LoC firing
-
పాక్ బరితెగింపు.. సరిహద్దులో కాల్పులు
జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. మనదేశంతో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని అక్నూర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి భారత బలగాలు లక్ష్యంగా బుధవారం(సెప్టెంబర్11) తెల్లవారుజామున పాక్ సైన్యం కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో భారత జవాను ఒకరు గాయపడ్డట్లు సమాచారం. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ కాల్పులతో అప్రమత్తమైనట్లు బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉలంఘించడం గమనార్హం. సెప్టెంబర్ 18న అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది.కాగా, 2021లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించిన తర్వాత సరిహద్దు వెంబడి భారత్,పాకిస్తాన్ మధ్య కాల్పులు పెద్దగా లేవు. గతేడాది మాత్రం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో భారత సైనికుడొకరు మృతి చెందారు. ఇదీ చదవండి.. మళ్లీ రాజుకుంటున్న మణిపూర్ -
చొరబాటు యత్నం భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్లో శనివారం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని, అయితే భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. చొరబాటుకు యత్నించి ఉగ్రవాదుల వద్ద భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ముగ్గురిని అరెస్ట్ చేస్తే 100 మంది వచ్చారు.. పోలీసులకే చుక్కలు చూయించారు! -
ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులు దాటి దేశం లోపలికి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద ఆదివారం అనుమానాస్పద కదలికలను పసిగట్టిన సైన్యం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన అనంతరం అక్కడి అటవీ ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు సైన్యం తెలిపింది. రంజాన్ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో సైనిక కార్యకలాపాలను కేంద్రం నిలిపివేసినప్పటికీ ఉగ్రవాదుల కదలికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కేరన్‌లో అప్రమత్తంగా భద్రతా సిబ్బంది -
సరిహద్దులో కాల్పులు..మహిళ మృతి
జమ్మూ కశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. శాంతి శాంతి అంటూనే సరిహద్దు రేఖ(ఎల్ఓసీ) వెంబడి గురువారం పాక్ కాల్పులకు దిగడంతో ఓ మహిళ మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పూంచ్ జిల్లాలోని మెంధర్ ప్రాంతంలోని పౌరుల ఇళ్లపై కాల్పులు జరిపింది. విషయం తెలిసి అక్కడే ఉన్న భద్రతాబలగాలు కూడా ధీటుగా పాక్‌కు సమాధానమిచ్చారు. పాక్ కాల్పుల్లో మరో మహిళకు కూడా గాయాలు అయ్యాయి. ఆమెను దగ్గరలోని మిలటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
మరో మెరుపు దాడి
భారతీయ ఆర్మీ మరోసారి ప్రతాపం చూపింది. దాయాది దేశం పాకిస్తాన్ కవ్వింపులకు కళ్లు చెదిరే సమాధానం ఇచ్చింది. సరిహద్దులు దాటివెళ్లి శత్రుసైన్య శిబిరంపై విరుచుకుపడింది. గతేడాది జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తుకు తెచ్చేలా.. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) దాటి వెళ్లిన భారత ‘ఘాతక్’ కమాండోలు ముగ్గురు శత్రు సైనికులను హతమార్చి, ఓ జవానును గాయపర్చి వీరోచితంగా తిరిగొచ్చారు. అలా.. శనివారం పాక్ కాల్పుల్లో చనిపోయిన భారత మేజర్ ప్రఫుల్ల అంబదాస్ సహా నలుగురు సహచరులకు తమదైన శైలిలో ఘన నివాళుర్పించారు. పూంచ్ సెక్టార్ దగ్గర్లో సోమవారం సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్.. 45 నిమిషాల్లో ముగిసింది. న్యూఢిల్లీ: భారత సైన్యం మరో సాహసవంతమైన ఆపరేషన్‌ను చేపట్టింది. ఐదుగురు భారత సైనికులు నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్ సైన్యానికి చెందిన తాత్కాలిక శిబిరాన్ని కూల్చి, అందులోని ముగ్గురు సైనికులను హతమార్చి వీరోచితంగా తిరిగొచ్చారు. కశ్మీర్లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్ సైన్యం మేజర్ ప్రఫుల్ల సహా నలుగురు భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చర్యకు ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ జరిగినట్లు భావిస్తున్నారు. భారత జవాన్లందరూ సురక్షితంగా తిరిగొచ్చారని ఆర్మీ వర్గాలు చెప్పాయి. మినీ సర్జికల్ స్ట్రైక్స్! గతేడాది సెప్టెంబరు 28 రాత్రి భారత సైన్యం హెలికాప్టర్లను ఉపయోగించి భారీ ఆపరేషన్‌ను చేపట్టి నియంత్రణ రేఖకు దగ్గర్లో పాక్ సైన్యం మద్దతుతోనే ఏర్పాటైన ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి రావడం తెలిసిందే. సోమవారం జరిగిన ఆపరేషన్‌లోనూ భారత సైనికులు పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖను దాటి అవతలకు వెళ్లి పాక్ సైనికుల భరతం పట్టారు. అయితే ఈ ఆపరేషన్‌ను సర్జికల్ స్ట్రైక్స్‌తో పోల్చలేమనీ, ఇది చాలా చిన్న లక్ష్యంతో, స్వల్ప కాలంలోనే పూర్తయిన దాడి అని ఆర్మీ వర్గాలు చెప్పాయి. కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కేరీ సెక్టార్లో ఓ మేజర్ సహ నలుగురు భారత సైనికులను శనివారం పాకిస్తాన్ సైన్యం బలిగొంది. దీనికి ప్రతీకారంగానే తాజా దాడి జరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖకు 200 నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న పాక్ శిబిరాన్ని భారత సైన్యం వ్యూహాత్మకంగా ఎంచుకుని, ఘాతక్ అనే చిన్న బృందంలోని ఐదుగురు కమాండోలు అక్కడకు వెళ్లి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. మొత్తం నలుగురు పాక్ సైనికులు చనిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అది నిజం కాదనీ, ముగ్గురు సైనికులు చనిపోగా, ఒకరు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతీకార దాడికి వెళ్లేముందు పాక్ శిబిరంపై స్థానిక కమాండర్ ఆదేశం మేరకు గట్టి నిఘా పెట్టారు. ఆపరేషన్‌లో చనిపోయిన సైనికులు పాక్ బలూచ్ పటాలంకు చెందిన వారనీ, దాడి జరిగిన ప్రాంతం రావల్కోట్లోని కఖ్చక్రీ సెక్టార్ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కిందిస్థాయి అధికారుల ఆదేశాలతోనే! సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లను భారత సైన్యం చేపట్టడం చాలా అరుదు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మళ్లీ భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి వెళ్లి చేపట్టిన (బహిరంగంగా ప్రకటించిన) ఆపరేషన్ ఇదే. ఇలాంటి ఆపరేషన్లు సాధారణంగా పై స్థాయిలోని ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంటాయి. కానీ ఈ ఆపరేషన్‌కు కింది స్థాయి అధికారులే ఆదేశాలు ఇచ్చారని రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి. పదాతి దళం నుంచి కొందరు సైనికులను ఎంపిక చేసి వారికి ఈ తరహా ఆపరేషన్స్ చేయడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణనిచ్చి ఘాతక్ అనే చిన్న బృందంలో చేరుస్తారు. ఈ బృందంలోని ఐదుగురు కమాండోలతోనే తాజా ఆపరేషన్ జరిగింది. అవి కట్టుకథలు: పాక్ తమ ముగ్గురు సైనికులు చనిపోయింది నిజమే కానీ భారత సైనికులు ఎల్వోసీని దాటి రాలేదని పాక్ పేర్కొంది. నియంత్రణ రేఖ వద్ద అశాంతిని రగిలించేందుకు భారత్ కట్టుకథలు చెబుతోందని ఆరోపించింది. ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకుండానే ఎల్ఓసీ అవతలి నుంచే భారత సైన్యం కాల్పు ల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ముగ్గు రు జవాన్లను హతమార్చిందని పాక్ ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ సైన్యం కూడా దీటుగా బదులిచ్చిందనీ, కొద్దిసేపటికి భారత్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయని పాక్ అందులో పేర్కొంది. భారత తాత్కాలిక హై కమిషనర్‌కు సమన్లు జారీ చేసి, భారత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామంది. -
దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చిన పాక్!
సరిహద్దుల్లో కాల్పులతో పేట్రేగుతున్న పాకిస్థాన్ సైన్యం.. తాజాగా చర్చలకు దిగివచ్చిన సంగతి తెలిసిందే. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద అనుమానిత ఉగ్రవాదులు ముగ్గురు భారతీయ సైనికులను పొట్టనబెట్టుకున్నారు. అంతేకాకుండా ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలుగా నరికేశారు. దీంతో రగిలిపోయిన భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. మరింత దీటుగా పాక్ సైన్యానికి జవాబు చెప్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పాక్ అధికారులు భారత బలగాల షెల్లింగ్ దాడుల్లో 11మంది పౌరులు, ముగ్గురు సైనికులు బుధవారం చనిపోయినట్టు ప్రకటించారు. అంతేకాకుండా బుధవారం సాయంత్రం పాక్ విజ్ఞప్తి మేరకు మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్లు హాట్లైన్లో చర్చించి.. కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి మనోహర్ పరీకర్ స్పందిస్తూ.. సరిహద్దుల్లో ‘పిరికిపంద’ దాడులను భారత్ దీటుగా తిప్పికొడుతుండటంతో దాయాది పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందని, దాడులను ఆపాలని భారత్‌ను విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవాలోని ఓ సభలో ప్రసంగించిన పరీకర్.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా దేశ నాయకత్వం బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదని కొనియాడారు. ‘మన సైన్యం వీరోచితమైనదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తొలిసారి దేశ రాజకీయ నాయకత్వం కూడా బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. అంతేకాకుండా పరికిపందల దాడులకు మేం దీటుగా బదులిస్తున్నాం. కొన్నిరోజులుగా ఇలా బలంగా ప్రతిస్పందిస్తుండటంతో వాళ్లు దిగొచ్చి ‘దయచేసి ఆపండి. మేం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ వేడుకుంటున్నారు. దీనిని ఆపడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు కూడా ఆపాలి. అప్పుడే సరిహద్దుల్లో కాల్పులు ఉండవు’ అని పరీకర్ వ్యాఖ్యానించారు. -
పాక్‌కు దీటుగా జవాబిస్తాం: షిండే
జమ్మూ/న్యూఢిల్లీ: కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మండిపడ్డారు. పాక్‌కు దీటుగా జవాబిస్తామన్నారు. మంగళవారం రాత్రి ఆర్ఎస్ పురా సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతిచెందడం, ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు గాయపడిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందిచారు. పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ 82 ఎంఎం మోర్టార్లు, భారీ ఆయుధాలతో సెక్టర్లో కనీసం 20 చోట్ల కాల్పులకు దిగినట్టు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. జమ్మూ, కాశ్మీర్ సరిహద్దులకు అదనంగా బీఎస్ఎఫ్ బలగాలను తరలిస్తామని షిండే ఢిల్లీలో చెప్పారు. 2003 నుంచి జరిగిన కాల్పుల ఉల్లంఘనల్లో ఇదే అతిపెద్ద సంఘటన అన్నారు. సరిహద్దుల్లో భద్రతపై షిండే మంగళవారం కాశ్మీర్లో పర్యటించివచ్చిన నేపథ్యంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగిపోవడంపై షిండే ఆందోళన వ్యక్తంచేశారు. గతనెలలో సాంబా ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన దాడిని అడ్డుకోవడంలో సైన్యం వైఫల్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 26న సాంబావద్ద లష్కరే ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి సహా పదిమంది సైనికులు మృతిచెందడం తెలిసిందే. మంగళవారం కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతోపాటు ఆర్మీ అధికారులతో షిండే భేటీ అయ్యారు. సాంబా తరహా ఘటన పునరావృతం కాబోదని ఆర్మీ అధికారులు షిండేకు హామీ ఇచ్చారు. -
ఎల్ఓసీలో పర్యటించనున్న హోం మంత్రి షిండే
పొరుగుదేశం పాకిస్థాన్ గతంలో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తున్న నేపథ్యంలో భారత హోంశాఖ మంత్రి సుశీష్ కుమార్ షిండే మంగళవారం నియంత్రణ రేఖ (ఎల్ఒసీ) వెంబడి పర్యటించనున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ కాశ్మీర్ చేరుకుంటారు. ఎల్ఓసీ వెంబడి భద్రత పరిస్థితులను ఈ సందర్బంగా షిండే ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సరిహద్దు రేఖ వెంబడి తరచుగా పాకిస్థాన్ భద్రత దళాలు కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా షిండే భారత్, పాక్ సరిహద్దుల్లోని ఎల్ఓసీ వెంబడి ఈ రోజు పర్యటించనున్నారు. 2003లో భారత్, పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు 136 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిన సంగతి తెలిసిందే.