
శ్రీనగర్ లో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య హోరాహోరీ
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నడిబొడ్డున అహ్మద్ నగర్లో లష్కరె తోయబా ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు ఆదివారం సాయంత్రం నుంచి హోరాహోరీ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఈ కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డారు. ఉగ్రవాదులు ఇంకా లొంగిపోలేదు.
ఆదివారం సాయంత్రం ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు లబ్దుల్ మాజిద్ రంగ్రేజ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. అప్పట్నుంచీ మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఇంటియజమాని, ఆయన కుటుంబ సభ్యులను బయటికి పంపించేశారు.