న్యూఢిల్లీ : దేశ రాజధానిలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్నిసోమవారం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో పాటు పలువురు నేతలు, ఉన్నతాధికారులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఆర్పీఎఫ్, సశస్త్ర సీమ బల విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద షిండే తదితరులు నివాళి అర్పించారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాళి అర్పించారు.పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అఖిలేష్.... ఖాకీల సేవల వల్లే సమాజంలో శాంతిభద్రతలు నెలకొంటున్నాయని కొనియాడారు.
పాకిస్తాన్ దళాలు ఎల్వోసీ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయం ఆలోచించాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. కాల్పుల ఉల్లంఘనపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పాక్ మళ్లీ కవ్వింపులకు పాల్పడితే గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.ఇరు వైపుల నుంచి స్పందన ఉంటేనే చర్చలు సాధ్యం అవుతాయని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
కాగా పాక్ కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్న జమ్మూకాశ్మీర్‌లో జాతీయ పోలీసు దినోత్సవాన్ని కాశ్మీర్ ప్రభుత్వం సోమవారం ఘనంగా నిర్వహించింది. రాజధానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఆయన నివాళి అర్పించారు.ఖాకీల సేవలను కొనియాడారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు.
కాల్పుల ఉల్లంఘనపై కేంద్రం ప్రత్యామ్నాయం ఆలోచించాలి
Published Mon, Oct 21 2013 1:22 PM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
Advertisement