Police Commemoration Day
-
పోలీస్ అమరవీరుల దినోత్సవం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నేడు మన ప్రభుత్వం తరపున నిర్వహించాం. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సోదరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను’’ అంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాట యోధుడే పోలీస్. అధునాతన వ్యవస్థలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవలసిన బాధ్యత నేటి పోలీసులపై ఉంది. నేర నిరోధం, నేర దర్యాప్తులో మన రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. ఈ విభాగంలో నియమించిన 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణుల పనితీరు మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది’’ అని సీఎం జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: ఇస్రో బృందానికి సీఎం జగన్ అభినందనలు విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నేడు మన ప్రభుత్వం తరపున నిర్వహించాం. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సోదరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మాట… pic.twitter.com/rEuY4guin4 — YS Jagan Mohan Reddy (@ysjagan) October 21, 2023 -
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు చెక్కులు
-
పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
పోలీస్ సంస్మరణ సభలో సీఎం వైఎస్ జగన్ స్పీచ్
-
పోలీసు సంస్మరణ దినోత్సవంలో ఏపీ డీజీపీ స్పీచ్
-
అమరవీరులకు నివాళులు అర్పించిన మంత్రి తానేటి వనిత
-
పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
-
విజయవాడలో నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
-
విజయవాడ : ఆయుధం.. అదరహో (ఫొటోలు)
-
Police Commemoration Day: ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్లైన్ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్ షా 90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ‘ఉగ్రవాదం, ఉగ్రవాదులకు సంబంధించిన స్పష్టమైన ఉమ్మడి నిర్వచనం ఇచ్చేందుకు అన్ని దేశాలు కలిసి రావాలి. అలా జరిగినప్పుడే ఉగ్రవాదులపైనా, ఉగ్రవాదంపైన అంతర్జాతీయంగా కలిసికట్టుగా పోరాడగలం. ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం సాగించడం, మంచి, చెడు ఉగ్రవాదాల మధ్య తేడాను గుర్తించడం, ఉగ్ర దాడులను చిన్నవి, పెద్దవి అంటూ వర్గీకరించడం ముందుగా జరగాలి’అని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సాగే ఉగ్రవాద సిద్ధాంతాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా భావించలేమంటూ ఆయన...ఉగ్రవాదంపై దీర్ఘకాలంలో నిబద్ధత, సమగ్రతతో కూడిన పోరాటం సాగించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. ‘చాలా దేశాల్లో ఇంటర్‌పోల్ ఏజెన్సీ, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద వ్యతిరేక సంస్థలన్నీ ఏకతాటిపైకి రావాలి’అని అమిత్ షా అభిప్రాయ పడ్డారు. దీనికోసం ఇంటర్‌పోల్ శాశ్వత కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నిఘా సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటూ ఉండాలన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అవసరమైన సాంకేతిక, మానవ వనరులను ఇంటర్‌పోల్‌తో పంచుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య ఉమ్మడి, పరస్పర సహకారం అవసరమని సీబీఐ డైరెక్టర్ సుబోధ్ జైశ్వాల్ అన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలు తగ్గుముఖం దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు హాట్స్పాట్లుగా పేరున్న చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అశాంతికి నెలవైన ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు నేడు 70% వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలతోపాటు జమ్మూకశ్మీర్లోనూ భద్రతాపరంగా ఇదే రకమైన పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
మహిళల భద్రతకోసం సీఎం జగన్ ప్రత్యేక చర్యలు
-
పోలీసు అమరవీరులకు వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున సెల్యూట్ : సీఎం జగన్
-
మనందరి సైనికుడు పోలీస్: సీఎం జగన్
మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి ఫలాలు ఇవాళ గ్రామ గ్రామాన ఇంటింటికీ చేరుతున్నాయి. దీని వల్ల గతంలో మావోయిజం, వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అందరి మనసులు గెల్చుకుని, అండగా నిలబడ్డాం. తద్వారా శాంతిని, భద్రతను పెంచుకోగలిగాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘సమాజంలో దుష్టశక్తులను ఎదురిస్తున్నప్పుడు, శాంతిభద్రతలను కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలను సైతం లెక్కచేయని మనందరి సైనికుడే పోలీసు సోదరుడు. శాంతిభద్రతలను కాపాడటంలో భాగంగా తనువు చాలించిన ప్రాణ త్యాగధనులకు సెల్యూట్ చేస్తున్నా..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ పవిత్రమైన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పోలీసు అమర వీరుల స్థూపానికి నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధి నిర్వహణలో పోలీసులు అనుకోని సంఘటనలు ఎన్నింటినో ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారికి సమాజం, ప్రభుత్వం తరఫున మనమంతా అండగా ఉండాలని, ఉంటామని స్పష్టం చేశారు. కర్తవ్యాన్ని దైవంగా భావించి 1959 అక్టోబర్ 21న చైనా సైనికులతో సాహసోపేత పోరాటంలో ప్రాణాలర్పించిన కరణ్‌సింగ్ స్ఫూర్తితో పోలీసు అమరవీరుల సంస్మరణ దినానికి 63 ఏళ్ల క్రితం నాంది పలికారన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల్ని స్మరించుకుని, వారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అమర వీరులకు, త్యాగధనులైన పోలీసు కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున, ప్రభుత్వం తరఫున సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. సంవత్సర కాలంలో దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో దాదాపు 261 మంది పోలీసులు అమరులయ్యారని, ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారని చెప్పారు. వీరిలో ముగ్గురు పోలీసులు కోవిడ్ సమయంలో చనిపోయారని తెలిపారు. వీరందరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ పోలీసులకు సంబంధించి ఇంకా చేయాల్సినవి.. పెండింగ్‌లో ఉన్నాయని తెలుసు. వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలన్నది నా మనసులో మాట. ఈ మధ్య కాలంలో వీక్లీ ఆఫ్ అమలవుతోందా? అని డీజీపీని అడిగాను. సిబ్బంది కొరత వల్ల అనుకున్న స్థాయిలో దాన్ని అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. వెంటనే 6,511 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేశాం. పోలీసు శాఖ కష్టనష్టాలు తెలిసిన ప్రభుత్వంగా, వారి బాగోగుల మీద శ్రద్ధ పెట్టే ప్రభుత్వంగా శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి, పని ఒత్తిడి తగ్గించడానికి భారీ నియామకాలకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేశాం. ఈ స్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ జరగలేదు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం 2,700 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. మన ప్రభుత్వం చేపట్టిన కొత్త పోస్టుల భర్తీలో భాగంగా చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐఆర్ బెటాలియన్ దళాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పోలీసు శాఖకు అనుసంధానంగా ఉన్న హోంగార్డుల గౌరవ వేతనం కూడా మన హయాంలోనే పెంచాం. పోలీసు ఉద్యోగాలలో వీరికి రిజర్వేషన్లు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఇదే పోలీసు శాఖలో 16 వేల మంది చెల్లెమ్మలను మహిళా పోలీసులుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే నియమించాం. పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చాం. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ప్రతి జిల్లాలో చేపట్టిన విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో దాదాపు 1.33 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది. దాదాపు 1.17 కోట్ల అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది. ఆపదలో ఉన్నామని 23,039 మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్ ద్వారా సమాచారమిస్తే పోలీస్ అన్నదమ్ములు వెంటనే వెళ్లి వారికి తోడుగా నిలబడ్డారు. 2,323 కేసులు పెట్టారు. 1,237 రెస్క్యూ ఆపరేషన్లు చేసి ఆపద జరగకముందే అక్కచెల్లెమ్మలను రక్షించారు. ఇలాంటి పరిస్థితులను రాష్ట్రంలో మొట్టమొదటిసారి చూస్తున్నాం. దిశ యాప్ ద్వారా పోలీసు సోదరుడు తనకు తోడుగా ఉన్నాడన్న భరోసా అక్కచెల్లెమ్మలకు కల్పించగలిగాం. మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాల భద్రతే లక్ష్యం శాంతిభద్రతల పరిరక్షణ, మహిళలు, పిల్లలు, అణగారిన సామాజిక వర్గాల భద్రత మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ విషయంలో రాజీ పడొద్దని పోలీసు సోదరులందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక దళిత మహిళ వనితమ్మ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఉన్న సుచరితమ్మ కూడా దళిత మహిళే. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, అణగారిన వర్గాలకు ఎంతగా తోడుగా నిలిచిందో.. భవిష్యత్తులోనూ నిలవబోతోందని చెప్పడం కోసమే ఈ విషయం చెబుతున్నా. పోలీసులకు వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు ఈ ఏడాది నుంచి పోలీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డును అందించనున్నాం. ఆపదలో ఉన్న వారికి, నేరం సంభవించక మునుపే నిమిషాల్లోనే అక్కడకి చేరుకుని రక్షించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న ఐదుగురు పోలీసులను ఎంపిక చేసి ఈ అవార్డు ఇవ్వబోతున్నాం. మూడేళ్లలో మెరుగుపడిన పోలీసుల పనితీరు ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు గత మూడేళ్లలో మెరుగు పడింది. ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.. మహిళలపై నేరాలకు సంబంధించి విచారణకు పట్టే సమయాన్ని గత ప్రభుత్వంలో కంటే గణనీయంగా తగ్గించగలిగాం. 2017లో 160 రోజులు పడితే.. 2018లో 164 రోజులు పట్టింది. మన ప్రభుత్వం వచ్చాక 2021లో అది 79 రోజులకు తగ్గింది. ఈ ఏడాదికి 42 రోజులకే తగ్గించగలిగాం. తద్వారా దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టే ఒక గొప్ప మార్పు ఇవాళ రాష్ట్రంలో కన్పిస్తోంది. దీంతో పాటు గొప్ప జవాబుదారీతనం కూడా కన్పిస్తోంది. మన పోలీసులు తీసుకొచ్చిన మార్పు ఇది. మనం తీసుకున్న అనేక చర్యలతో ప్రజల్లో చైతన్యం (అవేర్నెస్ క్రియేట్) పెంచగలించాం. టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చి.. నేరానికి సంబంధించి ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాం. ఫిర్యాదుదారుడికి తోడుగా నిలుస్తున్నాం కాబట్టే ఫిర్యాదులు పెరిగి.. నేరాలు తగ్గుముఖం పట్టాయి. కష్ట సమయంలో గుర్తొచ్చే స్నేహితుడు పోలీస్ కష్ట సమయంలో మొదట గుర్తొచ్చే స్నేహితుడు పోలీస్. పోలీస్ సిబ్బంది పగలనక, రాత్రనక విధులు నిర్వర్తిస్తున్నారు. అటువంటి గొప్ప బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య తగ్గింది. ఆయా ప్రాంతాల్లో యువత ఎక్కువగా జనజీవన స్రవంతిలో కలిసి అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే.. అందులో పోలీసుల కృషి మరువలేనిది. ఏదైనా ప్రమాదం, ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సహాయక చర్యలను అందించడంలోనూ పోలీసులు అంకిత భావంతో పని చేస్తున్నారు. – తానేటి వనిత, రాష్ట్ర హోం శాఖ మంత్రి సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహం మరువలేనిది రాష్ట్రంలో పోలీసులు గురుతర బాధ్యతలను నిర్వర్తించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయసహకారాలు, ప్రోత్సాహం మరువలేనివి. మతతత్వం, ఉగ్రవాదం, అసాంఘిక కార్యక్రమాలు, చాందసవాదం వంటి అనేక సమస్యలతో పోలీసులు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసేలా సీఎం.. టెక్నాలజీని సమకూర్చారు. మన సైబర్ డేటా సెంటర్‌ను దేశం లోని అన్ని రాష్ట్రాలకు అనుసంధానిస్తూ పాస్‌వర్డ్‌ను అన్ని జిల్లాలకు అందజేశాం. తద్వారా ఎక్కడైనా ఆన్లైన్ మోసాలు జరిగితే నేరగాళ్లను సులువుగా గుర్తించడానికి వీలుంటుంది. సైబర్ కేసులను డీల్ చేయడానికి అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నాం. నాటుసారా నుంచి 80% గ్రామాలకు విముక్తి కల్పించాం. విశాఖ–ఒడిశా సరిహద్దుల్లో 7,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశాం. ప్రభుత్వ సహకారంతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం. – రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ ‘అమరులు వారు’ పుస్తకం ఆవిష్కరణ ‘అమరులు వారు‘ అనే పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది అమరులైన పోలీస్ కుటుంబాలకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, ఆర్టీసీ వీసీ, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దేశంలోనే రాష్ట్ర పోలీస్ భేష్: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఘననివాళులు అర్పించారు. గురువారం గోషామహల్లో నిర్వహించిన ప్లాగ్ డే కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు పలువురు రిటైర్డ్ డీజీపీలు, సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, అమర పోలీసుల కుటుంబ సభ్యులు హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ‘అమరులు వారు’పుస్తకాన్ని హోంమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న పటిష్టమైన పోలీసింగ్ వల్లనే మెరుగైన శాంతి భద్రతలున్నాయని, భద్రతలో పోలీస్ శాఖ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే మన రాష్ట్రంలో క్రైమ్ రేటు అతి తక్కువగా ఉందని వివరించారు. కరోనా కారణంగా విధినిర్వహణలో రాష్ట్రంలో మొత్తం 62 మంది పోలీసులు మరణించారని, వీరి కుటుంబాలకు అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి మహమూద్ ప్రాణత్యాగానికి వెనుకాడం... అమరవీరుల దినోత్సవం సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరన్న విషయాన్ని అమరులైన పోలీసులు సమాజానికి గుర్తుచేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతికత ద్వారా శాంతి భద్రతలను కాపాడుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8.25 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. -
సలాం... పోలీస్
-
వారి రక్షణే మా ప్రాధాన్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేరం చేసిన ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. సంఘ విద్రోహులు, తీవ్రవాదాన్ని ఉపేక్షించొద్దని చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశమంతా పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు. కోవిడ్ సమయంలో పోలీసులు అమూల్యమైన సేవలు అందించారు. రాష్ట్ర హోంమంత్రిగా మహిళను నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్స్టేషన్లను తీసుకొచ్చాం. దిశా బిల్లును కేంద్రాని కూడా పంపించాం. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తాం. నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తాం. పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తాం’అని సీఎం జగన్ పేర్కొన్నారు. (చదవండి: పోలీస్ అమరవీరులకు సీఎం జగన్ నివాళి) అంతకుముందు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ‘అనేక మంది పోలీసులు వీరమరణం పొందారు. పోలీసులందరికీ వారు ఆదర్శంగా నిలిచారు. కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారు. కరోనాతో మృతిచెందిన పోలీసులకు సీఎం రూ.50లక్షలు ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్, హోంగార్డుల జీతాల పెంపులాంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం. దిశా లాంటి చట్టాలు తెచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాం. టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీకి 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. సవాళ్లు ఎదుర్కోవడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు’ అని డీజీపీ అన్నారు. వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి బాలికలకు అవగాహన కల్పించామని తెలిపారు. పోలీస్ సేవా యాప్ కూడా తీసుకొచ్చామని హోంమంత్రి పేర్కొన్నారు. -
తీవ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించవద్దు: సీఎం వైఎస్ జగన్
-
పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం జగన్
-
మెరుగైన సమాజానికి కృషి చేయండి
-
పోలీసు అమరవీరులకు సెల్యూట్: సీఎం జగన్
సాక్షి, విజయవాడ : పేదవారు సైతం వివక్షకు గురికాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళ్లగలిగినపుడే పోలీసు వ్యవస్థ మీద గౌరవం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నా అని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సంస్మరణ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించి... ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణకై చైనా సైన్యం దాడిలో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందిన పోలీసు అధికారి కరణ్‌సింగ్ సహా పదిమంది సీఆర్పీఎఫ్ సిబ్బంది త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. అలాంటి అమరవీరులు అందరికీ ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నా అన్నారు. ఇక మెరుగైన పోలీసు వ్యవస్థ కోసం ప్రతీ పోలీసు సోదరసోదరీమణులు నిరంతరం కృషి చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలు దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటివారికైనా మినహాయింపు ఉండకూడదు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ఎంతవారినైన చట్టం ముందు నిలబెట్టమని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సమావేశంలోనే చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కో రూల్ ఉండకూడదు. చట్టం అనేది అందరికి ఒకటే.. అది కొందరికి చుట్టం కాకూడదు. పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు. తొలి రాష్ట్రం మనదే.. సీఎం జగన్ తన ప్రసంగం కొనసాగిస్తూ.. ‘పోలీసులు సెలవులు లేకుండా కష్టపడుతున్నారని నాకు తెలుసు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించాం. అలా చేసిన తొలి రాష్ట్రం మనదే. వారంలో ఒకరోజు పోలీసులు తమ కుటుంబంతో గడిపితే మానసికంగా బలంగా ఉంటారు. లంచగొండితనం, అవినీతి, రౌడీయిజంపై నిజాయితీగా మీరు యుద్ధం చేయాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోంగార్డుల జీతాలను రూ. 18 వేల నుంచి రూ. 21 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. హోంగార్డులు మరణిస్తే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తొలి రాష్ట్రం కూడా మనదేనని గర్వంగా చెబుతున్నా. విధి నిర్వహణలో హోంగార్డులు మరణిస్తే రూ. 30 లక్షలు, పోలీసులు మరణిస్తే 40 లక్షల ఇన్స్యూరెన్స్ కవరేజ్ సదుపాయాన్ని తీసుకొచ్చాం. రిటైర్డు సిబ్బందికి కూడా బీమా వర్తిస్తుంది. ఇందుకుగానూ కృషి చేసిన హోం మంత్రి, డీజీపీ సవాంగ్‌కు అభినందనలు’ అని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం పోలీసులు కృషి చేయాలని.. అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కన్నీళ్లు వస్తున్నాయి: హోం మంత్రి సుచరిత పోలీసులు త్యాగానికి నిలువుటద్దం అని.. వారి త్యాగాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. శాంతి భద్రతలు పర్యవేక్షించే హోం మంత్రిగా తనకు సీఎం జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగాలు కల్పించి పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బాలికలు, మహిళ సంరక్షణ కోసం మహిళ మిత్ర ఏర్పాటు చేశామని వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేను పబ్లిక్ సర్వెంట్‌ని: డీజీపీ సవాంగ్
అమరావతి : ‘పోలీసులపై రాజకీయ నాయకులు చేసే స్టేట్మెంట్లు పట్టించుకోనవసరం లేదు. నేను పబ్లిక్ సర్వెంట్‌ని, నన్ను కలవడానికి వచ్చిన వారిని తప్పకుండా కలుస్తాను. దురదృష్టవశాత్తు మీటింగ్‌ల వల్ల ఏదో ఒకరోజు కార్యాలయంలో అందుబాటులో లేకపోతే.. దానికే డీజీపీ అందుబాటులో ఉండరు అంటే ఎలా’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జపుకుంటున్నాం. అమరలైన పోలీసుల త్యాగాలు మరువలేనివి. గత వారం రోజులుగా పోలీసుల సేవలు తెలియపరిచేలా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించాం. 2511 పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన 1,81,315 మంది విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. రహదారి భద్రత, సిటిజన్ సెంటర్ సర్వీస్, డ్రోన్స్, టెక్నాలజీ పోలిసింగ్, డయల్ 100, క్లూస్ టీమ్స్, ఆయుదాల వంటి వాటి గురించి తెలియజేశాం. పోలీసుఅమరవిరుల స్మరణదినం సందర్బంగా 10,513 మంది పోలీసులు, ప్రజలు రక్తదానం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పోలీసులకు కల్పించిన వీక్లీ ఆఫ్‌ల వల్ల 62,000 కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. పోలీసుల వీక్లీ ఆఫ్లకు సంబంధించి ఒక యాప్‌ను త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. పోలీసు కుటుంబాల ఆరోగ్యం కోసం ఆరోగ్య భద్రత స్కీమ్ బాగా ఉపయోగపడుతోంది. పోలీసులు విధి నిర్వహణలో మరణిస్తే దాదాపు 40 లక్షల ఇన్స్యూరెన్స్ అందిస్తున్నాం. దేశంలోనే మొదటిసారి ఇంత పెద్ద మొత్తం ఏపీలోనే అందిస్తున్నాం. హోంగార్డ్స్కు రోజూవారీ వేతనం రూ.600 నుంచి రూ.710 వరుకు పెంచాం.1 5,000 మంది హోంగార్డులకు ప్రయోజనం చేకూర్చేలా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం ప్రారంభించిన స్పందన కార్యక్రమం బాగుంది. స్పందనలో మహిళలే ఎక్కువ మంది ఫిర్యాదులు చేయగలుగుతున్నారు. ఇప్పటి వరకు 14 స్పందన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో 37,773 ఫిర్యాదులు వస్తే 31,119 ఫిర్యాదులను పరిష్కరించాం. ఈ సందర్భంగా జర్నలిస్టులపైన జరుగుతున్న దాడులను ప్రస్తావించగా.. యూనియన్ నేతలు కలిశారని, జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని' హెచ్చరించారు. -
ఓపెన్ హౌజ్‌ను ప్రారంభింంచిన మంత్రి కొడాలి నాని
సాక్షి, గుడివాడ: పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం గుడివాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌజ్‌ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలను గురించి ఓపెన్ హౌజ్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడమనేది మంచి కార్యక్రమమని ఆయన అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో పోలీసు శాఖపై ఉన్న అపోహలు తొలగి పోలీసుశాఖ మీద ప్రజలకు గౌరవం పెరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో గుడివాడ పోలీసులు.. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించటం సంతోషకరంగా ఉందన్నారు. వారోత్సవాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. పోలీసులు సమాజాన్ని కాపాడుతూ శాంతి భద్రతలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటారనీ, ఈ క్రమంలో సంఘ విద్రోహకక శక్తుల చేతుల్లో అనేక మంది పోలీసులు అమరులు అవుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరపుకొని అమరులైన పోలీసు సిబ్బందిని గుర్తు చేసుకోవడమే నిజమైన నివాళి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసుల సంక్షేమం కోసం తొలిసారిగా పోలీసులకు వారాంతపు సెలవును ప్రకటించారని ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. -
మీ త్యాగం చెదరని జ్ఞాపకం
మహబూబ్‌నగర్ క్రైం : విధి నిర్వహణలో వీర మరణం పొందిన అమరుల త్యాగం చెదరని జ్ఞాపకం లాంటిదని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు స్థూపం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఎస్పీ రెమా రాజేశ్వరి ఒదార్చారు. సంఘ విద్రోహక శక్తులతో పోరాడి ప్రాణాలు వదిలిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరుల కీర్తి.. పోరాట పటిమ తమకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, గిరిబాబు, సీఐలు రామకృష్ణ, రాజేష్, కిషన్, రాజు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా అమరులకు పూలమాలలతో వందనం సమర్పించారు. పోలీసుల సంక్షేమానికి కృషి సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడం పోలీస్ వృత్తిలో సహజమైన అంశంగా భావించి ప్రతి అధికారి ముందుకుసాగాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ప్రజల సంరక్షణ కోసం నిత్యం పోలీసింగ్ వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట పోలీస్ అధికారి ప్రాణాలు త్యాగం చేస్తున్నాడని, కాశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు శాంతి భద్రతలను రక్షించే క్రమంలో ఈ ఏడాది 414 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అందరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి అమరవీరులు చేసిన త్యాగమని కొనియాడారు. రెండు దశాబ్దాల కిందట నల్లమల అటవీ ప్రాంత పరిసరాల్లో మావోయిస్టులు జరిపిన విధ్వంసం అంతా ఇంతా కాదన్నారు. ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని, సమాజంలో శాంతియుత వాతావరణ నిర్మాణం కోసం పోలీసు బలగాలు, దేశ రక్షణ కోసం పొరాటం చేసే సైనికులు 39మంది చనిపోయారని గుర్తు చేశారు. పోలీసులు చేస్తున్న సేవలను, త్యాగాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. పోలీసులకు ప్రజల సహకారం ఉంటే శాంతిభద్రతల రక్షణ సులువవుతుందని, ఎక్కవ జనాభా ఉన్న ఈ సమాజంలో సుమారు లక్ష మందికి ఒక పోలీస్ అధికారి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నట్లు తెలిపారు. గౌరవప్రదంగా కవాతు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. సాయుధ బలగాలు సంప్రదాయ పూర్వకంగా వందనం సమర్పించగా ఎస్పీ రెమా రాజేశ్వరికి స్వీకరించారు. అనంతరం అమరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగానే అమరు పేరున రచించిన పుస్తకాన్ని పరేడ్ కమాండర్ వీరేష్ ఎస్పీకి అందజేయగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు చదివి వినిపించారు. పిల్లలతో ముచ్చటించిన ఎస్పీ కార్యక్రమం అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ రెమా రాజేశ్వరి తన చాంబర్లో ముచ్చటించారు. వారి సాదక బాదకాలను అడిగి తెలుసుకున్నారు. బరువెక్కిన హృదయాలతో వారి కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. వేదికపై పలువురు తమ మనోభావాలు పంచుకున్నారు. చిన్నప్పుడు తండ్రితో కూతురు గడిపిన రోజులు.. కొడుకుతో తల్లి పంచుకున్న మధుర జ్ఞాపకాలు.. భార్య తన భర్తతో పెళ్లియిన నాటి నుంచి చివరకు పంచుకున్న తీపి గుర్తులు నెమరువేసుకుని భావోధ్వేగానికి లోనయ్యారు. పట్టణంలో శాంతి ర్యాలీ అనంతరం ఎస్పీ రెమా రాజేశ్వరి జెండా ఊపి శాంతిర్యాలీ ప్రారంభించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ వన్‌టౌన్ చౌరస్తాలో ఉన్న పరదేశీనాయుడు విగ్రహం వరకు వెళ్లారు. నినాదాలు చేస్తూ విగ్రహానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ వెంకటేశ్వవర్లు, డీఎస్పీ భాస్కర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే అమరవీరుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్‌రావు, డీఎస్పీలు గిరిబాబు, ఇమ్మాన్యుయేల్, డీఎఫ్ఓ గంగారెడ్డి, సీఐలు డివిపి రాజు, రామకృష్ణ, రాజేష్, కిషన్, అమర్నాథ్రెడ్డి, ఎస్ఐలు భాస్కర్‌రెడ్డి, పీపీ బాలగంగాధర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, రాజయ్య, నాగభూషణం, సత్తయ్య, మన్మోహాన్ పాల్గొన్నారు. -
త్యాగాలు మరువలేనివి
గోదావరిఖని(రామగుండం): సమాజ సేవలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు మరువలేనివని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. రామగుండం కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వుడ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరారు. ప్రజాసేవకులుగా పజల ధన, మాన, ప్రాణాల రక్షణకు పునరంకితం కావాలన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం వంటి విచ్ఛినకర శక్తులు, నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడాల్సి రావడంతో పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాగా మారిందన్నారు. పోలీసుల తప్పులు ప్రచారం అవుతున్నంతగా వారి త్యాగాలు ఆశించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోవడం లేదన్నారు. త్యాగాలు చేసే వారిని గుర్తించడం లేదన్నారు. ఈ ఏడాది దేశంలో విధి నిర్వహణలో 414 మంది వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని, వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలను కాపాడమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. పోలీసులు చేస్తున్న అత్యున్నత త్యాగాలను సమాజం గుర్తించుకునే విధంగా ప్రముఖ దిన పత్రికలలో ప్రకటనలు బ్యానర్లు, కమిషరేట్‌లో, పోలీస్స్టేషన్లలో ఓపెన్‌హౌస్ కార్యక్రమాలు, కొవ్వొత్తి ర్యాలీలు, నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సమస్యలు పరిష్కరిస్తాం.. ప్రజల కోసం అసువులు బాసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాల న్యాయం చేస్తామన్నారు. నివాళ్లర్పించడానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సీపీ వివరాలు తెలుసుకున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈసందర్భంగా అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. అమరవీరులకు నివాళి.. ప్రజాసేవలో అసువులు బాసిన అమరుల కుటుంబాలకు సీపీ ఘన నివాళి అర్పించారు. స్తూపం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళ్లర్పించారు. వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ టి.సుదర్శన్‌గౌడ్, మంచిర్యాల డీసీపీ ఎం.వేణుగోపాల్‌రావు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ అశోక్‌కుమార్, లాఅండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీలు రక్షిత కె.మూర్తి, బాలుజాదవ్, హబీబ్‌ఖాన్, గౌస్‌బాబా, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్లు, ఏఆర్, సివిల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.