నించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని హర్యానాలోని మేవట్ ప్రాంతంలో 2013,డిసెంబర్లో పోలీసులు అరెస్టుచేసిన సంగతి విదితమే. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు స్థానిక అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి రితేష్‌సింగ్ తోసిపుచ్చారు. ‘నిందితుడిపై అభియోగాలను నమోదు చేయాల్సి ఉంది. నిందితుడిపై వచ్చిన అభియోగాలను దృష్టిలో పెట్టుకుని బె యిల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నా’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
లష్కరే తోయిబా అగ్రనేత హతం
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని భారాముల్లా జిల్లా సోపోరే పట్టణంలో ఈ రోజు భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని లష్కరే తోయిబాకు చెందిన అగ్రనేతగా గుర్తించారు. అతని వద్ద నుంచి పోలీసులు ఏకె47 తుపాకీతోపాటు మరికొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఇద్దరు లష్కరే ఉగ్రవాదులపై నేడు చార్జిషీట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన పలు పేలుళ్లు, దాడులతో సంబంధమున్న ఇద్దరు ఉగ్రవాదులపై గురువారం చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కోర్టుకు తెలిపారు. లష్కరే తోయిబాకు చెందినవారుగా భావిస్తున్న వీరిని పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. మహ్మద్ రషీద్, మహ్మద్ షాహిద్ అనే ఇద్దరు నిందితుల జ్యుడీషియల్ కస్టడీని గురువారం వరకు పొడిగించారు. తమపై చార్జిషీట్ దాఖలు చేయనందున బెయిల్‌పై విడుదల చేయాలంటూ ఇద్దరూ చేసిన విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. గురువారం వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించి, విచారణ కొనసాగించాలని ఆదేశించింది. తప్పించుకున్న నిందితుడు, పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది జావేద్ బలూచీతో సంబంధమున్న అబ్దుల్ సుభాన్‌ను పట్టుకోవడానికి కొంత సమయం కావాలని కోరిన పోలీసులు, ఈ ఇద్దరిపై చార్జిషీట్ సిద్ధంగా ఉందని, గురువారం కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఇద్దరు నిందితులను గత ఏడాది డిసెంబర్లో హర్యానాలోని మేవత్ ప్రాంతం లో అరెస్టు చేశారు. తద్వారా దేశంలో లష్కరే తోయిబా తలపెట్టిన భారీ దాడి కుట్రకు తెరదించారు. దేశంలో పెద్ద పెద్ద దాడులకు లష్కరే తోయిబా ప్రణాళికలు రూపొందించినట్టు తన పాకిస్థాన్ మొబైల్ నంబర్‌నుంచి రాజ స్థాన్లో బలూచీకి కొనసాగించిన సంభాషణల ద్వారా వెల్లడైందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్ల తరువాత ఇద్దరు వ్యక్తులను కలిసినట్లు రషీద్, షాహిద్ చెప్పారని పోలీసులు వివరించారు. విచారణ నుంచి తప్పుకున్న జడ్జి న్యూఢిల్లీ: నితీష్ కతారా హత్య కేసు నిందితుల్లో ఒకరైన విశాల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణనుంచి మరో ఢిల్లీ హైకోర్టు జడ్జి తప్పుకున్నాడు. ఈకేసులో మొదటి జడ్జి జస్టిస్ వీణా బీర్బల్ తప్పుకోవడంతో విశాల్ పెరోల్ అభ్యర్థనను ఎస్పీ గార్గ్‌కు అప్పగించారు. తమ్ముడి పెళ్లి బాధ్యతలు చూసుకోవడానికి మగవాళ్లెవరూ లేనందున తన హాజరు తప్పనిసరి అని, అందువల్ల పెరోల్ ఇవ్వాలని విశాల్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిదిన్నరేళ్లు శిక్ష అనుభవించిన విశాల్ గతంలో ఇచ్చిన బెయిల్‌ను దుర్వినియోగం చేయలేదని న్యాయవాది తెలిపారు. ఇటీవల జస్టిస్ గీతా మిట్టల్, జే ఆర్ మిధాలతో కూడిన ట్రయల్ కోర్టు ధర్మాసనం కిడ్నాప్, హత్య కేసులో విశాల్‌తోపాటు అతని కజిన్స్ వికాస్, సుఖ్‌దేవ్ పెహల్వాన్లకు శిక్ష విధించింది. నేరాన్ని పరువు హత్యగా పరిగణించిప కోర్టు... శిక్షాకాలంపై మే 16న వాదనలు విననుంది. -
శ్రీనగర్ ఎన్కౌంటర్ - ఇద్దరు ఉగ్రవాదులు హతం
దాదాపు 20 గంటల పాటు కొనసాగిన హోరాహోరీ కాల్పుల్లో ఒక ఇంట్లో దాగున్న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నడిబొడ్డున అహ్మద్ నగర్లో లష్కరె తోయబా ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు ఆదివారం సాయంత్రం నుంచి హోరాహోరీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు లబ్దుల్ మాజిద్ రంగ్రేజ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఇంటియజమాని, ఆయన కుటుంబ సభ్యులను బయటికి పంపించేశారు. ఆ తరువాత కూడా రోజు రోజంతా కాల్పులు జరిగాయి. చివరికి భద్రతాదళాలు ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటికి నిప్పంటించారు. దీంతో ఉగ్రవాదులిద్దరూ మాడి మసైపోయారు. -
శ్రీనగర్ లో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య హోరాహోరీ
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నడిబొడ్డున అహ్మద్ నగర్లో లష్కరె తోయబా ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు ఆదివారం సాయంత్రం నుంచి హోరాహోరీ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఈ కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డారు. ఉగ్రవాదులు ఇంకా లొంగిపోలేదు. ఆదివారం సాయంత్రం ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు లబ్దుల్ మాజిద్ రంగ్రేజ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. అప్పట్నుంచీ మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఇంటియజమాని, ఆయన కుటుంబ సభ్యులను బయటికి పంపించేశారు. -
లఖ్వీతో నాకు పడదు:కరీమ్ టుండా
న్యూఢిల్లీ: తాను లష్కరే తోయిబాలో ఉన్నత స్థానానికి ఎదగకుండా దాని కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ తీవ్రంగా అడ్డుపడ్డాడని ఇటీవల అరెస్టయిన ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ టుండా పోలీసులకు చెప్పాడు. లష్కరే తోయిబా భారత్‌లో విస్తరించడానికి తానే కారణమైనప్పటికీ లఖ్వీ తన అవకాశాలను దూరంచేశాడన్నాడు. అందుకే లఖ్వీ అంటే తనకు ద్వేషమని అతడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బాంబుల తయారీలో నిష్ణాతుడైన 70 ఏళ్ల టుండాను పోలీసులు ఈనెల 16న అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి అయిన లఖ్వీ దాడుల వ్యూహరచన సమయంలో తనను దూరంగా పెట్టాడని టుండా చెప్పినట్లు అతడిని విచారిస్తున్న పోలీసులు తెలిపారు. లఖ్వీతో ఉన్న ఆర్థిక విభేదాల కారణంగా లష్కరే అగ్రనాయకత్వం కూడా ముంబై ఆపరేషన్ సమయంలో తనను పక్కన పెట్టి యువకులైన అబూ జుందాల్ లాంటి వాళ్లను దగ్గరకు తీశారన్నాడు. దీని గురించి జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ తనకు చెప్పాడని... ఇక భారత్ నకిలీ నోట్ల పంపిణీపై దృష్టి సారించమని సూచించాడన్నాడు. -
కోర్టు ప్రాంగణంలో టుండాపై దాడి
సాక్షి, న్యూఢిల్లీ: లష్కరే తోయిబాకు చెందిన బాంబుల నిపుణుడు అబ్దుల్ కరీం టుండాపై మంగళవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో దాడి జరిగింది. శివకుమార్ రాఘవ్ అనే హిందూసేన కార్యకర్త టుండా వీపుపై బలంగా చరిచాడు. ముఖంపై కూడా కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. టుండాను కోర్టులో హాజరుపరచిన నేపథ్యంలో కోర్టు ఆవరణలో హిందూసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడి, అతడికి మరణశిక్ష విధించాలంటూ నినాదాలు చేశారు. ఇంతలోనే ఒక వ్యక్తి అకస్మాత్తుగా భద్రతా వలయాన్ని ఛేదించుకుంటూ వెళ్లి అతడిపై దాడికి పాల్పడ్డాడు. టుండాపై దాడి చేసిన రాఘవ్‌తో పాటు విష్ణు గుప్తా అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జయ్ తరేజా ఇన్ కెమెరా విచారణకు ఆదేశించారు. తన వద్ద డబ్బు లేదని, అందువల్ల తాను లాయర్‌ను పెట్టుకోలేనని టుండా మేజిస్ట్రేట్‌కు చెప్పాడు. అతడి తరపున వాదించేందుకు కొందరు లాయర్లు ముందుకు వచ్చారు. అయితే, టుండా వకాల్తనామాపై సంతకం చేశాడంటూ ఎం.ఎస్.ఖాన్ అనే న్యాయవాది కోర్టుకు చెప్పారు. దీనిపై మేజిస్ట్రేట్ టుండాను ప్రశ్నించగా, తనకు న్యాయవాది ఖాన్ పెద్దగా తెలియదని, అయితే, ఆయన తన తరఫున వాదిస్తారని చెప్పాడు. ఈలోగా ఒక న్యాయవాది ‘టుండా ఉగ్రవాది’ అంటూ కేకలు వేయడంతో కోర్టులో గలభా రేగింది. దీంతో నిందితుడి తరఫు న్యాయవాది మినహా మరెవరూ కోర్టు గదిలో ఉండరాదని మేజిస్ట్రేట్ ఆదేశించారు. టుండాను నాలుగు రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టుండాను ప్రశ్నించనున్న హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్‌లో గతంలో జరిగిన పేలుళ్లతో సంబంధాలు ఉన్న టుండాను ప్రశించాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. పీటీ వారంట్‌పై అతడిని ఇక్కడకు రప్పించనున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. ఐఎస్ఐ బ్రిగేడియర్ నుంచి టుండాకు నకిలీ కరెన్సీ పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకు చెందిన ఒక బ్రిగేడియర్ నుంచి టుండాకు నకిలీ భారత కరెన్సీ అందేదని ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించారు. పలుసార్లు అతడు ఐఎస్ఐ బ్రిగేడియర్ నుంచి నకిలీ కరెన్సీ అందుకున్నాడని వారు చెప్పారు. -
కోర్టులోనే అబ్దుల్ కరీమ్ టుండాపై దాడి, పోలీస్ కస్టడీ విధింపు!
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ కరీమ్ టుండాను పది రోజల కస్టడీకి సిటీ కోర్టు నుంచి ఢిల్లీ పోలీసులు అనుమతి తీసుకున్నారు. పోలీసు కస్టడీ విధించడానికి ముందు టుండాపై కోర్టు రూమ్ లో అడ్వకేట్ దాడి ఘటన గందరగోళం సృష్టించడంతో టుండాను రహస్యంగా విచారించారు. టుండాను కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టు లో ప్రవేశపెట్టారు. అయితే కోర్టు ప్రాంగణంలోనే హిందు సేనా అధ్యక్షుడు విష్ణు గుప్తా చెంప దెబ్బ కొట్టడంతో కోర్టు లో గందరగోళం నెలకొంది. దేశంలో సుమారు 40 ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో సంబంధమున్నట్టు కేసులు నమోదయ్యాయి. 20 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో జాబితాలో టుండా ఒకరు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో టుండా నిందితుడుగా ఉన్నాడు. దావూద్ ఇబ్రహీంకు అతిసన్నిహితుడైన టుండాను భారత, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉత్తరఖండ్ లోని బాన్ బసా ప్రాంతంలో శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండా అరెస్టు
న్యూఢిల్లీ : లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబ్దుల్ కరీం తుండా (70)ను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. ఇండో- నేపాల్ సరిహద్దుల్లో సంచరిస్తుండగా అతన్ని గత రాత్రి అరెస్ట్ చేసినట్లు న్యూఢిల్లీ స్పెషల్ సెల్ ప్రత్యేక కమిషనర్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఈ రోజు ఉదయం తుండాను ఢిల్లీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు తుండా అత్యంత సన్నిహితుడని, అలాగే పాక్‌లోని ఐఎస్ఐ సంస్థతో కూడా అతడికి సన్నిహిత సంబంధాలున్నాయని శ్రీవాత్సవ వివరించారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగిన 40 బాంబు పేలుళ్ల ఘటనలతో తుండాకు సంబంధాలున్నాయని చెప్పారు. ముంబై దాడి కేసులో ఇతను కూడా నిందితుడే అని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం పాకిస్థాన్ ప్రభుత్వానికి అందజేసిన 20 మంది ఉగ్రవాదుల జాబితాలో తుండా పేరు కూడా ఉందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆత్యాధునాతన పేలుడు పదార్థాలను తయారు చేయడంపాటు.. వాటిని పేల్చడంలో కూడా తుండా నిపుణుడని పోలీసుఉన్నతాధికారి శ్రీవాత్సవ తెలిపారు.