జమ్మూ/న్యూఢిల్లీ: కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మండిపడ్డారు. పాక్‌కు దీటుగా జవాబిస్తామన్నారు. మంగళవారం రాత్రి ఆర్‌ఎస్ పురా సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను మృతిచెందడం, ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు గాయపడిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందిచారు. పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ 82 ఎంఎం మోర్టార్లు, భారీ ఆయుధాలతో సెక్టర్లో కనీసం 20 చోట్ల కాల్పులకు దిగినట్టు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.
జమ్మూ, కాశ్మీర్ సరిహద్దులకు అదనంగా బీఎస్‌ఎఫ్ బలగాలను తరలిస్తామని షిండే ఢిల్లీలో చెప్పారు. 2003 నుంచి జరిగిన కాల్పుల ఉల్లంఘనల్లో ఇదే అతిపెద్ద సంఘటన అన్నారు. సరిహద్దుల్లో భద్రతపై షిండే మంగళవారం కాశ్మీర్‌లో పర్యటించివచ్చిన నేపథ్యంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగిపోవడంపై షిండే ఆందోళన వ్యక్తంచేశారు. గతనెలలో సాంబా ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన దాడిని అడ్డుకోవడంలో సైన్యం వైఫల్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 26న సాంబావద్ద లష్కరే ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి సహా పదిమంది సైనికులు మృతిచెందడం తెలిసిందే. మంగళవారం కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతోపాటు ఆర్మీ అధికారులతో షిండే భేటీ అయ్యారు. సాంబా తరహా ఘటన పునరావృతం కాబోదని ఆర్మీ అధికారులు షిండేకు హామీ ఇచ్చారు.
పాక్‌కు దీటుగా జవాబిస్తాం: షిండే
Published Thu, Oct 24 2013 2:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement