Militant killed
-
హిజ్బుల్ టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో హిజ్బుల్ టాప్ కమాండర్ అబ్దుల్ ఖయూం నజర్‌ను భారత బలగాలు మట్టుబెట్టాయి. గత 17 ఏళ్లలో దాదాపు 50కి పైగా హత్యలతో ప్రమేయమున్న నజర్ మరణంతో భద్రతా బలగాలు భారీ విజయం సాధించినట్లైంది. నియంత్రణ రేఖ వద్ద కశ్మీర్లోకి చొరబడేందుకు నజర్ ప్రయత్నిస్తుండగా.. ఎదురుకాల్పుల్లో అతను హతమైనట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ‘సరిహద్దు వెంట ఉడీ సెక్టార్లో లచిపొరా వద్ద మంగళవారం ఉదయం చొరబాటు యత్నాల్ని భద్రతా దళాలు భగ్నం చేసి నజర్‌ను హతమార్చాయి. ఇటీవల హిజ్బుల్ టాప్ కమాండర్లు వరుసగా భారత బలగాల చేతిలో మరణించడంతో.. ఆ సంస్థ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టడం కోసం నజర్ పాకిస్తాన్ నుంచి కశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు’ అని బారాముల్లా సీనియర్ ఎస్పీ ఇంతియాజ్ హుస్సేన్ చెప్పారు. అనేక మంది ప్రజలు, పోలీసులతో పాటు భద్రతా సిబ్బందిని నజర్ హత్యచేశాడని, పలు పేలుళ్ల కేసుల్లో అతని ప్రమేయముంద న్నారు. సొపోర్ పట్టణానికి చెందిన నజర్.. హిజ్బుల్ కమాండర్ అబ్దుల్ మజీద్ దార్ హత్యతో 2003లో ఉగ్ర జీవితాన్ని మొదలుపెట్టాడు. హిజ్బుల్‌తో భేదాభిప్రాయాల నేపథ్యంలో 2015లో పీఓకేలోని ముజఫరాబాద్ ఉగ్ర శిబిరానికి వెళ్లి అగ్ర నేతలతో చర్చలు జరిపాడు. ఇటీవల కశ్మీర్లో వరుసగా టాప్ కమాండర్లు హతమైన నేపథ్యంలో హిజ్బుల్‌కు పునరుత్తేజం తెచ్చే బాధ్యతల్ని నజర్‌కు అప్పగించారు. -
భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్ : భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టు బెట్టాయి. బామ్నూ ప్రాంతంలో టెర్రరిస్టులు దాక్కున్నారే విషయం తెలుసుకున్న సైన్యం వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
-
ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ బందిపొరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మంగళవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది మృతి చెందగా, ఓ జవాను గాయపడ్డాడు. కాగా ఉగ్రవాదుల సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పొంచిఉన్న ఉగ్రవాదులు...భద్రతాదళాలపై కాల్పులు ప్రారంభించగా, ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. కాగా హతమైన ఉగ్రవాది ఏ తీవ్రవాద సంస్థకు చెందిన సభ్యుడనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రత దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ జవాన్ గాయపడ్డాడు. క్షతగాత్రుడైన జవాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించామని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని భావిస్తున్నారు. పోలీసులతో కలసి సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టింది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడి అనంతరం పోలీసులు, సైన్యం కలసి ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది, జవాను మృతి
శ్రీనగర్: జమ్మాకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవానుతో పాటు ఉగ్రవాది మృతి చెందగా, మరో ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. మచిల్ సెక్టార్ వెంబడి ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలతో అక్రమంగా చొరబడుతున్నారనే సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్ 56 బెటాలియన్ కూంబింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్మీ జవాన్లకు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో జవానుతో పాటు ఉగ్రవాది మృతి చెందగా, ముగ్గురు జవాన్లు గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో అయిదుగురు ఆర్ఆర్ జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. -
పారిస్‌లో షూటౌట్
►ఉగ్రదాడుల సూత్రధారి కోసం పారిస్ అపార్ట్‌మెంట్‌పై పోలీసుల దాడి ► ఒక మహిళా మానవబాంబు ఆత్మాహుతి.. కాల్పుల్లో ఉగ్రవాది మృతి ► ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన భద్రతా బలగాలు ► పారిస్ దాడుల సూత్రధారి బెల్జియంకు చెందిన అబౌద్గా గుర్తింపు ► ఉగ్రదాడి అనంతరం టెలిఫోన్ నిఘాతో సూత్రధారి ఆచూకీ లభ్యం ► ఏడు గంటల పాటు సాగిన పోరు... ఐదుగురు పోలీసులకు గాయాలు ► అబౌద్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామన్న ఫ్రాన్స్ రాయబారి సెయింట్ డెనిస్(ఫ్రాన్స్): ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాద దాడికి సంబంధించి పోలీసులు బుధవారం కీలక ఆపరేషన్ నిర్వహించారు. శుక్రవారం నాటి దాడుల సూత్రధారి, ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) తీవ్రవాది అబ్దెల్హమీద్ అబౌద్ పారిస్ శివార్లలో ఒక అపార్ట్మెంట్లో దాక్కుని ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు బుధవారం వేకుజామున ఆ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. లోపలున్ను ఉగ్రవాదులు తుపాకీ కాల్పులతో ఎదురు దాడికి దిగటంతో ఏడు గంటలు ఆపరేషన్ కొనసాగింది. ఈ సందర్భంగా అపార్ట్మెంట్లో ఉన్న ఒక మహిళ ఆత్మాహుతి బాంబుతో తనను తాను పేల్చివేసుకోగా.. మరొక ఉగ్రవాది పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. అపార్ట్మెంట్లోని ఐదుగురు ఉగ్రవాదులతో పాటు సమీప ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను (ఒక మహిళ, ఒక పురుషుడు).. మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్ శివార్లలోని సెయింట్ డెనిస్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఐదుగురు పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని పారిస్ అధికారులు తెలిపారు. పారిస్ దాడుల అనంతరం దర్యాప్తులో భాగంగా టెలిఫోన్ నిఘా, ప్రత్యక్ష సాక్షుల కథనాల ద్వారా.. సూత్రధారి అబౌద్ అని, అతడు సెయింట్ డెనిస్‌లోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడని తెలిసిందని పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాంకోయ్ మొలిన్ తెలిపారు. ఈ అపార్ట్మెంట్ పారిస్ నగరంలో ఉత్తర దిక్కుగా.. స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంకు 2 కి.మీ. దూరంలో ఉంది. ఈ స్టేడియం వద్ద శుక్రవారం రాత్రి ముగ్గురు మానవబాంబులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డం తెలిసిందే. ఫ్రాన్స్‌లో ఎంతో చరిత్ర గల ప్రాంతాల్లో సెయింట్ డెనిస్ ఒకటి. ప్రస్తుతం ఇది విభిన్న జాతుల ప్రజలకు ఆవాసం. ఇక్కడ గల ఉగ్రవాదుల అపార్ట్మెంట్ ముట్టడికి యాంటీ టైస్ట్ పోలీసు దళాలతో పాటు సైనికులనూ రంగంలోకి దించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు అపార్ట్మెంట్ దగ్గర్లో పేలుడు శబ్దం వినిపించిందని.. భయభ్రాంతులకు గురయ్యామని స్థానికులు తెలిపారు. దాని వెంట వరుసగా బాంబు పేలుళ్ల శబ్దాలు వినవచ్చాయని, ఆ తర్వాత చాలాసేపు తుపాకీ కాల్పులు కొనసాగాయన్నారు.. పోలీసులు అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఇళ్లలోని వారు ఎవరూ బయటకు రావద్దని నిషేధాజ్ఞలు విధించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ తన మంత్రులతో అత్యవసరంగా భేటీ అయి పోలీస్ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. ఆపరేషన్ తర్వాత అపార్ట్మెంట్లో ఇంకా మరొక వ్యక్తి ఉన్నాడని.. అతడెవరో తెలియదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో అబౌద్ లేడని, పేర్కొన్నారు. మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. అయితే.. ఈ దాడి సందర్భంగా అబౌద్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తనకు సమాచారం అందిందని భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయ్ రిచీ చెప్పారు. అతడు చనిపోయాడా లేదా అన్న విషయంపై తుది నిర్ధారణ కోసం వేచిచూస్తున్నామన్నారు. -
శ్రీనగర్‌లో ఎన్కౌంటర్: తీవ్రవాది మృతి
శ్రీనగర్ : ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో హంద్వారా ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు భద్రతాదళాల ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. సదరు ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారని భద్రతదళాలకు శనివారం సాయంత్రం సమాచారం అందింది. దీంతో భద్రత దళాలు అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. ఆ విషయం గమనించిన తీవ్రవాదులు ... భద్రత దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దాంతో వెంటనే అప్రమత్తమైన దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు జరిగిని ఈ ఎన్కౌంటర్లో ఓ తీవ్రవాది మృతి చెందాడని ఉన్నతాధికారి తెలిపారు. అయితే భద్రత దళాల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. -
లష్కరే తోయిబా అగ్రనేత హతం
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని భారాముల్లా జిల్లా సోపోరే పట్టణంలో ఈ రోజు భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని లష్కరే తోయిబాకు చెందిన అగ్రనేతగా గుర్తించారు. అతని వద్ద నుంచి పోలీసులు ఏకె47 తుపాకీతోపాటు మరికొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.