శ్రీనగర్ ఎన్కౌంటర్ - ఇద్దరు ఉగ్రవాదులు హతం | 2 terrorists felled in Kashmir encounter | Sakshi
Sakshi News home page

శ్రీనగర్ ఎన్కౌంటర్ - ఇద్దరు ఉగ్రవాదులు హతం

Published Mon, Apr 14 2014 6:12 PM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

శ్రీనగర్ ఎన్కౌంటర్ - ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ ఎన్కౌంటర్ - ఇద్దరు ఉగ్రవాదులు హతం

దాదాపు 20 గంటల పాటు కొనసాగిన హోరాహోరీ కాల్పుల్లో ఒక ఇంట్లో దాగున్న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నడిబొడ్డున అహ్మద్ నగర్లో లష్కరె తోయబా ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు ఆదివారం సాయంత్రం నుంచి హోరాహోరీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

ఆదివారం సాయంత్రం ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు లబ్దుల్ మాజిద్ రంగ్రేజ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఇంటియజమాని, ఆయన కుటుంబ సభ్యులను బయటికి పంపించేశారు. ఆ తరువాత కూడా రోజు రోజంతా కాల్పులు జరిగాయి. చివరికి భద్రతాదళాలు ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటికి నిప్పంటించారు. దీంతో ఉగ్రవాదులిద్దరూ మాడి మసైపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement