సైన్యం కాల్పుల్లో ఉగ్రవాదులు మృతి | Army Foils Infiltration Bid In Nowshera, Two Terrorists Killed | Sakshi
Sakshi News home page

సైన్యం కాల్పుల్లో ఉగ్రవాదులు మృతి

Published Mon, Sep 9 2024 7:51 AM | Last Updated on Mon, Sep 9 2024 9:13 AM

Army Foils Infiltration Bid In Nowshera, Two Terrorists Killed

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సోమవారం (సెప్టెంబర్‌ 9) సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. 

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద నుంచి ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నౌషేరా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఇదే ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించిన  ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు.  ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టింది. 

ఇదీ చదవండి.. ఘనంగా రెండో ప్రపంచ యుద్ధ వీరుడి బర్త్‌డే వేడుకలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement