Infiltration Bid
-
సైన్యం కాల్పుల్లో ఉగ్రవాదులు మృతి
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్లో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సోమవారం (సెప్టెంబర్ 9) సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద నుంచి ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నౌషేరా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఇదే ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఇదీ చదవండి.. ఘనంగా రెండో ప్రపంచ యుద్ధ వీరుడి బర్త్‌డే వేడుకలు -
Jammu: ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న ఆర్మీ
జమ్మూ : అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. భారీగా ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం(డిసెంబర్ 22) అర్ధరాత్రి జమ్మూలోని అక్నూర్ సెక్టార్ వద్ద సరిహద్దు దాటడానికి యత్నించారు. వీరిని గుర్తించిన సైనికులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. మిగతా వారు వెనక్కి వెళ్లిపోయారు. అయితే చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని మిగిలిన ముగ్గురు తమ వెంటే వెనక్కి లాక్కెళ్లిపోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. ‘ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. నలుగురిలో ఒకరిని కాల్చి చంపాం. మిగిలిన ముగ్గురు చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని లాక్కెళ్లడాన్ని గమనించాం’అని ఆర్మీకి చెందిన వైట్‌నైట్ కార్ప్స్ ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. రాజౌరీ సెక్టార్లో గురువారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఒక పక్క సైన్యం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపడుతుండగానే మరో నలుగురు సరిహద్దు దాటి దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించడం గమనార్హం. ఇదీచదవండి..మగువలు మెచ్చిన చెప్పులు.. -
చొరబాటు యత్నం భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్లో శనివారం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని, అయితే భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. చొరబాటుకు యత్నించి ఉగ్రవాదుల వద్ద భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ముగ్గురిని అరెస్ట్ చేస్తే 100 మంది వచ్చారు.. పోలీసులకే చుక్కలు చూయించారు! -
సరిహద్దులో భీకర కాల్పులు
శ్రీనగర్: సరిహద్దు తుపాకుల మోతతో మరోసారి దద్దరిల్లిపోయింది. మంగళవారం ఉదయం ఉత్తర కశ్మీర్ జిల్లా గుర్జ్ లోయలోని నానే సెక్టార్ వద్ద చొరబాటుదారులను భారత సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదుల దాడిలో ఓ ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు వీర మరణం పొందారు. మృతి చెందిన ఆర్మీ మేజర్‌ను కేపీ రాణేగా అధికారులు గుర్తించారు. సైనికులను హవాల్‌దార్స్ జెమై సింగ్, విక్రమ్‌జీత్, రైఫిల్మన్ మణిదీప్గా పేర్కొన్నారు. సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మట్టికరిచినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు రెండు మృతదేహాలనే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 మంది మిలిటెంట్లు చొరబాటుకు యత్నించినట్లు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం ప్రకటించింది. మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే సరిహద్దులో చొరబాట్లను ఊపేక్షించబోమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రెండు రోజులకే ఈ కాల్పుల ఘటన చేసుకోవటం గమనార్హం. -
కంచె దాటే యత్నం; ఆరుగురు హతం
శ్రీనగర్: భారత భద్రతా బలగాలు కుపర్వా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఆదివారం పాకిస్తాన్ తీవ్రవాదుల భారీ చొరబాటుని అడ్డుకున్నాయి. దేశంలోకి చొరబడేందుకు యత్నిసున్న ఆరుగురిని కాల్చి చంపాయి. కీరన్ సెక్టార్లో ఆదివారం ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ‘దేశంలోకి చొరబాటుకు యత్నించిన ఆరుగురు తీవ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. తప్పించుకుపోయిన మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చ’ని రక్షణ శాఖ ప్రతినిధినొకరు తెలిపారు. కాగా, జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి శనివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెక్కకు మించి భద్రతా దళాలను మోహరిచండంతోనే అనేక మంది యువకులు తీవ్రవాదం వైపు మళ్లుతున్నారనే ఆరోపణలు నిజం కాదని అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా భారత భద్రతా బలగాలు ఎటువంటి తీవ్రవాద నిర్మూలన ఆపరేషన్లు చేపట్టలేదనీ, కాల్పుల విరమణ పాటిస్తున్నాయని గుర్తు చేశారు. కశ్మీర్ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందనీ, అయినా కొంతమంది యువకులు తీవ్రవాదం అడుగులేస్తున్నారని ఆర్మీ మాజీ బ్రిగేడియర్ అనిల్ గుప్తా అన్నారు. -
సరిహద్దులో దాడుల వీడియో విడుదల
-
సరిహద్దులో దాడుల వీడియో విడుదల
జమ్మూకశ్మీర్: దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత బలగాలు దీటైన సమాధానం చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడటంతో బీఎస్ఎఫ్ దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. అయితే ఈ ఘటనకు ముందు రోజే కథువా జిల్లాలో ఆరుగురు ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన థర్మల్ ఇమేజెస్‌ను బీఎస్ఎఫ్ విడుదల చేసింది. బీఎస్ఎఫ్ ఔట్‌పోస్ట్‌లపై బాంబులు విసురుతూ, ఆ తర్వాత జవానులు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకోవడానికి వారు కిందకు వంగుతూ, సమయం చూసి తిరిగి దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. శుక్రవారం ఉదయం 9.35 గంటల సమయంలో కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో భారత ఔట్‌పోస్ట్‌లపై పాక్ రేంజర్లు స్నైపర్ దాడులు జరిపారని బీఎస్ఎఫ్ తెలిపింది. దీంతో భారత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, ఏడుగురు పాక్ రేంజర్లు, ఓ ఉగ్రవాది మరణించారని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఇదే ప్రాంతంలో అంతకుముందు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. గుర్నామ్ సింగ్‌ను జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికి త్స అందజేస్తున్నట్టు చెప్పారు.