Jammu - Kashmir
-
తీవ్ర దుశ్చర్యకు పాల్పడిన ట్విటర్.. చర్యలకు కేంద్రం రెడీ..!
న్యూ ఢిల్లీ: గత కొన్నిరోజులుగా ట్విటర్‌కు కేంద్రానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ట్విటర్ పాల్పడిన తీవ్ర దుశ్చర్యతో కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ట్విటర్ ఇండియా మ్యాప్ నుంచి జమ్మూకశ్మీర్‌ను తొలగించింది. జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో అంతర్బాగంగా చూపించింది. అంతేకాకుండా కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపించింది. దీంతో ట్విటర్‌పై కేంద్రం తీవ్ర చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఐటీ శాఖ మంత్రి ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసి తిరిగి పునరుద్దరించిన విషయం తెలిసిందే. ట్విటర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ పోస్టు నుంచి ధర్మేంద్ర చాతుర్ ఆ పదవికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా ఆయన స్థానంలోకి ట్విటర్ గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్ అయిన జెరెమి కెస్సెల్‌ను భారతదేశానికి గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. నిబందనల ప్రకారం స్థానికులనే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలి. చదవండి: భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించిన ట్విట్టర్ -
పొంచి ఉన్న వ్యాధులు!
జమ్మూ: వరదల కారణంగా జమ్మూకాశ్మీర్‌లో వ్యాధుల ముప్పు పొంచిఉంది. యుద్ధప్రాతిపదికన వైద్యసహాయానికి ఏర్పాట్లు చేశారు. వరదనీరు క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికీ వరదనీటిలోనే లక్ష మంది ప్రజలు ఉన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రెండు వేల 500 రోడ్లు, 163 చిన్న వంతెనలు దెబ్బతిన్నాయి. సాయం అందక వరద బాధితులు హెలికాప్టర్లపై రాళ్లదాడులు చేస్తున్నారు. భద్రతలో భాగంగా సిబ్బంది ఆకాశం నుంచే సహాయ సామాగ్రి జారవిడుస్తున్నారు. శాంతి భద్రతల కోసం జమ్మూ నుంచి శ్రీనగర్ మార్గంలోకి రెండు బెటాలియన్ల సాయుధ బలగాలను తరలించారు. కాశ్మీర్లో విద్యుత్ వ్యవస్థ 65 శాతం మెరుగుపడింది. సెల్‌ఫోన్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. వరదల కారణంగా 6 వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. 13 టన్నుల మందులు, రోజుకు లక్షా 20వేల మంచినీటి బాటిళ్ల పంపిణీ చేస్తున్నారు. లక్ష క్లోరిన్ టాబ్లెట్లు కూడా సరఫరా చేశారు. హెలికాప్టర్ ద్వారా 22,500 మంది రోగులను తరలించారు. కాశ్మీర్ వరదల ప్రభావం వల్ల మాంసం చవగ్గా లభిస్తోంది. అయితే కూరగాయల ధరలు మాత్రం బాగా పెరిగిపోయాయి. ఉల్లిపాయల కన్నా చికెన్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. కిలో చికెన్ 50 రూపాయలకే ఇస్తున్నారు. వరదల కారణంగా వేల సంఖ్యలో పెళ్లిళ్లు రద్దయ్యాయి. ** -
కాశ్మీర్లో వర్ష బీభత్సం
శ్రీనగర్/జమ్మూ: గత 50 సంవత్సరాలలో ఎన్నడూ కనీవినీ ఎరుగని వర్షాలు, వరదలతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమైంది. ఈ బీభత్సానికి మరణించిన వారి సంఖ్య 20కి చేరగా, తాజాగా రాజౌరి జిల్లాలో వరదప్రవాహంలో పెళ్లి బృందం బస్సు కొట్టుకుపోయిన దుర్ఘటనలో ఏకంగా 50మంది మరణించినట్టు భావిస్తున్నారు. రాష్ట్రంలో చాలావరకు నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాజౌరి జిల్లాలో ని గంభీర్ నది వరదప్రవాహంలో కొట్టుకుపోయిన బస్పు ప్రమాదంలో ముగ్గురిని మాత్రమే ప్రాణాలతో రక్షించగలిగామని, మిగతావారంతా మరణించి ఉండవచ్చని మంత్రి అబ్దుల్ రహీం రాథర్ చెప్పారు. విద్యాసంస్థలను మూడురోజుల పాటు సెలవులిచ్చారు. కాగా, కాశ్మీర్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. -
వాజ్‌పేయ్ 'కాశ్మీర్ కల'ను నిజం చేస్తాం!
కట్రా(జమ్మూ కాశ్మీర్): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ కాశ్మీర్ కలను నిజం చేస్తామని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం ఉండాలని ఆశించిన వాజ్ పేయ్ కలను నిజం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కట్రా నుంచి ఉధంపూర్ మీదుగా ఢిల్లీకి వెళ్లే కొత్త రైలును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో ర్యాలీలో పాల్గొన్న మోడీ.. వాజ్ పేయ్ కల తప్పకుండా సాకారమవుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని ఆశించే ప్రతీ ఒక్క భారతీయుడు ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఉద్యోగం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మోడీ హామీ ఇచ్చారు. అది తమ బాధ్యతగా ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగుతామన్నారు. 'మాకు ఇక్కడ అధికారం వచ్చినా రాకపోయినా అది మా బాధ్యత అని' మోడీ తెలిపారు. -
రంజీలో తొలిసారి...
అగర్తల: రంజీ ట్రోఫీలో తమ చరిత్రలో తొలిసారి జమ్మూ కాశ్మీర్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. త్రిపురతో ఇక్కడ ముగిసిన చివరి మ్యాచ్‌ను ఆ జట్టు డ్రాగా ముగించింది. 228 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కాశ్మీర్ ఆట ముగిసే సరికి 2 వికెట్లకు 87 పరుగులు చేసింది. అర్ధ సెంచరీతో పాటు 7 వికెట్లు పడగొట్టిన పర్వేజ్ రసూల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. త్రిపురతో మ్యాచ్ డ్రా కావడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కాశ్మీర్‌కు 3 పాయింట్లు దక్కాయి. దీంతో పాయింట్ల పరంగా గోవా (24)తో సమానంగా నిలిచింది. లీగ్ దశలో ఇరు జట్లు నాలుగేసి విజయాలు సాధించాయి. దాంతో రన్ కోషెంట్ (చేసిన, ఇచ్చిన పరుగుల ఆధారంగా)ను పరిగణలోకి తీసుకున్నారు. గోవా (1.005)కంటే 0.001 పాయింట్లు ఎక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్ (1.006) స్వల్ప తేడాతో ముందుకు దూసుకుపోయింది. 2000-01 సీజన్లో కాశ్మీర్ నాకౌట్ దశకు చేరినా అది అప్పటి రంజీ ఫార్మాట్ ప్రకారం ప్రిక్వార్టర్స్ మాత్రమే. ముంబై సంచలన విజయం వల్సాడ్: రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సత్తా చాటింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఇక్బాల్ అబ్దుల్లా (5/44), విశాల్ దభోల్కర్ (4/33) చెలరేగడంతో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై సంచలన విజయం సాధించింది. 175 పరుగుల విజయలక్ష్యం ముందుండగా, 67/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన గుజరాత్ ఒక దశలో 134/4తో గెలుపు దిశగా పయనించింది. అయితే 12 పరుగులకే చివరి 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 147 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ పటేల్ (65) తప్ప అంతా విఫలమయ్యారు. లక్నోలో రైల్వేస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఉత్తరప్రదేశ్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తి కాకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మరో వైపు గత ఏడాది ఫైనలిస్ట్ సౌరాష్ట్ర ఈ సారి క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. గత సీజన్లో సెమీ ఫైనల్ చేరిన సర్వీసెస్‌తో పాటు క్వార్టర్స్ వరకు చేరుకున్న జార్ఖండ్, బరోడా ఈ సారి లీగ్ దశను దాటలేకపోయాయి. క్వార్టర్ ఫైనల్లో ఎవరితో ఎవరు (జనవరి 8 నుంచి 12 వరకు) 1. ముంబై x మహారాష్ట్ర ( వాంఖడే స్టేడియం, ముంబై) 2. బెంగాల్ x రైల్వేస్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా) 3. కర్ణాటక x ఉత్తరప్రదేశ్ (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు) 4. పంజాబ్ x జమ్మూ కాశ్మీర్ (మోతీబాగ్ స్టేడియం, వడోదర) 1, 2 మ్యాచ్‌ల విజేతల మధ్య తొలి సెమీ ఫైనల్ ఇండోర్‌లో... 3, 4 మ్యాచ్‌ల విజేతల మధ్య రెండో సెమీ ఫైనల్ మొహాలీలో ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగుతాయి. ఉప్పల్‌కు ‘ఫైనల్’ చాన్స్ హైదరాబాద్: రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ప్రదర్శన పేలవంగానే ఉన్నా మ్యాచ్‌ల నిర్వహణపరంగా నగరంలోని స్టేడియం మాత్రం బీసీసీఐ దృష్టిలో ప్రధాన వేదికగానే కనిపిస్తోంది. ఈ సీజన్లో రంజీ ఫైనల్ మ్యాచ్ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియాన్ని ఎంపిక చేసినట్లు బోర్డు ప్రకటించింది. ఈ నెల 29నుంచి ఫిబ్రవరి 2 వరకు ఇక్కడ ఫైనల్ జరుగుతుంది. గతంలో ఒక సారి 2008-09 సీజన్లో ముంబై, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య కూడా రంజీ ట్రోఫీ ఫైనల్ ఉప్పల్లోనే జరిగింది. ఆ తర్వాత 2010 ఫిబ్రవరిలో వెస్ట్‌జోన్, సౌత్‌జోన్ మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. -
హైదరాబాద్‌కు 3 పాయింట్లు
జింఖానా, న్యూస్‌లైన్: కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 36 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బుధవారం మూడో రోజు బరిలోకి దిగిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. జింఖానాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో జమ్మూ కాశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌లో 83.4 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. బాండే (57), జైద్ (52) అర్ధ సెంచరీలతో రాణించగా... ఫణి (41), సమద్ (35), శర్మ (31) రాణించారు. జయసూర్య 4, మిలింద్ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 567/6 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, జమ్మూ కాశ్మీర్ 322 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌కు 3, జమ్మూ కాశ్మీర్‌కు 1 పాయింట్ దక్కింది. -
మానవసేవే...మహాసేవ..!
వైద్యుడిని దేవుడిలా చూస్తుంది సమాజం! సేవలో దేవుణ్ణి చూశారు, దేశాన్ని చూశారు ఈ వైద్యుడు! ఎంతో పవిత్రమైనదని చెప్పే ఈ వృత్తిని... అంత పవిత్రంగానూ నిర్వర్తించారు ఈ డాక్టర్!!. ‘నీ కోసం చేసుకున్న గొప్ప పని కంటే ఇతరుల కోసం చేసిన మంచి పని ద్వారా కలిగేదే అసలైన ఆనందం’ అంటూ ఎన్సిసి నేర్పించిన పాఠాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన ఆచరణశీలి ఈయన. కార్గిల్‌లో ఈయన చేసిన దేశసేవ మనకు అతిశయం. మనలాంటి మానవులకు సేవ చేయడం ఈయన ఆశయం. తాడికొండ గురుకులపాఠశాలలో చదువుకున్న పాఠాలే తన జీవితాన్ని నడిపించాయంటారు డాక్టర్ అశోక్. జీవితంలో అత్యంత ఆనందాన్నిచ్చేది దేశసేవ మాత్రమేనన్న ఈయన నమ్మకాన్ని అధ్యాపక వృత్తిలో ఉన్న అమ్మ సావిత్రి, నాన్న వైపీరావులు ప్రోత్సహించారు. డాక్టర్ అశోక్ 22 ఏళ్లు దేశరక్షణ వ్యవస్థలో పనిచేశారు. జమ్ము-కాశ్మీర్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్... అనేక రాష్ట్రాల్లో దేశ సరిహద్దులో ఉద్యోగం చేసి, చెన్నైలో లెఫ్టినెంట్ కల్నల్‌గా రిటైరయ్యారు. 1985 నుంచి 2007 వరకు సాగిన ఆర్మీ ప్రస్థానంలో కొన్ని సంఘటనలు, ఆర్మీలో జీవితానికి, సాధారణ పౌరుడుగా జీవితానికి మధ్య తేడా ఆయన మాటల్లోనే... అప్పటి కాశ్మీర్! ‘‘మాది కృష్ణాజిల్లాలోని రేమల్లె గ్రామం. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత 1985లో ఆర్మీలో చేరాను. 1990 నుంచి కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి. నేను పూంచ్ సెక్టార్లో పని చేసిన రోజుల్లో ప్రతిరోజూ ఏదో ఒక ఉగ్రదాడి జరిగేది. ఆ ఘాట్‌రోడ్లలో ఏ నిమిషమైనా, ఎక్కడైనా మందుపాతర పేలవచ్చు. వాటికి వెరవకుండా ఉద్యోగం చేయడమే ప్రధానం. సైనికులకు వైద్యం చేయడం మా ఉద్యోగం. యుద్ధం లేనప్పుడు సైనికులు వార్ ఎక్సర్సైజ్ చేస్తారు, అందులో గాయపడిన వారికీ వైద్యం అందాలి. కాబట్టి ఆర్మీ డాక్టరు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, స్థానికులకు వైద్యం చేయడం మా విధి కాదు కానీ ఆసక్తి ఉంటే చేయవచ్చు. నా డ్యూటీ పూర్తయిన తర్వాత గ్రామాలకు వెళ్లి వైద్యం చేసేవాడిని. నేను అనస్థీషియాలజిస్ట్ని, కానీ ఎంతోమందికి పురుడుపోశాను. ప్రాణాపాయంలో ఉన్న వారికి చికిత్స చేశాను. చేయగలిగినంత చేయాలనే తృష్ణతో చేశాను. పొరుగుదేశ సైనికుడైనా ప్రాణం పోయాల్సిందే! మాకు కూడా మిలటరీ ట్రైనింగ్ ఇస్తారు. మిలటరీ వ్యక్తులకు వైద్యం చేయడం విధ్యుక్తధర్మం, స్థానికులకు సేవ చేయడం ద్వారా సైన్యం పట్ల వారిలో విశ్వాసాన్ని పెంచవచ్చు. పొరుగుదేశపు సైనికుడికైనా సరే వైద్యం చేయాల్సిందే... ఇందులో మొదటిది మనిషి ప్రాణం కాపాడడం డాక్టర్ ధర్మం. ప్రాణం కాపాడితే ఆ కృతజ్ఞత వారికి ఉంటుంది. ఆ వ్యక్తితో స్నేహసంబంధాలు పెంచుకుంటూ ఉగ్రవాద కార్యకలాపాల వివరాలు సేకరించవచ్చు. దేశరక్షణలో ఇదో భాగం. యూనిఫామ్‌కు దూరం! నా కళ్లు చెమర్చిన రోజది. 2007, డిసెంబర్ 16 వతేదీ వరకు పనిచేశాను, 17న మా పై అధికారి... ‘మీరు రిటైర్ అయ్యారు, ఇక యూనిఫాం ధరించక్కర్లేద’ని చెప్పినప్పుడు కళ్లనీళ్లొచ్చాయి. నేను రిటైర్ కావాలనే నిర్ణయం తీసుకునేటప్పటికి లెఫ్టినెంట్ కల్నల్ నుంచి కల్నల్‌గా ప్రమోషన్‌కు నా పేరు ఖరారైంది. కల్నల్ అయితే వైద్యం చేయడానికి వీలుండదు, కార్యనిర్వహణ విధులకే పరిమితం కావాలి. అదే సమయంలో మా పేరెంట్స్ దూరమయ్యారు. ఆ సమయంలో రక్షణ రంగాన్ని వదులుకున్నాను. సామాన్య పౌరునిగా... అదేరోజు తడ చెక్‌పోస్టు దగ్గర అలవాటుగా ఐడీకార్డు చూపించాను. ‘ఇది ఎక్స్‌సర్వీస్‌మన్ కార్డు, రాయితీలు ఉండవు’ అన్నారు. నేను చెల్లించాల్సింది పాతిక రూపాయలే కానీ నేను సాధారణ పౌరుడిని అని తెలియచెప్పిన సంఘటన అది. నిన్నటి వరకు నేను పొందిన గౌరవం నా యూనిఫామ్దే తప్ప నాది కాదు. ఇక నాకు నేనుగా నన్నో గౌరవప్రదమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చుకున్నాను. నాలోని ప్రత్యేకతలకు మెరుగుపెట్టాను. పిల్లల్లో, పెద్దవాళ్లలో దేశభక్తిని పెంపొందించే ప్రశ్నోత్తర పోటీలు (క్విజ్) నిర్వహిస్తున్నాను. లావాదేవీ లేని బంధం! పేషెంటుకి, డాక్టర్‌కి మధ్య మంచి సంబంధాలు ఉండాలంటే వారి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండకూడదు. నేను రక్షణ వ్యవస్థలో ఉద్యోగానికి వెళ్లడానికి ఇది కూడా ఒక కారణమే. ఆర్మీలో విపరీతమైన ఎండలు, గడ్డకట్టుకుపోయే చలి, ఎప్పుడైనా దాడి జరిగే నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని ఉద్విగ్నత మధ్య జీవిస్తాం. ఎవరికైనా ప్రమాదం అంచుల్లో ఉన్నప్పుడు పక్కవారితో విభేదాలు ఉండవు. ఒకవేళ అప్పటి వరకు ఉన్నా వాటిని ఆ క్షణంలో మరచిపోయి స్నేహితులవుతారు. పండుగలను అందరూ కలిసి చేసుకుంటారు. పుట్టిన రోజులకు ఇరుగుపొరుగు కూడా హడావిడి చేసేవారు. అదే ఇక్కడ పుట్టినరోజు చేసుకుంటే ‘ఇన్నేళ్లు వచ్చాక ఇంకా పుట్టినరోజు చేసుకోవడమేంటి’ అని నవ్వుకుంటారు. మన ఇంట్లో లేనివి వాళ్ల ఇంట్లో ఏమేమి ఉన్నాయో బేరీజు వేసుకుని స్నేహం చేసే వాతావరణం అక్కడ ఉండదు. ‘ఆర్మీలో ఉన్నప్పుడే బాగుంది’ అని నా భార్య విజయలక్ష్మి ఇప్పటికీ అంటోంది. నా పిల్లలు స్నిగ్ధ, స్పందన కూడా అప్పటి జీవితాన్ని ఆనందక్షణాల్లాగా గుర్తు చేసుకుంటుంటారు’’. డబ్బుసంపాదనలో మునిగిపోతే ఇన్ని ఆనందాలను కోల్పోయేవాడినంటారు డాక్టర్ అశోక్. జ్ఞానాన్ని సంపాదించుకోవడం, దానిని పంచడం ఆయన సిద్ధాంతం. - వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అది 2000 సంవత్సరం డిసెంబర్... సురాన్‌కోట్ గ్రామం. అర్ధరాత్రి రెండు గంటలప్పుడు నొప్పులు పడుతోన్న మహిళను మంచం మీద తెచ్చారు. బిడ్డ అడ్డం తిరిగింది. సిజేరియన్ చేస్తే తప్ప తల్లీబిడ్డా బతకరు. మాకు గైనకాలజీ విభాగం ఉండదు. ఆ కేసు తీసుకోవడానికి ఆర్మీ సర్జన్ సుముఖంగా లేరు. ‘నేను అనస్థీషియా నిపుణుడిగా చాలా సిజేరియన్ కేసులు చూశాను. ప్రతి స్టెప్ చెప్తాను చేయండి’ అని భరోసా ఇచ్చాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీశాం. అప్పుడా గ్రామస్థుల సంతోషం అంతా ఇంతా కాదు. - డాక్టర్ అశోక్, రక్షణ వ్యవస్థ మాజీ ఉద్యోగి -
జమ్మూకాశ్మీర్‌లో పేలుడు; ముగ్గురి మృతి
జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం ప్రమాదవశాత్తూ జరిగిన పేలుడుకు ముగ్గురు మరణించారు. ఉదంపూర్ జిల్లాలో ఓ నిర్మాణ స్థలం నుంచి పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. పంచేరి బెల్ట్‌లోని లడ్డా వద్ద ఓ మౌలిక నిర్మాణ సంస్థ పీఎంజీఎస్‌వై పథకం కింద పని పూర్తి చేసింది. దీంతో సామాగ్రిని వేరే ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమైంది. ఇందులో పేలుడు సామాగ్రి కూడా ఉంది. ఆదివారం ఉదయం సామాగ్రిని తరలిస్తుండగా పేలుడు సంభవించింది. ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. -
పాక్‌కు దీటుగా జవాబిస్తాం: షిండే
జమ్మూ/న్యూఢిల్లీ: కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మండిపడ్డారు. పాక్‌కు దీటుగా జవాబిస్తామన్నారు. మంగళవారం రాత్రి ఆర్ఎస్ పురా సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతిచెందడం, ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు గాయపడిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందిచారు. పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ 82 ఎంఎం మోర్టార్లు, భారీ ఆయుధాలతో సెక్టర్లో కనీసం 20 చోట్ల కాల్పులకు దిగినట్టు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. జమ్మూ, కాశ్మీర్ సరిహద్దులకు అదనంగా బీఎస్ఎఫ్ బలగాలను తరలిస్తామని షిండే ఢిల్లీలో చెప్పారు. 2003 నుంచి జరిగిన కాల్పుల ఉల్లంఘనల్లో ఇదే అతిపెద్ద సంఘటన అన్నారు. సరిహద్దుల్లో భద్రతపై షిండే మంగళవారం కాశ్మీర్లో పర్యటించివచ్చిన నేపథ్యంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగిపోవడంపై షిండే ఆందోళన వ్యక్తంచేశారు. గతనెలలో సాంబా ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన దాడిని అడ్డుకోవడంలో సైన్యం వైఫల్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 26న సాంబావద్ద లష్కరే ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి సహా పదిమంది సైనికులు మృతిచెందడం తెలిసిందే. మంగళవారం కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతోపాటు ఆర్మీ అధికారులతో షిండే భేటీ అయ్యారు. సాంబా తరహా ఘటన పునరావృతం కాబోదని ఆర్మీ అధికారులు షిండేకు హామీ ఇచ్చారు. -
కాల్పుల ఉల్లంఘనపై కేంద్రం ప్రత్యామ్నాయం ఆలోచించాలి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్నిసోమవారం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో పాటు పలువురు నేతలు, ఉన్నతాధికారులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఆర్పీఎఫ్, సశస్త్ర సీమ బల విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద షిండే తదితరులు నివాళి అర్పించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాళి అర్పించారు.పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అఖిలేష్.... ఖాకీల సేవల వల్లే సమాజంలో శాంతిభద్రతలు నెలకొంటున్నాయని కొనియాడారు. పాకిస్తాన్ దళాలు ఎల్వోసీ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయం ఆలోచించాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. కాల్పుల ఉల్లంఘనపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పాక్ మళ్లీ కవ్వింపులకు పాల్పడితే గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.ఇరు వైపుల నుంచి స్పందన ఉంటేనే చర్చలు సాధ్యం అవుతాయని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కాగా పాక్ కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్న జమ్మూకాశ్మీర్‌లో జాతీయ పోలీసు దినోత్సవాన్ని కాశ్మీర్ ప్రభుత్వం సోమవారం ఘనంగా నిర్వహించింది. రాజధానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఆయన నివాళి అర్పించారు.ఖాకీల సేవలను కొనియాడారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. -
పాక్‌తో మాటా మంతీ!
సంపాదకీయం: ఎప్పటిలాగే చర్చలకు ముందు అధీనరేఖ వద్దా, జమ్మూ-కాశ్మీర్‌లోనూ కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకున్నా న్యూయార్క్ లో భారత-పాకిస్థాన్ అధినేతల సమావేశం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చల సందర్భంగా పాకిస్థాన్ గురించి మన్మోహన్ ఆయనకు ఫిర్యాదుచేశారని వార్తలు వెలువడినా... దాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్‌ను ‘చాడీలుచెప్పే పల్లెటూరి పడుచు’తో పోల్చారని కాసేపు వదంతులు వచ్చినా ఈ సమావేశం సామరస్యవాతావరణంలోనే జరిగింది. ఆగస్టు నెలలో అధీనరేఖ వద్ద గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై పాకిస్థాన్ సైనికులు దాడిచేసి ఐదుగురిని బలితీసుకున్నారు. ఈ ఘటనను మరిచిపోకముందే సరిగ్గా చర్చలకు మూడురోజుల ముందు పాక్ భూభాగంనుంచి వచ్చిన ఉగ్రవాదులు రెండుచోట్ల దాడిచేసి నలుగురు జవాన్లతోసహా 12 మందిని కాల్చిచంపారు. ఈ ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరపవద్దని బీజేపీ డిమాండ్చేసింది. ఒకపక్క ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరోపక్క కాల్పులవిరమణను ఉల్లంఘిస్తూ ధూర్తదేశంగా తయారైన పాకిస్థాన్‌తో చర్చలేమిటన్నది ఆ పార్టీ ప్రశ్న. మన పొరుగున ఎవరుండాలో, వారు ఎలా ప్రవర్తించాలో మనం నిర్దేశించలేం. అయితే, ఆ పొరుగు సరిగా లేనప్పుడు దాన్ని దారికి తీసుకు రావడానికి అన్ని పద్ధతుల్లోనూ ప్రయత్నించకతప్పదు. అలాంటి ప్రయత్నాల్లో చర్చలు కూడా భాగమే. సమస్య తలెత్తుతున్నది గనుక చర్చలు వద్దనడం సరైన తర్కం అనిపించుకోదు. సమస్యలున్నప్పుడే చర్చల అవసరం మరింత పెరుగుతుంది. మన్మోహన్, నవాజ్ షరీఫ్‌ల చర్చలు ఒకరకంగా సానుకూలంగా జరిగినట్టే లెక్క. ఇలాంటి సమావేశాలు ‘ఉపయోగమేన’ని మన దేశం వ్యాఖ్యానించగా, ఈ చర్చలు ‘నిర్మాణాత్మకంగా, అనుకూలవాతావరణంలో’ జరిగాయని పాకిస్థాన్ ప్రకటించింది. అధీనరేఖ వద్ద పాకిస్థాన్ తరచు కాల్పులవిరమణను ఉల్లంఘిస్తుండటం, వారి సైన్యం ఉగ్రవాదులకు అండదండలివ్వడంవంటి అంశాలను మన్మోహన్ షరీఫ్ దృష్టికి తీసుకొచ్చారు. అధీనరేఖవద్ద కాల్పులవిరమణ కొనసాగించడానికి, శాంతి నెలకొల్పడానికి ఏంచేస్తే బాగుంటుందో నిర్ణయించడానికి త్వరలో ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స డెరైక్టర్ జనరల్స (డీజీఎంఓలు) సమావేశం జరగాలని ఈ చర్చల్లో నిర్ణయించారు. ఆ సమావేశం జరిగి, విధివిధానాలు నిర్ణయమై అమల్లోకివస్తే తదుపరి చర్చలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇప్పటికిప్పుడు ఈ సమావేశం పర్యవసానంగా ఇరుదేశాధినేతల విస్తృత చర్చలకు అవసరమైన ప్రాతిపదిక ఏర్పడలేదన్నదే మన దేశం అవగాహన. అది నిజమే కూడా. క్షేత్రస్థాయిలో తగినంత సామరస్యత ఏర్పడకుండా చర్చల కోసం చర్చలు... ఇక్కడేదో జరుగుతున్నదని చెప్పుకోవడానికి కలవడమూ వంటివి అర్ధంలేనివి. పాకిస్థాన్‌తో సమస్య ఎక్కడంటే... అక్కడి పౌర ప్రభుత్వం ఇచ్చే హామీలకు ఎలాంటి విలువా ఉండదు. భారత్‌తో సఖ్యతకు అక్కడి ప్రభుత్వం ముందడుగేసినప్పుడల్లా పాక్ సైన్యం దాన్ని వమ్ము చేస్తుంటుంది. మన దేశంతో చర్చలనేసరికి అధీనరేఖ రక్తసిక్తంకావడం, జమ్మూ-కాశ్మీర్లో ఏదోచోట ఉగ్రవాదులు చెలరేగి పోవడం ఇందుకే. తన సైన్యాన్ని తప్పుబట్టడం సాధ్యంకాదు గనుక అక్కడి ప్రభుత్వం నీళ్లు నములుతుంటుంది. వాస్తవానికి పాక్ వైపునుంచి కాల్పుల విరమణ ఉల్లంఘన, ఉగ్రవాద ముఠాలకు ప్రోత్సాహం వంటివి ఆగితే రెండు దేశాలూ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు, సహకరించుకోవాల్సిన అంశాలూ చాలా ఉన్నాయి. కాశ్మీర్ సమస్య, సియాచిన్, సర్‌క్రీక్ వివాదాలు, సింధు నదీజలాల ఒప్పందానికి సంబంధించిన అంశాలు, ఇరుదేశాలమధ్యా పెరగవలసిన వ్యాపార, వాణిజ్య సంబంధాలు, సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణావంటివి అందులో ముఖ్యమైనవి. ఈ అంశాలన్నిటిలో ఎంతో కొంత ప్రగతి సాధించ… గలిగితే క్రమేపీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. రెండు దేశాలూ ఆర్ధికంగా బలపడటానికి అవి దోహదపడతాయి. కానీ, రెండు దేశాలమధ్యా సుహృద్భావ సంబంధాలు ఏర్పడకుండా పాకిస్థాన్‌లో బలమైన శక్తులు పనిచేస్తున్నాయి. ఈ ధోరణిని నవాజ్ షరీఫ్ ఎంతవరకూ నియంత్రించగలరనే సందేహాలున్నా ఆయన ప్రధాని పదవిని స్వీకరించిన వెంటనే మాట్లాడిన మాటలు అందుకు సంబంధించి కొంత ఆశను కల్పించాయి. తమ గడ్డనుంచి ఇకపై ఉగ్రవాదులకు సహకారం అందబోదని ఆయన ప్రకటించారు. భారత్‌తో సామరస్యత నెలకొల్పుకుంటే విద్యుత్ కొనుగోలు అవకాశం ఏర్పడుతుందని, అందువల్ల తమ దేశంలో పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని షరీఫ్ భావిస్తున్నారు. 2008లో ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడిలో తమ పౌరుల ప్రమేయాన్ని నిగ్గుతేల్చేందుకు ఒక విచారణ సంఘాన్ని ముంబైకి పంపడం, సాక్ష్యాధారాలను సేకరించడం కూడా ఆయన చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారన్న నమ్మకాన్ని కలిగించింది. అయితే, నవాజ్ షరీఫ్ అధికారంలో ఇంకా కుదురుకోవాల్సే ఉంది. ఆయన అధికారంలోకొచ్చి వందరోజులు దాటుతుండగా ఇంచుమించు ప్రతిరోజూ దేశంలో ఏదో ఒకచోట ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి. త్వరలో ఖాళీ అవుతున్న సైనిక దళాల ప్రధానాధికారి పదవికి తన విధేయుణ్ణి ఎంపిక చేసుకోగలిగితే వీటిని నియంత్రించడం సులభమవుతుందని, అప్పుడు పాలనపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కలుగుతుందని నవాజ్ షరీఫ్ విశ్వసిస్తున్నారు. అది ఎంతవరకూ సాధ్యమవుతుందో ఇంకా చూడాల్సే ఉంది. ఈలోగా పాకిస్థాన్‌తో చర్చించడంద్వారా, అంతర్జాతీయంగా ఆ దేశంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకురావడంద్వారా సరిహద్దుల్లో సామరస్యత ఏర్పడేందుకు మనవైపుగా కృషి జరుగుతూనే ఉండాలి. సమస్యల పరిష్కారానికి ఇంతకు మించిన మార్గంలేదు. -
రసూల్‌కు ఐదు వికెట్లు
మైసూర్: జమ్ము కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్ (5/116) ఐదు వికెట్లతో రాణించినా... భారత్ ‘ఎ’తో జరుగుతున్న అనధికార తొలి టెస్టులో వెస్టిండీస్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు సాధించింది. ఫుదాదిన్ (86 నాటౌట్), మిల్లర్ (49) సమయోచితంగా రాణించడంతో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 135 ఓవర్లలో 429 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు చేసింది. జునేజా (47 నాటౌట్), ఖడివాలే (5 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఓపెనర్లలో లోకేశ్ రాహుల్ (46) ఓ మోస్తరుగా ఆడాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ చతేశ్వర్ పుజారా (3) విఫలమయ్యాడు. నాలుగు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన భారత్... రాహుల్, జునేజాలు మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించడంతో కుదురుకుంది. -
చైనాకు భారత్ ‘విమాన హెచ్చరిక’
న్యూఢిల్లీ: కొన్ని నెలల కిందట చైనా బలగాలు జమ్మూ కాశ్మీర్ లోని దౌలత్‌బేగ్ ఓల్డీ(డీబీఓ)లోకి చొరబడిన నేపథ్యంలో భారత వాయుసేన దీటైన హెచ్చరిక చేసింది. పెద్ద సంఖ్యలో సైనికులను, సామగ్రిని మోసుకెళ్లే ‘సీ-130జే’ రకానికి చెందిన భారీ రవాణా విమానం ‘సూపర్ హెర్క్యులెస్’ను తొలిసారిగా మంగళవారం డీబీఓ వైమానిక స్థావరంలో దింపింది. ఉదయం 6.54కు ల్యాండయిన హెర్క్యులెస్‌లో ఆర్మీ కమాండింగ్ అధికారి తేజ్బీర్ సింగ్, ‘వీల్డ్ వైపర్స్’ కమాండోలు వచ్చారు. లడఖ్ ప్రాంతంలోని అక్సాయ్ చిన్‌లో 16,614 అడుగుల(5,065 మీటర్లు) ఎత్తులో ఉన్న డీబీఓ స్థావరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వైమానిక స్థావరం. హెర్క్యులెస్ వినియోగంలోకి రావడంతో సరిహద్దులోకి జవాన్లను, యుద్ధ సామగ్రి తరలింపు, కమ్యూనికేషన్ల నిర్వహణ సజావుగా సాగనున్నాయి. ఈ విమానం 20 టన్నుల బరువును అవలీలగా మోసుకెళ్తుంది. భారత్, చైనాలు మూడేళ్ల విరామం తర్వాత చొరబాట్లు, ఇతర అంశాలపై మంగళవారమే చర్చలు జరిపిన నేపథ్యంలో ‘హెర్క్యులెస్’ను డీబీఓకు పంపడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా బలగాలు డీబీఓలోకి చొరబడడంతో ఇరు దేశ సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. -
రాజ్యసభలో కిష్ట్‘వార్’
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో తలెత్తిన మత ఘర్షణల దరిమిలా నెలకొన్న పరిస్థితులపై విపక్షాలు రాజ్యసభలో సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కిష్ట్వార్లో హింసాకాండను అరికట్టడంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. కిష్ట్వార్, పరిసర జిల్లాల్లో ఉద్రిక్తతలను కేవలం రెం డు వర్గాల మధ్య తలెత్తిన మత ఘర్షణలుగా కొట్టిపారేయలేమని, ఇవి దేశ సమైక్యతకు, సార్వభౌమత్వానికి భంగం కలి గించేలా ఉన్నాయన్నా రు. కిష్ట్వార్ వెళ్లేందుకు తనను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడా న్ని జైట్లీ తప్పుపట్టారు. ఏఐసీసీ సభ్యులు అడుగు పెట్టకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ 144 సెక్షన్ విధిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ చర్చలో మాట్లాడుతూ, కాశ్మీర్ ప్రభుత్వం హింసాకాం డను అరికట్టడంలో విఫలమైందని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డి మాండ్ చేశారు. కిష్ట్వార్లో తలెత్తినది స్థానిక శాంతిభద్రతల సమ స్య కాదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నా రు. కాగా, కాశ్మీర్ లోయలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. -
పాక్ సైన్యం దుశ్చర్యే : ఎ.కె.ఆంటోనీ
భారత జవాన్ల హత్యపై ఆంటోనీ - తొలి ప్రకటనను సవరిస్తూ పార్లమెంటులో ప్రకటన - భారత్-పాక్ సంబంధాలపై ప్రభావముంటుంది - బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందే - భారత్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయరాదు - పాక్‌కు రక్షణ మంత్రి ఆంటోనీ హెచ్చరిక - ఉగ్ర సంస్థలను నిర్మూలించాలని డిమాండ్ - స్వాగతించిన సుష్మ.. పెదవి విరిచిన శివసేన మంగళవారం కాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద పలువురు ఉగ్రవాదులు పాకిస్థాన్ సైనికుల యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులతో కలిసి భారత జవాన్లపై దాడిచేశారు. ... నాకు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదులు దాడి చేశారనే తెలుసు. పూర్తి సమాచారం అందేవరకు ఒక నిర్ణయానికి రాకూడదు. దౌత్యమార్గంలో పాక్‌కు భారత నిరసన తెలిపాం. - లోక్‌సభలో రక్షణమంత్రి ఆంటోనీ గురువారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి ఒక ముఠా నియంత్రణ రేఖను దాటివచ్చి మన వీర జవాన్లపై దాడిచేసి హత్యచేసిన ఘటనలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రత్యేక బృందాల పాత్ర ఉందని స్పష్టమైంది. భారత్ సహనాన్ని అలసత్వంగా భావించరాదు. మా సాయుధ బలగాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదు. ఈ విషాదానికి కారకులైన పాకిస్థాన్‌లోని వ్యక్తులు, ఇంతకుముందు ఇద్దరు సైనికులను కిరాతకంగా హత్యచేసిన వారిని శిక్షించకుండా వదలకూడదు. న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వద్ద మంగళవారం ఐదుగురు భారత జవాన్లను హతమార్చిన దురాగతంలో పాకిస్థాన్ సైన్యం పాత్ర ఉన్నట్టు స్పష్టమైందని రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ ప్రకటించారు. ఈ ఘటన పర్యవసానంగా నియంత్రణ రేఖపై భారత వైఖరిలో, పాకిస్థాన్‌తో సంబంధాల్లో ప్రభావం ఉంటుందని స్పష్టంచేశారు. పాకిస్థాన్‌పై కఠిన స్వరం వినిపిస్తూ.. భారత్ పాటిస్తున్న సంయమనాన్ని అలసత్వంగా పరిగణించరాదని, భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదని హెచ్చరించారు. కాశ్మీర్ సరిహద్దు వద్ద పూంచ్ సెక్టార్లో భారత జవాన్లను హతమార్చింది ఉగ్రవాదులు, పాక్ సైనిక దుస్తుల్లో ఉన్న దుండగులని మంగళవారం లోక్‌సభలో ఆంటోనీ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాల నుంచి, ప్రత్యేకించి బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు, నిరసన వ్యక్తమవడం తెలిసిందే. పాక్ సైన్యానికి ఆయన క్లీన్చిట్ ఇచ్చారని ఆరోపిస్తూ రెండు రోజులుగా పార్లమెంటును అవి స్తంభింపచేశాయి. దాంతో తొలి ప్రకటనను సవరిస్తూ గురువారం పార్లమెంటులో ఆయన తాజాగా ప్రకటన చేశారు. తొలు త చేసిన ప్రకటన అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చేసిందని, అనంతరం సైనికదళాధిపతి ఘటనా ప్రాంతానికెళ్లి వివరాలు సేకరించారన్నారు. ప్రభావముంటుంది... ‘‘నియంత్రణ రేఖకు అవతల పాకిస్థాన్ వైపు నుంచి.. పాక్ సైన్యం మద్దతు, సహాయం, తోడ్పాటు లేకుండా.. అప్పుడప్పుడూ పాక్ సైన్యం నేరుగా పాత్ర పోషించకుండా ఏమీ జరగదని మనకందరకూ తెలుసు’’ అని ఆంటోనీ వ్యాఖ్యానించారు. ‘‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి ఒక ముఠా నియంత్రణ రేఖను దాటివచ్చి మన వీర జవాన్లను హత్యచేసిన దాడిలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రత్యేక బృందాల పాత్ర ఉందని ఇప్పుడు స్పష్టమైంది’’ అని చెప్పారు. ఎలాంటి కవ్వింపూ లేకుండా జవాన్లపై జరిపిన కిరాతక దాడి భారతీయులందరినీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందని పేర్కొన్నారు. ‘‘మా సహనాన్ని అలసత్వంగా భావించరాదు. మా సాయుధ బలగాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదు. ఈ విషాదానికి కారకులైన పాకిస్థాన్‌లోని వ్యక్తులు, ఇంతకుముందు ఇద్దరు సైనికులను కిరాతకంగా హత్యచేసిన వారిని శిక్షించకుండా వదలకూడదు. ఉగ్రవాద వ్యవస్థలను, సంస్థలను, వాటి సదుపాయాలను నిర్మూలించటంలో పాకిస్థాన్ నిబద్ధదతో కూడిన చర్యలు చూపాలి. 2008 నవంబర్ నాటి ముంబై ఉగ్రవాద దాడికి బాధ్యులైన వారిని సత్వరమే చట్టం ముందు నిలబెట్టటానికి ప్రత్యక్ష చర్యలు చేపట్టాలి’’ అని పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు. ఆంటోనీ ప్రకటనను లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ వెంటనే స్వాగతించారు. రక్షణమంత్రి తన పొరపాటును అంగీకరించి, దానిని సరిదిద్దుకున్నారంటూ సంతోషం వ్యక్తంచేశారు. ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సుష్మా వ్యాఖ్యలను ఆంటోనీ ముకుళిత హస్తాలతో స్వాగతించారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన మాత్రం ఆంటోనీ తాజా ప్రకటనపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌తో చర్చలు జరపరాదని ఆ పార్టీ నేత అనంత్ గీతె పేర్కొన్నారు. రాజ్యసభలోనూ ఆంటోనీ ఇదే ప్రకటన చదవబోగా గందరగోళం రేగడంతో సభ వాయిదా పడింది. రక్షణమంత్రి సోమవారం రాజ్యసభలో మళ్లీ ఈ ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్‌శుక్లా చెప్పారు. భారత జవాన్ల హత్య ఉదంతం పూర్వాపరాలను సైనికాధిపతి జనరల్ బిక్రమ్‌సింగ్ ఆంటోనీకి వివరించారు. లోక్‌సభ సోమవారానికి వాయిదా: భారత జవాన్ల హత్య, తెలంగాణ తదితరాలపై తీవ్ర గందరగోళం తలెత్తటంతో లోక్‌సభను సోమవారం వరకూ వాయి దా వేశారు. ఉదయం సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు కొందరు ఆంధ్రప్రదేశ్‌ను సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. స్పీక ర్ మీరాకుమార్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవటంతో ఆమె తొలుత మధ్యాహ్నం వరకూ సభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత ఆంటోనీ ప్రకటన చేశారు. అనంతరం మళ్లీ గందరగోళం తలెత్తటంతో సభను 2 గంటల వరకూ వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశమైనా కూడా కొద్దిసేపటికే డిప్యూటీ స్పీకర్ కరియాముండా సభను సోమవారానికి వాయిదా వేశారు. -
అధీనరేఖ మళ్లీ రక్తసిక్తం!
సంపాదకీయం: విఫల రాజ్యం తనకు తానే కాదు... ఇరుగు పొరుగు దేశాలకూ ఎంత ముప్పుగా పరిణమిస్తుందో పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. జమ్మూ-కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో అధీన రేఖ ఆవలి నుంచి వచ్చిన సాయుధ ముఠా గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై సోమవారం రాత్రి కాల్పులు జరిపి ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఆ వచ్చినవారు పాకిస్థాన్ సైనికులా, ఉగ్రవాదులా అన్న అంశంపై జరుగుతున్న చర్చ సంగతి అలా ఉంచితే పాకిస్థాన్ భూభాగం నుంచి వచ్చినవారు ఈ ఘటనకు పాల్పడ్డారన్నది మాత్రం వాస్తవం. పూంచ్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో తమ సైన్యం ప్రమేయమేమీ లేదని పాకిస్థాన్ ప్రకటించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్‌లో జరుగుతున్న వివిధ ఉగ్రవాద ఘటనలకు మూలాలు తమవద్దే ఉన్నాయని పదే పదే రుజువవుతున్నా వాటిని నిరోధించడానికి పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోలేకపోతోంది. తాజా ఘటన ఆ పరంపరకు కొనసాగింపేనని గ్రహించి తన వైఫల్యాన్ని అంగీకరించక పోగా ‘మా సైన్యం కాల్పులకు దిగలేద’ని చెబితే సరిపోతుందని పాక్ ప్రభుత్వం ఎలా అనుకుంటున్నదో అర్ధం కాదు. 2003లో అధీన రేఖ వద్ద కాల్పుల విరమణ ప్రకటించాక మూడు నాలుగేళ్లపాటు సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి. అటు తర్వాత అడపా దడపా కాల్పులు, మిలిటెంట్ల చొరబాటు యత్నాల వంటివి చోటుచేసుకోవడం మళ్లీ మొదలయ్యాయి. గత రెండేళ్లుగా అధీనరేఖ వద్ద పరిస్థితి మొదటికొస్తున్న సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. గత ఏడాది కాల్పుల విరమణకు సంబంధించి అక్కడ మొత్తం 44 ఘటనలు చోటుచేసుకోగా ఈ ఏడాది సోమవారం ఘటనతో కలుపుకుంటే ఇప్పటికే 57 ఘటనలు జరిగాయి. ఈ జనవరిలో మెంధార్ సెక్టార్లో పాక్ దళాలు ఇద్దరు భారత జవాన్లను కాల్చిచంపి వారిలో ఒకరి తలను ఎత్తుకుపోయాయి. మన సైన్యం చెబుతున్నదాన్ని బట్టి ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలోనూ 100 మంది ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు. ఈ రెండు నెలల కాలంలోనే మన సైన్యం 19 మంది ఉగ్రవాదులను కాల్చిచంపింది. ఇవన్నీ అధీనరేఖ వద్ద ఆనాటికానాటికి పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నప్పుడల్లా మన ప్రభుత్వం పాకిస్థాన్‌కు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నది. కానీ, పరిస్థితి నానాటికీ దిగజారుతోంది తప్ప మెరుగుపడటం లేదు. పాకిస్థాన్‌తో వచ్చిన సమస్యేమిటంటే అది భౌగోళికంగా ఒక ప్రాంతమే అయినా, దానిపై పటిష్టమైన నియంత్రణగల రాజ్యవ్యవస్థ అక్కడ కొరవడింది. అక్కడి పౌర ప్రభుత్వం అధీనంలో ఉండటాన్ని సైన్యం నామోషీగా భావిస్తుంది. గత ఐదేళ్లుగా అలా చెప్పుచేతల్లో ఉంటున్నట్టు కనబడుతున్నా అది అంతంత మాత్రమే. ఇలాంటి అనిశ్చితిలో పాకిస్థాన్‌లో ఏమైనా జరగవచ్చు. ఉగ్రవాది బిన్ లాడెన్ రాజధాని నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్నా ఏళ్ల తరబడి ఆ సంగతిని గ్రహించలేని నిస్సహాయ స్థితి పాక్ ప్రభుత్వానిది. ఎక్కడో ఉన్న అమెరికా సైన్యం ఆకాశమార్గంలో వచ్చి లాడెన్‌ను చంపి శవాన్ని సైతం పట్టుకెళ్లాకగానీ అక్కడి పాలకవ్యవస్థకు తెలియలేదు. రెండు నెలలక్రితం పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వస్తుందేమోనని అందరూ ఆశించారు. దానికితోడు షరీఫ్ కూడా అలాగే మాట్లాడారు. ఇరుదేశాల సంబంధాల్లోనూ ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. భారత్ లక్ష్యంగా సాగుతున్న ఉగ్రవాద దాడులకు తమ భూభాగం వేదిక కాకుండా గట్టి చర్యలు తీసుకుంటానని చెప్పారు. కానీ, మాటలు చెప్పినంత వేగంగా పరిస్థితులు మారలేదని అధీన రేఖ వద్ద యథావిధిగా కొనసాగుతున్న దుందుడుకు చేష్టలు నిరూపిస్తున్నాయి. భారత్‌తో సయోధ్యకు పాక్ నాయకత్వం ప్రయత్నించి నప్పుడల్లా ఆ వాతావరణాన్ని చెడగొట్టడానికి సైన్యం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు జరిగిన ఘటన కూడా దానికి కొనసాగింపే కావచ్చు. ఎందుకంటే, వచ్చే నెలలో ఇరు దేశాల ప్రధానులూ ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా కలవాల్సి ఉంది. దానికితోడు పాకిస్థాన్ సైనిక దళాల చీఫ్ అష్ఫాక్ కయానీ రిటైర్ కావాల్సి ఉంది. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశం ప్రస్తుతం షరీఫ్ పరిశీలనలో ఉంది. షరీఫ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు, భారత ప్రధానితో చర్చలకు ముందు ఆయన్ను ఇరకాటంలో పెట్టేందుకు సైన్యం ప్రయత్నించి ఉండవచ్చు. ఇలాంటి సమయంలో సమష్టిగా వ్యవహరించి, భారత్ నిరసనను పాకిస్థాన్‌కు ముక్తకంఠంతో తెలియజెప్పాల్సిన ప్రస్తుత తరుణంలో యూపీఏ ప్రభుత్వం తొట్రుపాటు పడిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అధీన రేఖ ఘటనలో తమ సైన్యం ప్రమేయంలేదని పాక్ చేతులు దులుపుకుంటే, మన రక్షణ మంత్రి ఆంటోనీ ‘ఉగ్రవాదులు, పాక్ సైనిక దుస్తుల్లో ఉన్న మరికొందరు’ కాల్పులు జరిపారని ప్రకటించారు. ఆయన ఆంతర్యమేమిటోగానీ, ఆ ప్రకటన సారాంశం మాత్రం పాక్ సైన్యానికి ప్రమేయంలేదని చెప్పినట్టే ఉంది. పాక్ సైన్యం కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నదని అంతకు గంట క్రితమే జమ్మూ నుంచి సైనిక ప్రతినిధి ప్రకటించారు. ఇలా భిన్నస్వరాలు వినబడటానికి కారణమేమిటి? పాక్ సైన్యమూ, దాని కనుసన్నల్లో నడిచే ఐఎస్ఐ ఉగ్రవాదులకు తోడ్పాటునంది స్తున్నట్టు పదే పదే రుజువవుతున్నా ఇంత ‘జాగ్రత్తగా’ ప్రకటన చేయాల్సిన అవసరం ఆంటోనికి ఏమొచ్చింది? ఇలాంటి అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరిం చకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై గట్టిగా ఒత్తిడి తెచ్చి, అక్కడి సైన్యం తీరుతెన్నులను ప్రపంచానికి వెల్లడించడం ద్వారా వారిని ఏకాకులను చేయవలసిన ప్రస్తుత తరుణంలో తడబాట్లకు తావుండకూడదు. దౌత్యపరంగా గట్టిగా వ్యవహరించాల్సిన తరుణంలో మనల్ని మనం బలహీనపరుచుకోకూడదు.