అమరుల త్యాగాలు చిరస్మరణీయం | Blood camp on the occasion of police commemoration day | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలు చిరస్మరణీయం

Published Thu, Oct 20 2016 12:46 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

అమరుల త్యాగాలు చిరస్మరణీయం - Sakshi

అమరుల త్యాగాలు చిరస్మరణీయం

నెల్లూరు(క్రైమ్‌): విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీస్‌ సిబ్బంది త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా అదనపు ఎస్పీ శరత్‌బాబు పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంబించిన అనంతరం ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాలను పోలీస్‌ సిబ్బంది స్మరించుకుంటూ వారి ఆశయసాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం 200 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది, నగర ప్రజలు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి పోలీస్‌ అధికారుల సంఘ జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన మోటివేటర్‌ భాస్కర్‌నాయుడు, ట్రాఫిక్, మహిళా, ఏఆర్‌ డీఎస్పీలు నిమ్మగడ్డ రామారావు, శ్రీనివాసాచారి, చెంచురెడ్డి, ఎస్బీ, నగర ఇన్‌స్పెక్టర్లు మాణిక్యరావు, రామకృష్ణారెడ్డి, రామారావు, ఎస్బీ ఎస్సై శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాసరావు, ఆరెస్సైలు అంకమరావు, రమేష్‌ కృష్ణన్, రమణ, రాఘవ, నాలుగో, ఆరో నగర ఇన్‌స్పెక్టర్లు సీతారామయ్య, రామారావు, ఒకటో నగర ఎస్సై గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement