![Two Terrorists Killed Near LOC In Jammu Kashmir Poonch District - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/9/Terrorists.jpg.webp?itok=iU1VB_rt)
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లో శనివారం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని, అయితే భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలిపారు.
చొరబాటుకు యత్నించి ఉగ్రవాదుల వద్ద భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ముగ్గురిని అరెస్ట్ చేస్తే 100 మంది వచ్చారు.. పోలీసులకే చుక్కలు చూయించారు!
Comments
Please login to add a commentAdd a comment