ఉత్తర కశ్మీర్లోని భారాముల్లా జిల్లా సోపోరే పట్టణంలో ఈ రోజు భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఒక ఉగ్రవాది మృతి చెందాడు.
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లోని భారాముల్లా జిల్లా సోపోరే పట్టణంలో ఈ రోజు భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మృతి చెందిన వ్యక్తిని లష్కరే తోయిబాకు చెందిన అగ్రనేతగా గుర్తించారు. అతని వద్ద నుంచి పోలీసులు ఏకె47 తుపాకీతోపాటు మరికొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.