రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం
రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం
Published Sun, Oct 2 2016 2:51 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
నెల్లూరు: రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని న్యాయసలహా సేవాధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జి సత్యవాణి పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఐఎంఏ హాల్లో రక్తదాతలకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో సత్యవాణి మాట్లాడారు. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న వారిని అభినందించారు. బెతస్థా హోమ్ ఆ«ధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఏడు చోట్ల బ్లడ్‌బ్యాంకులను స్థాపించి పలువురికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రజలకు రక్తాన్ని అందుబాటులోకి తెచ్చిన నెల్లూరు బ్లడ్ బ్యాంక్ చైర్మ¯ŒS బీఎస్ ప్రసాద్‌ను అభినందించారు. నగరంలో మరిన్ని బ్లడ్ బ్యాంకులను స్థాపించి రోగులకు రక్త కొరత తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. 24 మంది మోటివేటర్లు, ఏడుగురు మహిళా రక్తదాలకు అవార్డులను అందజేసి సత్కరించారు. జిల్లా లెప్రసీ అధికారి రమాదేవి, బ్లడ్ బ్యాంక్ చైర్మ¯ŒS బీఎస్ ప్రసాద్, సింహపురి ఆస్పత్రి ఎండీ రవీంద్రరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈదూరు సుధాకర్, ఐఎంఏ రాష్ట్ర నాయకుడు డాక్టర్ అశోక్, నెల్లూరు బ్లడ్‌బ్యాంక్ కో ఆర్డినేటర్ మోపూరు భాస్కర్‌నాయుడు, డ్రగ్ కంట్రోల్ ఏడీ సురేష్‌బాబు, నగర డీఎస్పీ జేవీ రాముడు, హోంగార్డు డీఎస్పీ శ్రీనివాసరావు, బ్లడ్‌బ్యాంక్ డైరెక్టర్లు కుమారి, లక్ష్మణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement