ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది, జవాను మృతి | Encounter in Macchil sector of Kupwara: 1 militant and 1 Jawan killed | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది, జవాను మృతి

Published Wed, Jun 15 2016 10:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

Encounter in Macchil sector of Kupwara: 1 militant and 1 Jawan killed

శ్రీనగర్: జమ్మాకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవానుతో పాటు ఉగ్రవాది మృతి చెందగా, మరో ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. మచిల్ సెక్టార్ వెంబడి ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలతో అక్రమంగా చొరబడుతున్నారనే సమాచారంతో  రాష్ట్రీయ రైఫిల్  56 బెటాలియన్ కూంబింగ్ నిర్వహించింది.

ఈ సందర్భంగా ఆర్మీ జవాన్లకు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో జవానుతో పాటు ఉగ్రవాది మృతి చెందగా, ముగ్గురు జవాన్లు గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో అయిదుగురు ఆర్ఆర్ జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే. శ్రీనగర్లోని ఆర్మీ బేస్ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement